రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి ఊపందుకుంటోంది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో భూములు మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం 2024 మొదటి నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది.
2024 ఏప్రిల్ వరకు జరిగిన 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్ల విలువ సుమారు రూ. 16,190 కోట్లు. 2023 మొదటి నాలుగు నెలలతో పోలిస్తే.. 2024 మొదటి నాలుగు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్‌ల సంఖ్య 15 శాతం ఎక్కువ. విలువ పరంగా 40 శాతం ఎక్కువని తెలుస్తోంది.
2024లో ఎక్కువగా ఖరీదైన గృహాలకు రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.1 కోటి.. అంత కంటే ఎక్కువ ఖరీదైన గృహాలు ఉన్నాయి. ఖరీదైన గృహాల రిజిస్రేషన్స్ 2023 కంటే 2024లో 92 శాతం ఎక్కువ.
రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్యలో ఉన్న గృహాల రిజిస్ట్రేషన్స్ 2023 కంటే 47 శాతం ఎక్కువని గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద అన్ని రకాల కేటగిరీల గృహాల రిజిస్ట్రేషన్, విలువ 2023 కంటే ఎక్కువగానే నమోదయ్యాయి.
2024 ఏప్రిల్ నెలలో మొత్తం రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు 6,578 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య 2023 కంటే 46 శాతం పెరిగింది. ఈ ప్రాపర్టీల విలువ రూ.4,260 కోట్లగా నమోదైంది. ఇది కూడా అంతకు ముందు ఏడాది కంటే 86 శాతం పెరుగుదలను చూపుతోంది.
హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ హైదరాబాద్‌లో మాత్రమే కాకూండా మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా ఉంది. ఇవన్నీ ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లకు సంబంధించిన గృహ విక్రయాలను కవర్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment