వ్యభిచార గృహంపై స్థానికుల దాడి
నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించిన వైనం
మదనపల్లె: నివాసప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై స్థానికులు దాడి చేశారు. నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నీరుగట్టువారిపల్లెలోని తారకా లేఅవుట్‌లో ఓ మహిళ ఒంటరిగా నివాసముంటోంది. కొంతమంది మహిళలను వ్యభిచారం ఉచ్చులోకి దించి వ్యాపారం సాగి స్తోంది. పలుమార్లు స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకపోగా వారిపై బెదిరింపులకు పాల్పడేది. స్థానికంగా నివాసముంటున్న మహిళలు తీవ్ర ఇబ్బందిపడేవారు.
ఇకచేసేది లేక కౌన్సిలర్ బండి నాగరాజు ఆధ్వర్యంలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో సహా విటులను, మహిళలను రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై టూ టౌన్ ఎస్‌ఐ హనుమంతప్పను వివరణ కోరగా, వ్యభిచారవృత్తిలో ఉన్న ముగ్గు రు మహిళలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని చెప్పారు.