
మంచికి పోతే.. ఉన్న సంచీ ఊడిందని అంటుంటారు పెద్దలు. పాపం.. ఆ పెద్దాయన నీళ్లలో కొట్టుకుపోతున్న ఓ అమ్మాయిని మంచి ఉద్దేశంతోనే కాపాడాలనుకున్నాడు. ఉరుకుల మీద వెళ్లి నీళ్లలోకి దూకాడు. ఆ క్షణం.. ఆయన జీవితంలో ఊహించిన షాక్ తగిలిందట!.
పోర్ట్ల్యాండ్కు చెందిన క్రిస్ ఫోర్డ్(67) ఒక రిటైర్డ్ ఫొటోగ్రాఫర్. సముద్రానికి కొట్టుకువచ్చే శకలాలను, చెక్క ముక్కలను సేకరించడం ఆయన అలవాటు. ఈ మధ్య ఓ సాయంత్రంపూట తన భార్యతో కలిసి సముద్రం ఒడ్డున విహరిస్తున్నాడు. ఇంతలో దూరంగా రెండు తెల్లటి చేతులు నీటిపై తేలుతూ కనిపించాయి. నో డౌట్.. ఎవరో అమ్మాయే అది అనుకున్నాడు. భార్య పక్కన ఉందనే విషయం మరిచిపోయి(సరదాగానే..) పరిగెత్తుకుంటూ వెళ్లి దభేల్ మని నీళ్లలోకి దూకి ఆ ప్రాణం కాపాడాలనుకున్నాడు.
తీరా చూస్తే.. ఈదుకుంటూ దగ్గరికి వెళ్లి చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయట ఆ పెద్దాయనకు. అది ఒక బొమ్మ. అదీ అలాంటి ఇలాంటి బొమ్మ కాదు. తల లేని సె* టాయ్. అది చూడగానే ఆయన నోట మాట పడిపోయిందట.
ఆ బొమ్మను లాక్కుంటూ బయటకు తీసుకొచ్చాడు. హీరోలా వెళ్లి.. అలాంటి బొమ్మతో ఒడ్డుకు వచ్చిన భర్తను చూసి ఆ భార్య కింద పడి దొర్లుకుంటూ నవ్వుకుందట. పరువు పోయిందనుకుంటూనే.. ఆ సరదా విషయాన్ని ఆయన తన బ్లాగ్లో పంచుకున్నాడు.
పైగా తనలాంటి ఎవరో భార్యా బాధితుడే ఇలాంటి పని చేసి ఉంటాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అది బోట్లు ఎక్కువగా తిరిగే ఏరియా. బహుశా ఎవరైనా బోటులో వచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంగ్లండ్ డోర్సెట్ చెసిల్ తీరం వెంట జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment