swiming fool
-
ఆటగాళ్లతో మాట్లాడుకుంటూ వచ్చాడు.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు శిభరంలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరాచీలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ కారీ అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కారీ తన సహచరులతో మాట్లాడుకుంటూ వస్తూ.. స్విమ్మింగ్ పూల్‌ను గమనించకుండా దాంట్లో జారిపోయాడు. అయితే కారీ స్విమ్మింగ్ పూలో పడిపోయినప్పడు తన చేతిలోని ఫోన్‌ను పైన ఉన్న సహచర ఆటగాళ్లకు విసిరి వేశాడు. దీంతో కారీ చేసిన పనికి చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగి నవ్వు కున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రికార్డు చేశాడు. అంతేకాకుండా తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను కమ్మిన్స్ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రావల్పిండి వేదికగా జరిగిన పాకిస్తాన్- ఆస్ట్రేలియా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 12న ప్రారంభం కానుంది. చదవండి: Trolls On Fawad Alam: పాక్ క్రికెటర్‌కు విచిత్ర పరిస్థితి.. 28 ఏళ్ల రికార్డు బద్దలు View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) -
భార్య పక్కన ఉండగానే హీరోలా నీళ్లలోకి దూకాడు! కట్ చేస్తే..
మంచికి పోతే.. ఉన్న సంచీ ఊడిందని అంటుంటారు పెద్దలు. పాపం.. ఆ పెద్దాయన నీళ్లలో కొట్టుకుపోతున్న ఓ అమ్మాయిని మంచి ఉద్దేశంతోనే కాపాడాలనుకున్నాడు. ఉరుకుల మీద వెళ్లి నీళ్లలోకి దూకాడు. ఆ క్షణం.. ఆయన జీవితంలో ఊహించిన షాక్ తగిలిందట!. పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన క్రిస్ ఫోర్డ్(67) ఒక రిటైర్డ్ ఫొటోగ్రాఫర్. సముద్రానికి కొట్టుకువచ్చే శకలాలను, చెక్క ముక్కలను సేకరించడం ఆయన అలవాటు. ఈ మధ్య ఓ సాయంత్రంపూట తన భార్యతో కలిసి సముద్రం ఒడ్డున విహరిస్తున్నాడు. ఇంతలో దూరంగా రెండు తెల్లటి చేతులు నీటిపై తేలుతూ కనిపించాయి. నో డౌట్.. ఎవరో అమ్మాయే అది అనుకున్నాడు. భార్య పక్కన ఉందనే విషయం మరిచిపోయి(సరదాగానే..) పరిగెత్తుకుంటూ వెళ్లి దభేల్ మని నీళ్లలోకి దూకి ఆ ప్రాణం కాపాడాలనుకున్నాడు. తీరా చూస్తే.. ఈదుకుంటూ దగ్గరికి వెళ్లి చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయట ఆ పెద్దాయనకు. అది ఒక బొమ్మ. అదీ అలాంటి ఇలాంటి బొమ్మ కాదు. తల లేని సె* టాయ్. అది చూడగానే ఆయన నోట మాట పడిపోయిందట. ఆ బొమ్మను లాక్కుంటూ బయటకు తీసుకొచ్చాడు. హీరోలా వెళ్లి.. అలాంటి బొమ్మతో ఒడ్డుకు వచ్చిన భర్తను చూసి ఆ భార్య కింద పడి దొర్లుకుంటూ నవ్వుకుందట. పరువు పోయిందనుకుంటూనే.. ఆ సరదా విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పంచుకున్నాడు. పైగా తనలాంటి ఎవరో భార్యా బాధితుడే ఇలాంటి పని చేసి ఉంటాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అది బోట్లు ఎక్కువగా తిరిగే ఏరియా. బహుశా ఎవరైనా బోటులో వచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంగ్లండ్ డోర్సెట్ చెసిల్ తీరం వెంట జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. -
ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..
మనుషులు ప్రాణాలను రక్షించుకోవటం కోసం లేదా తనను ఇబ్బందికి గురిచేసే వారి నుంచి లేదా బాధపెట్టే వారి నుంచి దూరంగా స్వేచ్ఛగా బయటికి వచ్చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. అచ్చం అదే విధంగా ఇక్కొడొక ఆవు అలానే తన ప్రాణాలను రక్షించుకువడానికి బయటకు వచ్చేస్తుంది. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...బ్రెజిల్‌లోని ఒక ఆవు జంతు వధ కబేళా నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అది రియో డి జనీరోకు పశ్చిమాన 800 కి.మీ దూరంలో ఉన్న నోవా గ్రెనడాలోని వాటర్ పార్క్‌లోకి వెళ్లుతుంది. అక్కడ నుంచి నెమ్మదిగా ఓపెన్-ఎయిర్ స్విమ్మింగ్ పూల్‌కి చేరుకుని అక్కడ ఉన్న కొన్ని మెట్టు ఎక్కి నీటి స్లైడ్ పైకి చేరుకుంటుంది. కానీ అక్కడ ఆ ఆవు నడవలేక జారిపోతుంటుంది. దీంతో ఆ ఆవు అక్కడే కూర్చొండిపోతుంది. నిజానికి ఆ స్విమ్మింగ్ పూల్ 200 కేజీల బరువును మాత్రమే భరించగలదు కానీ 317 కిలోలు ఉన్న ఆవు ఎక్కినప్పుడు ఆ పూల్ పై భాగం ఏ మాత్రం ధ్వంసం కాలేదు. అంతేకాదు ఆ స్విమ్మింగ్ పూల్ యజమాని కార్లోస్ మిగ్యుల్ సెరాంటె ఆ ఆవుకి టోబోగా పేరు పెట్టి దత్తతగా తీసుకుని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రాణలను రక్షించేకునేందుకు ఎంతలా ప్రయత్నించిందంటూ ఆ ఆవుని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న కేకేఆర్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
KKR players in the Swimming pool: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమం లో కేకేఆర్ ఆటగాళ్లు తమ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ను కేకేఆర్ షేర్ చేసింది. ఈ వీడియోలో ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హుస్సేన్ ఏరోబిక్స్( డ్యాన్స్ ఎక్సర్ సైజ్) చేస్తుండగా సహచర ఆటగాళ్లు పూల్‌లో తనను అనుకరించారు. దీంట్లో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు 13మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో కోలకతా నాల్గవ స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ , స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, గిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా కేకేఆర్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్ 𝙅𝙪𝙨𝙩 𝙙𝙤 𝙩𝙝𝙖𝙩 𝙋𝙖𝙖𝙣𝙞 𝙒𝙖𝙡𝙖 𝘿𝙖𝙣𝙘𝙚 😂🎶 Recovery session done quite right ✅#KKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/O4iU9SDyio — KolkataKnightRiders (@KKRiders) October 5, 2021 -
షర్ట్ లేకుండా విరాట్ కోహ్లి ఫోటోలు... వైరల్
Virat Kohli’s Shirtless Photo During RCB’s Pool Session: ప్రపంచంలోనే అంత్యంత ప్రజాదరణ పొందిన క్రికటర్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడు. అయితే ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో రెండు వరుస అపజాయాల తర్వాత ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఆర్సీబీ తిరిగి ట్రాక్‌లో పడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైను 54 పరుగుల తేడాతో బెంగళూరు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు సహచర ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కోహ్లి షర్ట్ లేకుండా ఉన్న ఫొటోలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా శుక్రవారం( సెప్టెంబర్ 29)న రాజస్తాన్ రాయల్స్‌తో బెంగళూరు తలపడనుంది. చదవండి: MS Dhoni: ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్.. హెడ్‌కోచ్‌గా.. లేదంటే! Our boys definitely deserve to cool off after a couple of days of intense #IPL action. 🧊🏊♂️ #PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/SNNMwIvxtJ — Royal Challengers Bangalore (@RCBTweets) September 27, 2021 -
స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మంజీర డైమండ్ టవర్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల 4న జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజునే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా.. ఈ విషయాన్ని పోలీసులు నేటి వరకు గోప్యంగా ఉంచారు. బాలుడు మృతి పై తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గేటెడ్ కమ్యూనిటిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్త చేశారు. యాజమాన్యంపై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నయోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా.. బాధ్యులపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు తమ కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఇద్దరు మృతి
మొయినాబాద్: వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సహంగా గడిపేందుకు ఫాంహౌస్‌కు వచ్చిన ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో ముగిని మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పూర, కిషన్‌భాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సయ్యద్ ఖాన్ కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆదివారం మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఒయాసిస్ ఎన్ ఫాంహౌస్‌కు ఉదయం 10 గంటలకు వచ్చారు. సయ్యద్ ఖాన్ కుమారుడు షోయబ్‌ఖాన్(20), బంధువుల పిల్లలు ముగ్గురు కలిసి ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగిన సోయబ్‌ఖాన్ ఎక్కువ నీళ్లు ఉన్నవైపు వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈతరాక నీటమునిగిన బాలుడు రాజేంద్రనగర్: స్విమ్మింగ్‌పూల్‌లో నీట మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిపేట గ్రామంలో ఉన్న డ్యూడ్రాం ప్రైవేటు ఫాంహౌస్‌కు హయత్‌నగర్‌కు చెందిన రాజు కుటుంబం వచ్చింది. వారంతా కలిసి ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈత కొడుతున్న క్రమంలో అతని కుమారుడు ప్రసన్న బాబు (7) నీటిలో మునిగిపోయాడు. విషయాన్ని గమనించేలోపే అతను నీట మునిగి మృతిచెందాడు. హుటాహుటిన బాలుడిని మొయినాబాద్‌లోని భాస్కర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులకు రాత్రి వరకు బాధితులు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని సీఐ రమణగౌడ్ తెలిపారు. -
బ్యాంకాక్‌లో ఏపీ యువకుడి మృతి
సాక్షి, కృష్ణా : బ్యాంకాక్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి ఓ ఆంధ్రా యువకుడు మృతి చెందారు. మృతుడు పల్లంపాటి వెంకటేష్ కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన యువకుడిగా గుర్తించారు. వెంకటేశ్ హైదరాబాద్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఆఫీసు పని మీద ఇటీవల బ్యాంకాక్ వెళ్లిన వెంకటేష్ మంగళవారం మృతి చెందారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. వెంకటేష్ మృతితో అతని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు దిగి..
బోధన్ టౌన్(బోధన్) : స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోధన్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్ చౌరస్తాకు చెందిన విశాల్ (21) బీటెక్ పూర్తి చేశాడు. తన మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి బోధన్‌లోని ఆఫీసర్స్ క్లబ్లో గల స్విమ్మింగ్‌పూల్‌కు గత రెండు నెలల నుంచి వస్తున్నాడు. రోజూ లాగే గురువారం మధ్యాహ్నం సమయంలో తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌కు వచ్చాడు. ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగిన విశాల్.. ఎంతకూ పైకి రాలేదు. దీంతో మిత్రులు అతడ్ని బయటకు తీసి 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే, 108 వచ్చే సరికే విశాల్ మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి తుకారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడికి ఈత వచ్చని, ఈత వచ్చిన వ్యక్తి ఎలా మృతి చెందుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడికి మృతికి కారణమైన ఈతకొలను నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాల్ మృతికి గల కారణాలపై సీఐని వివరణ కోరగా.. పోస్టుమార్టం తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన బదులిచ్చారు. -
ఈత కొలనుల వద్ద ప్రమాద హెచ్చరికలు
ఆసిఫాబాద్ : వేసవి సెలవుల్లో ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన విద్యార్థులు, ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని వాగులు, ఒర్రెల వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేసవిలో సరదా కోసం ఈత కొలనుల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యు వాత పడుతున్నారని, ముందు జాగ్రత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈతకు వెళ్లడం నిషేదమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఖమ్రొద్దీన్, పోలీసులు పాల్గొన్నారు. -
స్వర్ణాల సెంచరీ పూర్తి
ఐదో రోజూ భారత్‌దే జోరు ఒకేరోజు 39 స్వర్ణాలుబ్యాడ్మింటన్లో రుత్విక సంచలనంఫైనల్లో సింధుపై విజయంతో స్వర్ణందక్షిణాసియా క్రీడలు గువాహటి/షిల్లాంగ్: బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో పసిడి పంటను పండిస్తున్నారు. పోటీల ఐదో రోజూ భారత్ ఏకంగా 39 స్వర్ణాలు సాధించి పతకాల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. బుధవారం జరిగిన క్రీడాంశాల్లో బ్యాడ్మింటన్, షూటింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్‌లలో భారత క్రీడాకారులు అందుబాటులో ఉన్న అన్ని స్వర్ణాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. ప్రస్తుతం భారత్ 117 స్వర్ణాలు, 61 రజతాలు, 16 కాంస్యాలతో 194 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబుల్స్‌లో సిక్కి, జ్వాల, సుమీత్‌లకు స్వర్ణాలు షటిల్ బ్యాడ్మింటన్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు బంగారు పతకాలు లభించాయి. స్వర్ణం నెగ్గిన ప్రతి ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారులు (రుత్విక, శ్రీకాంత్, గుత్తా జ్వాల, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి) ఉండటం విశేషం. మహిళల సింగిల్స్‌లో యువతార గద్దె రుత్విక శివాని పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ 12వ ర్యాంకర్, తెలంగాణకే చెందిన పీవీ సింధుతో జరిగిన ఫైనల్లో ప్రపంచ 131వ ర్యాంకర్ రుత్విక 21-11, 22-20తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ‘మ్యాచ్ సంగతి అటుంచితే సింధుపై ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలువలేదు. ఈ విజయం అనూహ్యం, అద్భుతం. నా కెరీర్లో ఇవి మధుర క్షణాలు. నమ్మశక్యంకాని విజయంతో నా కళ్లలోంచి ఆనందబాష్పాలు వస్తున్నాయి’ అని సింధును ఓడించిన తర్వాత రుత్విక వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-14, 21-6తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై గెలిచి స్వర్ణం సాధించాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21-9, 21-7తో సిక్కి రెడ్డి-మనీషా (భారత్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జోడీ 21-18, 21-17తో అక్షయ్ దేవాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) జంటపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట 30-29, 21-17తో మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీని ఓడించింది. టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్‌కు ఎదురులేకుండాపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఆంథోనీ అమల్‌రాజ్, మహిళల సింగిల్స్‌లో మౌమా దాస్... మహిళల డబుల్స్‌లో మణిక బాత్రా-పూజా సహస్రబుద్ధే జోడీ... పురుషుల డబుల్స్‌లో సత్యన్-దేవేశ్ కరియా జంట విజేతలుగా నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నాయి.టెన్నిస్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్-విజయ్ సుందర్ ప్రశాంత్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా (భారత్), మిక్స్డ్ డబుల్స్‌లో అంకిత రైనా-దివిజ్ శరణ్ స్వర్ణాలు సాధించారు. స్క్వాష్‌లో తొలిసారి...దక్షిణాసియా క్రీడల చరిత్రలో తొలిసారి ఏకకాలంలో భారత పురుషుల, మహిళల జట్లు స్క్వాష్ ఈవెంట్లో విజేతగా నిలిచాయి. పురుషుల టీమ్ ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, రవి దీక్షిత్, కుష్ కుమార్, హరీందర్ పాల్ సంధూలతో కూడిన భారత బృందం 2-1తో పాకిస్తాన్‌ను బోల్తా కొట్టించగా... జోష్నా చినప్ప, దీపిక, సునయన, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు 2-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒకేరోజు పది పసిడి పతకాలు వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ, 400 మీటర్ల రేసులో ఎంఆర్ పూవమ్మ, 100 మీటర్ల హర్డిల్స్‌లో గాయత్రి, హైజంప్‌లో సహన కుమారి... పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, 400 మీటర్ల రేసులో అరోక్య రాజీవ్, డిస్కస్ త్రోలో అర్జున్, లాంగ్‌జంప్‌లో అంకిత్ శర్మ, 10 వేల మీటర్ల రేసులో గోపీ స్వర్ణాలు నెగ్గారు.షూటింగ్లో భారత్‌కు మూడు స్వర్ణాలు దక్కాయి. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వీ చండీలా విజేతగా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో, పురుషుల 50 మీటర్ల టీమ్ పిస్టల్ ఈవెంట్లోనూ భారత్‌కు పసిడి పతకాలు లభించాయి.స్విమ్మింగ్‌లో పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో వీర్‌ధవల్ ఖాడే, మహిళల 200 మీటర్ల మెడ్లేలో శ్రద్ధ సుధీర్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో జ్యోత్స్న పన్సారె విజేతలుగా నిలిచారు. 4ఁ100 మీటర్ల పురుషుల, మహిళల రిలే రేసుల్లోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి. వుషు క్రీడాంశంలో జ్ఞాన్దశ్ సింగ్ (తైజిక్వాన్, తైజియాన్)... సంతోంబి చాను (తైజిక్వాన్, తైజియాన్) పసిడి పతకాలు సాధించారు. ఈ ఇద్దరే కాకుండా పురుషుల సాన్‌షూ ఈవెంట్లో ఉచిత్ శర్మ (52 కేజీలు), రవి పాంచాల్ (56 కేజీలు), సూర్య భానుప్రతాప్ సింగ్ (60 కేజీలు)... మహిళల సాన్‌షూ ఈవెంలో సనతోయ్ సింగ్ (52 కేజీలు), అనుపమా దేవి (60 కేజీలు), పూజా కడియాన్ (70 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు.