సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలు నిర్ణయంలో ధర, ప్రాంతం, వసతులతో పాటు వాస్తు కూడా ప్రధానమైనదే. భారతీయ గృహ కొనుగోలుదారులైతే వాస్తు తర్వాతే మిగతా అంశాలను ఎంపిక చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్‌లలో ఏ దిక్కున ఎంత అభివృద్ధి చెందుతుంది? ఏడాది కాలంలో నగరంలో గృహ కొనుగోళ్ల విలువ, ధరల వృద్ధి తదితర అంశాలపై నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదికను వెలువరించింది.
గత నెలలో హైదరాబాద్‌లో రూ. 3,352 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే మార్చిలో నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 6,414 అపార్ట్‌మెంట్లు రిజిస్టేషన్స్ అయ్యాయి.
ఇందులో 53 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే రిజిస్టేషన్స్ కాగా.. 70 శాతం 1,000 నుంచి 2,000 చ.అ. ప్రాపర్టీలే ఉండటం గమనార్హం.
పశ్చిమం..
- సరఫరా అయిన గృహాల విలువ: 85 వేల కోట్లు
- ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 7,700 కోట్లు
- ప్రాపర్టీ ధరల వృద్ధి: 19 %
- టాప్–5 మైక్రో మార్కెట్లు: తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి
ఉత్తరం..
- సరఫరా అయిన గృహాల విలువ: 26 వేల కోట్లు
- ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 1,900 కోట్లు
- ప్రాపర్టీ ధరల వృద్ధి: 22 శాతం
- టాప్ - 5 మైక్రో మార్కెట్లు: కొంపల్లి, సైనిక్‌పురి, పోచారం, బాచుపల్లి, మియాపూర్
(ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?)
దక్షిణం..
- సరఫరా అయిన గృహాల విలువ: 3,400 కోట్లు
- ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 310 కోట్లు
- ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం
- టాప్ - 5 మైక్రో మార్కెట్లు: రాజేంద్రనగర్, మహేశ్వరం, శంషాబాద్, ఆదిభట్ల, షాద్‌నగర్
తూర్పు..
- సరఫరా అయిన గృహాల విలువ: 3,200 కోట్లు
- ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 230 కోట్లు
- ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం
- టాప్ - 5 మైక్రో మార్కెట్లు: ఉప్పల్, ఘట్‌కేసర్, హబ్సిగూడ, నాగోల్, ఎల్బీనగర్
(ఇదీ చదవండి: భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!)
సెంట్రల్..
- సరఫరా అయిన గృహాల విలువ: 2,200 కోట్లు
- ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 180 కోట్లు
- ప్రాపర్టీ ధరల వృద్ధి: 20%
- టాప్ 5 మైక్రో మార్కెట్లు: అమీర్‌పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం
Comments
Please login to add a commentAdd a comment