Brothel
-
‘వ్యభిచార గృహం నడిపేందుకు రక్షణ కావాలి’.. మద్రాస్ హైకోర్టు షాక్
చెన్నై: ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను చూసి మద్రాస్ హైకర్టు షాక్ గురైంది. సదరు పిటిషనర్‌పై దర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను రద్దు చేయడమే కాకుండా అతడికి జరిమానా కూడా విధించింది. ఇంతకీ ఆ పిటిషన్ ఏంటంటే..తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వ్యభిచార గృహాన్ని నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రాక్టీస్ చేస్తున్న రాజా మురుగన్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా మేజర్లు ఏకాభిప్రాయంతో సెక్స్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ పిటిషనర్ వాదించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. తన వ్యాపార కార్యకలాపాల్లో పోలీసుల జోక్యాన్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు తెలిపారు. అయితే వ్యభిచార గృహాన్ని నడుపుతూ తప్పు చేయడమే కాకుండా తన చర్యలను నిసిగ్గుగా సమర్థించినందుకు జస్టిస్ బి పుగలేంధీ ధర్మాసనం పిటిషనర్‌పై మండిపడడింది. తన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. న్యాయవాదిపై 10 వేల జరిమానా కూడా విధించింది.అదే విధంగా ప్రఖ్యాత లా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకునేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను కోర్టు కోరింది. ఇతర రాష్ట్రాల్లోని సందేహాస్పద సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ల నమోదును బార్ కౌన్సిల్ తప్పనిసరిగా పరిమితం చేయాలని సూచించింది.‘సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ట తగ్గుతోందని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఇక నుంచైనా బార్ కౌన్సిల్ సభ్యులు పేరున్న కళాశాలల నుంచి మాత్రమే నమోదు చేసేలా చూసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి పేరు లేని అనామక సంస్థల నుంచి నమోదును పరిమితం చేయాలి’ అని తెలిపింది. -
శ్రీలంక మహిళల దుస్థితి.. బుక్కెడు బువ్వ, మందుల కోసం సెక్స్ వర్కర్లుగా..
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది శ్రీలంక. ప్రజలు తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది . ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాయి. కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి 'ఆయుర్వేద స్పా'ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెక్స్ వర్కర్లుగా చేరుతున్న మహిళల సంఖ్య 30 శాతం వృద్ధి చెందింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు వీరంతా వస్త్రపరిశ్రమ రంగంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. ఉద్యోగం పోతుందనే భయంతో గత్యంతరం లేకే తాము ఈ ఊబిలోకి దిగుతున్నట్లు ఓ మహిళ చెప్పింది. ఉద్యోగం చేస్తే తమకు నెలకు రూ.28,000 నుంచి 35,000వరకు మాత్రమే వచ్చేదని, కానీ వ్యభిచారంలో రోజుకు రూ.15,000 సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని ఆమె పేర్కొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులకు అండగా ఉండేందుకు మహిళలు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదని శ్రీలంక సెక్స్ వర్కర్ల న్యాయవాద సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషిల దండేనియా తెలిపారు. దేశంలో ఇతర వృత్తులతో పోల్చితే వ్యభిచారంలోనే అత్యంత వేగంగా డబ్బు సంపాదించవచ్చనే వాళ్లు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం.. నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆహారం, ఔషధాల కోసం కొంతమంది మహిళలు దుకాణ యజమానులతో శృంగారంలో పాల్గొంటున్నారనే విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కొలంబో పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి చోట్ల పోలీసుల సహకారంతో వ్యభిచారం జరుగుతున్నట్లు నివేదికలు బహిర్గతం చేశాయి. వ్యభిచారం సాఫీగా చేసుకునేందుకు కొంతమంది బ్రోకర్లు మహిళలను పోలీసులతో బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేస్తున్నట్లు వెల్లడించాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి లాగేందుకు యత్నం.. చివరికి
సాక్షి, జీడిమెట్ల: మహిళకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మేడ్చల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. సీఐ బాలరాజు ఎస్సై గౌతమ్‌కుమార్ వివరాల ప్రకారం.. 2021లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ వచ్చేందుకు కర్నూల్ బస్టాండ్‌లో నిలబడింది. కర్నూల్లో మహిళను పరిచయం చేసుకున్న అదే ప్రాంతానికి చెందిన బుగ్గన మధుమోహన్‌రెడ్డి(33) ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చాడు. అనంతరం ఆమెను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించగా తప్పించుకున్న మహిళ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు మధుమోహన్‌ను రిమాండ్‌కు తరలించారు. కేసు పుర్వపరాలు పరిశీలించిన మేడ్చల్ జిల్లా కోర్టు మంగళవారం నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా వేసింది. -
విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి..
సాక్షి, అల్వాల్: మానవ అక్రమ రవాణకు పాల్పడుతూ వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నిందితుడిపై రాచకొండ పోలీసులు పీడి చట్టాన్ని నమోదు చేసి జైలుకు పంపించారు. రాచకొండ కమిషనరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం... టాంజానియా దేశానికి చెందిన కబాంగిలా వారెన్ అలియాస్ అండ్రూ హసన్ నేరేడ్మెట్లోని జీకే కాలనీలో నివాసముంటున్నాడు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీలో ఈటల ‘స్వతంత్రం’.. ఆదిలాబాద్‌లో షాక్! ఇతను విదేశాల నుండి విద్య కోసం విద్యార్థినులను వీసాపై ఇండియాకు రప్పిస్తున్నాడు. వారికి ఆశ్రయం కల్పించి ఆదాయం సమకూర్చుతానని నమ్మించి వ్యభిచారంలోకి దింపుతున్నాడు. స్థానికంగా తన పరిచయాల ద్వారా మహిళల వద్ద విటులను పంపిస్తున్నాడు. రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ నేరేడ్మెట్ పోలీసులతో కలిసి జూన్ 28న నిందితుడు కబాంగిల వారెన్‌ను అరెస్టు చేశాడు. ఇతనిపై పీడియాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: పేదరికం తక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ) -
లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్
సాక్షి, వనస్థలిపురం: లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న యువతితో పాటు నలుగురు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. చింతల్‌కుంటలోని మనోహర్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుకున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి లాడ్జిపై దాడి చేశారు. ఒక యువతి, విటులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లాడ్జి రూం నం.109పై దాడి చేయగా అందులో ఓ వ్యక్తి, మహిళను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించామన్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి వారి వద్ద నుంచి ఆరు సెల్ఫోన్లు, రూ.6500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం.. -
మల్కాజిగిరిలో వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లాతూర్కు చెందిన పూజా కాంబ్లే(40) మల్కాజిగిరి సాయి నగర్లో నివాసముంటూ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఆమె గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రాత్రి ఆమె ఇంటిపై పోలీసులు దాడిచేసి నిందితురాలిని రిమాండ్‌కు, ఆమెతో పాటు ఉన్న యువతిని హోంకు తరలించారు. మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ -
మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిని మీర్ పేట పోలీసులు బాలాపూర్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మీర్‌పేట ఆర్ఎన్రెడ్డినగర్ టీకేఆర్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభి చారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 5వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమక్షంలో సదరు ఇంటిలోని మొదటి అంతస్తును సీజ్ చేశారు. -
వేశ్య దగ్గరికి వెళ్లి మంచి పని చేశాడు
అక్కడికి వెళ్లాలనుకోవడం తప్పే.. కానీ వెళ్లి మంచి పని చేశాడు సుఖం కోసం వెళ్లి.. ఆమె బాధను చెరిపేశాడు మోసపోయి వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఆమెకు విముక్తిని కల్పించాడు సాక్షి, న్యూఢిల్లీ : ఏ స్త్రీ వ్యభిచారం చేయాలనుకోదు. అలాగే వేశ్య వృత్తి కొనసాగించాలని కూడా ఎవరు అనుకోరు. ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు చాలా అరుదనే చెప్పాలి. స్త్రీలను బలవంతంగా ఎత్తుకొచ్చి ఈ వృత్తిలోకి తోస్తారు లేదా ఏ తోడు లేక జీవనం కోసం ఏమి చేయాలో తెలియక ఇందులోకి వస్తారు. ప్రతి వేశ్య వెనక ఒక చీకటి బాధాకరమైన కథ తప్పక ఉంటుంది. అయితే వారి వద్దకు వెళ్లే కస్టమర్లు సుఖాన్ని కోరుకుంటారే తప్ప వారి బాధల్ని పట్టించుకోరు. కానీ ఓ వ్యక్తి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆ స్త్రీ వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఎలాగైనా ఆమెను ఆ ఊబినుంచి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద నుంచి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికి సమాచారం ఇచ్చారు. చివరకు ఆమెకు విముక్తి కల్పించాడు. ఇదంతా దేశ రాజధాని ఢిల్లీలోని జీపీరోడ్‌లో జరిగింది. మోసపోయి వేశ్యగా.. కోల్‌కతాకు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. మరో మంచి ఉద్యోగం కోసం ఆమె వెతుకుతోంది. అంతలోనే ఆమెకు పరిచయమైన ఓ మహిళ ఢిల్లీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికింది. ఆమె మాటలు నమ్మి జూన్ 8న ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం ఇప్పిస్తుందనే ఆశతో ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక తెలిసింది సదరు మహిళ ఆమెను మోసం చేసిందని. ఓ వ్యభిచార ముఠా చేతికి చిక్కిన ఆమె.. రెండు నెలలపాటు నరకం చూసింది. ఆమె దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ తీసుకొని బందించారు. చిత్రహింసలకు గురిచేశారు. వచ్చిన కస్టమర్లను సుఖపెట్టకుంటే హింసించేవారు. ఇక తన బతుకు ఇంతే అనుకొని అలా శవంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె వద్దకు కోల్‌కతా కస్టమర్ వచ్చాడు. అందరిలాగే అతను ఆమె సుఖాన్ని కోరుకోకుండా బాధను పంచుకున్నాడు. ఆమె వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కస్టమర్‌గా వెళ్లిన సోదరుడు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో మహిళ సోదరుడు ఢిల్లీకి వెళ్లి అతన్ని కలిశాడు. వివరాలు తెలుసుకొని... నిర్థారించుకోవడానికి కస్టమర్‌గా వేశ్య గృహానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిని చూసి చలించిపోయాడు. బయటకు వచ్చి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ఇచ్చాడు. కేసు ఫిర్యాదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. బందీగా ఉన్న మహిళకు విముక్తి కల్పించారు. ఉద్యోగం పేరిట మోసం చేసిన మహిళపై కేసు నమోదు చేశారు. చేసింది తప్పే అయినా ఆ కస్టమర్ ఓ మహిళను రక్షించి మంచి పని చేశాడు. -
వ్యభిచార గృహంపై దాడి
మహిళ, ఇద్దరు విటుల అరెస్ట్ నిర్వాహకులకు పోలీసు కానిస్టేబుల్ అండ..? తిరుపతి క్రైం : స్థానిక కొర్లగుంటలోని కట్టకిం దపల్లెకు వెళ్లే సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఈస్ట్ సీఐ రాంకిశోర్ ఆదివారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలి సహా ఇద్దరు విటులను అరెస్టు చేశారు. సీఐ కథనం మేరకు.. కొర్లగుంటలో ఒక మహిళ (38) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొద్ది రోజులుగా వ్యభిచార గృహం నడుపుతోంది. సరైన సమాచారం రావడంతో మహిళా పీసీలతో ఈ గృహంపై దాడిచేశారు. ఈ సందర్భంగా పులివెందులకు చెందిన మునికిశోర్రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన బాలకృష్ణారెడ్డి అనే ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఒక మహిళను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. వీరి నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఒక కానిస్టేబుల్‌తో సంబంధాలు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇతనే వారికి అండగా ఉంటూ ఈ గృహాన్ని నడిపస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో నిజానిజాలను ఉన్నతస్థాయి అధికారులు తేల్చాల్సింది. -
వ్యభిచార గృహం నుంచి బాలికకు విముక్తి
హసన్‌పర్తి : వ్యభిచార గృహం నుంచి ఓ బాలికకు గురువారం విముక్తి కలిగింది. సిద్ధాపురంలో అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారవృత్తి చేయిస్తున్నారనే నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు హసన్‌పర్తి ఎస్సై పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం... సిద్ధాపురానికి చెందిన ముస్కు పోచాలు, ముస్కు సీత, ముస్కు రఘు వేశ్యాగృహం నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల నుంచి ఓ బాలికను రూ.20వేలకు కొనుగోలు చేసి 20 రోజుల క్రితం తీసుకువచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు దాడి నిర్వహించారు. ఈ బాలికతోపాటు మరో ఐదుగురు అమ్మాయిలను సైతం పోలీసులు గుర్తించారు. వారు మేజర్ కావడంతో కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. కాగా సిరిసిల్లకు చెందిన వేశ్యాగృహ నిర్వాహకురాలు స్వాతి మూడు నెలల క్రితం ఆ బాలికను ఖమ్మం నుంచి తీసుకువచ్చినట్లు తెలిసింది. వేశ్యాగృహం నుంచి విముక్తి పొందిన బాలికను పోలీసులు నగరంలోని బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలికకు తల్లిదండ్రులు లేరని తెలిసింది. దీంతో ఆ బాలికను మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలికతో వ్యభిచారం చేయించిన పోచాలు, సీత, రఘుతోపాటు సిరిసిల్లకు చెందిన స్వాతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: ఓ ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వ్యక్తులను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నడుపుతున్న మహిళతో పాటు మరో నలుగురు యువతులను, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీ పేస్ 2లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్వాహకురాలు జానిరాణి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..
కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలితోపాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
అతివల అదృశ్యంపై ఆందోళన
వివాహేతర సంబంధం.. ప్రేమ వ్యవహారం.. ఉద్యోగాలు.. డబ్బుపై ఆశ.. ఆదరణ లేకపోవడం.. ఇంట్లో అలగడం.. దూరపు చదువులు.. .. ఇలా సందర్భం ఏదైనా కావొచ్చు. మహిళ లేదా బాలిక కాలు తీసి బయట పెట్టిందంటే ఆమె రక్షణకు గ్యారంటీ లేదు. మహిళ.. అయితే చాలు ప్రమాదం ఏ రూపంలోనైనా ముంచుకు రావొచ్చు. మహిళల బలహీనతలు ఆసరా చేసుకుని వారిని వ్యభిచారం రొంపిలోకి దించే ముఠాలు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కాచుకుని కూర్చొంటాయి. మహిళ ఒంటరిగా కనబడితే చాలు బ్రోకర్లకు పండగే. ఎలాగైనా లోబర్చుకుని లేనిపోని ఆశలు చూపి జీవితాన్ని బుగ్గిపాలు చేసేందుకూ వెనకాడరు. - ఏటా 10 నుంచి 20 మంది మహిళల ఆచూకీ గల్లంతు - ఢిల్లీ వ్యభిచార గృహంలో జిల్లాకు చెందిన యువతి - రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మేసిన మోసగాడు - ఢిల్లీ పోలీసుల ‘ఆపరేషన్’లో బాధితురాలికి విముక్తి ఒంగోలు క్రైం : జిల్లాలో బాలికలు, మహిళలు ఏటా అదృశ్యమవుతున్నారు. కొద్దికాలం తర్వాత కొందరి ఆచూకీ తెలుస్తున్నా మరికొందరు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియలేదు. మూడేళ్ల నుంచి అదృశ్యం కేసుల వివరాలు పరిశీలిస్తే మహిళలకు ఉన్న భద్రత ఏ పాటిదో అర్థమవుతోంది. వివాహేతర సంబంధాలు.. ప్రేమ వ్యవహారం.. బతుకువేటలో ఇల్లు వదిలి బయటకు వెళ్లడం.. ఉద్యోగాల ఆశ చూపడం.. ఇంట్లో అలిగి వెళ్లడం.. సందర్భం ఏదైనా కావొచ్చు.. మహిళ బయటకు వెళ్లిందంటే చాటు ఇట్టే అదృశ్యమైపోతోంది. ఫలితంగా రక్తసంబంధీకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. నయవంచకుల కబందహస్తాల్లో చిక్కి అతివలు అల్లాడిపోతున్న సందర్భలూ లేకపోలేదు. మహిళల, బాలికల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అతివలు గడపదాటితే తిరిగి ఇంటికి వచ్చే వరకూ ఇంట్లోని పెద్దలకు నిద్రపట్టడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసుల లెక్కల ప్రకారం ఏటికేడు మహిళల అదృశ్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అదృశ్యమైన వారిలో 5 నుంచి 10 శాతం వరకు ఏళ్లు గడిచినా వారి ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. వ్యభిచార గృహాలకు తరలింపు కొంతమంది అమాయక బాలికలు, మహిళలు ఎవ రో ఒకరి చేతిలో మోసపోయి చివరకు వ్యభిచార గృహాల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఢిల్లీలోని ఓ వ్యభిచార గృహంలో జిల్లాకు చెందిన యువతి ఆచూకీ ఇటీవల లభ్యం కావడం అదృశ్యమైన మహిళల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఓ నయవంచకుడు సదరు యువతికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆమెను నమ్మకంగా తన వెంట ఢిల్లీ తీసుకెళ్లాడు. చివరకు ఆ మోసగాడు వ్యభిచార గృహానికి ఆమెను నిలువునా అమ్మాడు. ఎంతకమ్ముకున్నాడో ఏమోగానీ ఆమె ఏడాదిగా వ్యభిచార రొంపిలో పడి కమిలిపోయింది. తీరా ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ ‘ముక్తి’ పేరిట చేపట్టిన దాడుల్లో గౌతమ్‌బుద్ధ రోడ్డులోని ఓ వ్యభిచార గృహంలో ఆ మహిళ పోలీసుల కంట పడింది. దీంతో ఆమెకు ఆ రొంపి నుంచి విముక్తి లభించడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ఇవిగో..సాక్ష్యాలు - మద్దిపాడు మండలం తెల్లబాడుకు చెందిన 14 ఏళ్ల బాలికను ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సుమతి అనే మహిళ ఆరు నెలలుగా నిర్బంధించింది. బాలికను వ్యభిచారం రొంపిలోకి దింపి పచ్చటి బాల్యాన్ని సర్వనాశనం చేసింది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఆచూకీ తెలపండంటూ పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. అభం శుభం తెలియని 14 ఏళ్ల బాలిక జీవితాన్ని బుగ్గిపాలు చేశారు. చివరకు పోలీసులు నిందితురాలు సుమతిని కటకటాల్లోకి నెట్టి..బాలికను హోంకు తరలించారు. - కొత్తపట్నంకు చెందిన యువతిని బంధువులామె ఇంట్లో శుభకార్యమని పిలిపించుకొని ముంబైకి చెందిన వ్యభిచార గృహం నిర్వాహకులకు అమ్మింది. ఆ కేసును కూడా జిల్లా పోలీసులు ఛేదించారు. - ‘పిన్నే పిశాచీ’ఉదంతాన్ని గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వేటపాలేనికి చెందిన ఓ యువతిని నెల్లూరు జిల్లా అల్లూరులో ఉంటున్న సొంత పిన్ని అక్కడికి తీసుకెళ్లి వ్యభిచారం రొంపిలోకి దింపింది. యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో తానే ఆలనా.. పాలనా చూస్తానని బంధువులతో నమ్మ బలికి తీసుకెళ్లింది. తీరా ఆ యువతి ఆచూకీ తెలపాలంటూ నాయనమ్మ పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయమేమంటే పిన్నే ఆ యువతిని రూ.20 వేలకు అల్లూరులోని వ్యభిచార గృహంలో అమ్మేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. -
వ్యవసాయక్షేత్రంలో అశ్లీల నృత్యాలు!
-
ఫాంహౌస్‌లో ముంబై యువతులు
రంగారెడ్డి(మహేశ్వరం): మహేశ్వరం పోలీసులు మంగళవారం ఓ ఫాంహౌస్‌పై దాడి చేసి ముంబైకి చెందిన యువతులను, హైదరాబాద్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేశారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ శివారు ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో ఇద్దరు ముంబై యువతులు, ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన యువకులు ఉన్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఫాంహౌస్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. -
వ్యభిచారగృహంలో బంగ్లాదేశ్ యువతి
సరూర్‌నగర్(హైదరాబాద్ క్రైం): నగరంలో వ్యభిచార గృహంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఒక ఇంటిలో వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక యువతి కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచార గృహంపై స్థానికుల దాడి
నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించిన వైనం మదనపల్లె: నివాసప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై స్థానికులు దాడి చేశారు. నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నీరుగట్టువారిపల్లెలోని తారకా లేఅవుట్లో ఓ మహిళ ఒంటరిగా నివాసముంటోంది. కొంతమంది మహిళలను వ్యభిచారం ఉచ్చులోకి దించి వ్యాపారం సాగి స్తోంది. పలుమార్లు స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకపోగా వారిపై బెదిరింపులకు పాల్పడేది. స్థానికంగా నివాసముంటున్న మహిళలు తీవ్ర ఇబ్బందిపడేవారు. ఇకచేసేది లేక కౌన్సిలర్ బండి నాగరాజు ఆధ్వర్యంలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో సహా విటులను, మహిళలను రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై టూ టౌన్ ఎస్ఐ హనుమంతప్పను వివరణ కోరగా, వ్యభిచారవృత్తిలో ఉన్న ముగ్గు రు మహిళలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
వ్యభిచార గృహంపై దాడి:జీహెచ్ఎంసీ డీఈ అరెస్ట్
హైదరాబాద్: ఉప్పల్‌లోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలతోపాటు జీహెచ్ఎంసీ డీఈ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఈ కూకట్పల్లి సర్కిల్‌కు చెందిన వాడిగా తెలుస్తోంది. ** -
'ఒంటరిగా నిద్రించాలంటే భయమేస్తోంది'
ఎప్పుడు ఏ వైపు నుంచి అభిమానులు దూసుకు వచ్చి హోటల్ లో రచ్చ చేస్తారేమోనని భయానికి గురవుతున్నాడు. అభిమానుల బెడదకు ఒంటరిగా నిద్రించాలంటే భయమేస్తోంది అంటున్నాడు జస్టిన్ బీబర్. అభిమానులెవరూ రాకుండా 24 గంటలు సెక్యూరిటీ ఉండేలా చూడాలని బాడీగార్డ్ కు బీబర్ సూచించారు. అభిమానుల బెడదకు ఒంటరిగా కూడా ఉండేందుకు భయపడుతున్నాను. చిన్న శబ్దమైనా ఉలిక్కి పడుతున్నాను అని టీనేజ్ సంచలనం తెలిపాడు. తనకు ఇద్దరు బాడీగార్డులు కాపలా ఉన్నా.. ఎదో తెలియని ఆందోళన అని అన్నాడు. వచ్చే వారం ఆస్ట్రేలియాలోని పెర్త్ లో వరల్డ్ టూర్ ముగియనుంది. అయితే ప్రదర్శన జరిగే రోజుల్లో అమ్మను తనకు తోడుగా ఉండాలని కోరాను అని బీబర్ తెలిపాడు. కొద్ది రోజుల క్రితం వేశ్యగృహంలో బీబర్ మీడియా కంటపడటం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ప్రదర్శన జరిగిన రోజున అభిమానులు వాటర్ బాటిల్ విసిరిన సంగతి తెలిసిందే. -
మరో వివాదంలో పాప్ స్టార్ జస్టిన్ బీబెర్!
టీనేజ్ పాప్ స్టార్ జస్టిన్ బీబెర్ దక్షిణ అమెరికా పర్యటన వివాదాలతో ముందుకు సాగుతోంది. తాజాగా ఫోటో జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించడం వివాదంగా మారింది. అర్జెంటినాలో కెమెరాలతో క్లిక్ మనిపిస్తున్న ఫోటో జర్నలిస్ట్ ను కారు డోర్ తో దురుసుగా తోయడం పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఇటీవల బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో వేశ్యగృహంలో బీబర్ పట్టుబడిన సంఘటన దక్షిణ అమెరికా అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ సంఘటన తర్వాత రియో డి జెనిరోలోని ఓ ప్రదర్శనలో వాటర్ బాటిల్ తో బీబెర్ ను అభిమాని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఓ అమ్మాయితో ఒంటిపై షర్ట్ లేకుండా ఓ రాత్రి గడుపుతూ ఉన్నట్టుగా కనిపించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. -
వేశ్యాగృహంలో మీడియాకు చిక్కిన పాప్ స్టార్!
సినీ నటులు, పాప్ స్టార్స్ చాటుమాటుగా తమ ప్రేయసిలతో కనిపించడం సాధారణమే. అయితే అంతర్జాతీయంగా గొప్ప పేరు, ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ ఓ వేశ్య గృహంలో కనిపించడం సంచలనం రేపింది. తాజాగా టీనేజ్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో ఓ వేశ్యాగృహంలో కనిపించడం అక్కడి అభిమానుల ఆగ్రహానికి గురి చేసింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న జస్టిన్ బీబర్ వేశ్య గృహంలో మీడియా కంటపడటం అనేక విమర్శలకు దారి తీసింది. పందొమ్మిదేళ్ల బీబర్, తన స్నేహితుడితో కలిసి మూడు గంటలపాటు రియో డి జెనిరోలోని సెంటారోస్ బ్రోతల్ (వేశ్యా వాటిక) గడిపారని న్యూయార్క్ పోస్ట్ ఆరో పేజిలో కథనాన్ని వెల్లడించింది. వేశ్యగృహం నుంచి వెళ్లే సమయంలో అతని బాడీ గార్డ్స్ బెడ్ షీట్ ను బీబర్ ముఖంపై కప్పి తీసుకువెళ్లినట్టు కథనంలో పేర్కోంది. అంతేకాకుండా వేశ్యలను కూడా తన హోటల్ రూంకు తీసుకువెళ్లారని ఫోటోగ్రాఫర్లు కూడా ధృవీకరించారు. ఈ వ్యవహరంతో ఆగ్రహించిన బ్రెజిల్ ఫ్యాన్స్.. ఓ కార్యక్రమంలో ఓ వేదికపైన ఉన్న బీబర్ ను వాటర్ బాటిల్ తో కొట్టారు.