
నిందితురాలు పూజా కాంబ్లే
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన పూజా కాంబ్లే(40) మల్కాజిగిరి సాయి నగర్‌లో నివాసముంటూ టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఆమె గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రాత్రి ఆమె ఇంటిపై పోలీసులు దాడిచేసి నిందితురాలిని రిమాండ్‌కు, ఆమెతో పాటు ఉన్న యువతిని హోంకు తరలించారు.
మీర్‌పేట్‌లో వ్యభిచార గృహం సీజ్
Comments
Please login to add a commentAdd a comment