కంగారు పడకండి. బార్బీకి ఏం కాలేదు. బార్బీ స్ట్రాంగ్ గర్ల్. ఈసారి ఇంకో స్ట్రాంగ్ గర్ల్ రూపంలో అవతరించిందంతే. ఆ రూపమే.. ‘‘బ్లైండ్ డాల్’’! చూపు లేని బొమ్మ!! ఆ..! చూపు లేక΄ోవటం శక్తి అవుతుందా? ఎందుక్కాదూ? చూపు లేక΄ోవటం, చూడలేక΄ోవటం వేర్వేరు కదా. చూపు ఉండీ పక్క మనిషి నిస్సహాయతను పట్టించుకోని వాళ్లకు ఏం శక్తి ఉన్నట్లు? చూపు లేకున్నా సాటి మనిషి హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు ఏం శక్తి లేనట్లు?
బార్బీ.. అమ్మాయిల మనసెరిగిన బొమ్మ. డాక్టర్ బార్బీకి.. మెడిసిన్ చదవాలని కలలు కనే అమ్మాయిల మనసు తెలుసు. ఆస్ట్రోనాట్ బార్బీకి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయాలని ఉవ్విళ్లూరే అమ్మాయిల ఆశలకు ఎన్ని రెక్కలు ఉంటాయో తెలుసు. నల్లజాతి బార్బీకి.. రంగు కారణంగా నల్ల జాతి మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర వివక్ష ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా.. మిస్ యూనివర్శ్ బార్బీ, ప్రెసిడెంట్ బార్బీ, పైలట్ బార్బీ, వీల్ చెయిర్ బార్బీ, ప్రోస్థెటిక్ లెగ్ బార్బీలన్నీ వివిధ వృత్తులు, ప్రవృత్తులు, స్థితి గతులకు ప్రతీకగా ఉండి, ఆడపిల్లలకు స్ఫూర్తిని, సహానుభూతిని అందిస్తున్నవే.
1959తో తొలి బార్బీ మార్కెట్‌లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 1000 రకాలకు పైగానే బార్బీ డాల్స్ అమ్మాయిలకు ఆత్మ బంధువులయ్యాయి. ఆ క్రమంలో తాజాగా ఆవిర్భవించిన కారణజన్మురాలే.. ‘‘బ్లైండ్ డాల్’’. కారణ జన్మురాలా! అవును. కారణ జన్మురాలే. బాలికల్ని మానసికంగా శక్తివంతుల్ని చేయాలన్నదే ఆ కారణం. మాటెల్ కంపెనీ తన ‘స్ఫూర్తిదాయకమైన మహిళలు’ సిరీస్‌లో భాగంగా 2021లో ‘హెలెన్ కెల్లర్’ రూపంలో బార్బీని తయారు చేసినప్పటికీ, ఫ్యాషనబుల్‌గా తెచ్చిన తొలి బ్లైండ్ బార్బీ మాత్రం ఇదే.
అంధులైన వారిని కూడా కలుపుకుని ΄ోయేలా ఈ ‘బ్లైండ్ బార్బీ’ రూపోందింది. ఇందుకోసం బార్బీ బొమ్మల కంపెనీ ‘మాటెల్’.. ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్’తో చేతులు కలిపింది. ఈ కొత్త బార్బీ డాల్ పింక్ శాటిన్ టీ షర్టు, పర్పుల్ ట్యూల్ స్కర్టు ధరించి ఉంటుంది. చేతిలో తెలుపు, ఎరుపు రంగుల స్టిక్ ఉంటుంది. పిల్లల్లో స్వీయ వ్యక్తీకరణను, ఆత్మదృఢత్వాన్ని పెంపొందించేందుకు బ్లైండ్ బార్బీని తెచ్చామని మాటెల్ కంపెనీ చెబుతోంది. అంతే కాదు, ఈ కొత్త బార్బీ ΄్యాకింగ్ కూడా విలక్షణంగా ఉంది. బాక్సు మీద బార్బీ అనే అక్షరాలను బ్రెయిలీ లిపిలో ముద్రించారు.
బ్రిటన్ యువతి లూసీ ఎడ్వర్డ్స్ ఈ బొమ్మకు ప్రచారకర్త. ఆమె తన 11 ఏళ్ల వయసులో కుడి కంటి చూపు కోల్పోయారు. 17 ఏళ్ల వయసులో రెండో కంటి చూపు కూడా క్షీణించింది. ‘‘ఈ బొమ్మ నా సర్వస్వం. ఇది నా దగ్గర ఉంటే నేను ఒంటరినన్న భావనే నాలో కలగదు..’’ అంటున్నారు లూసీ తన చేతిలోని బ్లైండ్ బార్బీని హృదయానికి హత్తుకుంటూ. ఇంకోమాట.. ‘‘అయ్యయ్యో’’ అనిపించుకోవటంస్ట్రాంగ్ గర్ల్‌కి అస్సలు ఇష్టం ఉండదట. లూసీ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment