ఇదీ బార్బీ బొమ్మ కథ!
హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19,
1959లో. మా ఊరు న్యూయార్క్. నేను మొదటిసారి మీ ముందుకు బ్లాక్ అండ్ వైట్ స్విమ్‌సూట్‌లో వచ్చాను. నేను 11.5 అంగుళాల ఎత్తుతో ఉంటాను. నా మొదటి ధర మూడు డాలర్లు. నాకో ప్రత్యేకమైన రంగు ఉంది. ఆ రంగు పేరు ’బార్బీ పింక్’. నన్ను మీరు రకరకాల రూ΄ాల్లో చూసి ఉంటారు. డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలెట్.. ఇలా 250 రకాల రూపాల్లో నేను మీకు కనిపిస్తాను. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టే నాలుగేళ్ల ముందే, అంటే 1965లో నేను అంతరిక్షానికి వెళ్లాను తెలుసా? అమ్మాయిలు ఏయే రంగాల్లో అయితే తక్కువగా ఉన్నారో ఆ రంగాల్లో నేను కనిపించి వారిలో స్ఫూర్తి నింపాను. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కల.
ప్రపంచంలోని అన్ని దేశాల వారూ నన్నెంతో ఇష్టపడతారు. నన్నింకా వైవిధ్యంగా తయారు చేసేందుకు నాకోసం సుమారు వెయ్యి మందికిపైగా రకరకాల ఫ్యాషన్లు తయారు చేశారు. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడేవారు. ఆ తర్వాత 6 నుంచి 99 ఏళ్లవారు కూడా నా మీద ఇష్టం చూపడం మొదలుపెట్టారు. 1997లో నా పేరు మీద ’బార్బీ గాల్’ అనే పాట కూడా తయారు చేశారు. అది ఇప్పటికీ ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 100 బార్బీ బొమ్మలు అమ్ముడు΄ోతున్నాయి. మొత్తం 150 దేశాల్లో నా బొమ్మలు అమ్ముతున్నారు.
నా పేరిట అనేక సోషల్‌మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో నాకు సంబంధించి రకరకాల వీడియోలుంటాయి. ఇప్పటిదాకా 151 మిలియన్ల నిమిషాల సేపు ఆ వీడియోలను జనం చూశారు.
నా పేరుతో 2023లో ’బార్బీ’ అనే విడుదలైంది.
-ఇదీ నా కథ. ఇక ఉంటాను. బై!
Comments
Please login to add a commentAdd a comment