please
-
నీట్ పరీక్ష రద్దు పిటిషన్లపై ‘సుప్రీం’ విచారణ నేడు
సాక్షి, న్యూఢిల్లీ : నీట్-యూజీ 2024 పేపర్ లీకేజీ అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. నీట్ -యూజీ 2024 పేపర్ లీకేజీపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ ఏడాది జరిగిన నేషనల్ ఎలిజిబులటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో అవకతవకలు జరిగాయిని, ఆ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కోరుతూ సుమారు 38 పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన పిటిషన్లను ఇవాళ (జులై 8న) ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్,జస్టిస్ జేబీ పార్దివాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.నీట్-యూజీ పరీక్షను రద్దు చేయాలినీట్-యూజీ పరీక్షను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలని పలువురు పిటిషన్లు దాఖలు చేయగా..పేపర్ లీకేజీల కారణంగా నీట్ పరీక్షల పవిత్రత దెబ్బతింటుందని, వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు.నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) మాత్రం పరీక్షను న్యాయ బద్దంగా నిర్వహించామని,పరీక్ష జరిగే సమయంలో భారీ ఎత్తున మాల్‌ప్రాక్టీస్ జరిగిందనే ఆరోపణల్ని ఖండించింది. నీట్ అవకతవకలపై వస్తున్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని స్పష్టం చేసింది.అంతేకాదు,తమ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఎన్టీఏ సైతం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్టీఏ యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిజమైన అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుందని, వారి కెరియర్‌తో పాటు అవకాశాలపై ప్రతీ కూల ప్రభావం పడుతుందని తెలిపింది. -
ఈత కొలనుల వద్ద ప్రమాద హెచ్చరికలు
ఆసిఫాబాద్ : వేసవి సెలవుల్లో ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన విద్యార్థులు, ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని వాగులు, ఒర్రెల వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేసవిలో సరదా కోసం ఈత కొలనుల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యు వాత పడుతున్నారని, ముందు జాగ్రత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈతకు వెళ్లడం నిషేదమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఖమ్రొద్దీన్, పోలీసులు పాల్గొన్నారు. -
కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రైతుల విన్నపం అమలాపురం : ‘కొబ్బరి కాయను రూ.ఆరుకు అమ్మినా ఇప్పుడవుతున్న పెట్టుబడులకు గిట్టుబాటు కాదు.. అటువంటిది పది నెలలుగా మేము రూ.3 లోపే విక్రస్తున్నాం. ఇలా అయితే మేము సాగుచేయలేం. కొబ్బరి విస్తారంగా పండే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే కొబ్బరికి ధరకు, సాగుకు భరోసా వస్తుంది’ అని భారతీ కిసాన్ సంఘ్ (బీకేఎస్) కు చెందిన దక్షిణభారత కొబ్బరి రైతుల బృందం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతుల బృందం మంగళవారం కలిసింది. కొబ్బరి ధరల పతనం, పరిశ్రమల ఏర్పాటుకు చేయూత అందకపోవడం వంటి విషయాలను వారు కేంద్రమంత్రికి వివరించారు. బృందంలో సభ్యుడు, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి స్థానిక విలేకరులకు ఫోన్లో వివరించారు. కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేసి దానిలో రైతులను భాగస్వామ్యులను చేయాలని అప్పుడే కొబ్బరి లాభసాటి ధర వస్తుందని వివరించారు. కొబ్బరినూనెను వంటనూనెగా గుర్తించాలని, దీనిలో ఉన్న పోషకాలు, ఇతర ఆరోగ్యకరమైన పోషకాలపై ప్రజలకు అవగాహనకల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని రైతులు కోరారు. దీనిపై స్పందించిన సీతారామన్ కోకోనట్ డవలప్మెంట్ బోర్డు (సీడీబీ) ఆధ్వర్యంలో కంపెనీలు ఎందుకు ఏర్పడడం లేదని ప్రశ్నించారు. అలాగే ఇంత తక్కువ మద్దతు ధరను కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) ఎలా నిర్ణయించిందని మంత్రి ప్రశ్నించారు. సీఏసీపీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరకుండా మద్దతు ధరలు నిర్ణయిస్తుందని, ఇందుకు తాము ఉదాహరణలతో సహా వివరించామని జమ్మి తెలిపారు. దీనిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కేంద్రవ్యవసాయ శాఖమంత్రి రాధమోహన్సింగ్, ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభులతో మాట్లాడేందుకు సీతారామన్ అవకాశం కల్పించారని జమ్మి వివరించారు. -
భూపాలపల్లిలో చేర్చండి
వాజేడు మండల వాసుల రాస్తారోకో వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఢిల్లీ పెద్దలను కదలించేలా తరలిరండి
బంద్‌కు అన్ని వర్గాలూ సహకరించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ : ప్రత్యేక హోదా ఆవశ్యకత ఢిల్లీ వరకూ వినిపించేలా రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు మరో పోరాటం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. స్థానిక రమణయ్యపేటలోని తన నివాసంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం, బీజేపీలు కపటనాటకమాడి ప్రజలను మరోసారి మోసం చేశాయని విమర్శించారు. ఆది నుంచి రెండు పార్టీలూ ప్రజలను మభ్యపెడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బంద్ సందర్భంగా అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్ విగ్రహాలపై ద్వంద్వవైఖరి విజయవాడలో మహానేత వైఎస్ విగ్రహం కూల్చివేత అంశంలో ఒక విధంగా, ఎన్టీఆర్ విగ్రహాల విషయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం విధానాలపై కన్నబాబు మండిపడ్డారు. అక్కడేమో వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి, కాకినాడ సర్పవరం జంక్షన్లో రోడ్డు మధ్యలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి హంగులు ఏర్పాటు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని తిరిగి ప్రభు త్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ఇటీవల పార్లమెంట్లో జైట్లీ చేసిన ప్రకటనకు చంద్రబాబే కారణమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించాలి
డైరెక్టర్ మనోహర్‌రావును కోరిన హెచ్ఎంఎస్ గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలక భూమిక పోషించి చారిత్రాత్మకమైన సమ్మె చేసిన సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె వేతనాలను జూలై నెల వేతనాలతో కలిపి చెల్లించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ కోరారు. ఆదివారం డైరెక్టర్ (పీఅండ్‌పీ) ఎ.మనోహర్‌రావును క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కార్మికులంతా బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసి అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించారని, వారికి వేతనాలు ఇవ్వడంలో జాప్యం తగదన్నారు. అలాగే గనులలో తరుచూ అధికారుల నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, రక్షణ చర్యలు పటిష్టపర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి సత్తయ్య, వి.ప్రతాపరావు, కొలిపాక వీరస్వామి, అంబటి నరేశ్, గాజుల వెంకటస్వామి పాల్గొన్నారు. -
అయినవారిని కాపాడబోయి...
బంధువు దశదిన కర్మకు వెళ్లి అనంతలోకాలకు... నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌లో నీటమునిగి బీటెక్ విద్యార్థి మృతి లింగాలఘణపురం మండలం వనపర్తిలో విషాదఛాయలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు, ఆత్మీయులు త్వరలో విదేశాలకు వెళ్లనున్న కొడుకు.. తమకు అండగా నిలుస్తాడనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ... అంతలోనే ఘోరం జరిగిపోయింది. అయినవారిని కాపాడబోయి వారితోపాటే నీటమునిగి తనువు చాలించాడు బీటెక్ విద్యార్థి అవినాష్‌రెడ్డి. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టులో సోమవారం జరిగిన దుర్ఘటన లింగాలఘణపురం మండలంలోని వనపర్తికి చెందిన యువకుడి కుటుంబంలో తీరని ఆవేదనను మిగిల్చింది. కాగా, ఈ ఘటనలో మరో నలుగురు మృత్యువాత పడ్డారు. - వనపర్తి (లింగాలఘణపురం) వనపర్తి(లింగాలఘణపురం) : అయ్యో.. దేవుడెట్ల జేసే... అంటూ లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రామస్తులందరూ విషణ్ణవదనంలో మునిగారు. ఆ ఊరికి చెందిన యువకుడు, బీటెక్ విద్యార్థి దుర్మరణం చెంద డం వారిని కలచివేసింది. అయినవారిని కాపాడబోయి వారితోపాటే నీటమునిగి సదరు యువకుడు అనంతలోకాలకు వెళ్లడం వారిని నిశ్చేష్టులను చేసింది. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టులో సోమవా రం జరిగిన ఈ దుర్ఘటన యువకుడి కుటుంబంలో తీరని ఆవేదనను మిగి ల్చింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో విద్యార్థులు మృతిచెం దిన ఘటన నుంచి జిల్లా వాసులు మరవకముందే జరిగిన ఈ ప్రమాదం కలవరపరిచింది. అసలు ఏం జరిగింది.. అవినాశ్ తన తల్లి అరుణతో కలిసి నల్లగొండకు బంధువు దశదిన కర్మకు వెళ్లాడు. డిండి ప్రాజెక్టులో కర్మకాండ పూర్తి చేసేందుకు బంధువులు బయలుదేరారు. అక్కడికి అందరికంటే ముందుగానే అవినాశ్‌రెడ్డి, అతడి అల్లుళ్లు ఇద్దరు, కోడళ్లు ఇద్దరు వెళ్లారు. అందరూ వచ్చేలోగా స్నానాలు పూర్తిచేద్దామనుకుని ఐదుగురూ ప్రాజెక్టు నీటిలోకి దిగారు. లోతు తక్కువగా ఉందని భావించిన వారు నీటిలో కొంతదూరం వెళ్లారు. అయితే, అక్కడ పెద్ద గుంత ఉంది. అల్లుళ్లు, కోడళ్లు నీట మునుగుతున్నారు. గమనించిన అవినాశ్ వారిని రక్షించేందుకు దగ్గరికి వెళ్లాడు. పాపం.. ఆ గుంతలో అతడు చిక్కుకున్నాడు. ఐదుగురి ప్రాణాలను డిండి ప్రాజెక్టు మింగేసింది. స్వగ్రామంలో విషాదం లింగాలఘణపురం మండలంలోని వనపర్తి గ్రామానికి చెందిన గట్టికొప్పుల నర్సిరెడ్డి, అరుణ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు అవినాశ్‌రెడ్డి(22) హైదరాబాద్‌లోని కీసరలో గల ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. కూతురు ఆమని కూడా హైదరాబాద్‌లోనే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అవినాశ్‌రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడు. త్వరలో విదేశాలకు వెళ్లనున్న కొడుకు.. తమకు అండగా నిలుస్తాడనుకున్న అవినాశ్ తల్లిదండ్రులకు అతడి మరణవార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. కొడుకు ఇకలేడని తెలిసిన వెంటనే వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అవినాశ్ దుర్మరణం గ్రామస్తులను సైతం కలచివేసింది. సమాచారం తెలియగానే ఊరుఊరంతా అవినాశ్ ఇంటికి చేరుకున్నారు. ఎంతటి ఘోరం జరిగిపోయిందని ఆవేదన చెందారు.