బామ్మకు అరుదైన గిఫ్ట్‌; సంతోషంతో ముద్దులు | Viral Video Elderly Woman Receives Surprise Gift From Granddaughter | Sakshi
Sakshi News home page

బామ్మకు అరుదైన గిఫ్ట్‌; సంతోషంతో ముద్దులు

Published Tue, Jul 13 2021 1:20 PM | Last Updated on Tue, Jul 13 2021 2:35 PM

Viral Video Elderly Woman Receives Surprise Gift From Granddaughter - Sakshi

బ్రెజిల్‌లో ఒక బామ్మకు తన మనవరాలు బార్బీ డాల్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఆమెను సర్‌ప్రైజ్‌ చేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తనకు సరైన సమయంలో ఆ గిఫ్ట్‌ ఇచ్చినందుకు ఆమె తన మనవరాలిని ముద్దులతో ముంచెత్తింది. వివరాలు.. బ్రెజిల్‌కు చెందిన డోనా కార్‌మోజా ఇంట్లోనే ఉంటూ తన మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంది.

తమని బాగా చూసుకుంటున్న బామ్మకు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలని భావించింది. వెంటనే ఆన్‌లైన్‌లో ఒక బార్బీడాల్‌ను కొనుగోలు చేసి ఆమెను సర్‌ప్రైజ్‌ చేస్తూ దాన్ని గిఫ్ట్‌ రూపంలో ఇవ్వాలనుకుంది. రెండు రోజుల తర్వాత డోనా కు ఒక గిఫ్ట్‌ పార్సిల్‌ వచ్చింది. ఆమె దానిని తెరిచి చూడగానే అందులో బార్బీ డాల్‌ కనబడడంతో సంతోషపడింది. ఈ గిఫ్ట్‌ను తన మనవరాలే పంపిందని గ్రహించి పక్కనే ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి ముద్దుల వర్షం కురిపించింది. ఈ వీడియోను ఒక వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ డోనా కార్‌మోజాకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అయినా.. దానిని ఆమె తన జీవితకాలం దాచుకుంటుంది అని క్యాప్షన్‌ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement