సాక్షి, కృష్ణా : బ్యాంకాక్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి ఓ ఆంధ్రా యువకుడు మృతి చెందారు. మృతుడు పల్లంపాటి వెంకటేష్ కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన యువకుడిగా గుర్తించారు. వెంకటేశ్ హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఆఫీసు పని మీద ఇటీవల బ్యాంకాక్ వెళ్లిన వెంకటేష్ మంగళవారం మృతి చెందారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. వెంకటేష్ మృతితో అతని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment