Slaughtering
-
ఆగస్టు 31న మాంసం విక్రయాలు, జంతు వధ నిషేధం
కర్ణాటక: బెంగళూరులో ఆగస్టు 31న మాంస విక్రయాలను, జంతు వధను నిషేధించారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆగస్టు 31న గణేష్ చతుర్థి సంధర్భంగా ఈ నిషేధాన్ని విధించినట్లు పేర్కొంది. అంతేకాదు నిషేధం విధిస్తూ పౌరసరఫరాల సంస్థ సర్యులర్ కూడా జారీ చేసింది. పైగా మరింత సమాచారం కోసం నిషేధం కాఫీని కూడా జత చేసింది. పశుసంవర్ధక శాఖ జాయింట డైరెక్టర్ బృహత్ బెంగళూరు మహానగర కార్పొరేషన్ పరిధిలోని దుకాణాల్లో జంతువులను వధించడం మాంసం విక్రయించడం నిషేధమని తెలియజేశారు. ఇంతకమునుపు ఈ నెల ప్రారంభంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా మాంసం అమ్మకాలను, జంతువులను చంపడాన్ని నిషేధిస్తూ పౌర సరఫరాల శాఖ సర్క్యులర్ జారీ చేసింది. (చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు) -
మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే
ఎస్‌ఎస్‌తాడ్వాయి (ములుగు జిల్లా): మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నెల రోజుల ముందు నుంచే అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై కుస్తీ పడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కోళ్లు, మేకలు, గొర్లను వధించి వ్యర్థాలను పడేయడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వ్యర్థాల ద్వారా ఈగలు, దోమలు సైతం వ్యాపి చెందుతున్నాయి. మంత్రులు చెప్పినా.. జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధానమని, కోవిడ్ నేపద్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇటీవల మేడారంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినా వారి ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా తల్లులను దర్శించుకునేందుకు గత నెల రోజుల నుంచి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. వారంతా చిలకలగుట్ట, శివరాంసాగర్, ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్ ప్రాంతాల్లో విడిది చేస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు తెచ్చిన మేకలు, కోళ్లను ఎక్కపడితే అక్కడ వధిస్తున్నారు. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడ వధించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిరుపయోగంగా మరుగుదొడ్లు మరుగుదొడ్లు నిరుపయోగం.. మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. భక్తుల సౌకర్యర్థం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాత్కాలిక జీఐ షీట్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నీళ్ల కోసం కుండీలను కట్టారు. అంతాబాగానే ఉన్న కుండీల్లో మాత్రం నీరు పోయడం లేదు. దీంతో జాతరకు వస్తున్న భక్తులు మల, మూత్ర విసర్జన సందర్భంగా ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వాటర్ బాటిళ్లలో నీరు తీసుకుని మరుగుదొడ్లను వినియోగించుకోవడంతో కంపు కొడుతున్నాయి. కాగా, జాతర నాలుగు రోజులు మాత్రమే మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలనే అధికారుల ఆలోచనను భక్తులు తప్పుపడుతున్నారు. ముందస్తుగా జాతరకు వచ్చే వారికోసం సైతం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. -
ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..
మనుషులు ప్రాణాలను రక్షించుకోవటం కోసం లేదా తనను ఇబ్బందికి గురిచేసే వారి నుంచి లేదా బాధపెట్టే వారి నుంచి దూరంగా స్వేచ్ఛగా బయటికి వచ్చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అచ్చం అదే విధంగా ఇక్కొడొక ఆవు అలానే తన ప్రాణాలను రక్షించుకువడానికి బయటకు వచ్చేస్తుంది. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...బ్రెజిల్‌లోని ఒక ఆవు జంతు వధ కబేళా నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అది రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని వాటర్ పార్క్‌లోకి వెళ్లుతుంది. అక్కడ నుంచి నెమ్మదిగా ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్‌కి చేరుకుని అక్కడ ఉన్న కొన్ని మెట్టు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంటుంది. కానీ అక్కడ ఆ ఆవు నడవలేక జారిపోతుంటుంది. దీంతో ఆ ఆవు అక్కడే కూర్చొండిపోతుంది. నిజానికి ఆ స్విమ్మింగ్ పూల్ 200 కేజీల బరువును మాత్రమే భరించగలదు కానీ 317 కిలోలు ఉన్న ఆవు ఎక్కినప్పుడు ఆ పూల్ పై భాగం ఏ మాత్రం ధ్వంసం కాలేదు. అంతేకాదు ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని కార్లోస్ మిగ్యుల్ సెరాంటె ఆ ఆవుకి టోబోగా పేరు పెట్టి దత్తతగా తీసుకుని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణలను రక్షించేకునేందుకు ఎంతలా ప్రయత్నించిందంటూ ఆ ఆవుని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
అక్కడ మాంసాహారం నిషిద్ధం..
కఠ్మాండు: తీవ్ర భూకంపంతో నేలమట్టమైన నేపాల్‌లో జంతువులు, పక్షుల వేటను, మాంసాహారాన్ని నిషేధించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని భావించిన కఠ్మాండు ప్రభుత్వం వేటను, మాంసాహారాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాంసాహారం భుజించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, మాంసం, సంబంధిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నోటీసులు జారీ చేసింది. పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం తామీ నిర్ణయం తీసుకున్నామని కఠ్మాండు జిల్లా అధికారి ఈకె నారాయణన్ తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 6,600మందిని పొట్టన పెట్టుకున్న భూకంపం లక్షలాదిమందిని క్షతగాత్రులుగా మార్చింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరుస భూకంపాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడిపోయారు. ఆరుబయటే టెంట్లలో కాలం గడుపుతున్నారు. ఎక్కడా చూసినా అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. చాలా మంది ప్రజలు అనారోగ్యం బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అనేక ఏజెన్సీలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.