కుందనమా? చందనమా? | not a toy it's a girl | Sakshi
Sakshi News home page

కుందనమా? చందనమా?

Published Sun, Jan 3 2016 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

కుందనమా? చందనమా?

కుందనమా? చందనమా?

ఆ అమ్మాయిని చూస్తే ఎవరైనా బార్బీ బొమ్మకి చెల్లెలివా, బాబోయ్ ప్రపంచ సుందరివా అంటారు. అచ్చు బార్బీ లాంటి కళ్లు, జుత్తు, ఆకారం, స్వరూపం, ఆఖరికి నడుం సైజు అదేదో అచ్చు గుద్దినట్టు ఉంటాయి. ఈమె అమ్మాయి కాదు బొమ్మాయి అనే వాళ్లు కొందరైతే, మనిషి సైజు బొమ్మేమోనని గిచ్చి చూసేవాళ్లు ఇంకొందరు. కొందరైతే బొమ్మలాంటి రూపాన్ని చూసి భయపడి పారిపోతున్నారట. ఇప్పుడు ఆండెస్సా డొమియానీ అనే ఈ 23 ఏళ్ల అమ్మాయి బ్రెజిల్‌లో హాట్ టాపిక్.

ఈ అమ్మాయి ప్లాస్టిక్ సర్జరీల సాయంతో బార్బీ బొమ్మలా తయారైందని నమ్మేవాళ్లు కొందరైతే, కాదు ఇది సహజమైన రూపమేనని వాదిస్తున్నారు ఇంకొందరు. అయితే నా ఒంటిపై సర్జరీ కత్తి గాటు సైతం పడలేదు. ఇది దేవుడిచ్చిన రూపం అని ఆండెస్సా వాదిస్తోంది. అయితే బొమ్మలాంటి కళ్ల కోసం మాత్రం కాంటాక్టు లెన్సు పెట్టుకుందట. ఏదేమైనా ఈ మానవ బార్బీ ఇప్పుడు బ్రెజిల్ దేశంలో ధరల సమస్య, నిరుద్యోగం కన్నా అతి పెద్ద ‘రచ్చ’నీయాంశం.
  బొమ్మాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement