
కర్ణాటక: బెంగళూరులో ఆగస్టు 31న మాంస విక్రయాలను, జంతు వధను నిషేధించారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆగస్టు 31న గణేష్ చతుర్థి సంధర్భంగా ఈ నిషేధాన్ని విధించినట్లు పేర్కొంది. అంతేకాదు నిషేధం విధిస్తూ పౌరసరఫరాల సంస్థ సర్యులర్ కూడా జారీ చేసింది. పైగా మరింత సమాచారం కోసం నిషేధం కాఫీని కూడా జత చేసింది.
పశుసంవర్ధక శాఖ జాయింట డైరెక్టర్ బృహత్ బెంగళూరు మహానగర కార్పొరేషన్ పరిధిలోని దుకాణాల్లో జంతువులను వధించడం మాంసం విక్రయించడం నిషేధమని తెలియజేశారు. ఇంతకమునుపు ఈ నెల ప్రారంభంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా మాంసం అమ్మకాలను, జంతువులను చంపడాన్ని నిషేధిస్తూ పౌర సరఫరాల శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment