ఈత కొలనుల వద్ద ప్రమాద హెచ్చరికలు | Accidental And Danger Swimming Pools | Sakshi
Sakshi News home page

ఈత కొలనుల వద్ద ప్రమాద హెచ్చరికలు

Published Fri, Mar 30 2018 1:23 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

Accidental And Danger  Swimming Pools - Sakshi

పెద్దవాగు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పోలీసులు

ఆసిఫాబాద్‌ : వేసవి సెలవుల్లో ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన విద్యార్థులు, ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సీఐ బాలాజీ వరప్రసాద్‌  ఆధ్వర్యంలో పోలీసులు  మండలంలోని వాగులు, ఒర్రెల వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేసవిలో సరదా కోసం ఈత కొలనుల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యు వాత పడుతున్నారని, ముందు జాగ్రత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈతకు వెళ్లడం నిషేదమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఎస్సై ఖమ్రొద్దీన్, పోలీసులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement