మనుషులు ప్రాణాలను రక్షించుకోవటం కోసం లేదా తనను ఇబ్బందికి గురిచేసే వారి నుంచి లేదా బాధపెట్టే వారి నుంచి దూరంగా స్వేచ్ఛగా బయటికి వచ్చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అచ్చం అదే విధంగా ఇక్కొడొక ఆవు అలానే తన ప్రాణాలను రక్షించుకువడానికి బయటకు వచ్చేస్తుంది.
(చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...)
అసలు విషయంలోకెళ్లితే...బ్రెజిల్‌లోని ఒక ఆవు జంతు వధ కబేళా నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అది రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని వాటర్ పార్క్‌లోకి వెళ్లుతుంది. అక్కడ నుంచి నెమ్మదిగా ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్‌కి చేరుకుని అక్కడ ఉన్న కొన్ని మెట్టు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంటుంది. కానీ అక్కడ ఆ ఆవు నడవలేక జారిపోతుంటుంది.
దీంతో ఆ ఆవు అక్కడే కూర్చొండిపోతుంది. నిజానికి ఆ స్విమ్మింగ్ పూల్ 200 కేజీల బరువును మాత్రమే భరించగలదు కానీ 317 కిలోలు ఉన్న ఆవు ఎక్కినప్పుడు ఆ పూల్ పై భాగం ఏ మాత్రం ధ్వంసం కాలేదు. అంతేకాదు ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని కార్లోస్ మిగ్యుల్ సెరాంటె ఆ ఆవుకి టోబోగా పేరు పెట్టి దత్తతగా తీసుకుని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణలను రక్షించేకునేందుకు ఎంతలా ప్రయత్నించిందంటూ ఆ ఆవుని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!)
Comments
Please login to add a commentAdd a comment