మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబెర్! | Justin Bieber smashes car door at paparazzi in Argentina | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబెర్!

Published Sun, Nov 10 2013 10:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబెర్!

మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబెర్!

టీనేజ్ పాప్ స్టార్ జస్టిన్ బీబెర్ దక్షిణ అమెరికా పర్యటన వివాదాలతో ముందుకు సాగుతోంది. తాజాగా ఫోటో జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించడం వివాదంగా మారింది. అర్జెంటినాలో కెమెరాలతో క్లిక్ మనిపిస్తున్న ఫోటో జర్నలిస్ట్ ను కారు డోర్ తో దురుసుగా తోయడం పతాక శీర్షికల్లోకి ఎక్కింది. 
 
ఇటీవల బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో వేశ్యగృహంలో బీబర్ పట్టుబడిన సంఘటన దక్షిణ అమెరికా అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ సంఘటన తర్వాత రియో డి జెనిరోలోని ఓ ప్రదర్శనలో వాటర్ బాటిల్ తో బీబెర్ ను అభిమాని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఓ అమ్మాయితో ఒంటిపై షర్ట్ లేకుండా ఓ రాత్రి గడుపుతూ ఉన్నట్టుగా కనిపించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement