Rio de Janeiro
-
G20 Summit: మళ్లీ ఎఫ్‌టీఏ చర్చలు
రియో డి జనిరో: బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేతలిద్దరూ సమావేశమయ్యారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపుతో ఎఫ్‌టీఏ భవితవ్యం అయోమయంలో పడటం తెలిసిందే. దానికి నేతలిద్దరూ తాజాగా తెర దించారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా ఎఫ్‌టీఏ విధివిధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బెల్ఫాస్ట్, మాంచెస్టర్ నగరాల్లో నూతన కాన్సులేట్లు తెరవాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.మెరుగైన భవితకు కృషి మెరుగైన భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టాల్సిందిగా జీ20 సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సదస్సులో రెండో రోజు సుస్థిరాభివృద్ధి, ఇంధన రంగంలో మార్పులపై ఆయన ప్రసంగించారు. అభవృద్ధి చెందుతున్న దేశాలకు ఇచి్చన హామీలను అమలు చేయడం సంపన్న దేశాల బాధ్యత అని గుర్తు చేశారు. పర్యావరణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడం మానవాళి మనుగడకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. గాజాకు మరింత మాన వతా సాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడాలంటూ సదస్సు డిక్లరేషన్ విడుదల చేసింది. వీటితో పాటు పలు అంశాలపై బుధవారం సదస్సు చివరి రోజు ఉమ్మడి తీర్మానం చేసే అవకాశముంది. దేశాధినేతలతో మోదీ భేటీలుఆతిథ్య దేశం బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు జరిపారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్), గాబ్రియెల్ బోరిక్ ఫోంట్ (చిలీ), జేవియర్ మెయిలీ (అర్జెంటీనా), జార్జియా మెలోనీ (ఇటలీ), ప్రబోవో సుబియాంటో (ఇండొనేసియా), పెడ్రో శాంచెజ్ (స్పెయిన్), అబ్దెల్ ఫతా ఎల్ సిసీ (ఈజిప్ట్), యూన్ సుక్ యోల్ (దక్షిణ కొరియా), జోనాస్ గర్ స్టోర్ (నార్వే), లూయీస్ మాంటెనెగ్రో (పోర్చుగీస్), లారెన్స్ వాంగ్ (సింగపూర్), యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ తదితరులు వీరిలో ఉన్నారు. -
G20 సదస్సులో బిజీ బిజీగా PM మోడీ
-
గ్లోబల్ సౌత్‌ను పట్టించుకోవాలి
రియో డిజనిరో: ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కమ్ముకున్న యుద్ధ మేఘాలు దక్షిణార్ధ గోళ (గ్లోబల్ సౌత్) దేశాలను అతలాకుతలం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలతో అవి సతమతమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తక్షణం పరిష్కరించడంపై జీ20 కూటమి ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ‘‘గ్లోబల్ సౌత్ సవాళ్లు, అవసరాలకు ముందుగా పెద్దపీట వేయాలి. అప్పుడు మాత్రమే జీ20 జరిపే ఏ చర్చలైనా, తీసుకునే ఏ నిర్ణయాలైనా ఫలవంతం అవుతాయి’’ అని స్పష్టం చేశారు.రెండు రోజుల జీ20 శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో సోమవారం మొదలైంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ‘ఆకలి, పేదరికంపై పోరు–సోషల్ ఇంక్లూజన్’ అంశంపై మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ సమస్యలు, సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గతేడాది ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పలు నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ‘‘గ్లోబల్ సౌత్‌కు ప్రాధాన్యం పెంచే చర్యల్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కలి్పస్తూ ఢిల్లీ శిఖరాగ్రం నిర్ణయం తీసుకుంది.అన్ని దేశాలనూ కలుపుకునిపోయేలా సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాథమ్యమివ్వాలని నిర్ణయించింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అన్నదే మూలమంత్రంగా సదస్సు జరిగింది. ఆ ఒరవడిని మరింతగా కొనసాగించాలి’’ అని సదస్సులో పాల్గొన్న పలువురు దేశాధినేతలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి మొదలుకుని పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమన్న భారత వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత్ తీరు ఆచరణీయం పేదరికం, ఆకలి సమస్యలపై పోరులో భారత్ ముందుందని మోదీ వివరించారు. ‘‘ప్రజలందరినీ కలుపుకుని పోవడమే ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వ పదేళ్ల పాలన సాగింది. 80 కోట్లకు పై చిలుకు ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య బీమా, పెద్ద పంటల బీమా, పంట రుణాల పథకాలు అమలు చేస్తున్నాం. తద్వారా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారు’’ అని వివరించారు. గ్లోబల్ సౌత్‌తో పాటు ఇతర దేశాలు కూడా వీటిని అనుసరిస్తే అద్భుత ఫలితాలుంటాయన్నారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని జీ20 శిఖరాగ్రంలో తొలి రోజు నిర్ణయం జరిగింది.బైడెన్‌తో మోదీ భేటీజీ20 శిఖరాగ్రం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం వారి మధ్య ఇది తొలి భేటీ. వారిద్దరూ పలు ద్వైపాక్షిక అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం.ఘనస్వాగతం జీ20 భేటీ కోసం బ్రెజిల్ వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయుల సంస్కృత శ్లోకాలాపన, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని యో గుటెరస్, స్పెయిన్ అధినేత పెడ్రో శాంచెజ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తదితరులతో ప్రధాని భేటీ అయ్యారు. -
G-20 Summit: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ
రియో డీజెనిరో: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్ చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు.జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. సోమవారం తెల్లవారుజామున బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ.. నేడు పలు దేశాధినేతలతో సమావేశం కానున్నారు. జీ-20 సదస్సుకు మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రెజిల్లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి సమావేశం కానుంది.ఇదిలా ఉండగా, జీ-20 సదస్సు అనంతరం మోదీ.. గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.#WATCH | Prime Minister Narendra Modi lands in Rio de Janeiro, Brazil.During the second leg of his three-nation tour, PM Modi will attend the 19th G20 Leaders’ Summit in Brazil, scheduled on November 18 and November 19.(Video source - ANI/DD News) pic.twitter.com/5it1R8cpXP— ANI (@ANI) November 18, 2024 -
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి
రియో డి జెనారో: అమెజాన్ అడవుల్లో బార్సెలోస్ ప్రాంతానికి వెళ్తోన్న టూరిస్టు విమానం కుప్పకూలడంతో సిబ్బందితో కలిపి మొత్తం 14 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమెజాన్ అడవుల్లోని బార్సెలోస్ను సందర్శించేందుకు 14 మందితో కూడిన టూరిస్టు విమానం వాతావారణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అడవుల్లో కుప్పకూలింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది పర్యాటకులతోపాటు ఇద్డరు సిబ్బంది కూడా మృతిచెందారు. భారీ వర్షంలో ప్రయాణిస్తున్న ఈ విమానం పైలట్ ఎదురుగా ఏమీ కలిపించకపోయిన అలాగే నడుపుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించక విమానం అడవుల్లో కుప్పకూలిందని ఆమెజోనా స్టేట్ సెక్యూరిటీ సెక్రెటరీ వినిషియస్ అల్మెయిదా తెలిపారు. ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని మృతుల్లో స్పోర్ట్ ఫిషింగ్ నిమిత్తం బయలుదేరిన 12 మంది మగవారితో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని ఒక స్టేట్మెంట్లో తెలిపింది అక్కడి ప్రభుత్వం. మృతుల కుటుంబానికి స్నేహితులకు ప్రగాఢ సానుభూతులు తెలిపిన గవర్నర్ విల్సన్ లిమా ప్రమాదం గురించి తెలిసిన మరుక్షణం నుండి విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మీడియా కథనాల ప్రకారం ప్రమాదానికి గురైన విమానం బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ మేకర్ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్ ఈఎంబీ-10 12 మంది టూరిస్టులతో మనౌస్ నుంచి బార్సెలోస్‌కు బయలుదేరింది.. మనౌస్ నుంచి బార్సెలోస్‌కు గంటన్నర ప్రయాణ సమయం పడుతుందని వాతావరణంసరిగ్గా లేనందునే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. #Breaking A small plane crashed in Amazonas, Brazil, leaving at least 14 people dead, including the pilot and co-pilot. Among the victims were several American tourists. pic.twitter.com/RZ0GrYbfe6 — Bowner (@agentbowner) September 16, 2023 ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే.. -
సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..
రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు. యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు. ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్‌లోనే ఉండిపోయారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము. ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు. ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ -
విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్మర్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో నెయ్మర్ నిర్మించిన మాన్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు అతనికి భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరోసారి నెయ్మర్కు పర్యావరణ అధికారులు బిగ్‌షాక్ ఇచ్చారు. నెయ్మర్ కొత్తగా నిర్మించిన తన మాన్షన్ హౌస్ వెలుపల ఒక కృత్రిమ సరస్సును నిర్మించాడు. అతని చర్యపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పర్యావరణానికి హానీ కలిగించేలా నిబంధనలు ఉల్లఘించి మాన్షన్ బయట కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లఘించినందుకు గానూ నెయ్మర్కు 3.3 మిలియన్ యూఎస్ డాలర్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.27.1 కోట్లు) జరిమానా విధించారు. ఈ విషయాన్ని అధికారులు ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ''నిబంధనల ప్రకారం మాన్షన్‌లో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించుకోవచ్చు. కానీ నెయ్మర్ తన విలాసాల కోసం పర్యావరణానికి హానీ కలిగిస్తూ కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటి?. రూల్స్‌కు విరుద్దంగా నదీ ప్రవాహాన్ని సంగ్రహించడం చట్టరిత్యా నేరం. అనుమతి లేకుండా నదీ ప్రవాహాన్నిమళ్లించడం.. కృత్రిమ సరస్సు నిర్మాణం కోసం రాళ్లు, ఇసుకను అక్రమంగా తరలించడం.. పర్యావరణ బోర్డు అనుమతి లేకుండానే వృక్షసంపదను అణచివేయడమనేది నేరం కిందే లెక్క. ప్రభుత్వ చట్టాలను పాటించకుండా నిషేధాజ్ఞలను ఉల్లఘించినందుకు గానూ నెయ్‌మర్‌పై చర్యలు తీసుకుంటున్నాం. ''అంటూ ప్రకటనలో తెలిపింది. ఇక నెయ్మర్ కుటుంబసభ్యులు మాన్షన్‌లో ఉన్నప్పుడే అధికారులు, పోలీసులు ఎంటరయ్యారు. దీంతో నెయ్మర్ తండ్రి అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అధికారులు చుట్టూ కొలతలు తీసుకొని ఎంతమేర పర్యావరణానికి నష్టం కలిగించాడనే దానిపై రిపోర్టు తయారు చేశారు. అనంతరం నోటీసులు అంటించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. Neymar has been fined nearly $3.5 million after Brazilian authorities said that the soccer star’s luxury coastal mansion in southeastern Brazil violated rules in the 'construction of an artificial lake' https://t.co/VE5RVJYSxJ pic.twitter.com/T5rdztMMER — Reuters (@Reuters) July 5, 2023 ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు.ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చదవండి: #Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
అధికారుల కన్నెర్ర.. నెయ్మర్కు దెబ్బ మీద దెబ్బ
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్మర్ జూనియర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో(ఐదు మిలియన్ రియాస్లు) జరిమానా విధించారు. తాజాగా అక్రమ ప్రాజెక్టు కట్టడంపై నెయ్మర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కన్నెర్రజేసిన అధికారులు శనివారం రెండోసారి జరిమానా విధించి నెయ్‌మర్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. కాగా 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా? Neymar: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్! మిలియన్ డాలర్ ఫైన్ -
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు ఊహించని షాక్! మిలియన్ డాలర్ ఫైన్
Neymar Could Be Fined $1 Million: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్ తగిలింది. దేశంలోని ప్రధాన పట్టణం రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా విలాసవంతమైన భవనం నిర్మిస్తున్న నేమార్‌కు మిలియన్ డాలర్ మేర ఫైన్ వేయనున్నారు. ఈ విషయం గురించి స్థానిక మేయర్ కార్యాలయం.. ‘‘సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. భవనం నిర్మిస్తున్న క్రమంలో అతడు పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేకూర్చాడు. కాబట్టి మిలియన్ డాలర్ల మేర జరిమానా విధించే అవకాశం ఉంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. నేమార్ చేపట్టిన నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలిపింది. రెండున్నర ఎకరాలు కాగా నేమార్ మాన్షన్ వద్దకు వచ్చి అధికారులు భవన నిర్మాణాన్ని ఆపాలని చెప్పగా.. అతడి తండ్రి వారితో గొడవతో దిగినట్లు సమాచారం. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' -
మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా!
రియో డీ జెనీరో: బ్రెజిల్ తీరంలో మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం బయటపడడం కలకలం రేపింది. ఇది మరో గ్రహానికి చెందిన జీవి చెయ్యి కావొచ్చని స్థానికులు అనుమానించారు. భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 20న సో పౌలో స్టేట్‌లో లభించిన పొడవైన ఎముకలు మనిషి చేతి వేళ్లను పోలి ఉన్నాయి. అచ్చంగా చెయ్యి ఆకారంలోనే ఉండడం గమనార్హం. నిజానికి ఇది గ్రహాంతరవాసి హస్తం కాదని, భారీ తిమింగలం లేదా డాల్ఫిన్‌కు చెందిన ఎముకలని మెరైన్ బయాలజిస్ట్ ఎరిక్ కోమిన్ వెల్లడించారు. ఇది 18 నెలల క్రితం మరణించి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఎముకలు సముద్ర జీవి శరీరం చర్మం కింద ఉండే ఫ్లిప్సర్స్ అని తెలిపారు. ఈ ఫ్లిప్పర్స్‌కు ఐదు వేళ్ల లాంటి ఎముకలు ఉంటాయన్నారు. -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్‌లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్‌ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
భీకర వర్షాలు.. 58 మంది మృతి
రియో డీ జనీరియో: భీకర వర్షాలతో బ్రెజిల్ దేశంలోని రియో డీ జనీరియో రాష్ట్రంలో కొండప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పెట్రోపోలిస్ ప్రాంతంలో వర్షాలకు కొండల నుంచి భారీ స్థాయిలో బురదచరియలు కిందనున్న జనావాసాలపై పడ్డాయి. దీంతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పెట్రోపోలిస్ మేయర్ రూబెన్స్ చెప్పారు. జనావాసాలను బురద ముంచెత్తింది. అందులోని 21 మందిని కాపాడారు. ఇదే ప్రాంతంలో 11 ఏళ్ల క్రితం భారీ వర్షాల ధాటికి వందల మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. వరదలు, బురద చరియలు పడిన ప్రాంతంలో 180కి పైగా జవాన్లు అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని పెట్రోపోలిస్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం తెలిపింది. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చదవండి: (వైద్య చరిత్రలో మరో అద్భుతం.. ఆమె ఎయిడ్స్‌ను జయించింది!) -
ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..
మనుషులు ప్రాణాలను రక్షించుకోవటం కోసం లేదా తనను ఇబ్బందికి గురిచేసే వారి నుంచి లేదా బాధపెట్టే వారి నుంచి దూరంగా స్వేచ్ఛగా బయటికి వచ్చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అచ్చం అదే విధంగా ఇక్కొడొక ఆవు అలానే తన ప్రాణాలను రక్షించుకువడానికి బయటకు వచ్చేస్తుంది. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...బ్రెజిల్‌లోని ఒక ఆవు జంతు వధ కబేళా నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అది రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని వాటర్ పార్క్‌లోకి వెళ్లుతుంది. అక్కడ నుంచి నెమ్మదిగా ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్‌కి చేరుకుని అక్కడ ఉన్న కొన్ని మెట్టు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంటుంది. కానీ అక్కడ ఆ ఆవు నడవలేక జారిపోతుంటుంది. దీంతో ఆ ఆవు అక్కడే కూర్చొండిపోతుంది. నిజానికి ఆ స్విమ్మింగ్ పూల్ 200 కేజీల బరువును మాత్రమే భరించగలదు కానీ 317 కిలోలు ఉన్న ఆవు ఎక్కినప్పుడు ఆ పూల్ పై భాగం ఏ మాత్రం ధ్వంసం కాలేదు. అంతేకాదు ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని కార్లోస్ మిగ్యుల్ సెరాంటె ఆ ఆవుకి టోబోగా పేరు పెట్టి దత్తతగా తీసుకుని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణలను రక్షించేకునేందుకు ఎంతలా ప్రయత్నించిందంటూ ఆ ఆవుని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్డౌన్
రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. దీంతో రాజధానిలో రెండు వారాల పాటు లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ఆదివారం అమల్లోకి వచ్చింది. బ్రెజిల్‌లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. నగరాలు, ముఖ్య పట్టణాల్లో గత వారం రోజులుగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 2,54,000 మంది మరణించారు. గత గురువారం ఒక్కరోజే 1,541 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో మార్చి 15 వరకు హోటళ్లు, బార్లు, షాపింగ్ మాల్స్, స్కూళ్లు మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
చిన్నారిని కాపాడిన మూడేళ్ల బాలుడు
రియో డిజనీరో: మూడేళ్ల వయసులోనే స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న తన స్నేహితుడిని కాపాడి ఒక బాలుడు హీరోగా మారాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ మూడేళ్ల చిన్నారి తల్లి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తన కొడుకు ఆర్థర్, తన స్నేహితుడు ఆడుకుంటూ ఉంటుండగా ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో పడిపోయినట్లు తెలిపింది. దగ్గరలో స్విమ్మింగ్ పూల్స్, నీటి గుంతలు ఉన్నప్పుడు పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి ఆర్థర్ తల్లి వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్విమ్మింగ్ రింగ్‌ను అందుకోవడం కోసం అర్ధర్, అతని స్నేహితుడు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆర్థర్ స్నేహితుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. దీంతో ఆర్థర్ పెద్దవాళ్లను పిలవడమే కాకుండా తన స్నేహితుడిని కూడా కాపాడాడు. ఈ ఘటనలన్ని అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లందరూ ఆర్థర్‌ను రియల్ హీరో అంటూ ఆకాశనికెత్తెస్తున్నారు. దీనికి తోడు ఇది చూసిన పోలీసు ఆర్థర్‌కు మంచి బహుమతిని అందించారు. బుట్ట నిండా చాకెట్లు అందించడంతో పాటు ఒక మెడల్, సర్టిఫికేట్‌ను బహుకరించారు. చదవండి: నాన్న చంపాలని చూస్తున్నారు : నటి వైరల్ వీడియో -
కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు
రియో డి జనీరో: చిన్నాపెద్దా తేడా లేని కరోనా ఐదు నెలల వయసున్న శిశువును వదల్లేదు. ఆ మహమ్మారి వల్ల కోమాలోకి కూడా వెళ్లిన ఆ శిశువు అంతిమంగా వైరస్‌నే జయించిన ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఐదు నెలల చిన్నారి డామ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించింది. దీంతో శిశువు తల్లిదండ్రులు బాబును స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. డామ్‌ను పరీక్షించిన వైద్యులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా భావించి మందులు రాసిచ్చారు. కానీ మందులు వాడినప్పటికీ బాబు ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. పైగా రోజురోజుకూ మరింత క్షీణిస్తుండటంతో కలవరపడ్డ తల్లిదండ్రులు రియో డి జనీరోలోని ప్రొ కార్డికో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు బాబుకు పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. (అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) అనంతరం చికిత్స అందించే సమయంలో బాబు కొన్ని రోజుల పాటు కోమాలోకి వెళ్లాడు. దీంతో వైద్యులు అతడిని రక్షించేందుకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. సుమారు 54 రోజుల తర్వాత ఆ శిశువు కరోనా బారి నుంచి బయటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం గురించి ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. "ఇది నిజంగా అద్భుతం" అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా బ్రెజిల్లో 12 నెలల లోపు వయసు ఉన్న చిన్నారులు 25 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం అమెరికాలో 5,14,849 కేసులు నమోదవగా 29,300 మంది మరణించారు. (చనిపోతే బతికించారు.. మళ్లీ ‘చంపేశారు’!!) -
నెమార్ విరాళం రూ. 7 కోట్ల 64 లక్షలు
రియో డి జనీరో: బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్, ప్యారిస్ సెయింట్–జెర్మయిన్ క్లబ్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ నెమార్ కరోనా కట్టడికి భారీ విరాళమిచ్చాడు. అతను 10 లక్షల డాలర్ల (రూ. 7,64, 18,241) విరాళం ప్రకటించినట్లు స్థానిక టీవీ చానల్ తెలిపింది. ఈ మొత్తాన్ని ‘యూనిసెఫ్’తో పాటు టీవీ వ్యాఖ్యాత లూసియానో హక్ ఆధ్వర్యంలో జరుగుతోన్న చారిటీ క్యాంపెయిన్ కోసం వినియోగించనున్నారు. -
యశస్విని సింగ్ పసిడి గురి...
ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఈ ఈవెంట్లో శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అమ్మాయి యశస్విని సింగ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో యశస్విని 236.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో భారత్‌కు ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించింది. ఒలీనా (ఉక్రెయిన్–234.8 పాయింట్లు) రజతం, జాస్మీనా (సెర్బియా –215.7 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇలవేనిల్, అభిషేక్ వర్మ స్వర్ణాలు అందించారు. -
మా ఇలవేణి బంగారం; ఈ పసిడి ప్రత్యేకం!
రియో డి జెనిరో : భారత షూటర్ ఇలవేణి వలరివన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకం సాధించింది. బుధవారం రియో డి జెనిరో వేదికగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె భారత్‌కు పతకాన్ని అందించింది. తద్వారా షూటింగ్ ప్రపంచ కప్ సిరీస్‌లో అంజలీ భగవత్, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించిన(10 మీ ఎయిర్ రైఫిల్) మూడో మహిళా షూటర్‌గా నిలిచింది. ఈ నెల(ఆగస్టు 2)లోనే 20వ వసంతంలో అడుగుపెట్టిన ఈ కడలూరు అమ్మాయి సీనియర్ క్రీడాకారిణిగా బరిలో దిగిన రోజే పసిడిని సొంతం చేసుకోవడం విశేషం. కాగా బుధవారం నాడు జరిగిన పోటీలో 251.7 పాయింట్లు సాధించిన ఇలవేణి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్‌కు చెందిన సియోనాయిడ్ కింటోష్(250.6), తైపీకి చెందిన లిన్ మాంగ్ చిన్(229.9) వరుసగా రజత, కాంస్య పతకాలతో ఇలవేణి తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా సీనియర్ షూటర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ వద్ద ఇలవేణి షూటింగ్లో మెళకువలు నేర్చుకుంది. విజయానంతరం ఆమె మాట్లాడుతూ..‘మ్యాచ్‌కు ముందు కాస్త ఒత్తిడికి లోనయ్యాను. ఒలింపిక్ పతకం సాధించాలని మూడేళ్ల కిందటే లక్ష్యం పెట్టుకున్నాను. ప్రస్తుతం ఈ విజయం నాలో విశ్వాసం నింపింది. మా అకాడమీ గన్ ఫర్ గ్లోరీకి జాతీయ అవార్డు వచ్చిన రోజే నేను పసిడి సాధించడం ఎంతో గర్వంగా ఉంది. ఈ స్వర్ణం నాకెంతో ప్రత్యేకమైనది’ అని సంతోషం వ్యక్తం చేసింది. తాను ఈ పతకం సాధించడం వెనుక ఎందరో ప్రోత్సాహం ఉందని, వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పతకాన్ని తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్టు పేర్కొంది. కాగా గత కొన్నేళ్లుగా దేశంలోని పలు నగరాల్లో షూటింగ్ కేంద్రాలను నెలకొల్పి..యువ షూటర్లకు శిక్షణ ఇస్తున్న గగన్ నారంగ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇలవేణి వలరివన్.. కడలూరు జిల్లా తారామణికుప్పంకు చెందిన ఇలవేణి వలరివన్ కుటుంబం ఉద్యోగ రీత్యా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటున్నది. తమిళనాట కడలూరు జిల్లాలోనే కాదు, చెన్నైలోనూ ఆ కుటుంబానికి ఆప్తులు ఎక్కువే. అందుకే తమిళనాడుతోనే ఆ కుటుంబానికి అనుబంధం ఎక్కువ. బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ (ఇంగ్లిçషు) చదువుతున్న ఇలవేణికి రైఫిల్ షూటింగ్లో చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువే. తండ్రి వలరివన్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. జూనియర్ పోటీల్లో రాణించే ప్రయత్నం చేసింది. అనేకమార్లు వెనక్కి తగ్గినా, ఏ మాత్రం ఢీలా పడకుండా ముందుకు సాగిన ఇలవేణి ప్రస్తుతం తమిళనాట బంగారంతో మెరిసింది. బ్రిజిల్ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో తన సత్తాని ఇలవేణి చాటుకుంది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 251.7 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని తమిళ ఖ్యాతిని బ్రెజిల్ వేదికగా చాటింది. మా బంగారం ఇలవేణి.. తమ కుమార్తె పతకం సాధించడటం పట్ల వలరివన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని ఏదో ఒక క్రీడపై దృష్టి పెట్టే రీతిలో చర్యలు తీసుకోవాలని, అందులో వారిని ప్రోత్సహించాలని, సంపూర్ణ సహకారం అందించాలని ఇలవేణి తల్లిదండ్రులు సూచించారు. తన కుమార్తె ఒలింపిక్స్‌లో రాణించాలన్న లక్ష్యంతో ఉన్నదని అది సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, తారామణి కుప్పంవాసులు అయితే, తమ గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో ఇలవేణి నిలబెట్టినట్టు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అక్కడి యువత బాణసంచాలు పేల్చుతూ ఇలవేణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడి ఇలవేణి కుటుంబీకులు, అత్త, అవ్వ మా ఇలవేణి బంగారం అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. First senior World Cup GOLD for @elavalarivan as India wins 3 of the four women’s 10m Air Rifle in all @ISSF_Shooting world cups this year. Incredible talent and phenomenal achievement. Many congratulations! #issfworldcuprio2019 pic.twitter.com/FN9DUurVJk — NRAI (@OfficialNRAI) August 28, 2019 -
ఈ డ్రగ్ మాఫియా డాన్ కొ(చె)త్త ఐడియా ..!
-
‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు!
రియోడిజెనిరో : పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి తప్పించుకోవడంలో క్రిమినల్స్ వేసే ఎత్తులు చూస్తుంటే ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది. హాలీవుడ్ సినిమా వాళ్లకు కూడా రాని కళాత్మకతను వీరు తమ ‘కళ’ల్లో చూపిస్తుంటారు. విషయం ఏంటంటే.. డాన్లలో డ్రగ్ మాఫియా డాన్ల రూటే సపరేటంటూ బ్రెజిల్‌లోని జైలులో ఉన్న ఓ డ్రగ్ మాఫియాడాన్‌కు ఓ ఐడియా వచ్చింది. అచ్చం తన టీనేజర్ కూతురులా రెడీ అయి జైలు నుంచి తప్పించుకోవాలనేది అతని ప్లాన్. కానీ చివరి నిమిషంలో అమ్మాయిలా నటించడంలో మాత్రం సక్సెస్ కాలేక ‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు. 42 సంవత్సరాల క్లౌవినో డ సిల్వా బ్రెజిల్ దేశంలో పేరుమోసిన డ్రగ్ మాఫియాకు నాయకుడు. ఇతడు ప్రస్తుతం రియోడిజెనిరో నగరంలోని సెంట్రల్ జైలులో 73 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే రకరకాల ఎత్తులు వేసినా పారలేదు. దీంతో ఏకంగా తన కూతురుని ఉపయోగించుకొని పారిపోవాలని భారీ స్కెచ్ వేశాడు. తనను కలవడానికి వచ్చిన 19 ఏళ్ల కూతురిని లోపలే ఉంచి అప్పటికే సిద్ధం చేసుకున్న టీషర్ట్, సిలికాన్‌మాస్క్, కళ్లజోడు, విగ్‌లతో అచ్చం కూతురిలా రెడీ అయి బయటకు వచ్చాడు. పాపం జైలు ఆవరణలోని పోలీసులు కూడా ఇతన్ని చూసి అమ్మాయే అనుకొని పొరపాటుపడ్డారు. దీంతో గేటు వరకూ వచ్చాడు. దాదాపు బయటకు వెళ్లే సమయంలో గేటు దగ్గర చివరి తనిఖీల్లో భాగంగా పోలీసులు చెక్ చేస్తుండగా మనోడు అమ్మాయిలా మరీ మెలికలు తిరిగిపోయాడంటా. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అవాక్కయ్యారు. అతడి ఒక్కొక్క మేకప్ తీయమని చెప్తూ వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. మేకప్ తీసేస్తున్నప్పుడు మనోడి కాన్ఫిడెన్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఇంతకీ ఇన్ని వస్తువులు ఎలా వచ్చాయబ్బా అని ఆరా తీయగా గర్భిణి వేషంలో అంతకుముందే ఓ మహిళ ఇతడిని కలిసి వెళ్లిందని తెలిసింది. మధ్యలో ఈ పాడు సిగ్గు అడ్డురాకుండా ఈ కొ(చె)త్త ఐడియా సక్సెస్ అయి ఉంటే ఇప్పుడు ట్విటర్లో ఎగిరే బదులు హాయిగా ఏ డాన్ సెట్‌లోనో కూర్చునేవాడేమో! -
బ్రెజిల్ అధ్యక్షుడిగా జైర్ బొల్సొనారో ఎన్నిక
రియో డి జెనీరో : బ్రెజిల్ అధ్యక్షుడిగా మాజీ ఆర్మీ కెప్టెన్ జైర్ బొల్సొనారో ఎన్నికయ్యారు. 55.13 శాతం ఓట్లతో బొల్సనారో నెగ్గగా, 44.87 శాతం ఓట్లు ప్రత్యర్థి ఫెర్నాండో హదద్కు పోలయ్యాయి. రాజధాని రియో డి జెనీరోలో అభిమానులు, మద్దతుదారులు భారీ ర్యాలీ తీశారు. 'సమిష్టిగా అందరం కలిసి బ్రెజిల్ తలరాతను మారుద్దాం' అని ఎన్నికల ఫలితాల తర్వాత బొల్సొనారో తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. జనవరి 1న అధ్యక్షపదవిని బొల్సొనారో చేపట్టనున్నారు. -
రియో డీజెనిరియోలో కార్నివాల్
-
షాకింగ్: జైలుకు నిప్పు, 150మంది ఖైదీలు పరారీ
రియోడిజనిరో: బ్రెజిల్ లో మరోషాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. సావోపోలో రాష్ట్రంలోని బౌరు జైలులో ఖైదీలు రెచ్చిపోయారు. ఖైదీల అంతర్గత పోరు ఆవరణలో బీభత్సం సృష్టించింది. ఖైదీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. దీంతో జైలు లో కొంత భాగానికి నిప్పుపెట్టారు. అనంతరం జైలు గోడల్ని బద్దలు కొట్టి కనీసం 150మంది ఖైదీలు పారిపోయారు. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో జైళ్లలో హింసాత్మక సంఘటనలకు దీనికి ఎలాంటి సంబంధంలేదని మిలటరీ పోలీస్ అధికారులు ప్రకటించారు. కఠినమైన క్రమశిక్షణ మూలంగానే ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని జైలు అధికారులు తెలిపారు. పారిపోయిన వారిలో 100 మంది తిరిగి పట్టుకున్నట్టు జైళ్ల శాఖ అధికారులు చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేశంలోని జైళ్లలో అల్లర్లు, ఘర్షణలు చెలరేగాయి. వీటిలో130 మందికిపైగా ఖైదీలు హత్యకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనల్లో అధికారుల ఆరోపణలను పరిశీలకులు వ్యతిరేకించారు. జైళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంవలనే తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయని విమర్శిస్తున్నారు. కాగా బ్రెజిల్ లోని ఇతర జైళ్లతో పోలిస్తే సంఖ్య పరంగా బౌరు జైల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజా వార్తా సంస్థ ఏజెన్శియా బ్రసిల్ ప్రకారం, బౌరు జైలును 1,124 అనువుగా రూపొందించగా 1,427 ఖైదీలు ప్రస్తుతం ఉన్నారు. -
తృటిలో చేజారిన కాంస్యం
రియో డి జనీరో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన ఎఫ్51 క్లబ్ త్రో ఈవెంట్లో 31 ఏళ్ల ఈ హరియాణా పారా అథ్లెట్ 26.63మీ. దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. స్లొవేకియాకు చెందిన మరియన్ కురేజ 26.82మీ. విసిరి కాంస్యం సాధించాడు. వీరిద్దరి మధ్య దూరం కేవలం 0.19మీ. మాత్రమే. తొలి స్థానంలో నిలిచిన జెల్జికో దిమిత్రిజెవిక్ (29.96మీ) ప్రపంచ రికార్డును సృష్టించాడు. -
ఒలింపిక్ విజేతకే షాక్ ఇచ్చేలా..
పారాలింపిక్స్ 1500మీ. పరుగులో బాకా రికార్డు రియో డి జనీరో: ఒలింపిక్స్ విజేత నెలకొల్పిన రికార్డును ఓ పారాలింపిక్స్ అథ్లెట్ అధిగమించడమంటే మాటలా... వినడానికి నమ్మశక్యంగా లేని ఈ ఫీట్‌ను అల్జీరియాకు చెందిన అబ్దెల్లతిఫ్ బాకా సాధ్యం చేసి చూపించాడు. మంగళవారం జరిగిన టి13 1500మీ. ఫైనల్ పరుగును బాకా 3 నిమిషాల 48.29 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇది గత నెలలో జరిగిన ఒలింపిక్స్ 1500మీ. చాంపియన్ మాథ్యూ సెంట్రోవిట్జ్ (3నిమిషాల 50.00 సె) టైమింగ్కన్నా 1.7 సెకన్ల కన్నా తక్కువ కావడం విశేషం. అంతేకాకుండా రజతం సాధించిన టమిరు డెమిస్సే (ఇథియోపియా, 3.48:49), కాంస్యం సాధించిన హెన్రీ కిర్వా (కెన్యా, 3.49:59), నాలుగో స్థానంలో నిలిచిన ఫోవద్ బాకా (అల్జీరియా, 3.49:84) కూడా ఈ ఒలింపిక్స్ చాంపియన్కన్నా వేగంగా పరిగెత్తి రేసు పూర్తి చేయడం నిజంగా అభినందనీయం. -
నా కల నెరవేర్చుకున్నా..
పారాలింపిక్ పతక విజేత దీపా మలిక్ రియో డి జనీరో: ధైర్యంగా తాను కన్న కలల ఫలితమే తాజా పారాలింపిక్ పతకమని షాట్‌పుటర్ దీపా మలిక్ తెలిపింది. ఎఫ్53 షాట్ పుట్ విభాగంలో తను రజతం సాధించిన విషయం తెలిసిందే. ‘నేను ధైర్యంగా కల కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు అమితంగా శ్రమించాను. ఆత్మవిశ్వాసం, పట్టుదల కోల్పోనందువల్లే ఇది సాధ్యమైంది. మహిళలు సాధారణంగా ఈ విషయంలో వెనకడుగు వేస్తారు. ఇదే క్రమంలో నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఈ పతకం గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయం నాలాంటి వారికి ఎంతగానో ప్రేరణగా నిలిచి వారికున్న అడ్డుగోడలను ఛేదించేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సాయ్తో పాటు నా శిక్షకులకు, నాకెంతగానో బలాన్నిచ్చిన భర్త, పిల్లలకు కృతజ్ఞతలు’ అని 45 ఏళ్ల దీప తెలిపింది. -
ఫర్మాన్ బాషాకు నాలుగో స్థానం
రియో డి జనీరో: పారాలింపిక్స్ గేమ్స్‌లో భారత పవర్‌లిఫ్టర్ ఫర్మాన్ బాషా తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. గురువారం జరిగిన పోటీల్లో పురుషుల 49కేజీ విభాగంలో తను 140కేజీల బరువు ఎత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. రెండు, మూడు ప్రయత్నాల్లో 150, 155కేజీల బరువు ఎత్తాలని ప్రయత్నించినా విఫలమయ్యాడు. కాంగ్ వాన్ లీ (వియత్నాం) 181కేజీ బరువు ఎత్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. -
స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు
⇒ పారాలింపిక్స్ విజేతలకు కేంద్రం నజరానా న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారికి నజరానాలు ప్రకటించింది. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఈనెల 7 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో స్వర్ణం సాధించే అథ్లెట్‌కు రూ.75 లక్షలు ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు తమ అధికార ట్వీట్టర్ పేజీలో పేర్కొంది. భారత్ నుంచి ఈసారి ఎన్నడూ లేని విధంగా 17 మందితో కూడిన బృందం ఈ గేమ్స్‌కు వెళ్లింది. 2004 ఏథెన్స్లో స్వర్ణం గెలిచిన దేవేంద్ర జాజరియా ఈసారి కూడా జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో బరిలోకి దిగబోతున్నాడు. -
తొలి రౌండ్లోనే యోగేశ్వర్ అవుట్
రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో భారత్ చివరి ఆశగా భావించిన రెజ్లర్ యోగేశ్వర్ దత్ 65కేజీ ఫ్రీస్టయిల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. ఆదివారం జరిగిన బౌట్లో తను 0-3 తేడాతో మండక్‌నరన్ గన్‌జోరిగ్ (మంగోలియా) చేతిలో చిత్తుగా ఓడాడు. 2012 లండన్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ తన చివరి గేమ్స్‌ను పతకంతో ముగిస్తాడని అంతా అనుకున్నా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు గన్‌జోరిగ్ క్వార్టర్స్‌లో ఓడిపోవడంతో అటు రెప్‌చేజ్ అడే అవకాశం కూడా పోయింది. పురుషుల మారథాన్‌లో పాల్గొన్న థనక్కల్ గోపి, ఖేతా రామ్ వరుసగా 25, 26వ స్థానాల్లో నిలిచారు. గోపి 2:15:25 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరుకోగా ఖేతారామ్ 2:15:26సెకన్లలో చేరుకున్నాడు. మరో భారత అథ్లెట్ నితేంద్ర సింగ్ (2:22:52) 84వ స్థానంలో నిలిచాడు. -
'సాక్షి' నిన్ను చూసి దేశం గర్విస్తోంది
-
రియోలో ఆ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు!
ఒలింపిక్స్ చివరి దశకు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో ఇవి ముగియబోతున్నాయి. దాంతో విదేశీయులను ఆకట్టుకునేందుకు అక్కడున్న దాదాపు 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించారట. అయితే ఈసారి మాత్రం తాము అనుకున్న దానికంటే వ్యాపారం చాలా డల్‌గా ఉందని చెబుతున్నారు. రియోలో అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన విలా మిమోసా ప్రాంతం మరకానా స్టేడియంకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు వస్తే.. రోడ్డు మీద దోపిడీ దొంగలకు చిక్కుకుపోతామనే భయంతో చాలామంది ఆగిపోతున్నారని తెలిసింది. ఈ నగరంలో ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఏకంగా రెండు వేల హత్యలు జరిగాయి. ప్రస్తుతం ఈ రెడ్‌లైట్ ఏరియాలో ధరలు రూ. 1500 నుంచి రూ. 840కి పడిపోయాయని చెబుతున్నారు. విదేశీయులకు అర్థం అయ్యేందుకు వీలుగా ఇంగ్లీషు, పోర్చుగీసు, ఇతర భాషల్లో కూడా తగ్గింపు ధరలను రాసి పోస్టర్లు వేస్తున్నారు. బ్రెజిల్లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్ధంగా నడుస్తోంది. అయితే వేశ్యాగృహాలు నడపడం మాత్రం అక్కడ చట్టవిరుద్ధం. -
రియోలో కాల్పుల కలకలం
-
రియోలో కాల్పుల కలకలం
రియో: విశ్వక్రీడాపోటీల వేదిక.. ఒలింపిక్ విలేజ్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. క్రీడా ప్రాంగణంలో జర్నలిస్టులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. బ్రెజిల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు బాస్కెట్ బాల్ వేదిక నుంచి ప్రధాన వేదికకు బస్సులో వెళుతుండగా, మార్గం మధ్యలో కాల్పులు జరిగాయని, బస్సు కిటీకి అద్దాలను ధ్వసం చేసుకుంటూ దూసుకొచ్చిన బుల్లెట్ దెబ్బకు ఒకరు స్వల్పంగా గాయపడ్డారని ప్రత్యక్షసాక్షలులు వెల్లడించారు. అయితే అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. రియోలో కాల్పులకు అవకాశమేలేదని, ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించామని, అద్దాలను ధ్వసం చేసింది బుల్లెట్లా లేక రాళ్లా అనే విషయం తెలియాల్సిఉందని రియో క్రీడల నిర్వాహక కమిటీ అధికార ప్రతినిధి మారియో అండ్రాడ తెలిపారు. (తప్పక చదవండి: రియో.. వెలుగుల్లో చీకట్లు) అసలే దోపిడీలు, హత్యలు విరివిగా చోటుచేసుకునే బ్రెజిల్ లో.. విశ్వక్రీడల ప్రారంభానికి ముందే భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం.. ఒలింపిక్ గ్రామంలో(స్పోర్ట్స్ విలేజ్) సహా రియో నగరమంతా భారీ భద్రతా ఏర్పాటుచేసింది. అయినాసరే, గత శనివారం క్రీడాప్రాంగణానికి సమీపంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. చిన్నా చితకా అల్లర్లు కూడా జరిగాయి. -
ఒలింపిక్ విలేజ్ లో వరుస చోరీలు
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు, ఇతర ఆటగాళ్లు వరుస చోరీ ఘటనలతో సతమతమవుతున్నారు. ఒపింపిక్ విలేజ్ లో ఏర్పాట్లు చవకబారుగా ఉన్నాయంటూ ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చోరీలు ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా డెన్మార్క్ అథ్లెట్ల మొబైల్స్, బట్టలు, ఐపాడ్, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డెన్మార్క్ చెఫ్ డె మిషన్ కు చెందిన రాడ్ విట్ మాట్లాడుతూ.. తన ఐపాడ్ కూడా చోరీ చేశారని ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో అర్థం కావడం లేదని చెప్పారు. జూలై 18 నుంచి ఇప్పటివరకూ ఒలింపిక్ విలేజ్ లోని 36 అపార్ట్ మెంట్ల నుంచి దాదాపు 150 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువగా చైనా, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు బాధితులుగా ఉన్నారు. రియోలో 88 వేలకు పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. లండన్2012 ఒలింపిక్స్ తో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువని, అయితే వరుస చోరీలతో అథ్లెట్లు భయబ్రాంతులకు లోనవుతున్నారని డెన్మార్క్ అధికారులు వివరించారు. రియో నిర్వాహకులు మాత్రం ఫిర్యాదు అందిన ప్రతిసారి బాధితులకు క్షమాపణలు చెబుతున్నారు తప్ప ఇలాంటివి జరకుండా చేయడంలో విఫలమవుతున్నారు. -
నిద్ర కళ్లతో టీవీ చూద్దాం
బోల్ట్ పరుగు తీసే క్షణాలను చూడాలనుకుంటున్నారా..? భారత క్రీడాకారులు సగర్వంగా పతకాన్ని ముద్దాడుతుంటే ఆనందించాలని భావిస్తున్నారా..? అయితే నిద్రకళ్లతో టీవీ చూడటానికి సిద్ధం కండి. ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడల పండగ ఒలింపిక్స్ వచ్చేసింది. శుక్రవారం రాత్రి జరిగే ప్రారంభోత్సవ (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున గం. 4.30 నుంచి) కార్యక్రమంతో అధికారికంగా క్రీడలకు తెరలేవనుంది. 17 రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలింపిక్స్ ఈసారి బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో నగరంలో జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం రియో ఎనిమిదిన్నర గంటలు వెనక ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మన కాలమానం సాయంత్రం ఆరు గంటల నుంచి పోటీలు జరుగుతాయి. ఇవి రాత్రి మొత్తం ఉంటాయి. ఉదయం ఏడు గంటల వరకూ సాగుతాయి. బోల్ట్ 100 మీటర్ల పరుగు మన కాలమానం ప్రకారం 15వ తేదీ ఉదయం గం.6.55కి ఉంటుంది. అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండటమో... లేక తెల్లవారుజామున త్వరగా లేవడమో... అనుకూలతను బట్టి ఏదో ఒక సమయంలో నిద్ర కళ్లతో అయినా టీవీ ఆన్ చేద్దాం. పండుగను ఆస్వాదిద్దాం. -
వాట్సాప్‌ను ఎలా నిషేధిస్తారు?
రియోడిజనిరో: వాట్సాప్‌పై నిషేధం విధించడాన్ని బ్రెజిల్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలా ఎలా చేస్తారని కిందిస్థాయి కోర్టును మందలించింది. వెంటనే నిషేధం ఎత్తివేయాలని ఆదేశించింది. డ్రగ్స్ రవాణా ముఠా వాట్సాప్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కొనసాగించారని, ఆ సమాచారం తమకు ఇవ్వాలని వాట్సాప్ పేరెంటింగ్ సంస్థ ఫేస్ బుక్‌ను బ్రెజిల్ పోలీసులు ఆశ్రయించారు. అయితే, వ్యక్తిగత సమాచారం ఇవ్వబోమని ఫేస్ బుక్, వాట్సాప్ పోలీసులకు స్పష్టం చేశాయి. దీంతో కింది కోర్టును సంప్రదించిన విచారణ అధికారులు వాట్సాప్ పై నిషేధం విధించేలా అనుమతి తెచ్చుకున్నారు. కేసు విచారణకు తమకు సహకరించడం లేదని దాదాపు నాలుగు గంటలు వాట్సాప్ నిషేధించారు. ఈ చర్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కింది కోర్టును ఉన్నత న్యాయ స్థానం మొట్టికాయలు వేసింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వాట్సాప్‌పై కొన్నిగంటలపాటు నిషేధం విధించారు. -
అచ్చం బిల్లా సినిమాలో చేసినట్లే దాడి
రియో డిజనిరో: అచ్చం సినిమాలోలాగే.. బిల్లా సినిమా చూశారుగా.. అందులో గాయాలపాలయి పోలీసుల అదుపులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ డాన్(ప్రభాస్)ను తీసుకొచ్చేందుకు అనుష్క బృందం ఓ ఆస్పత్రిపై దాడికి దిగి అతడిని విడిపించుకునే తీరుగా బ్రెజిల్ రాజధాని రియో డిజనిరోలోని ఓ ఆస్పత్రిపై కొంతమంది సాయుధులు దాడికి దిగారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్తుపదార్థాల చేరవేత దారుడిని విడిపించేందుకు పోలీసులతో తలపడ్డారు. ఈ క్రమంలో ఓ రోగి ప్రాణాలుకోల్పోగా మరొకరు గాయపడ్డారు. ఎట్టకేలకు తమ వాడిని ఆ సాయుధులు విడిపించుకుని వెళ్లారు. రియోడిజనిరోలో సౌజా అగ్విర్ అనే ఆస్ప్రత్రిలో ఓ డ్రగ్స్ రవాణా దారు బుల్లెట్ గాయంతో చికిత్స పొందుతున్నాడు. అతడు ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడికి చెందిన ఓ 20మంది ముఠా ఆయుధాలతో దిగారు. బయట పదిహేనుమంది కాపలా ఉండగా మరో ఐదుగురు ఆస్పత్రిలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒకరు చనిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే త్వరలో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్‌లో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు ఈ ఆస్పత్రిని కూడా ఎంపిక చేశారు. అలాంటి ఆస్పత్రిపై సాయుధులు దాడి చేయడాన్ని, ఆ దాడిని పోలీసులు కనిపెట్టలేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ వీడియో ట్విటర్ లో పెట్టిన వారికోసం..
రియో డి జనిరో: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బ్రెజిల్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో ట్విటర్ లో పెట్టిన ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తనపై జరిగిన దారుణంగా గురించి బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. గత వారాంతంలో అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి ఆమె వెళ్లింది. తామిద్దరమే ఇంట్లో ఉన్నామని ఆమె భావించింది. కానీ తర్వాతి రోజు మెలకువ వచ్చేప్పటికి వేరే ఇంట్లో ఉన్నానని, తన చుట్టూ 30 మంది ఉన్నారని.. వీరిలో చాలా మంది చేతుల్లో ఆయుధాలు ఉన్నాయని చెప్పింది. వీరందరూ లేదా వీరిలో కొంతమంది ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గాయాలతో నగ్నంగా, చేతిలో పైసా లేకుండా ఇల్లు చేరుకున్నానని బాధితురాలు కన్నీళ్ల పర్యంతమైంది. ఆమె ప్రియుడు, మరో వ్యక్తిపై పోలీసులు రేప్ కేసు పెట్టి వారెంట్ జారీ చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బాధితురాలు పేర్కొంది. సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 'తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. కురుచ దుస్తులు వేసుకున్నందుకే ఇలా జరిగిందని అంటున్నారు. ఇది మహిళల తప్పు కాదు. చోరీ జరిగినప్పుడు దొంగలను తప్పుబట్టడం మానేసి బాధితులను నిందిస్తారా?' అని బాధితురాలు ఆక్రోశించింది. 16 ఏళ్ల బాలికపై 33 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన సో జువో నగరంలో ఈనెల 21న జరిగింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో చూసి బ్రెజిల్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మరో రెండు నెలల్లో రియో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనం రేపింది. -
16 ఏళ్ల బాలికపై 33 మంది..
రియో డి జెనీరో: మరి కొద్ది రోజుల్లో ఒలంపిక్స్‌కు ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ నగరం రియో డి జెనీరోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఘటనను మించేలా తలపిస్తున్న ఈ ఘటనలో ఓ 16 ఏళ్ల బాలికపై 33 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బ్రెజిల్ మహిళా సంఘాలు, సమాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రియోలోని ఫవేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన 20 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌ను కలువడానికి వెస్టర్న్ ఫ్రింజ్లోని అతని గదికి వెళ్లింది. అయితే నమ్మిన బాయ్‌ఫ్రెండే ఆమె పాలిట కాలయముడిలా మారాడు. బాలికకు డ్రగ్స్ ఇచ్చిన దుండగులు 36 గంటల పాటు నిర్భందించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో గతవారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు బాలిక బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. -
సచిన్ ఎంపికపై గంగూలీ ఏమన్నాడు...
కోల్‌కతా: రియోడిజనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ నియామకంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తంచేశాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయాన్ని సమ్మతిస్తున్నట్లు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికైన వాళ్లలో ఒకరైన సచిన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పి గంగూలీ తన మద్ధతు ప్రకటించాడు. తన నిర్ణయం ఏంటి అని ఎప్పుడూ అడుగుతుంటారని, ప్రతి విషయం మీద అభిప్రాయాలు ఇవ్వడాన్ని తాను నమ్మనని టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడైన గంగూలీ అభిప్రాయపడ్డాడు. అందుకే అలాంటి వాటిని పక్కనపెట్టి ముందుగా ఎంపికైన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పడమే ఉత్తమ బాధ్యత అన్నాడు. 'సచిన్ దేశం కోసం ఇప్పటివరకూ ఎంతో చేశాడు. అతడు అద్భుతాలు చేసినందున నేడు భారత్ తరఫున రియో ఒలింపిక్స్ కు గానూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఐఓఏ నిర్ణయం సరైనది' అని గంగూలీ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికే ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. సల్మాన్ కు కూడా ఆ హోదా దక్కడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రియోలో గ్లామర్ తీసుకొస్తాడంటూ మద్ధతుగా గంగూలీ వ్యాఖ్యానించాడు. -
భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్
రియో ఒలింపిక్స్ కోసం న్యూఢిల్లీ: రియో డి జనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. రాయబారిగా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్‌కు తన సమ్మతిని తెలుపుతూ లేఖ కూడా రాశారు. ఇప్పటికే ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను కూడా సంప్రదించామని, ఇంకా ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు. -
'స్వర్గంలో చోటిస్తానన్నా వెళ్లను'
'లివ్ యువర్ పాషన్' నినాదంతో బ్రెజిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విశ్వక్రీడలకు.. చిన్నదే అయినా గొప్ప చిక్కొచ్చిపడింది. ముగ్గురు పిల్లల తల్లైన ఓ 59 ఏళ్ల మహిళ.. ఒలంపిక్స్ ప్రధాన స్టేడియాలు నిర్మించే ప్రదేశాన్ని ఖాళీ చేయనుగాక చేయనంటూ భీష్మించుకు కూర్చుంది. ఆమె ఇంటిపక్కనుండే క్రైస్తవ పూజారి కూడా నిర్వాసిత ప్రదేశానికి పోయేదిలేదని తేల్చిచెప్పడంతో వీళ్లను బలవంతంగా తరలించలేక, అలాగని ఆ స్థలాన్ని వదులుకోలేక నానా తంటాలు పడుతున్నారు క్రీడల నిర్వాహకులు. బ్రెజిల్ లోని రెండో అతిపెద్ద నగరం, దక్షిణ అట్లాంటిక్ తీరంలోని రియో డి జనెరోలో ఆగస్టు 5 నుంచి 2016- ఒలంపిక్స్ ప్రారంభం అవుతాయి. 200కు పైగా దేశాలకు చెందిన 10 వేల మంది క్రీడాకారులు 28 విబాగాల ఈవెంట్లలో పాల్గొంటారు. ఆ మేరకు రియో నగర నైరుతి ప్రాంతంలో ప్రధాన వేదికలతోపాటు ఆటగాళ్లు బస చేసేందుకు నిర్మాణాలు చేపట్టారు. ఇందుకోసం భారీ ప్యాకేజీ ఇచ్చిమరీ వందలాది కాలనీల్లోని వేలాది మందిని ఖాళీ చేయించారు. వేడుకలకు మరో ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో పనులు మరింత వేగంగా పరుగుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన స్టేడియం పనులు పూర్తికాగా, ఇతర క్రీడాంశాలకు చెందిన స్టేడియాల పనులు జరుగుతున్నాయి. అయితే ఈత కొలను నిర్మాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే మార్సియా(59), హొయిసా బెట్రో(45) వాళ్ల ఇల్లులు కూలగొడితేగానీ అది సాధ్యం కాదు.ఆ కాలనీలో నివసించిన 600కు పైగా కుటుంబాలు ఇప్పటికే నిర్వాసిన ప్రాంతానికి వెళ్లిపోగా, వీళ్లిద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. 'అదేంటమ్మా.. ఇంత మంచి ప్యాకేజీ ఇచ్చాం కదా.. మీరూ వెళ్లిపోవచ్చుకదా'అని నిర్మాణ సంస్థ ప్రతినిధులెవరైనా తనను ప్రశ్నిస్తే.. 'పాతికేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఈ ప్రదేశమంటే నాకెంతో ఇష్టం. ఇదిగాక స్వర్గంలో చోటిస్తానన్నా వెళ్లను'అని గట్టిగా జవాబిస్తుంది. ఇక ఇళ్లు వదిలి వెళ్లకపోవడానికి బెట్రోకు మరో కారణం ఉంది. కంపెనీ చూపించిన నిర్వాసిత ప్రాంతం.. శాపానికి గురైన దెయ్యాల దిబ్బ అని అతడి నమ్మకం. అక్కడికి వెళితే దుష్టశక్తులు తనను కాల్చుకుతింటాయని భయం.ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో నిర్మాణ సంస్థ.. ఆ రెండు ఇళ్ల చుట్టూ ఇనుప కంచెను నిర్మించి ఒకరకమైన నిర్బంధాన్ని విధించింది. ఇది తెలుసుకున్న మార్సియా, బెట్రోల బంధవులు కంచెలు తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. విశ్వక్రీడలు ప్రారంభం అయ్యేనాటికి ఒక వేళ ఆ రెండు ఇళ్లు అలాగే ఉంటే బహుశా ఆ ఇద్దరిదీ 'ప్రపంచ స్థాయి భూపోరాటం' అనక తప్పదేమో! -
రియో ఒలంపిక్స్ టెస్ట్ ఈవెంట్ షెడ్యూల్ విడుదల
రియోడిజినారో: రియో ఒలంపిక్స్ టెస్ట్ ఈవెంట్ షెడ్యూల్ విడుదలైంది. 2016 లో జర్మనీలోని రియోడిజనారోలో జరగబోయే ఒలంపిక్స్ కు 21 విభాగాలకు ఈ ఏడాది టెస్ట్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. మరో 23 ఈవెంట్లకు 2016 జనవరి నుంచి మే వరకు టెస్ట్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. మొత్తం ఈవెంట్లను మూడు సెగ్మెంట్లుగా విభజించారు. మొదటి సెగ్మెంటయిన వాలీబాల్ ను 2015 మేలో నిర్వహించనున్నారు. ఈవెంట్ల రెండో విభాగంలో అవుట్ డోర్ విభాగాలైన బాక్సింగ్, బాస్కెట్ బాల్, డైవింగ్ లను నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నిర్వహించనున్నారు. చివరి ఈవెంట్లుగా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్ బాల్ లను నిర్వహించనున్నారు. -
స్కూల్లో కాల్పులు: ఒకరు మృతి
రియోడీజనీరో: స్కూల్లో ఆగంతకుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బ్రెజిల్‌లోని బెలో హరిజోటీ మెట్రోపాలిటిన్ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే ఆగంతకుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో అసిస్టెంట్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని చెప్పారు. ఆగంతకుడు ప్రవేశ ద్వారం నుంచి స్కూల్లోకి ప్రవేశిస్తున్న వ్యక్తినే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో స్కూల్ విద్యార్థులు, సిబ్బంది కారిడార్ నుంచి తరగతి గదుల్లోకి భయంతో పరుగులు తీశారు. -
రెండు రైళ్లు ఢీ: 40 మందికి గాయాలు
రియోడిజనీరో : బ్రెజిల్ రియోడిజనీరో రాష్ట్రంలో రెండు లోకల్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మెస్కెట్టా పట్టణంలోని రైల్వే స్టేషన్లో రైలు ఆగి ఉంది. అదే ట్రాక్‌పైకి మరో రైలు వచ్చి ఆగి ఉన్న రైలును ఢీ కొట్టింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది : పీలే కుమార్తెలు
రియాడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన కుమార్తెలు శనివారం వెల్లడించారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. పీలే ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి చేరిందని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 74 ఏళ్ల పీలే మూత్ర సంబంధిత సమస్యలతో ఇటీవల సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పీలే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఈ నెలలో ఇదే ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. నవంబర్13న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. -
షేక్ షేక్ షకీరా !
ముగింపు కార్యక్రమంలో సందడి చేయనున్న పాప్ స్టార్ రియో డి జనీరో: కొలంబియా పాప్ స్టార్ షకీరా ప్రపంచకప్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గత రెండు ప్రపంచకప్‌లలో తన ఆట, పాటతో సందడి చేసిన షకీరా.. ఈ సారి టోర్నీ ముగింపు ఉత్సవంలో తళుక్కున మెరవబోతోంది. జూలై 13న రియో డి జనీరోలో జరిగే మెగా ఫైనల్‌కు ముందు పాప్ స్టార్ ప్రదర్శన ఇవ్వనుంది. ఫిఫా అధికారిక గీతం ‘లా లా లా’తో ఇప్పటికే హల్చల్ చేస్తున్న కొలంబియా భామ.. బ్రెజిల్ స్టార్ కర్లినో బ్రౌన్‌తో కలిసి ఆడి పాడనుంది. ఇక ఫిఫా మరో అధికారిక గీతాన్ని (‘దార్ ఉమ్ జీటో-వియ్ విల్ ఫైండ్ ఎ వే’) సాంటనా, వెక్లైఫ్తో పాటు బ్రెజిల్ సింగర్ అలెగ్జాండర్ పెరైస్ ముగింపు కార్యక్రమంలో ఆలపించనున్నారు. దీంతో పాటు స్థానిక కార్యక్రమాలు అభిమానులను అలరించనున్నాయి. -
కొత్తా... దేవతండీ!
సామాజికం ‘‘మా అమ్మాయికి ఆ భగవంతుడు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఇచ్చాడు’’ అంటున్నాడు ఎలని నాన్న ఎడటో సాంటోస్. క్యాన్సర్ నుంచి ఎయిడ్స్ వరకు ఎలాంటి రోగాన్ని అయినా సరే, ఎలని సాంటోస్ నయం చేస్తుందనే వార్తలతో బ్రెజిల్‌లోని ఊరూవాడా మారుమోగిపోతోంది. ఎనిమిది సంవత్సరాల ‘ఎలని’ ఇప్పుడు చాలామంది దృష్టిలో బాల దేవత! రియో డి జెనిరోలో తన తండ్రి పని చేసే చర్చిలో రోగులతో మాట్లాడి, వారి బాధలను తెలుసుకొని ప్రార్థనలు చేస్తుంటుంది ఎలని. ‘‘రోగులు వారానికి రెండుసార్లు ఈ అమ్మాయి చేతిని తాకితే చాలు. ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది’’ అంటున్నారు ఎలనీని విశ్వసించే వాళ్లు. ‘‘ప్రజల రోగాలను నయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రోజులో చాలాసేపు రకరకాల రోగులను చేతితో ముట్టుకుంటూనే ఉంటాను. ఆ తరువాత దేవుడిని ప్రార్థించగానే వాళ్లు స్వస్థులవుతారు’’ అంటోంది ఎలని. -
మ్యాచ్ సమయాల్లో మార్పులు
రియో డి జనీరో: వచ్చే ఏడాది జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రారంభ సమయాలపై ‘ఫిఫా’ మెట్టు దిగింది. అంతర్జాతీయ ఆటగాళ్ల సంఘం (ఎఫ్ఐఎఫ్ప్రో) చేసిన ఒత్తిడికి తలొగ్గి ఏడు మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో మార్పులు చేసింది. కొన్నింటిని ముందుకు... మరికొన్నింటిని వెనక్కి జరిపింది. అధిక ఉష్ణోగ్రతకు ఆటగాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 14న మన్నాస్లో ఇంగ్లండ్, ఇటలీ మధ్య మ్యాచ్ రాత్రి 9 గంటలకు బదులుగా సాయంత్రం 6 గంటలకు జరగనుంది. యూరోపియన్ టెలివిజన్ ప్రసార సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే రోజు రెసిఫీలో ఐవరీకోస్ట్, జపాన్ల మధ్య మ్యాచ్ రాత్రి 7 గంటలకు కాకుండా 10 గంటలకు నిర్వహించనున్నారు. జూన్ 18న మన్నాస్లో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన కామోరూన్, క్రొయేషియా మ్యాచ్‌ను సాయంత్రం ఆరింటికి మార్చారు. రియో డి జనీరోలో స్పెయిన్, చిలీల మధ్య మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు కాకుండా సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. -
మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబెర్!
టీనేజ్ పాప్ స్టార్ జస్టిన్ బీబెర్ దక్షిణ అమెరికా పర్యటన వివాదాలతో ముందుకు సాగుతోంది. తాజాగా ఫోటో జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించడం వివాదంగా మారింది. అర్జెంటినాలో కెమెరాలతో క్లిక్ మనిపిస్తున్న ఫోటో జర్నలిస్ట్ ను కారు డోర్ తో దురుసుగా తోయడం పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఇటీవల బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో వేశ్యగృహంలో బీబర్ పట్టుబడిన సంఘటన దక్షిణ అమెరికా అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ సంఘటన తర్వాత రియో డి జెనిరోలోని ఓ ప్రదర్శనలో వాటర్ బాటిల్ తో బీబెర్ ను అభిమాని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఓ అమ్మాయితో ఒంటిపై షర్ట్ లేకుండా ఓ రాత్రి గడుపుతూ ఉన్నట్టుగా కనిపించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. -
వేశ్యాగృహంలో మీడియాకు చిక్కిన పాప్ స్టార్!
సినీ నటులు, పాప్ స్టార్స్ చాటుమాటుగా తమ ప్రేయసిలతో కనిపించడం సాధారణమే. అయితే అంతర్జాతీయంగా గొప్ప పేరు, ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ ఓ వేశ్య గృహంలో కనిపించడం సంచలనం రేపింది. తాజాగా టీనేజ్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో ఓ వేశ్యాగృహంలో కనిపించడం అక్కడి అభిమానుల ఆగ్రహానికి గురి చేసింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న జస్టిన్ బీబర్ వేశ్య గృహంలో మీడియా కంటపడటం అనేక విమర్శలకు దారి తీసింది. పందొమ్మిదేళ్ల బీబర్, తన స్నేహితుడితో కలిసి మూడు గంటలపాటు రియో డి జెనిరోలోని సెంటారోస్ బ్రోతల్ (వేశ్యా వాటిక) గడిపారని న్యూయార్క్ పోస్ట్ ఆరో పేజిలో కథనాన్ని వెల్లడించింది. వేశ్యగృహం నుంచి వెళ్లే సమయంలో అతని బాడీ గార్డ్స్ బెడ్ షీట్ ను బీబర్ ముఖంపై కప్పి తీసుకువెళ్లినట్టు కథనంలో పేర్కోంది. అంతేకాకుండా వేశ్యలను కూడా తన హోటల్ రూంకు తీసుకువెళ్లారని ఫోటోగ్రాఫర్లు కూడా ధృవీకరించారు. ఈ వ్యవహరంతో ఆగ్రహించిన బ్రెజిల్ ఫ్యాన్స్.. ఓ కార్యక్రమంలో ఓ వేదికపైన ఉన్న బీబర్ ను వాటర్ బాటిల్ తో కొట్టారు.