సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మంజీర డైమండ్ టవర్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల 4న జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజునే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనా.. ఈ విషయాన్ని పోలీసులు నేటి వరకు గోప్యంగా ఉంచారు. బాలుడు మృతి పై తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గేటెడ్ కమ్యూనిటిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్త చేశారు. యాజమాన్యంపై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నయోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా.. బాధ్యులపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు తమ కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment