- డైరెక్టర్ మనోహర్‌రావును కోరిన హెచ్‌ఎంఎస్
సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించాలి
Published Sun, Jul 24 2016 8:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలక భూమిక పోషించి చారిత్రాత్మకమైన సమ్మె చేసిన సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె వేతనాలను జూలై నెల వేతనాలతో కలిపి చెల్లించాలని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ కోరారు. ఆదివారం డైరెక్టర్ (పీఅండ్‌పీ) ఎ.మనోహర్‌రావును క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కార్మికులంతా బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసి అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించారని, వారికి వేతనాలు ఇవ్వడంలో జాప్యం తగదన్నారు. అలాగే గనులలో తరుచూ అధికారుల నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, రక్షణ చర్యలు పటిష్టపర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి సత్తయ్య, వి.ప్రతాపరావు, కొలిపాక వీరస్వామి, అంబటి నరేశ్, గాజుల వెంకటస్వామి పాల్గొన్నారు.
Advertisement