
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు శిభరంలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరాచీలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ కారీ అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కారీ తన సహచరులతో మాట్లాడుకుంటూ వస్తూ.. స్విమ్మింగ్ పూల్‌ను గమనించకుండా దాంట్లో జారిపోయాడు. అయితే కారీ స్విమ్మింగ్ పూలో పడిపోయినప్పడు తన చేతిలోని ఫోన్‌ను పైన ఉన్న సహచర ఆటగాళ్లకు విసిరి వేశాడు.
దీంతో కారీ చేసిన పనికి చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్లందరూ ఒక్కసారిగి నవ్వు కున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రికార్డు చేశాడు. అంతేకాకుండా తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను కమ్మిన్స్ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రావల్పిండి వేదికగా జరిగిన పాకిస్తాన్- ఆస్ట్రేలియా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 12న ప్రారంభం కానుంది.
చదవండి: Trolls On Fawad Alam: పాక్ క్రికెటర్‌కు విచిత్ర పరిస్థితి.. 28 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment