Barbie doll
-
బార్బీ డాల్.. ఈ సంగతులు తెలుసా మీకు?
ఇదీ బార్బీ బొమ్మ కథ!హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19, 1959లో. మా ఊరు న్యూయార్క్. నేను మొదటిసారి మీ ముందుకు బ్లాక్ అండ్ వైట్ స్విమ్‌సూట్‌లో వచ్చాను. నేను 11.5 అంగుళాల ఎత్తుతో ఉంటాను. నా మొదటి ధర మూడు డాలర్లు. నాకో ప్రత్యేకమైన రంగు ఉంది. ఆ రంగు పేరు ’బార్బీ పింక్’. నన్ను మీరు రకరకాల రూ΄ాల్లో చూసి ఉంటారు. డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలెట్.. ఇలా 250 రకాల రూపాల్లో నేను మీకు కనిపిస్తాను. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టే నాలుగేళ్ల ముందే, అంటే 1965లో నేను అంతరిక్షానికి వెళ్లాను తెలుసా? అమ్మాయిలు ఏయే రంగాల్లో అయితే తక్కువగా ఉన్నారో ఆ రంగాల్లో నేను కనిపించి వారిలో స్ఫూర్తి నింపాను. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కల. ప్రపంచంలోని అన్ని దేశాల వారూ నన్నెంతో ఇష్టపడతారు. నన్నింకా వైవిధ్యంగా తయారు చేసేందుకు నాకోసం సుమారు వెయ్యి మందికిపైగా రకరకాల ఫ్యాషన్లు తయారు చేశారు. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడేవారు. ఆ తర్వాత 6 నుంచి 99 ఏళ్లవారు కూడా నా మీద ఇష్టం చూపడం మొదలుపెట్టారు. 1997లో నా పేరు మీద ’బార్బీ గాల్’ అనే పాట కూడా తయారు చేశారు. అది ఇప్పటికీ ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 100 బార్బీ బొమ్మలు అమ్ముడు΄ోతున్నాయి. మొత్తం 150 దేశాల్లో నా బొమ్మలు అమ్ముతున్నారు.నా పేరిట అనేక సోషల్‌మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్లో నాకు సంబంధించి రకరకాల వీడియోలుంటాయి. ఇప్పటిదాకా 151 మిలియన్ల నిమిషాల సేపు ఆ వీడియోలను జనం చూశారు. నా పేరుతో 2023లో ’బార్బీ’ అనే విడుదలైంది. -ఇదీ నా కథ. ఇక ఉంటాను. బై! -
అయ్యయ్యో! బార్బీకి ఏమైంది?!
కంగారు పడకండి. బార్బీకి ఏం కాలేదు. బార్బీ స్ట్రాంగ్ గర్ల్. ఈసారి ఇంకో స్ట్రాంగ్ గర్ల్ రూపంలో అవతరించిందంతే. ఆ రూపమే.. ‘‘బ్లైండ్ డాల్’’! చూపు లేని బొమ్మ!! ఆ..! చూపు లేక΄ోవటం శక్తి అవుతుందా? ఎందుక్కాదూ? చూపు లేక΄ోవటం, చూడలేక΄ోవటం వేర్వేరు కదా. చూపు ఉండీ పక్క మనిషి నిస్సహాయతను పట్టించుకోని వాళ్లకు ఏం శక్తి ఉన్నట్లు? చూపు లేకున్నా సాటి మనిషి హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు ఏం శక్తి లేనట్లు? బార్బీ.. అమ్మాయిల మనసెరిగిన బొమ్మ. డాక్టర్ బార్బీకి.. మెడిసిన్ చదవాలని కలలు కనే అమ్మాయిల మనసు తెలుసు. ఆస్ట్రోనాట్ బార్బీకి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయాలని ఉవ్విళ్లూరే అమ్మాయిల ఆశలకు ఎన్ని రెక్కలు ఉంటాయో తెలుసు. నల్లజాతి బార్బీకి.. రంగు కారణంగా నల్ల జాతి మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర వివక్ష ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా.. మిస్ యూనివర్శ్ బార్బీ, ప్రెసిడెంట్ బార్బీ, పైలట్ బార్బీ, వీల్ చెయిర్ బార్బీ, ప్రోస్థెటిక్ లెగ్ బార్బీలన్నీ వివిధ వృత్తులు, ప్రవృత్తులు, స్థితి గతులకు ప్రతీకగా ఉండి, ఆడపిల్లలకు స్ఫూర్తిని, సహానుభూతిని అందిస్తున్నవే. 1959తో తొలి బార్బీ మార్కెట్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 1000 రకాలకు పైగానే బార్బీ డాల్స్ అమ్మాయిలకు ఆత్మ బంధువులయ్యాయి. ఆ క్రమంలో తాజాగా ఆవిర్భవించిన కారణజన్మురాలే.. ‘‘బ్లైండ్ డాల్’’. కారణ జన్మురాలా! అవును. కారణ జన్మురాలే. బాలికల్ని మానసికంగా శక్తివంతుల్ని చేయాలన్నదే ఆ కారణం. మాటెల్ కంపెనీ తన ‘స్ఫూర్తిదాయకమైన మహిళలు’ సిరీస్‌లో భాగంగా 2021లో ‘హెలెన్ కెల్లర్’ రూపంలో బార్బీని తయారు చేసినప్పటికీ, ఫ్యాషనబుల్‌గా తెచ్చిన తొలి బ్లైండ్ బార్బీ మాత్రం ఇదే. అంధులైన వారిని కూడా కలుపుకుని ΄ోయేలా ఈ ‘బ్లైండ్ బార్బీ’ రూపోందింది. ఇందుకోసం బార్బీ బొమ్మల కంపెనీ ‘మాటెల్’.. ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్’తో చేతులు కలిపింది. ఈ కొత్త బార్బీ డాల్ పింక్ శాటిన్ టీ షర్టు, పర్పుల్ ట్యూల్ స్కర్టు ధరించి ఉంటుంది. చేతిలో తెలుపు, ఎరుపు రంగుల స్టిక్ ఉంటుంది. పిల్లల్లో స్వీయ వ్యక్తీకరణను, ఆత్మదృఢత్వాన్ని పెంపొందించేందుకు బ్లైండ్ బార్బీని తెచ్చామని మాటెల్ కంపెనీ చెబుతోంది. అంతే కాదు, ఈ కొత్త బార్బీ ΄్యాకింగ్ కూడా విలక్షణంగా ఉంది. బాక్సు మీద బార్బీ అనే అక్షరాలను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. బ్రిటన్ యువతి లూసీ ఎడ్వర్డ్స్ ఈ బొమ్మకు ప్రచారకర్త. ఆమె తన 11 ఏళ్ల వయసులో కుడి కంటి చూపు కోల్పోయారు. 17 ఏళ్ల వయసులో రెండో కంటి చూపు కూడా క్షీణించింది. ‘‘ఈ బొమ్మ నా సర్వస్వం. ఇది నా దగ్గర ఉంటే నేను ఒంటరినన్న భావనే నాలో కలగదు..’’ అంటున్నారు లూసీ తన చేతిలోని బ్లైండ్ బార్బీని హృదయానికి హత్తుకుంటూ. ఇంకోమాట.. ‘‘అయ్యయ్యో’’ అనిపించుకోవటంస్ట్రాంగ్ గర్ల్‌కి అస్సలు ఇష్టం ఉండదట. లూసీ అంటారు. -
కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం... తోలుబొమ్మలం
‘రంగ రంగ రంగస్థలానా... కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంటా...తోలు బొమ్మలం అంటా’ అంటూ ‘రంగస్థలం’లో తాత్వికంగా పాడతాడు రామ్‌చరణ్. ఈ పాట సంగతి ఎలా ఉన్నా ‘బొమ్మలు మన కుటుంబ సభ్యులు’ అంటున్నాడు ఆలిఫ్. కోల్‌కతాకు చెందిన వ్లోగర్ ఆలిఫ్ బొమ్మలు తయారుచేసే కార్మికుల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. లిక్విడ్ ప్లాస్టిక్‌ను వివిధ రకాల బొమ్మల మూసలలో పోయడం నుంచి బొమ్మల తలలకు ప్లాస్టిక్ వెంట్రుకలు అతికించడం వరకు రకరకాల దశలు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘లైఫ్ ఇన్ ప్లాస్టిక్ నాట్ ఫంటాస్టిక్’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. ‘అందమైన బొమ్మల వెనుక ఇంత కష్టం ఉంటుందా!’ అని చెప్పేలా ఉన్న ఈ వీడియో వైరల్ అయింది. -
సృజన: తెలుగింటి బార్బీ
పట్టులంగా, ఓణీ కట్టిన బొమ్మలు కాళ్లకు పారాణి, నుదుటన బాసికం కట్టిన బొమ్మలు, పసుపు కొట్టే బొమ్మలు.. పందిట్లో బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, అబ్బురపరిచే బొమ్మలు.. చిందేసే బొమ్మలు.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే బొమ్మలు ..,ఎవ్వరి చూపులనైనా కట్టిపడేసేలా ఉండే బొమ్మలేవీ అంటే.. అవి దివ్య తేజస్వి చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలై ఉంటాయి. వెస్ట్రన్ బార్బీ డాల్‌ను ఇండియన్ డాల్‌గా మార్చేసి, వాటిని మన సంప్రదాయ వేడుకలకు అనువుగా మార్చేసింది హైదరాబాద్ ఎఎస్‌రావు నగర్‌కు చెందిన దివ్య తేజస్వి. అమ్మాయి పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు ప్రతి వేడుకను బొమ్మల్లో అందంగానూ, అర్థవంతంగానూ చూపుతూ పది మందికి ఉపాధి కల్పిస్తోంది. భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్న దివ్య ఈ అందమైన బొమ్మల రూప కల్పన గురించి అడిగితే ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, పదిమందికి ఆదాయవనరుగా ఎలా మారిందో నవ్వుతూ వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘దసరా వచ్చిందంటే బొమ్మల కొలువు గురించి ఆలోచన చేయకుండా ఉండరు. అలాగే, ఒక బొమ్మనైనా ఇంటికి తెచ్చుకుంటారు. నేను ఇంట్లోనే బొమ్మల తయారీ మొదలుపెట్టాను. పాప ముచ్చట తీర్చిన బొమ్మ అమ్మానాన్నలది వెస్ట్ గోదావరి. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. బయోకెమిస్ట్రీ చేశాను. జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్లాను. అక్కడ టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. మాకు ఓ పాప. హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అనుకున్న సమయంలో కరోనా మా జీవితాలను దెబ్బతీసింది. మా ఉద్యోగాలు పోయాయి. అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఓరోజు మా పాప తన బొమ్మకి డ్రెస్ వేసివ్వమంటే, నా చీర అంచుతో చీరకట్టి, అలంకరించి ఇచ్చాను. దాన్ని ఫొటో తీసి ఇన్‌స్టా పేజీలో పెట్టాను. ఆర్డర్లు తెచ్చిన బొమ్మలు నేను పెట్టిన బొమ్మ ఫొటో నచ్చి అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు. ‘నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. మా అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఉంది. వచ్చినవారికి రిటన్‌గిఫ్ట్ ఇవ్వాలి. నాకు అలాంటి బొమ్మలు ఒక పదిహేను కావాలి. చేసిస్తారా..’ అంది. నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. ఆ నెల రెంట్ ఇవ్వకుండా ఓనర్‌తో మాట్లాడి, ఆ డబ్బుతో బార్బీ బొమ్మలు, వాటికి కావల్సిన మెటీరియల్ తీసుకొచ్చాను. వ్యాపారం అనుకోలేదు. కానీ, ముందు గణేషుడి బొమ్మ తయారు చేశాను. ఆ ముద్దు వినాయకుడిని చూసి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక వెస్ట్రన్ కల్చర్‌తో ఉండే బార్బీ బొమ్మను తెలుగింటి సంప్రదాయం అద్దుకునేలా తయారు చేయడానికి చాలా ప్రయోగాలే చేయాల్సి వచ్చింది. జుట్టు రంగు, స్కిన్కలర్, కళ్లు.. వీటితో పాటు డ్రెస్సింగ్.. చాలా సమయమే తీసుకుంది. కానీ, ఒక్కో బొమ్మ తయారు చేసి, అనుకున్న సమయానికి పంపాను. ఆ ఆర్డర్ తర్వాత మరో ఆర్డర్ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాం. సందర్భానికి తగిన కానుకలు మా అమ్మనాన్నలకు నేను, చెల్లి సంతానం. మా చిన్నప్పుడు మేం ఆడుకోవడానికి మా అమ్మ క్లాత్‌తో బొమ్మలు కుట్టి, చీరలు కట్టి, వాటికి పూసలతో అలంకారం చేసేది. నాకు అదంతా గుర్తుకువచ్చింది. మన సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. వాటిని ఉదాహరిస్తూ బొమ్మలు తయారు చేసేదాన్ని. మొదట్లో అంతగా గుర్తింపు లేదు కానీ మెల్ల మెల్లగా గుర్తింపు రావడం మొదలైంది. పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు అమ్మాయి పుట్టిన నాటి నుంచి ప్రతీది వేడుకలాగే సాగుతుంది ఆమె జీవితం. ఒక ఆర్డర్ అయితే వాళ్లమ్మాయి మొదటి రోజు స్కూల్‌కి వెళుతోంది, ఆ రోజును పురస్కరించుకుని బొమ్మ కావాలని అడిగారు. ఉయ్యాల నుంచి విద్యాభ్యాసం, ఓణీ ఫంక్షన్, పెళ్లి, సీమంతం, గృహప్రవేశం, షష్టిపూర్తి ... వరకు ఇలా ప్రతి దశలోనూ జరిగే వేడుక సందర్భాన్ని తీసుకొని, దానికి అనుగుణంగా బొమ్మల సెట్స్‌ను తయారుచేయడం ప్రారంభించాను. ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాతోపాటు నాకు తెలిసిన స్నేహితులు జత కలిశారు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకరు డ్రెస్ కుడతారు, మరొకరు హెయిర్ బ్లాక్‌గా రావడానికి, ఇండియన్ స్కిన్ కలర్‌కి తేవడానికి, కళ్లు డిజైన్ చేయడానికి కష్టపడతారు. మొదట్లో నాకు ఒక్క బొమ్మ చేయడానికి రోజు మొత్తం పట్టేది. ఇప్పుడు 2–3 గంటలు పడుతుంది. నేను చేసిన విధానం నేర్పించి, నా పనిలోకి తీసుకున్నవారిలో కాలేజీ అమ్మాయిలు, గృహిణిలు ఉన్నారు. వాళ్ల ఇంటి వద్దే వర్క్ చేసిచ్చేవారున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మ, చెల్లెలు కూడా ఈ బొమ్మల తయారీలో భాగమయ్యారు. మా అమ్మ, మా చెల్లెలు బొమ్మలకు జడలు, పువ్వులు కుట్టి, పంపుతారు. మా వారు షాపింగ్ చేసుకొస్తారు. ఆన్లైన్లో చూసి, నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలు అలంకరణలో మార్పులు చేర్పులు, ప్యాకింగ్‌లో సాయం చేస్తుంటారు. మా చెల్లెలు ‘లలిత డాల్స్’ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా పేజీలో ఫొటోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇలా కొందరి చేయూతతో నా బొమ్మలు మరింత అందంగా రూపుకడుతున్నాయి. బడ్జెట్‌కు తగినట్టు.. ఒక బొమ్మ రూ. 200 నుంచి ధర ఉంది. వెడ్డింగ్ సెట్ అయితే రూ. 15000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో సెట్ కావాలంటే అందుకు తగినట్టు కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. ఇది దసరా సమయం కాబట్టి, అమ్మవారి బొమ్మలు, బతుకమ్మ ఆడుతున్న మహిళల బొమ్మల సెట్.. తయారుచేశాను. హైదరాబాద్‌లోని ఎఎస్‌రావునగర్‌లో ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాం. అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో పాటు పౌరాణిక గాధలు కూడా ఈ బొమ్మల ద్వారా చూపుతున్నాను’’ అని వివరించింది ఈ కళాకారిణి. – నిర్మలారెడ్డి -
బ్రౌన్ స్కిన్ బార్బీ.. భారతీయ మహిళ ఆహార్యంలో..!
‘బ్రౌన్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే పదాన్ని ఇప్పుడు ప్రపంచమంతా గుర్తిస్తుంది. బ్రౌన్ స్కిన్ మేకప్‌ను ప్రాచుర్యంలోకి తేవడానికి దక్షిణాసియా బార్బీ డాల్ అమెరికన్ సీఇవో దీపికా ముత్యాల ఫస్ట్ ఇండియన్ స్కిన్‌టోన్ బార్బీని ఆవిష్కరించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. మహిళల హిస్టరీ మంత్ వేడుకలో భాగంగా ఈ యేడాది మార్చిలో తన బ్యూటీ బ్రాండ్‌ను ఆవిష్కరిస్తూ చూపిన ఈ రూపం ఇప్పటికీ ప్రజల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. బార్బీ అనగానే తెల్లగా, నీలికళ్లతో ఉండే నాజూకైన రూపంతో ఉండే బొమ్మ మన మనసులో కదలాడుతుంది. ‘ఈ బార్బీని చూడండి. ఆమె చర్మం ముదురు గోధుమ రంగు, ఆమె కళ్లు పెద్దవి, వెడల్పాటి కనుబొమ్మలు, జూకాలు, గాజులు ధరించి పవర్సూట్తో సగర్వంగా ఉంటుంది. ఆమె ఈ ప్రపంచ సవాళ్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆమె గుర్తింపు. ఆమె సాంస్కృతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. ఉన్నత లక్ష్యాలు, సానుభూతి, దయతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది’ అంటూ నేటి ఆధునిక భారతీయ మహిళ ఆహార్యాన్ని ఈ కొత్త బార్బీ రూపంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా పరిచయం చేసింది. దీనికి వ్యూవర్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పుడు దీపికను అంతా ‘బ్రౌన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్’ అని పిలుస్తున్నారు. దక్షిణాసియా సమాజంలోని చర్మ రంగులను, విదేశాల్లో ఉన్న బ్యూటీ ప్రమాణాలను రెండింటినీ అంచనా వేసిన దీపికా ఈ రంగంలో ఏదైనా కొత్తదనం తీసుకురావాలనుకుంది. తన చిన్నతనంలో నీలిరంగు కళ్లతో తెల్లగా ఉండే బార్బీని గుర్తుచేసుకుంది. ఈ బొమ్మకు భారతీయ శైలికి తగినవిధంగా రూపొందించాలనుకుంది. అందుకు బొమ్మ రంగును ముదురు గోధుమ వర్ణంలో తీర్చింది. దీపికా ముత్యాల బ్రౌన్ స్కిన్ మేకప్‌ని ప్రాచుర్యంలోకి తెచ్చిన లైవ్ టిండెడ్ బ్యూటీ బ్రాండ్ ఫౌండర్ కూడా. ‘ప్రజలు ఈ బొమ్మను తమదిగా చేసుకోవడానికి, అలాగే ముదురు గోధుమ రంగుకు ఉన్న ప్రాధాన్యతను ప్రపంచం ముందుంచడానికి చేసిన ప్రయత్నం ఇది’ అని చెబుతుంది ఈమె. నిజానికి చాలా బ్యూటీ ప్రొడక్ట్‌లు రంగులను దృష్టిలో ఉంచుకుని తయారు చేయరు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ 2015లో ముదురు గోధుమ రంగు చర్మంపై పై బ్యూటీ ఉత్పత్తులను ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆమె చేసిన వీడియో వైరల్ అయ్యింది. 2018లో ఈ విభాగంలోనే ఆన్లైన్ కమ్యూనిటీని ప్రారంభించింది. 2019 నాటికి ఆల్–ఇన్–వన్ కలర్ కారెక్టర్, లిప్‌స్టిక్, ఐ షాడో, బ్లష్‌ను అభివృద్ధి చేయడానికి అనేకమంది నుంచి అభిప్రాయాలను సేకరించి, బార్బీని ఇలా ఆవిష్కరించింది. ప్రపంచ దృష్టిని ఆకట్టుకునేలా ఓ కొత్త ఆలోచనతో ఇండియన్ బార్బిని ఆవిష్కరించిన దీపికకు అభిమానులు ఇంకా విస్తృతస్థాయిలో తమ అభినందనలు తెలియజేస్తున్నారు. -
తొలి ట్రాన్స్ బార్బీ!
అబ్బాయిల లక్షణాలతో పుట్టిన ఆ చిన్నారికి బార్బీ బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ అమ్మాయిలు ఎక్కువగా ఆడుకునే బొమ్మను చిన్నారికి ఇవ్వడం బాగోదని ఆమె తల్లి బార్బీ బొమ్మను కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. చిన్నారి పెరిగి పెద్దదవుతున్నప్పటికీ ఆమె బార్బీతో ఆడుకోవాలన్న ఆశ మరింత పెరుగుతూనే వచ్చింది. అప్పుడప్పుడు మనసుని తీవ్రంగా కలిచి వేస్తుండేది. నాడు బార్బీకోసం తల్లడిల్లిన ఆ చిన్నారి.. తాజాగా యాభై ఏళ్ల వయసులో తనే ‘బార్బీడాల్’గా మారింది. ఆమె మరెవరో కాదు ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్ కాక్స్’. మే 29న 50వ పుట్టినరోజు సందర్భంగా మ్యాటెల్ సంస్థ కాక్స్రూపురేఖలతో బార్బీడాల్ను విడుదల చేసింది. దీంతో ‘తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ’గా నిలిచి చరిత్ర సృష్టించింది లావెర్న్ కాక్స్. అమెరికాకు చెందిన లావెర్న్ కాక్స్ నటనలో నిష్ణాతురాలు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ వెబ్ సిరీస్‌లో సోఫియా బరెస్ట్ పాత్రలో నటించి మంచిగుర్తిపు తెచ్చుకుంది. నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్ షో నిర్వహించి తొలి ట్రాన్స్ జెండర్‌గా కూడా నిలిచింది. చుట్టుపక్కల సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ స్థాయికి ఎదిగిన లావెర్న్ బార్బీడాల్గా అరుదైన గౌరవం లభించింది. సిల్వర్ మెటాలిక్ బాడీ సూట్పైన ముదురు ఎరుపు రంగు గౌను, స్టైలిష్ హెయిర్ స్టైల్, మేకప్‌లో లావెర్న్ బార్బీడాల్గా మెరిసిపోతోంది. పెద్దపెద్ద కలలతో.. చిన్నప్పటి నుంచి బార్బీతో ఆడుకోలేదని బాధపడుతోన్న లావెర్న్ తన రూపంలో ఉన్నæ బార్బీని చూసి తెగ మురిసిపోతూ...‘‘ బార్బీ డ్రెస్ చాలా బావుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్స్ నా బొమ్మ కొంటారేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్ని చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటికి ట్రాన్స్ చిన్నారులు దాడులకు గురవుతున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఈ దాడులు అడ్డంకిగా మారాయి. ఇప్పుడు ఈ బార్బీ డాల్ చూసిన చిన్నారులంతా పెద్దపెద్ద కలలతో బంగారు భవిష్యత్తుని నిర్మించుకుంటారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలను వేరుగా చూడకుండా వారి ఆసక్తి ప్రకారం ఆడుకోనిస్తారని ఆశిస్తున్నాను’’ అని లావెర్న్ చెప్పింది. ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్స్‌ని విభిన్నంగా చూసే ఈ సమాజంలో ఈ బార్బీడాల్ కనువిప్పు కలిగించి వాళ్లు కూడా మనలో ఒకరుగా భావించాలని ఆశిద్దాం. 2021 వరకు అందమైన రూపానికి బార్బీ ప్రతీకగా నిలుస్తుండేది. గతేడాది నుంచి సరికొత్త ఇన్నోవేషన్స్‌తో దూసుకుపోతున్న మహిళల గుర్తింపుగా బార్బీ సంస్థ ‘బార్బీ ట్రైబ్యూట్ సిరీస్’ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మహిళల రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్ ఐకాన్ లూసిల్ బాల్, క్వీన్ ఎలిజిబెత్–2, ఇంకా యువతులను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమ్యాటిక్స్(స్టెమ్)ను చదివేలా ప్రోత్సహించేందుకు నాసాతో కలసి బార్బీని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, ఆస్ట్రోనాట్ రూపం, మహిళా శాస్త్రవేతల రూపాల్లో సందడి చేస్తున్నాయి. ‘‘లావెర్న్ రూపాన్నీ బార్బీగా తీసుకు వచ్చినందుకు మేమెంతో గర్వపడుతున్నాము’’ అని సంస్థ తెలిపింది. -
‘బార్బీ’ ది ఆస్ట్రోనాట్
బార్బీ బొమ్మలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్. చాలా దేశాల్లో బార్బీతో ఆడుకోని అమ్మాయిలే ఉండరని చెప్పొచ్చు. ఇప్పుడా బార్బీ సరికొత్త రూపం సంతరించుకుని.. అంతరిక్షంలో చక్కర్లు కొట్టేసి వచ్చింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కీ వెళ్లబోతోంది. ‘స్టెమ్’ వైపు అమ్మాయిలు.. ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్’ రంగాల సంక్షిప్త రూపమే ‘స్టెమ్’. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలను స్టెమ్, స్పేస్ రీసెర్చ్ వైపు ప్రోత్సహించడం, ఆయా రంగాల్లో తమ ఆడపిల్లలను ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను రూపొందించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), బార్బీ బొమ్మల కంపెనీ సంయుక్తంగా ‘వుమన్ ఇన్ స్పేస్’ థీమ్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తాజాగా ఈఎస్ఏ నిర్వహించిన ‘వామిట్ కమెట్’ జీరో గ్రావిటీ ప్రయోగంలో బార్బీ బొమ్మకు కూడా స్థానం కల్పించారు. భార రహిత స్థితిలో తేలుతున్న బార్బీ చిత్రాలను విడుదల చేశారు. ఆ రూపం ఎవరిదో తెలుసా..? ఇంతకీ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ రూపం ఎవరిదో తెలుసా.. ఇటలీ ఆస్ట్రోనాట్ సమంతా క్రిస్టోఫరెట్టి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త అయిన ఆమె.. ఇంతకుముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 200 రోజులు గడిపి వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆమె మళ్లీ ఐఎస్ఎస్కు వెళ్తున్నారు. అప్పుడు ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను కూడా తన వెంట తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతానికి ఈ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ బొమ్మలు యూరప్ దేశాల్లో విక్రయిస్తున్నారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశముంది. ఈ ఫొటోలో ధగధగా మెరుస్తూ వెంట్రుకల్లా ఉన్నవేమిటో తెలుసా..? అగ్ని పర్వతం నుంచి వెలువడిన గాజు పోగులు. హవాయిలో ఇటీవలే బద్దలైన కిలాయి అగ్ని పర్వతం నుంచి.. అచ్చం వెంట్రుకల్లా సన్నగా, తేలిగ్గా లేత బంగారు రంగులో ఉండే గాజు పోగులు వెలువడుతున్నాయి. వీటిని ‘పెలెస్ హెయిర్’గా పిలుస్తారు. హవాయ్ ప్రజలు పూజించే అగ్నిపర్వతాల దేవత పేరు ‘పెలె’. బంగారు రంగులో ఉండే ఈ గాజు పోగులు ఆ దేవత వెంట్రుకలేనని స్థానికులు చెప్తారు. అందుకే వీటికి పెలెస్ హెయిర్’గా పేరుపెట్టారు. ఎలా ఏర్పడుతాయి? అగ్నిపర్వతం నుంచి వెలువడే లావాలో గాజు బుడగలు ఏర్పడతాయని, అవి పగిలినప్పుడు సన్నగా, వెంట్రుకల్లా ఉండే గాజు పోగులు వెలువడతాయని హవాయ్ వల్కనో అబ్జర్వేటరీ శాస్త్రవేత్త డాన్ స్వాన్సన్ తెలిపారు. తేలిగ్గా ఉండే ఈ గాజు వెంట్రుకలు గాలిలో చాలా ఎత్తువరకు వెళతాయని.. ఎగురుతూ, కొట్టుకుపోతూ విస్తరిస్తుంటాయని చెప్పారు. చూడటానికి అందంగా ఉన్నా.. ఈ గాజు పోగులు ప్రమాదకరమని తెలిపారు. ఇవి పదునుగా ఉంటాయని.. చిన్నచిన్న ముక్కలుగా మారి పీల్చేగాలిలో, తాగే నీటిలో చేరి ఇబ్బందులకు కారణమవుతాయని వెల్లడించారు. 2018లోనూ ఈ అగ్ని పర్వతం లావాను వెదజల్లిందని.. అప్పుడు కూడా ఇలాగే ‘పెలెస్ హెయిర్’ భారీగా వెలువడిందని తెలిపారు. -
వారెవ్వా.. అంతరిక్షంలోకి సమంత
Samantha Cristoforetti Barbie Doll: వన్ సెకన్.. మీరనుకుంటున్న సమంత కాదిమే. ఈమె ఇటాలియన్ ఆస్ట్రోనాట్. పూర్తి పేరు సమంత క్రిస్టోఫోరెట్టి(44). అరుదైన ఓ గౌరవం అందుకుని ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కి మొట్టమొదటి యూరోపియన్ ఫిమేల్ కమాండర్ ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు అచ్చం ఆమెలాంటి బొమ్మతో పిల్లల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇందులో భాగంగా అమ్మాయిలకు స్పేస్ స్టడీస్తోపాటు సైన్స్ టెక్నాలజీ మ్యాథ్స్ అండ్ ఇంజినీరింగ్(STEM) రంగాల్లో కెరీర్ పట్ల ఆసక్తి కలిగించేందుకు కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకోసం ఐఎస్ఎస్కు కమాండర్‌గా వెళ్లబోతున్న సమంత బొమ్మను ఉపయోగించబోతున్నారు. అచ్చం సమంత క్రిస్టోఫోరెట్టి రూపంతో ఉన్న బొమ్మ(బార్బీ డాల్) ఒకదానిని తయారుచేయించి.. అంతరిక్ష ప్రయోగాల్ని, పరిశోధనల అనుభూతుల్ని పిల్లలకు తెలియజెప్పే ప్రయోగం చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీకి చెందిన ఓ జీరో గ్రావిటీ ఫ్లైట్‌ను వినియోగించారు. స్పేస్‌లోకి వెళ్లే ముందు ఏం చేయాలి? అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాల్ని జీరో గ్రావిటీలో సమంత బొమ్మను ఉపయోగించి చూపిస్తారు. అక్టోబర్ 4-10 మధ్య వరల్డ్ స్పేస్ వీక్ జరుగుతోంది. ఈ ఏడాదిని ‘విమెన్ ఇన్ స్పేస్’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె బొమ్మ ద్వారా పిల్లలకు ఆసక్తికరంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా వచ్చే డబ్బును విమెన్ ఇన్ స్పేస్ ప్రోత్సాహకం కోసం ఉపయోగించనున్నట్లు బార్బీ ప్రతినిధి ఇసాబెల్ ఫెర్రెర్ తెలిపారు. ఇక తన బొమ్మ ద్వారా పాఠాలపై సమంత సైతం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే సమంతా క్రిస్టోఫోరెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తర్వాతి మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. ఆరు నెలలపాటు కమాండర్ హోదాలో ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బార్బీ గతంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు శాలీ రైడ్, అన్నా కికినా బొమ్మలను సైతం రూపొందించింది. చదవండి: నాసా పోస్ట్ చేసిన బొమ్మ.. అద్భుతం -
సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఇప్పుడు బార్బీ ‘బొమ్మల’ కొలువుతో..
చదివిన చదువే కాదు మన అభిరుచులూ ఉపాధి వైపుగా కొత్త అడుగులు వేయిస్తాయి. కొంగొత్త ఆలోచనలకు రూపమిస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ పూన్గోడి రవి విషయంలో ఇదే జరిగింది. పెళ్లయి, పిల్లలు పుట్టాక ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ తయారీని ఎంచుకుంది. ఆశించిన స్థాయిలో బిజినెస్ లేక నిరాశపడినా తర్వాత బొమ్మల తయారీని ఎంచుకుంది. బెంగళూరులో నివాసం ఉంటున్న పూన్గోడి దేవతామూర్తులను అందమైన బొమ్మలుగా రూపుకట్టి, అందరి ప్రశంసలతో పాటు ఉపాధినీ పొందుతోంది. చాలామందిని బార్బీడాల్స్ ఆకట్టుకుంటాయి. బార్బీ డాల్ని ఇండియన్ వెర్షన్‌లోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది... అని ఆలోచన చేసింది పూన్గోడిరవి. క్లే, రబ్బర్, క్విల్టింగ్ పేపర్ మెటీరియల్‌తో దేవతామూర్తులు, పెళ్ళి, స్త్రీల వేడుకల థీమ్‌తో అందమైన బొమ్మలుగా రూపుకట్టి, మార్కెట్ చేస్తోంది. బొమ్మల తయారీని ఇంట్లోనే స్వయంగా నేర్చుకున్నాను అని చెప్పే ఈ 35 ఏళ్ల గృహిణి మాట్లాడుతూ ‘‘ఆభరణాలు, బొమ్మల తయారీ ఇంట్లోనే నేర్చుకున్నాను. దేవతామూర్తుల బొమ్మలు తయారు చేసి, దుర్గానవరాత్రులప్పుడు బొమ్మల కొలువు ఏర్పాటు చేశాను. మా బొమ్మల కొలువు చూడటానికి వచ్చిన వారందరూ బొమ్మల గురించి ఎన్నో వివరాలు అడిగారు. అడగడంతో ఈ బొమ్మల తయారీనే వ్యాపారం గా మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది. దీంతో ‘విషురోష్’ పేరుతో దేవతామూర్తుల బొమ్మల తయారీని చేపట్టాను’’ అని వివరించే పూనుగోడి రవి రోజూ నాలుగైదు గంటల సమయాన్ని బొమ్మల తయారీకి కేటాయిస్తుంది. ఒకటి నుంచి వందలు దశావతారాలు, అర్ధనారీశ్వరులు, రాధాకృష్ణులు, శేషతల్ప శాయి... ఇలా ఒకటేమిటి అన్ని దేవతా రూపాలు ఆమె చేతిలో అపురూపంగా ఒదిగి పోతాయి. ‘మా కుటుంబంలో ఎవరికీ హస్తకళలపట్ల ఆసక్తి లేదు. నాకూ మూడేళ్ల క్రితం వరకు ఈ ఆలోచనే లేదు. ఒకటి ట్రై చేద్దాం అని మధుర మీనాక్షి అమ్మవారి బొమ్మను రూపొందించాను. చాలా సంతృప్తిగా అనిపించింది. అందుకు తగినట్టు ప్రశంసలూ వచ్చాయి. అటు తర్వాత ఒకదాని వెంట మరొకటి బొమ్మ నా చేతుల్లో రూపుదిద్దుకుంటూనే ఉంది. రెండేళ్లలోనే ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి 300 కు పైగా బొమ్మలు అమ్ముడు పోయాయి. రెండు రోజుల్లో ఏ బొమ్మనైనా సృష్టించి, అలంకరణ పూర్తి చేసే నేర్పు వచ్చేసింది. ఎవరికైనా నచ్చితే ఆన్లైన్ ద్వారానే అమ్మకాలు కొనసాగిస్తాను’ అని వివరించింది. –నిర్మలారెడ్డి -
ఫ్రంట్‌లైన్ వారియర్.. బార్బీ
ప్రస్తుతం ప్రపంచమంతా... ఒలింపిక్స్ క్రీడలు, క్రీడాకారులు ఎవరు బాగా ఆడుతున్నారు? ఏ దేశానికి ఏయే మెడల్స్ ఎన్నెన్ని వస్తున్నాయి వంటి అంశాలపై ఆసక్తిగా గమనిస్తోంది. మరోపక్క పతకాలు సాధించిన క్రీడాకారులను భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచేలా ఆయా దేశాల ప్రభుత్వాలు ఉన్నత సత్కారాలతో స్వదేశానికి ఆహ్వానిస్తున్నాయి. క్రీడాకారులకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, గౌరవ మర్యాదలతో వారు రాబోయే తరాలకు స్పూర్తిగా నిలుస్తారు. వీరిని చూసి మరెంతోమంది ఆ స్థాయికి ఎదగాలని కలలు కంటుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని బొమ్మల రూపంలో చెబుతోంది బార్బీ బొమ్మల తయారీ సంస్థ. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలలో బార్బీ డాల్ ఒకటి. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను ఎంతగానో ఆకట్టుకునే ఈ బార్బీ బొమ్మలు సరికొత్తగా రాబోతున్నాయి. ఇప్పటిదాకా వ్యోమగామిగా, ఫైర్ ఫైటర్‌గా, గేమ్ డెవలపర్‌గా అనేక రకాలుగా రూపాంతరం చెంది పెద్దల నుంచి పిల్లల వరకు అందర్నీ ఆకట్టుకునే బార్బీబొమ్మలు ఈసారి సరికొత్త రూపంలో సందడి చేయనున్నాయి. దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ధైర్యసాహసాలతో ముందుండి ప్రజారోగ్యం కోసం పోరాడుతున్న వారి రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను తీర్చిదిద్దింది. కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో ముందుండి పోరాడిన ఆరుగురు మహిళల రూపాలతో బార్బీలను తయారుచేసింది. ఈ ఆరుగురి రూపాలను వారి వృత్తికి తగినట్లుగా డ్రెస్‌లు వేసి ఆకర్షణీయమైన బొమ్మలుగా మలిచింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రూపకల్పనలో కృషిచేసిన సారా గిల్బర్ట్ ఆరుగురిలో ఒకరుగా నిలవడం విశేషం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన గిల్బర్ట్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. గిల్బర్ట్ బార్బీ బొమ్మగా మరింత ఆకర్షణీయంగా కనిపించారు. కురులను వదులుగా వదిలి, నేవీ బ్లూ రంగు ప్యాంట్ సూట్, తెల్లని జాకెట్‌తో సరికొత్త బార్బీ డాల్‌గా మెరిసిపోతున్నారు. గిల్బర్ట్తోపాటు న్యూయార్క్‌లో తొలి కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఎమర్జెన్సీ రూమ్ నర్స్ అమీ ఓ సల్లివాన్, లాస్వేగాస్లో వివక్షకు గురైన డాక్టర్ ఆడ్రిక్రుజ్, హెల్త్‌కేర్‌లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన కెనడాకు చెందిన మానసిక వైద్య నిపుణురాలు చిక స్టేసీ ఒరివ్వా, కోవిడ్ జన్యుక్రమాన్ని గుర్తించిన బ్రెజిల్ బయోమెడికల్ రీసెర్చర్ జాక్వెలిన్ గోస్డిజెస్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కోసం ‘ఉతికి మళ్లీ వేసుకోగల’ సర్జికల్ గౌనును రూపొందించిన ఆస్టేలియా డాక్టర్ కిర్బి వైట్లు బార్బీ బొమ్మల్లో ప్రేరణాత్మకంగా ఒదిగిపోయారు. మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి, ధైర్యంగా ముందుండి పోరాడిన హెల్త్ వర్కర్స్ కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్బీ సంస్థ మాట్టె్టల్ తెలిపింది. ‘‘ఫ్రంట్‌లైన్ వారియర్స్ పడ్డ ఆందోళన, చేసిన కృషిని భవిష్యత్ తరాలకు అందించడానికి సరికొత్త బార్బీడాల్స్ను తీసుకొచ్చాము. మా ప్రయత్నం కొంతమంది చిన్నారుల్లోనైనా స్పూర్తి తీసుకురాగలిగితే ఆ దిశగా వారు ఎదుగుతారని ఆశిస్తున్నాం’’ అనిÐ ] ూట్టెల్ యాజమాన్యం చెప్పింది. ‘‘బార్బీ బొమ్మను నా రూపంలో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. టీకా నిపుణిరాలిగా నా ప్రతిమను బార్బీలో చూసిన అమ్మాయిల్లో కొంతమంది అయినా సైన్స్‌ను కెరియర్‌గా ఎంచుకుని అద్భుతాలు సాధించాలి’’ అని గిలబర్ట్ చెప్పింది. -
బామ్మకు అరుదైన గిఫ్ట్; సంతోషంతో ముద్దులు
బ్రెజిల్లో ఒక బామ్మకు తన మనవరాలు బార్బీ డాల్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఆమెను సర్ప్రైజ్ చేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తనకు సరైన సమయంలో ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు ఆమె తన మనవరాలిని ముద్దులతో ముంచెత్తింది. వివరాలు.. బ్రెజిల్‌కు చెందిన డోనా కార్మోజా ఇంట్లోనే ఉంటూ తన మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంది. తమని బాగా చూసుకుంటున్న బామ్మకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని భావించింది. వెంటనే ఆన్లైన్లో ఒక బార్బీడాల్ను కొనుగోలు చేసి ఆమెను సర్ప్రైజ్ చేస్తూ దాన్ని గిఫ్ట్ రూపంలో ఇవ్వాలనుకుంది. రెండు రోజుల తర్వాత డోనా కు ఒక గిఫ్ట్ పార్సిల్ వచ్చింది. ఆమె దానిని తెరిచి చూడగానే అందులో బార్బీ డాల్ కనబడడంతో సంతోషపడింది. ఈ గిఫ్ట్‌ను తన మనవరాలే పంపిందని గ్రహించి పక్కనే ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి ముద్దుల వర్షం కురిపించింది. ఈ వీడియోను ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేస్తూ డోనా కార్మోజాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయినా.. దానిని ఆమె తన జీవితకాలం దాచుకుంటుంది అని క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. BEAUTIFUL SURPRISE 🎁❤️😭 (Brazil) Dona Carmoza is surprised with a Barbie doll from her granddaughter...she'd wanted a Barbie her whole life. pic.twitter.com/MS6Kotbth3 — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) July 11, 2021 -
రష్యన్ కాస్మోనాట్‌ను ప్రతిబింబించే బార్బీ బొమ్మ
డ్రస్ ఏదైనా బార్బీ బొమ్మలు ముచ్చటగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ‘బార్బీ’ డాల్స్కున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ బొమ్మలను ఇష్టపడతారు. అందమైన అమ్మాయిలను ప్రతిబింబించేలా చూడముచ్చటగా బార్బీ సంస్థ ఈ బొమ్మలను రూపొందిస్తోంది. అయితే సంస్థ తయారుచేసే ప్రతిబొమ్మ వెనక ఒక నేపథ్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను ప్రతిబింబించేలా బొమ్మలను రూపొందించే బార్బీ సంస్థ ఈ సారి సరికొత్త థీమ్‌తో ముందుకొచ్చింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు.. ధైర్యంగా, సాహోసోపేతంగా ముందుకుసాగే మహిళలను ప్రతిబింబించే విధంగా బార్బీ బొమ్మలను రూపొందించింది. ఈ క్రమంలోనే బాలికలు, మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు రష్యన్ మహిళా కాస్మోనాట్ ‘అన్నా కికినా’ రూపంలో బార్బీ బొమ్మను తయారు చేసింది. సోవియట్ యూనియన్ ప్రయోగించిన ‘ఫస్ట్ క్రూయిడ్ స్పేస్కాఫ్ట్’ ఈ ఏడాది ఏప్రిల్ 12 నాటికి అంతరిక్షంలోకి వెళ్లి 60 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బార్బీ సంస్థ రెండు సరికొత్త బొమ్మలను ఆవిష్కరించింది. ప్రస్తుతం రష్యా స్పేస్ టీమ్‌లో ఉన్న ఏకైక మహిళా కాస్మోనాట్ ‘అన్నా కికినా’ రూపంతో బార్బీ బొమ్మలను తయారు చేసింది. అచ్చం అన్నా లా కనిపించే ఈ బార్బీ బొమ్మలు తెలుపు, నీలం రంగు డ్రెస్‌లతో ఉన్నాయి. వ్యోమగామి ధరించే తెల్లని సూట్‌తోపాటు, జెట్ బ్లూ జంప్‌సూట్‌తో ధరించిన ఈ బార్బీడాల్స్పై అన్నా కికినా పేరుతోపాటు రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ అధికారిక లోగో ఉండటం విశేషం. 36 ఏళ్ల కాస్మోనాట్ కికినా.. వాలెంటినా తెరెష్కోవా తర్వాతా ఐదో మహిళగా 2022లో అంతరిక్షంలోకి అడుగిడనుంది. ప్రస్తుత రోజుల్లో ఇంజినీర్ అయిన అన్నా కికినా ఎంతోమందికి ఆదర్శమని రష్యన్ స్పేస్ ఏజెన్సీ చెప్పింది. తను ఎంతో ధైర్యవంతురాలైన మహిళే కాకుండా అందరితో కలిసిపోయే తత్వం, పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో నడుచుకునే ఎంతో తెలివైన కాస్మోనాట్ అని తెలిపింది. రోస్కోస్మోస్‌లో ఇప్పటిదాకా మొత్తం 124 మంది కాస్మోనాట్స్ ఉండగా వారిలో కేవలం నలుగురు మాత్రమే మహిళా కాస్మోనాట్స్. అందుకే మరింతమంది మహిళలను స్పేస్ ఏజెన్సీ లో పనిచేసేలా ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పేస్ ఏజెన్సీ వివరించింది. ‘‘నేను చిన్నతనంలో వ్యోమగామి కావాలని అనుకోలేదు. నా దగ్గర ఆస్ట్రోనాట్ రూపంలో ఉన్న బార్బీ బొమ్మ ఉంటే ఆ సమయంలో కచ్చితంగా ఆస్ట్రోనాట్ కావాలనే ఆలోచన వచ్చేది. బార్బీ బొమ్మతో ఆడుతున్న ప్రతీ అమ్మాయి వ్యోమగామి కావాలని అనుకోదు. ప్రతిఒక్కరికీ తమకంటూ ఒక అభిరుచి ఉంటుందని నేను భావిస్తున్నా’’ అన్నాకికినా చెప్పింది. కాస్మోనాట్ బార్బీ బొమ్మతో ఆడుకునే వారిలో కొంతమంది అమ్మాయిలైనా ప్రేరణ పొంది స్పేస్ ఏజెన్సీల్లో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారని ఆశిద్దాం. -
‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే
మార్చి 8 మహిళాశక్తి బర్త్ డే! బాయ్స్ అండ్ బిగ్ బాయ్స్.. ఆరోజు మీరు మీ మహిళకు.. మీ బాస్, మీ కొలీగ్, మీ టీచర్, మీ మదర్, వైఫ్, సిస్టర్ .. వారెవరైనా సరే.. శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకండి. ‘మేడమ్ మీవల్లే’ ‘అమ్మా నన్ను కన్నందుకు’ ‘సోదరీ తోడున్నావు’ ‘సహచరీ నీడవయ్యావు’ కృతజ్ఞతగా ఒక్కమాట. ఒక్క ప్రణామం. ప్లస్.. వాళ్లను రెస్పెక్ట్ చేస్తూ ఒక ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్! బార్బీ బొమ్మల తయారీ కంపెనీ ‘మటెల్’ కూడా ఈ ఏడాది ఉమెన్స్ డే కి మహిళాశక్తిని రెస్పెక్ట్ చేస్తూ డీజే క్లారా గా ఒక కొత్త బార్బీని మార్కెట్ లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా బ్రిటిష్ రేడియో ప్రెసెంటర్. ‘పవర్ గర్ల్’ బార్బీ, ‘సూపర్ ఉమన్’ క్లారా ప్రతి మహిళలోనూ ఉంటారు. మహిళే మన రోల్ మోడల్. అమ్మాయిలూ.. (లేదా) మహిళలూ.. మీరొక సెలబ్రిటీ అనుకుందాం. ‘అనుకోవడం ఏంటీ! నేను సెలబ్రిటీనే’ అంటారా! మరీ మంచిది. ‘ఉమెన్స్ డే’ కి మీకు రెండు గిఫ్టులు. అయితే రెండూ కాదు. ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలి. మొదటిది: ఆస్కార్ అవార్డు. రెండోది: మీ తెలివి తేటలతో, మీ రూపలావణ్యాలతో, మీ ప్రొఫెషనల్ ప్రతిభా సామర్థ్యాలతో, అచ్చంగా మీలా ఉండే బార్బీ డాల్ మీ పేరిట మార్కెట్లో రిలీజ్ అవడం. రెండిట్లో ఏది కోరుకుంటారు? పైకి చెప్పక్కర్లేదులెండి. డీజే క్లారా సంతోషాన్ని చూసినవాళ్లు ఎవరైనా ఏమంటారంటే.. మీరసలు ఆస్కార్ వైపే చూడరని! ‘ఎలా చెప్పగలరు మీరలా!’.. అంటారా? డీజే క్లారా ప్రస్తుతం ఆకాశం పట్టనంత సంతోషంగా ఉన్నారు. ఆమెను రోల్ మోడల్‌గా చూపుతూ.. బార్బీ బొమ్మలు తయారు చేస్తుండే ప్రపంచ ప్రసిద్ధ ‘మటెల్’ టాయ్స్ కంపెనీ ‘డీజే క్లారా బార్బీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ‘ఒక మహిళకు ఇంతకన్నా గౌరవం ఏముంటుంది?’ అంటున్నారు క్లారా. తన రూపంలో ఉన్న ఆ కొత్త బార్బీ డాల్‌ను రెండు చేతులతో అందుకుని అపురూపంగా చూసుకుంటూ ఆమె మురిసిపోతున్నారు. 36 ఏళ్ల క్లారా యాంఫో (ఆమె పూర్తి పేరు) ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ. లండన్‌లో బి.బి.సి. రేడియో ప్రెజెంటర్. బి.బి.సి టెలివిజన్ లో వ్యాఖ్యాత. క్లారాయాంఫో డాట్ కామ్‌లోకి వెళ్లి చూస్తే ఆమె గురించి అంతా తెలిసిపోతుంది. అంత ఓపిక లేకపోతే క్లారా బార్బీ డాల్‌ను చూసినా సరే. క్లారా బాహ్య సౌందర్యాన్ని, ఆమె అంతఃశక్తిని ప్రతిఫలించేలా ఉంది క్లారా బార్బీ. కంగ్రాట్స్ క్లారా. మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ∙∙ బార్బీ ‘గర్ల్ పవర్’ అయితే, క్లారా ‘సూపర్ ఉమెన్’, ఇద్దరూ కలిసిన ‘పవర్ ఉమన్’.. మహిళ. ఫలానా మహిళ అని కాదు. ప్రతి మహిళా! మన మేడమ్, మన కొలీగ్, మన టీచర్, మన సహోద్యోగి, స్నేహితురాలు, అమ్మ, సోదరి, జీవిత సహచరి.. చుట్టూ ఎంత శక్తి! మనల్ని బతికిస్తున్న, మనల్ని నడిపిస్తున్న, మనిషంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్న శక్తులు. ఆ శక్తులకు, సామర్థ్యాలకు ప్రతీకలే క్లారా, క్లారా బార్బీ. క్లారా మొదట డాన్సర్. తర్వాత డీజే (డిస్క్ జాకీ). బి.బి.సి. టీవీలో ‘స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్’ అనే డాన్స్ పోటీల ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఇప్పటికీ వస్తోంది. ‘స్ట్రిక్ట్లీ’ అంటారు షార్ట్‌కట్‌లో. ఆ ప్రోగ్రామ్ కంటెస్టెంట్‌గా వచ్చి, బి.బి.సి.లోనే రేడియో ప్రెసెంటర్‌గా ప్రసిద్ధి చెందారు క్లారా. అయితే బార్బీగా ఆమె అవతరించడానికి అదొక్కటే కారణం కాదు. జాతి వివక్షకు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తన జాతి హక్కుల కోసం నిలబడ్డారు. గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా బ్రిటన్‌లో జరిగిన అనేక సభల్లో ఆమె ప్రసంగించారు. బి.బి.సి.లో ఉద్యోగం పోతుందనీ, ఉద్యోగం పోతే గుర్తింపు ఉండదని అనుకోలేదు. ఆమె నిబద్ధతని బ్రిటన్ గుర్తించింది. ‘ది ఫేసెస్ ఆఫ్ హోప్’ అంటూ బ్రిటిష్ ‘వోగ్’ పత్రిక 2020 సెప్టెంబర్ సంచిక కోసం తను ఎంపిక చేసిన 40 మంది సామాజిక కార్యకర్తల్లో ఒకరిగా క్లారాకు స్థానం కల్పించింది. బార్బీగా కూడా ఇప్పుడు స్థానం పొందడాన్ని క్లారా తన అదృష్టంగా భావిస్తున్నారు. ‘‘నా ప్రొఫెషనల్ లైఫ్‌కు లభించిన గౌరవమిది. శక్తికి, ఆత్మవిశ్వాసానికి ఆదర్శవంతమైన ఒక బార్బీని అవడం కన్నా అదృష్టం ఏమంటుంది!’’ అంటున్నారు క్లారా ఎంతో గర్వంగా. ‘మిల్క్ హనీ బీస్’ అని లండన్‌లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నల్లజాతి మహిళలకు, బాలికలకు సృజనాత్మక రంగాలలో చేదోడుగా ఉంటుంది. ఆ సంస్థకు చేదోడుగా కూడా క్లారా ఉంటున్నారు. కలలకు రూపం బార్బీ ప్రపంచంలో ఎన్ని రంగాల్లోనైతే మహిళలు రాణిస్తున్నారో అన్ని రంగాల మహిళలకూ బార్బీలో రోల్ మోడల్స్ వచ్చేశాయి. ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) సహా దాదాపు 200 జాబ్ ఫీల్డ్స్‌లో బార్బీ బొమ్మలు ఉన్నాయి. ఆడపిల్లల ఆశలకు, వాస్తవాలకు మధ్య ఉండే ‘డ్రీమ్ గ్యాప్’ను చెరిపేయడానికే బార్బీ ఆవిర్భవించింది. తొలి బార్బీ 1959లో ఫ్యాషన్ డాల్‌గా అమెరికన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ బార్బీ సృష్టికర్త రూత్ హ్యాండ్లర్ అనే మహిళ. ఆగమనంతోనే ఆడపిల్లలకు ఆత్మీయనేస్తం అయింది బార్బీ. తోబుట్టువు పుట్టినంతగా సంతోషించారు. ఆడపిల్లల్ని కనుక మనం సంతోషంగా ఉంచగలిగితే వాళ్లు ఏదైనా సాధించగలరు అని మార్లిన్ మన్రో అంటుండేవారు. ఒక బార్బీని కొనిచ్చినా వారు ఏదైనా సాధించగలరు. అయితే వారు కోరుకున్న బార్బీని మాత్రమే. ఎడ్యుకేషన్, మెడిసిన్, మిలటరీ, పాలిటిక్స్, ఆర్ట్స్, బిజినెస్, సైన్స్.. ఏ రంగలోని బార్బీని కోరుకుంటే ఆ బార్బీ. ‘స్పెషల్లీ ఏబుల్డ్’ బార్బీలు కూడా ఉన్నాయి. గత ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి (అక్టోబర్ 11) మానసి జోషీ బార్బీ విడుదలైంది. మానసి ప్యారా–బాడ్మింటన్ ప్లేయర్. అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి గత ఏడాది వచ్చిన తన రోల్ మోడల్ బార్బీతో మానసి జోషి -
బార్బీకి పోటీగా ఫియర్లెస్ గర్ల్
బార్బీ ప్లేస్‌లోకి ‘ఫియర్లెస్ గర్ల్’ అనే కొత్త బొమ్మ రాబోతోందా! బార్బీ నాజూకుగా ఉంటుంది. ‘ఫియర్లెస్ గర్ల్’ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండడం ఇప్పడు ‘కొత్త నాజూకు’ కాబట్టి.. రాబోయే రోజుల్లో ఫియర్లెస్ గర్ల్నే అంతా ఇష్టపడబోతున్నారా? మరేం పర్వాలేదు. పాత బొమ్మ ప్లేస్‌లోకి కొత్త బొమ్మ వచ్చినా కొత్తగా మారబోయేదేం ఉండదు. బార్బీలో ఇన్‌బిల్ట్‌గా ఫియర్‌లెస్‌నెస్ ఉంటుంది కనుక రెండు బొమ్మలూ ఒకటే. రెండు బొమ్మలూ ఇచ్చే ఇన్స్పిరేషన్ ఒక్కటే. చాయిస్ మాత్రం మీ అమ్మాయిదే. రెండూ కావాలి అంటే రెండూ కొనివ్వొచ్చు. మార్చి 7. మార్చి 8. మార్చి 9. చరిత్రలో ఈ మూడూ మూడు ముఖ్యమైన రోజులు. మూడూ మూడు మహిళా దినోత్సవాలు. మూడూ ఈ మధ్యనే వచ్చి వెళ్లిపోయాయి. మార్చి ఎనిమిది.. తెలిసిందే. హిస్టారిక్ డే. అండ్.. హిస్టారికల్ డే కూడా. మార్చి ఏడు, మార్చి తొమ్మిది కూడా అలాంటివే. అయితే అవి పెద్దగా సెలబ్రేట్ అవలేదు. మార్చి ఏడైతే అసలు వచ్చి వెళ్లినట్లే ఎవరికీ తెలీదు. ఏంటి మార్చి 7కు ఉన్న ప్రత్యేకత? ‘ఫియర్లెస్ గర్ల్’ పుట్టిన రోజు. అవును. భయమన్నదే లేని పిల్ల బర్త్‌డే ఆ రోజు. ఆరో ఏడో ఏళ్లుంటాయి. పొట్టి గౌన్‌లో ఉంటుంది. కాళ్లకు బూట్లు ఉంటాయి. జుట్టు రబ్బరు బ్యాండుతో ముడివేసి ఉంటుంది. నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడి, తల కాస్త పైకి ఎత్తి చూస్తుంటుంది. సర్దార్ పాపారాయుడు (1980) సినిమాలో ఎన్టీఆర్‌లో కనిపించే ‘ఫియర్‌లెస్‌నెస్’ లాంటి ఫియర్‌లెస్‌నెస్ ఆ గర్ల్‌లో కనిపిస్తుంటుంది.స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తాం మనం. మనలాంటివాడే.. ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్ బాబు. పాపారాయుడు శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు. పాపారాయుణ్ణి ఎంత తేలిగ్గా షూట్ చేసి, డెడ్‌బాడీ తేవచ్చో డీటెయిల్డ్‌గా చెప్తాడు. మోహన్‌బాబు బ్రిటిష్ దొరబాబు. ఎన్టీఆర్ అతడి టార్గెట్.‘‘వాణ్ణి కాల్చడం అంత సులభం కాదు సర్’ అని ఇండియన్ ఏజెంట్ ఒకడు అంటే.. ‘‘ఇన్సల్ట్’’ అని పెద్దగా అరుస్తాడు ఆ ఏజెంట్ మీద మోహన్‌బాబు.‘‘ఏమీ.. వాడేమి అల్లూరి సీతారామా రాజా, ఆజాద్ చంద్రశేఖరా, భగత్సింగా, సుభాస్ చంద్రబోసా.. ఆఫ్ట్రాల్ పప్పారాయుడు. చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి. వేలు నొక్కండి. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది. దట్సాల్. గిలగిలా తన్నుకు ఛస్తాడు. అండర్‌స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్టావుట్’’ అంటాడు. అంతా వెళ్లిపోతారు. మోహన్‌బాబు ఒక్కడే బంగళాలో మిగిలిపోతాడు. అప్పుడొస్తాడు పాపారాయుడు అదే బంగళాలోని పై ఫ్లోర్‌లోంచి.. కిందికి ఒక్కో మెట్టూ దిగుతూ! ఉలిక్కిపడతాడు మోహన్‌బాబు.. ఒక్కో మెట్టూ వెనక్కు దిగుతూ. అంతకు ముందెప్పుడూ పాపారాయుడిని చూసి ఉండడు అతడు. ‘‘హు ఆర్ యు.. నీవెవరు? నీ పేరేమి? వాటీజ్ యువర్ నేమ్’’ అంటాడు. చెప్తాడు ఎన్టీఆర్. ‘‘ఓహ్.. పప్పారాయుడు’’ అని బెదిరిపోతాడు మోహన్‌బాబు. తన స్టెయిల్లో నవ్వుతాడు ఎన్టీఆర్. ‘‘ఏ! పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? ఊ. తీసుకో. వేలుతో నొక్కు. హె. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది. ఊ.. తీసుకో. తీసుకో’’ అంటాడు ఎన్టీఆర్. ‘‘ఎ.. నువ్వెందుకొచ్చావిక్కడికి?’’ అంటాడు.‘‘నువ్వు చచ్చేముందు పాపారావు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని’’ అంటాడు ఎన్టీఆర్.‘‘ఓ.. గుడ్ పర్సనాలిటీ. ఓ.. బెస్టాఫ్ లక్. గో.. గో.. ప్లీజ్ గో.. వెళ్లూ..’ అంటాడు.‘‘పిరికిపంద. కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకు రమ్మన్నావ్. నీ కళ్ల ముందుకు వచ్చినవాణ్ణి పొమ్మంటున్నావ్. ఏ.. భయమా?’’ అంటాడు ఎన్టీఆర్.‘‘నీ చెవులు వైర్లెస్. నీ చూపులు కేర్లెస్. నీ మాటలు ఫియర్లెస్’’ అంటాడు మోహన్‌బాబు. పాపారాయుడులోని సేమ్ ఆ కేర్లెస్నెస్, ఫియర్‌లెస్‌నెస్ ఈ పాప.. ‘ఫియర్లెస్ గర్ల్’లో కనిపిస్తుంటాయి. న్యూయార్క్‌లోని ‘బౌలింగ్ గ్రీన్’ పబ్లిక్ పార్క్‌లో అలా నిలబడి ఉంటుంది. పాప ఎదురుగా వాల్‌స్ట్రీట్ బుల్ (ఎద్దు) ఉంటుంది. ‘చూసుకుందాం రా..’ అని ఆ బుల్‌ని సవాల్ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె కాళ్ల దగ్గర చిన్న గుండ్రటి పళ్లెం లాంటి శిలాఫలకం ఉంటుంది. ‘నో ద పవర్ ఆఫ్ ఉమెన్ ఇన్ లీడర్షిప్. షి మేక్స్ ఎ డిఫరెన్స్’ అని ఆ ఫలకంపై రాసి ఉంటుంది. ‘మహిళా నాయకత్వ శక్తి గురించి తెలుసుకోండి. తన సత్తా ఏమిటో చూపిస్తుంది’.. అని. 50 అంగుళాల పొడవు, 110 కిలోల బరువు ఉన్న ఈ ‘ఫియర్లెస్ గర్ల్’ కంచు విగ్రహాన్ని ‘స్టేట్ స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజర్’ (ఎసెస్‌జీఏ) అనే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తయారు చేయించి అక్కడ పెట్టించింది. ఆస్తుల విలువను అంచనా వెయ్యడంలో ఎసెస్‌జీఏ ఎక్స్పర్ట్. మహిళలు లీడ్ చేసే కంపెనీల ఆస్తుల విలువ త్వరగా, స్థిరంగా పెరగడం ఆ కంపెనీ గమనించింది. అయితే ఎలా ఆ విషయాన్ని ఇండికేట్ చెయ్యడం? మామూలు విలువను గ్రాఫ్‌లో చూపించవచ్చు. మరి మహిళా శక్తిని? స్టాచ్యూలో చూపించారు. ఆ స్టాచ్యూనే ‘ఫియర్లెస్ గర్ల్’. 2017 మార్చి 7న స్టాచ్యూని ప్రతిష్టించారు. వందేళ్ల నాటి మహిళా పోరాటాల్లోంచి వచ్చిన మార్చి 8 ఎక్కడ? రెండేళ్ల క్రితమే పుట్టిన ఈ ఫియర్లెస్ పాపాయి ఎక్కడ? ఆ ప్రశ్నే అక్కర్లేదు. మార్చి ఎనిమిది అనే రోజును విగ్రహంలా చెక్కితే.. ‘ఫియర్లెస్ గర్ల్’ రూపమే వస్తుంది. మహిళలు నిర్భయంగా చేసిన పోరాటాలు, లేవదీసిన ఉద్యమాలు, నడిపించిన విప్లవాలు.. వీటన్నిటికీ సరిగ్గా సరిపోయే సింబాలిక్ వర్చ్యూ, స్టాచ్యూ.. ఫియర్లెస్ గర్ల్. ఇప్పుడీ గర్ల్ పవర్ ఎలా విస్తరించబోతోందో చూడండి. ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో బార్బీడాల్ ప్లేస్‌లోకి ఫియర్లెస్ గర్ల్ డాల్స్ రాబోతున్నాయి. అయితే డాల్స్‌లా కాదు. చిట్టిపొట్టి స్టాచ్యూల్లా! కోర్టులో కేసు నడుస్తోంది. అది క్లియర్ అయితే హైదరాబాద్‌కి, ఆంధ్రా కేపిటల్కీ వచ్చేస్తుంది ఫియర్లెస్ గర్ల్. మనమూ ఒకటి కొనొచ్చు. మన అమ్మాయి బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఫియర్లెస్ గర్ల్ స్టాచ్యూని చేయించింది ఎసెస్‌జీఏ అయితే, చేసింది క్రిస్టన్ విస్బెల్ అనే అమెరికన్ మహిళ. ఫియర్లెస్ గర్ల్ నమూనాలను ఇప్పటికే ఆమె ఇద్దరు ముగ్గురికి కానుకగా ఇచ్చారు. అయితే ‘మీకా హక్కులేదు’ లేదని ఎసెస్జీఎ కేసు వేసింది. ‘ఫియర్లెస్సెన్ మనిషి జన్మహక్కు. ఎవరి దగ్గరైనా ఆ స్టాచ్యూ ఉండొచ్చు’ అని విస్బెల్ వాదన. అయితే మనిషి జన్మహక్కు కాదు. స్త్రీ జన్మహక్కు. మరి మగవాడికి? స్త్రీని భయపెట్టడం తన జన్మహక్కు అనుకుంటుంది కదా పురుష ప్రపంచం? ఆ ప్రపంచాన్ని హద్దుల్లో ఉంచడానికే ఫియర్లెస్ గర్ల్ స్టాచ్యూ. మార్చి 8 ఉమెన్స్ డే. మార్చి 7 ఫియర్లెస్ గర్ల్ బర్త్ డే. మరి మార్చి 9? బార్బీడాల్ పుట్టినరోజు. బార్బీకి అరవై ఏళ్లొచ్చాయి మొన్న తొమ్మిదికి. మొదట్లో బార్బీ వట్టి మమ్మీ డాల్. మన చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకునేవాళ్లు కదా.. చిన్న పాపాయిని చంకలో ఎత్తుకుని ఉన్న చిన్నారి బొమ్మతో. అలాంటి బొమ్మ.. బార్బీ డాల్. అయితే ఇండిపెండెంట్ బొమ్మ. చేతిలో పాపాయి ఉండదు. అలాగని తను పాపాయీ కాదు. ఉమన్. ఆ ఉమన్ అరవై ఏళ్లుగా ఆడపిల్లల చేతిలో పాపాయి అయింది. ఫస్ట్ ఫస్ట్ బార్బీ క్యూట్ ఉమన్, స్వీట్ ఉమన్, స్విమ్ సూట్ ఉమన్. స్త్రీని ఇలాగేనా చూపించడం అని మధ్యలో ఎవరో క్వశ్చన్ చేశారు. పాయింటే. వెంటనే ఫ్యాషన్ మోడల్‌గా ఉన్న బార్బీ రోల్ మోడల్ అయింది. సెలబ్రిటీ అయింది. ఆస్ట్రోనాట్ అయింది. సి.ఇ.వో. అయింది. జర్నలిస్ట్ అయింది. ఇంజినీర్ అయింది. ఎయర్హోస్టెస్ అయింది. లోకంలో ఎన్ని టఫ్ ప్రొఫెషన్స్ ఉంటాయో అన్నీ అయింది. ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా. అంతేనా, పవర్ఫుల్ గర్ల్‌గా టైమ్ మేగజీన్ కవర్ పేజీ కూడా అయింది! సాదాసీదాగా ఉన్న బార్బీనీ, స్ట్రాంగ్ బార్బీని చెయ్యడానికి చాలానే ఉద్యమాలు నడిచాయి. ‘‘బార్బీని నెలువెత్తు బొమ్మగా ‘స్కేల్ అప్’ చేసి చూస్తే 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉంటుంది. 55–60 కేజీల మధ్య బరువు ఉంటుంది. 36–18–33 ఆకృతిలో ఉంటుంది. లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఉండే ఇలాంటి బాడీ షేప్, ఎత్తుకు సరిపడా లేని బార్బీ బరువు.. ఆడపిల్లల మనసు పాడుచేసి, వారిని ‘బార్బీ సిండ్రోమ్’కు గురిచేస్తోందని జూలీ బిండెల్ అనే స్త్రీవాద రచయిత్రి పదేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ భూమ్మీద బార్బీ ఉన్నంత కాలం ఆడపిల్లలకు మనశ్శాంతి ఉండదు’’ అని యాగ్నెస్ నైర్న్ అనే విద్యావేత్త కలవరపడ్డారు. వాళ్ల ఒపీనియన్‌కి గౌరవం లభించింది. బార్బీ ఇప్పుడు అందమైన పిల్లే కాదు. స్ట్రాంగ్ గర్ల్ కూడా. మరేమిటి? బార్బీ ప్లేస్‌లో ఫియర్లెస్ గర్ల్ వచ్చేస్తుందా? ఇంకో రెండు మూడేళ్లలో వచ్చేస్తుందనే అంటున్నారు. వచ్చినా, రాకున్నా.. ప్రతి బార్బీలోనూ ఇన్‌బిల్ట్‌గా ఓ ఫియర్లెస్ గర్ల్ ఉంటుంది. అందుకే కదా.. కదా ప్రపంచాన్ని అరవై ఏళ్లుగా శాసిస్తూ వస్తోంది. ఫియర్లెస్ గర్ల్‌కి ఉన్నట్లే బార్బీ డాల్ కీ ఒక జన్మ వృత్తాతం ఉంది. బార్బీని సృష్టించింది రూత్హ్యాండ్లర్ అనే మహిళ. అమెకో కొడుకు. కూతురు. కొడుక్కి ఆడుకోడానికి చాలా బొమ్మలు ఉండేవి. కార్లు, ఏరోప్లేన్లు, గన్లు. కూతురికి ఒకే బొమ్మ ఉండేది. కేరింగ్ డాల్. పాపాయిని ఎత్తుకున్న పాపాయి బొమ్మ. ‘కేరింగ్ గానే కాదు, డేరింగ్‌గానూ ఉండాలి నా కూతురు’ అనుకున్నారు రూత్. తనే స్వయంగా కూతురి కోసం బార్బీ డాల్ని తయారు చేశారు. ఆమె కూతురి పేరు బార్బారా. ఆ పేరే బొమ్మకు పెట్టారు బార్బీ అని. -
బార్బీ బొమ్మకు బ్రదర్వా..!
అందంగా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. అమ్మాయిలైతే ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అబ్బాయిలు కూడా ఏమీ తగ్గట్లేదు. అమ్మాయిలేమో కుందనపు బొమ్మలా.. బార్బీ డాల్లాగా తయారయ్యేందుకు తెగ ముచ్చట పడతారు. మరి అబ్బాయిలు..! మేం కూడా ‘బొమ్మ’లా తయారవుతానని అనుకున్నాడేమో ఈ ఫొటోలోని అబ్బాయి. రెండేళ్ల నుంచి ఏకంగా అచ్చు బొమ్మలాగే తయారవుతున్నాడు. జపాన్‌కు చెందిన మట్ కువాటాకు 24 ఏళ్లు. అందంగా తయారు కావడం ఇతడికి ఇష్టం. అందంగా కనిపించడమే కాదు.. వినూత్నంగా.. విభిన్నంగా కనిపించడం అంటే మనోడికి పిచ్చి క్రేజ్. అందుకు తగ్గట్టుగానే అచ్చు బొమ్మలా మారిపోతున్నాడు. ఇందుకోసం గంటలు గంటలు మేకప్ వేయించుకుంటున్నాడు. ఇలా తయారై తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుంటాడు కువాటా. ఇంకేం మనోడికి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడని కొందరు.. ఫొటోను ఎడిటింగ్ చేయడం వల్లే ఇలా కనిపిస్తున్నాడని మరికొందరు ఇన్‌స్ట్రాగాంలో విమర్శలు చేస్తున్నారు. అయితే వీటిని కువాటా కొట్టిపారేస్తున్నాడు. మేకప్ కనుక నిజమే అయితే ఆ మేకప్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే గొప్ప వాడవుతాడంటూ కొందరు కితాబిస్తున్నారు. -
బార్బీతో కోడింగ్ పాఠాలు...!
బార్బీ.. అమ్మాయిల మనసు దోచుకునే ఓ బొమ్మ మాత్రమే కాదు.. అందం, ఆత్మవిశ్వాసాల కలయిక. బార్బీ కేవలం ఆడుకోవడానికే కాదు సరికొత్త పాఠాలు నేర్పేందుకు న్యూలుక్లో మార్కెట్లోకి వచ్చేసింది. వినోదంతో పాటు విఙ్ఞానాన్ని అందించేందుకు ‘రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీ’ని మంగళవారం లాంచ్ చేసినట్లు బొమ్మల తయారీ సంస్థ మటెల్ తెలిపింది. ఏడేళ్ల ప్రాయం నుంచే అమ్మాయిల్లో ఇంజనీరింగ్, కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించినట్లు పేర్కొంది. కిడ్స్ బేస్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫాం ‘టింకర్’ భాగస్వామ్యం వల్లే రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించడం సాధ్యమైందని మటెల్ తెలిపింది. సరికొత్త రూపంలో... జీన్స్, గ్రాఫిక్ టీ- షర్ట్‌పై డెనిమ్ జాకెట్, కళ్లకు సేఫ్టీ గ్లాసెస్‌తో న్యూలుక్లో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్స్ బార్బీలో ఆరు కోడింగ్ పాఠాలను చేర్చినట్లు ‘టింకర్’ సహ వ్యవస్థాపకుడు కృష్ణ వడాటి తెలిపారు. ఈ బార్బీతో ఆడుకుంటూనే.. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడ్ బిల్డింగ్ బ్లాక్స్ వంటి కోడింగ్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్ 2017 గణాంకాల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (స్టెమ్) తదితర రంగాల్లో మహిళల భాగస్వామ్యం కేవలం 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో ‘బార్బీ’తో జతకట్టడం ద్వారా చిన్ననాటి నుంచే అమ్మాయిల్లో కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్తరకం బార్బీతో ఆన్‌లైన్‌తో పాటు, ఆఫ్‌లైన్‌లో కూడా గేమ్స్ ఆడటం వీలవుతుందని తెలిపారు. బార్బీ నేపథ్యం... పేపర్ బొమ్మలతో ఆడుకుంటున్న తన కూతురు బార్బరా కోసం రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ 1959లో ఒక సరికొత్త బొమ్మను రూపొందించారు. జర్మన్ డాల్ ‘బిల్డ్ లిల్లీ డాల్’ స్ఫూర్తితో రూపొందించిన బొమ్మకు తన కూతురి పేరు మీదుగా బార్బీ అని ఆమె నామకరణం చేశారు. బార్బీ పరంపరలో ఇప్పటి వరకు 200 మోడళ్లతో బార్బీ డాల్స్ అందుబాటులోకి వచ్చాయి. బార్బీ ప్రెసిడెంట్, బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్, బార్బీ పైలట్ వంటివి బార్బీ మోడళ్లలో ముఖ్యమైనవి. -
కుందనమా? చందనమా?
ఆ అమ్మాయిని చూస్తే ఎవరైనా బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా అంటారు. అచ్చు బార్బీ లాంటి కళ్లు, జుత్తు, ఆకారం, స్వరూపం, ఆఖరికి నడుం సైజు అదేదో అచ్చు గుద్దినట్టు ఉంటాయి. ఈమె అమ్మాయి కాదు బొమ్మాయి అనే వాళ్లు కొందరైతే, మనిషి సైజు బొమ్మేమోనని గిచ్చి చూసేవాళ్లు ఇంకొందరు. కొందరైతే బొమ్మలాంటి రూపాన్ని చూసి భయపడి పారిపోతున్నారట. ఇప్పుడు ఆండెస్సా డొమియానీ అనే ఈ 23 ఏళ్ల అమ్మాయి బ్రెజిల్లో హాట్ టాపిక్. ఈ అమ్మాయి ప్లాస్టిక్ సర్జరీల సాయంతో బార్బీ బొమ్మలా తయారైందని నమ్మేవాళ్లు కొందరైతే, కాదు ఇది సహజమైన రూపమేనని వాదిస్తున్నారు ఇంకొందరు. అయితే నా ఒంటిపై సర్జరీ కత్తి గాటు సైతం పడలేదు. ఇది దేవుడిచ్చిన రూపం అని ఆండెస్సా వాదిస్తోంది. అయితే బొమ్మలాంటి కళ్ల కోసం మాత్రం కాంటాక్టు లెన్సు పెట్టుకుందట. ఏదేమైనా ఈ మానవ బార్బీ ఇప్పుడు బ్రెజిల్ దేశంలో ధరల సమస్య, నిరుద్యోగం కన్నా అతి పెద్ద ‘రచ్చ’నీయాంశం. బొమ్మాయి -
బార్బీ గాళ్.. బేబీ డాల్..
ఈ ఫొటో చూడగానే ఏం అనిపిస్తుంది? ఏముంది బార్బీ బొమ్మే కదా అనుకుంటారు ఎవరైనా.. అయితే పరీక్షగా చూడండి మీకే అర్థమవుతుంది. ఫొటోలో ఉన్నది బొమ్మ కాదు.. ఓ అమ్మాయి. అవును.. అచ్చు బార్బీ బొమ్మలా ఉన్న అమ్మాయి. బ్రెజిల్‌లోని బ్లూమెనౌ సిటీకి చెందిన ఆండ్రెసా దామియాని అనే ఈ అమ్మాయి బార్బీ లాంటి దేహంతో అక్కడ సెలబ్రిటీ అయిపోయింది. ఈ 23 ఏళ్ల బార్బీ సుందరి అలా కనిపించేందుకు ఒక్కసారి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట. సన్నగా కనిపించేందుకు కనీసం డైటింగ్ కూడా చేయదట. అక్కడి కుర్రకారంతా తనను డిస్నీ క్యారెక్టర్ అయిన ‘ఎమ్మా’ అని పిలుచుకుంటారట. తన చూపులతో అక్కడి కుర్రకారు మనసును దోచేస్తుందని వేరే చెప్పాలా..! -
బార్బీకి బ్యాడ్ టైం..
బార్బీ.. ఈ బొమ్మ గురించి తెలియని వారు ఉండరు. అమ్మాయిలకు అత్యంత ప్రియమైన బొమ్మ. ప్రపంచంలోనే నంబర్ 1. ఇప్పుడా బార్బీకీ బ్యాడ్ టైం వచ్చింది. ప్రస్తుతం డిస్నీ వాళ్ల ‘ఫ్రొజెన్’ బొమ్మ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. అంతేకాదు.. ఈ ఏడాది క్రిస్మస్కు తల్లిదండ్రులు తమ పిల్లలకు బహుమతిగా ఇచ్చే బొమ్మల జాబితాలో బార్బీని తోసిరాజని.. ‘ఫ్రొజెన్’ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాకు చెం దిన ‘హాలీడే టాప్ టాయ్స్’ సర్వేలో ఈ విషయం తేలింది. గత 11 ఏళ్లుగా టాప్‌లో ఉన్న బార్బీ.. ఫ్రొజెన్ దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది. -
కాలాతీతం: బార్బీ గర్ల్... ఎప్పుడూ యంగే!
బార్బీ డాల్ గురించి కొత్తగా ఎవరికైనా పరిచయం చేస్తే... పెద్ద చెప్పొచ్చారు అంటూ పైకి కిందకు చూస్తారు. అంటే బార్బీ గురించి తెలియని వారు చాలా అరుదని. పెద్దలు అభిమానించేవి వేర్వేరు విషయాల్లో వేర్వేరుగా ఉండొచ్చేమో గాని... ప్రపంచంలో ప్రతి చిన్నారికీ బార్బీ డాల్ అంటే ప్రేమ, ఇష్టం. మరో మాటలో చెప్పాలంటే... బార్బీ డాల్‌ను తాకని ఈతరం బాలికలు ఉండనే ఉండరనుకోండి! కానీ అలాంటి బార్బీ డాల్ గురించి మీరు ఎపుడూ వినని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం! సుమారు 55 ఏళ్ల క్రితం రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ తన కూతురు కాగితపు బొమ్మలతో ఆడుకుంటూ, మధ్యమధ్యలో వాటితో మాట్లాడ ం చూసి మురిసిపోయింది. అంతేకాదు, మనుషులను పోలిన బొమ్మలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ‘మాటెల్’ (టాయ్స్ కంపెనీ) సహ వ్యవస్థాపకుడైన తన భర్తకు చెబితే ఆయన పెదవి విరిచాడు. అయినా ఆమె నిరుత్సాహ పడలేదు. తన ఆలోచనకు ప్రతిరూపంగా ఓ బొమ్మను రూపొందించింది. కూతురు ‘బార్బారా’ పేరు మీదే దానికి ‘బార్బీ’ అని నామకరణం చేసింది. - 1959లో బార్బీడాల్ వెలుగులోకి వచ్చింది. తొలిసారి న్యూయార్క్‌లో దీనిని అమ్మారు. మొదటి బొమ్మను మూడు డాలర్లకు అమ్మారు. - అమెరికా వ్యక్తి ఆలోచన అయినా బార్బీ డాల్ ఉత్పత్తి జపాన్‌లో మొదలైంది. తొలుత దానికి చేతితో తయారుచేసిన బట్టలు తొడిగేవారు. 1972 వరకు అవి జపాన్‌లో ఉత్పత్తయ్యేవి. - బార్బీ ఉత్పత్తి దారుల చెప్పేదానిని బట్టి బార్బీ రూపురేఖలు ఓ పదిహేడేళ్ల ఫ్యాషన్ మోడల్‌వి. - బార్బీపై మరింత ఆకర్షణ పెంచడానికి, జనంలోకి చొచ్చుకు పోవడానికి చేసిన ప్రయోగమే బార్బీ సిస్టర్స్. బార్బీకి మొత్తం ఏడుగురు సిబ్లింగ్స్ (తోడబుట్టిన వారు). వారి పేర్లు స్కిప్పర్, స్టాసీ, చెల్సియా, క్రిస్సీ, కెల్లీ, ట్యూటి, టాడ్. - బొమ్మలు అమ్మే విధానంలో విప్లవాత్మక నిర్ణయాలకు బార్బీ కారణమైంది. అది ఎప్పటికీ ఆకర్షణీయంగా ఉండేలా ఉత్పత్తిదారులు ఆలోచన చేశారు. అందులో భాగంగా కొత్త క్యారెక్టర్లలో బార్బీ కనిపిస్తూ అన్ని తరాల పిల్లలను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు బార్బీ 130 ఉద్యోగాలు (పాత్రలు) చేసింది. ఆస్ట్రోనాట్, మెక్‌డొనాల్డ్ క్యాషియర్, డాక్టరు, టీచరు ఇలా ఎన్నో కొత్తకొత్త పాత్రల్లో బార్బీ బొమ్మలు విడుదలయ్యాయి. - బార్బీకి ఓ బాయ్‌ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పుట్టిందండోయ్. అతగాడి పేరు ‘కెన్’. వాళ్లిద్దరూ పెళ్లి డ్రస్సుల్లో ఉన్న బొమ్మలు చూసే ఉంటారు కదా.. వారిద్దరికీ పెళ్లి కాలేదు. అది ఒక ఫ్యాంటసీ అట. వారిప్పటికీ డేట్ మీదే ఉన్నారు. - వారిద్దరికీ ఓ కారుంటే బాగుంటుందని అనుకోవడమే కాదు ఆస్టిన్ పేరుతో బార్బీ కారు కూడా వచ్చేసింది. - కొందరు పిల్లలకు కుక్కలంటే ఇష్టం. ఇంకొందరికి, పిల్లులు. మరికొందరికి చిలుకలు ఇలా ఉంటాయి కదా. మరి అన్ని వర్గాల పిల్లలను అలరించే బార్బీకి ఏ ఒక్కటో ఉంటే ఎలా? అందుకే ఆమెకు ఇంతవరకు 50 పెట్స్ తయారుచేశారు. వాటిలో గుర్రం, కుక్క, పిల్లి, చింపాంజీ, పాండా, చిలుక, సింహం పిల్ల, జిరాఫీ, జీబ్రా. చూశారా.. అన్నీ పిల్లలకు ఇష్టమైనవే. - బార్బీ ఎక్కువగా బ్రౌన్ కలర్ ఐ షాడోలో దొరుకుతుంది. - అమ్మాయిలకు జుట్టు ఎంత ఇష్టమో తేల్చిన బొమ్మ కూడా బార్బీనే. పొడవాటి, ఒత్తై జుట్టుతో 1992లో ఓ బార్బీ డాల్‌ను విడుదల చేశారు. 130 బార్బీ పాత్రల్లో అత్యధికంగా అమ్ముడైన డాల్... జుట్టున్న బార్బీనే. - బార్బీ పాశ్చాత్యురాలు కదండీ. బాయ్ ఫ్రెండ్‌తో పడకపోయినా అతడితోనే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే అతనికి బై చెప్పి బ్లెయినీ అనే మరో అబ్బాయితో జతకట్టింది. - ప్రపంచంలో ప్రతి మూడు సెకన్లకు ఒక బార్బీ అమ్ముడుపోతోందట. చూశారా ఇన్ని విశేషాలతో నిత్యం వార్తల్లో ఉండి ఎప్పుడూ అందంగా ముద్దుగా ఉండే బార్బీ అంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. ఇంకో సంగతి. బార్బీ డాల్ శరీర కొలతలు మరీ ఫాంటసీ. అలాంటి పాత్ర నిజ జీవితంలో ఉంటుందా అని ఈ మధ్యనే కొందరు ప్రశ్నిస్తున్నారట. సరే వారి ముచ్చట కాదనడం ఎందుకని బార్బీ డాల్... వాస్తవానికి దగ్గరగా ఉండే ఆకారంలో తయారై రానుంది. దీనికింకో కారణం కూడా ఉంది. టీనేజ్ అమ్మాయిలు కొందరు బార్బీ లాగా తయారుకావాలని... అలా ముచ్చటైన కందిరీగ నడుము ఉండాలని తినీతినకుండా ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారట. వారికి బార్బీ కూడా సామాన్యురాలే అని చెప్పడానికి వాస్తవానికి దగ్గరగా తయారుచేస్తున్నారేమో.