![Viral Video: Three year Old Saves His friend from Drowning in Pool in Brazil - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/26/chi.gif.webp?itok=hGu3F7-Y)
రియో డిజనీరో: మూడేళ్ల వయసులోనే స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న తన స్నేహితుడిని కాపాడి ఒక బాలుడు హీరోగా మారాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ మూడేళ్ల చిన్నారి తల్లి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. తన కొడుకు ఆర్థర్, తన స్నేహితుడు ఆడుకుంటూ ఉంటుండగా ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో పడిపోయినట్లు తెలిపింది. దగ్గరలో స్విమ్మింగ్ పూల్స్, నీటి గుంతలు ఉన్నప్పుడు పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి ఆర్థర్ తల్లి వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో స్విమ్మింగ్ రింగ్‌ను అందుకోవడం కోసం అర్ధర్, అతని స్నేహితుడు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆర్థర్ స్నేహితుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. దీంతో ఆర్థర్ పెద్దవాళ్లను పిలవడమే కాకుండా తన స్నేహితుడిని కూడా కాపాడాడు. ఈ ఘటనలన్ని అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లందరూ ఆర్థర్‌ను రియల్ హీరో అంటూ ఆకాశనికెత్తెస్తున్నారు. దీనికి తోడు ఇది చూసిన పోలీసు ఆర్థర్‌కు మంచి బహుమతిని అందించారు. బుట్ట నిండా చాకెట్లు అందించడంతో పాటు ఒక మెడల్, సర్టిఫికేట్‌ను బహుకరించారు.
Comments
Please login to add a commentAdd a comment