developed
-
యువత బలమే దేశానికి కలిమి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మన యువత బలమే మన దేశాన్ని అగ్రగామిగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువతీ యువకుల శక్తి సామర్థ్యాలతో భారత్ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమం’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’ అనేది మన లక్ష్యమని గుర్తుచేశారు. ఆ లక్ష్యం సాధించడం కష్టం కావొచ్చేమో గానీ అసాధ్యం మాత్రం కాదని తేల్చిచెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సత్తా మన యువతలో ఉందన్నారు. మనది యువదేశమని, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేశారు. మనం వేసే ప్రతి అడుగులో, ప్రతి విధానంలో, ప్రతి నిర్ణయంలో వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో వేర్వేరు కీలక రంగాల్లో ఎన్నో విజయాలను మన దేశం సాధించబోతోందని మోదీ వెల్లడించారు. దేశం ముందుకు పరుగులు తీయాలంటే గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, మనం ఇప్పుడు అదే పనిలో నిమగ్నమై ఉన్నామని వివరించారు. ప్రభుత్వానికి యువత భుజం కలపాలి 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం బ్లెండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాస్తవానికి అంతకంటే ముందే అది సాధించబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, యువత సైతం భుజం కలపాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్‌కు యువతే యజమానులని ఉద్ఘాటించారు. మన విధాన నిర్ణయాల్లో యువత ఆలోచనలు కూడా ఒక భాగమని చెప్పారు. వారి దిశానిర్దేశం దేశానికి అవసరమని అన్నారు. మనం అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరి సమ్మిళిత కృషి అవసరమన్నారు. 1930లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా అగ్రదేశంగా ఎదిగిందని, ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దేశమైన సింగపూర్ ప్రస్తుతం బలీయమైన ఆర్థిక శక్తిగా మారిందని మోదీ గుర్తుచేశారు. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యమని ఉద్బోధించారు. రాబోయే 25 ఏళ్లు మనకు అమృతకాలమని వివరించారు. వికసిత్ భారత్ కలను యువత సాకారం చేస్తుందన్న విశ్వాసం తనకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో మన దేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేలా యువత సన్నద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమానికి 3 వేల మందికిపైగా యువతీ యువకులు హాజరయ్యారు. -
వికసిత భారత్ దిశగా సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా తదుపరి సంస్కరణలను అమలు చేయగలదని కార్పొరేట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత పురోగతి వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీజీకి శుభాకాంక్షలు. మీ దార్శనిక సారథ్యంలో భారత్ అనేక మైలురాళ్లను అధిగమించింది. ఇకపైనా దేశం వృద్ధి బాటలో ముందుకు దూసుకెడుతుందని విశ్వసిస్తున్నాం.– అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత గ్రూప్దేశాభివృద్ధి కొనసాగుతుంది నెహ్రూజీ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన మోదీజీకి శుభాకాంక్షలు. కొత్త కేబినెట్ ఏర్పాటుతో దేశ అభివృద్ధి, పురోగతి కొనసాగగలదని ఆశిస్తున్నాను.– సజ్జన్ జిందాల్, సీఎండీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్కీలక సమయం భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సుకు ఈ విడత మరింత కీలకం కాగలదని ఆశిస్తున్నాను. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్లక్ష్యానికి పటిష్ట పునాదులు ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది సంస్కరణల ఎజెండా కొనసాగింపునకు దోహదపడగలదు. ఆర్థిక, సామాజికాభివృద్ధికి తోడ్పడుతూ, వికసిత భారత్ లక్ష్యానికి గట్టి పునాదులు వేసే పురోగామి విధానాలు, చర్యలను కొత్త ప్రభుత్వం తీసుకోగలదని ఆశిస్తున్నాము. – అనీష్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీసంస్కరణల అమలు లక్ష్యం అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ను పటిష్టపర్చేందుకు మోదీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం తదుపరి విడత సంస్కరణలు అమలు చేయగలదని ఆశిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్, సీఐఐఎకానమీ మరింత స్పీడ్ కీలక దేశాలకు మించి అత్యధిక వృద్ధి రేటును కొనసాగిస్తూ, దేశ నాయకత్వం భారత్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదని కార్పొరేట్లు విశ్వసిస్తున్నారు.– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
స్వభావం
‘‘బట్టతలకి స్వభావానికి మందు లేదు.’’ అన్న మాట అందరికీ తెలిసినదే. స్వభావం అంటే ఏమిటి? ‘స్వ’ అంటే తన యొక్క ‘భావం’ అంటే సహజ లక్షణం, లేదా సహజ గుణం. ‘సహ’ అంటే కలిసి ‘జ’ అంటే పుట్టినది. అంటే, ఒక వ్యక్తితో పాటు పుట్టేది అని అర్థం. ఒక గురువుగారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ప్రవాహం మధ్యలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. ఒక ఆకు మీద దానిని ఎక్కించారు. పట్టుకోగానే అది కుట్టింది. బాధగా వేలిని రుద్దుకున్నారు. కొద్దిసేపటికి అది మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. తిరిగి అదే పని చేశారు. అది కూడా తన పని తాను చేసింది. చేతిని గట్టిగా విదిలించారు. మూడోసారి మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఈలోపు గట్టు వచ్చింది. తేలుని పట్టుకుని నేల మీద వదిలారు. మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఒక శిష్యుడికి సందేహం కలిగింది. గురువుగారు మేధావి కదా! ఇంత తెలివితక్కువగా ఎందుకు ప్రవర్తించారు? అని. ‘‘రెండుమార్లు కుట్టినా మూడోమారు కూడా ఎందుకు కాపాడారు?’’ అని అడిగాడు. ‘‘కుట్టటం దాని స్వభావం. దానిని తేలు మార్చుకోలేదు. కాపాడటం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి?’’ అని సమాధానం చెప్పారు. స్వభావం అంటే తన యొక్క, ‘భావం’ తత్త్వం. తనతనం. అది పుట్టుకతో వస్తుంది. ‘‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే’’ అనే సామెత తెలుసు కదా! అంటే మారదు అని అర్థం. దీనిని వంకగా పెట్టుకుని తమలో ఉన్న చెడు స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. ఇదే మనిషి పురోభివృద్ధిని నిర్ణయించే ప్రధాన అంశం. సుమారుగా అందరికీ చాలా విషయాలు తెలుసు. ఏది మంచి ఏది చెడు అన్నదీ తెలుసు. తెలిసిన దానిని ఎంత వరకు ఆచరణలో పెట్టారు? అన్న దాని వల్ల పురోభివృద్ధిలో వ్యత్యాసం వస్తుంది. దానికి కారణం స్వభావం. స్వభావం సరిదిద్దుకో వలసినది అయితే చాలా ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముందుగా మార్చుకోవాలి అనే సంకల్పం ఉండాలి. క్రమంగా, నిలకడగా ప్రయత్నం చేయాలి. మూతిని కట్టేసినా మాట్లాడకుండా ఉండలేని వారి చేత పాఠాలని చదివించిన ఉపాధ్యాయులని చూశాం. పెరిగాక వారిని యాంకర్లుగా చేస్తే సరి. పాఠం చదవటం వల్ల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది. ఆగకుండా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వభావాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే మార్గం ఇది. అదేవిధంగా అబద్ధాలు ఆడే పిల్లవాడు ఉంటే, వాడి చేత కథలు రాయిస్తే వాడి సృజనాత్మకత అంతా అక్కడ చూపించటం జరుగుతుంది. నోరు విప్పని వారు ఉంటారు కొందరు. వారు రహస్యసమాచార శాఖలలో రాణిస్తారు. వ్యక్తి స్వభావాన్ని అనుసరించి తగినమార్గంలో పెడితే ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఏదీ పనికి రానిది అని చెప్పటానికి వీలు లేదు. ‘స్వభావో దురతిక్రమః’’ మారదు కనుక మలచుకోవచ్చు. మంచి పనులు చేయటం ద్వారా మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కనీసం మంచికి, మందికి ఉపయోగ పడవచ్చు. ఉదాహరణకి దేనిని చూసినా సొంతం చేసుకోవాలనే గుణం ఉంది అనుకుందాం. తప్పు అని తెలిసినా మనసు అదుపులో ఉండదు. అటువంటి వారిలో దొంగతనం అనే రోగం పోగొట్టటం ఎట్లా? వారి చేత ఇతరులకి ఇప్పిస్తూ ఉండాలి. అది తనదే కానక్కర లేదు. తీసుకున్న వారి ముఖంలో కనపడే ఆనందం చూసి ‘సెరిటోనిన్’ అనే హార్మోను విడుదల అయి వారికి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఇతరుల వస్తువులని తీసుకోవాలనే స్వభావం క్రమక్రమంగా దూరమవుతుంది. కనీసం ఆలోచన ఆచరణ రూపం ధరించదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!
సాఫ్ట్వేర్ చిన్నారిప్రపంచమంతా టెక్నాలజీతోపాటు పరుగులు పెడుతోంది. అందుకే చిన్నా..పెద్దా తేడా లేకుండా అంతా స్మార్ట్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల దాకా అన్నీ అవలీలగా వాడేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కోడింగ్ ద్వారా వివిధ రకాల అప్లికేషన్లు, గేమ్‌లు తయారు చేస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో కొంతమంది మాత్రమే వీటిని తయారు చేయగలరు. మిగతావారికి కోడింగ్ అంటే అర్థం కాని పెద్ద సబ్జెక్ట్‌గా చూస్తారు. అటువంటిది భారత సంతతికి చెందిన సీమర్ ఖురానా కోడింగ్‌ను మునివేళ్లతో పట్టి చకచక వీడియోగేమ్‌ను రూపొందించింది. అతిపిన్నవయసులో వీడియోగేమ్ రూపొందించి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన వీడియోగేమ్ డెవలపర్‌గా గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. కెనడాలోని ఆంటారియోలో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన పరాస్ ఖురానా కూతురే సీమర్. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండే సీమర్ తన వయసు పిల్లలంతా వీడియోగేమ్‌లు ఆడుకుంటుంటే సీమర్ మాత్రం... తన సీనియర్లు చదివే పాఠాలు నేర్చుకోవడానికి ఆరాటపడేది. మ్యాథ్స్ అంటే మక్కువ ఎక్కువ ఉన్న సీమర్.. తన తరగతి కాకుండా పైతరగతి విద్యార్థులు చదివే లెక్కల పాఠాలు నేర్చుకోవాలనుకునేది. కానీ ఎవరూ నేర్పించేవాళ్లు కాదు. దీంతో యూట్యూబ్‌లో చూసి లెక్కలు నేర్చుకునేది. కిండర్ గార్డెన్ చదివే సీమర్ మూడోతరగతి లెక్కలు సులభంగా చేసేది. ఒకపక్క లెక్కలు చెబుతూనే కాగితాలతో క్రాఫ్ట్ తయారు చేసి ఆడుకుంటూ ఉండేది. ఇది గమనించిన సీమర్ తండ్రి కోడింగ్ క్లాసులను చూపించారు. కోడింగ్ నచ్చడంతో సీమర్ కోడింగ్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. క్రమంగా కోడింగ్‌పై పట్టుసాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది. డాక్టర్ మాటలు విని... సీమర్ అక్క ఆరోగ్యం పాడవడంతో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కను పరీక్షించిన డాక్టర్ జంక్ఫుడ్ని మానేయాలని చెప్పడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే హెల్దీ, జంక్‌ఫుడ్‌ల గురించి వీడియో గేమ్ తయారు చేయాలనుకుంది. దీనికోసం వారానికి మూడు క్లాసులకు హాజరవుతూ ఏడాదిలోపే కోడింగ్‌ను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఆ తరువాత ‘హెల్దీఫుడ్ ఛాలెంజ్’ పేరిట వీడియో గేమ్‌ను తయారు చేసింది. జంక్ ఫుడ్ వల్ల ఏర్పడే ముప్పు, ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం ఎలా తీసుకోవాలో ఈ వీడియోగేమ్ వివరంగా చెబుతుంది. ఈ యాప్‌ను తయారు చేయడానికి స్కూలు అయిపోయిన తరువాత రోజుకి రెండు గంటలపాటు సమయాన్ని కేటాయించేది సీమర్. ఇలా తన పేరుని గిన్నిస్‌బుక్‌లో ఎక్కించుకుంది. వీడియో గేమ్‌లే కాదు... లెక్కలు, కోడింగ్‌తోపాటు డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, కరాటేలు కూడా నేర్చుకుంటోంది.‘సీమర్స్ వరల్డ్’ పేరుమీద యూ ట్యూబ్ ఛానల్ నడుపుతూ తనకొచ్చే వివిధ రకాల ఆటల ఐడియాలను షేర్ చేస్తోంది. టాలెంట్‌కు వయసుతో సంబంధంలేదనడానికి సిసలైన ఉదాహరణగా నిలుస్తోంది సీమర్. చిచ్చర పిడుగుల్లాంటి పిల్లలు వయసు కంటే పెద్ద చదువులు చకచకా చదివేసి, డిగ్రీ పట్టాలు పొందేస్తుంటారు. అయితే అంతకన్నా చకచకా అడుగులు వేసింది సీమర్. డిగ్రీలు చదవడం కాదు... ఏకంగా వీడియో గేమ్నే రూపొందించింది ఈ ఆరేళ్ల సిసింద్రీ సీమర్ ఖురానా. (చదవండి: ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..) -
అభివృద్ధి కోసం నాలుగు మంత్రాలు
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాల బలోపేతం (ఇన్ఫ్రా), పెట్టుబడులు, ఆవిష్కరణలు, అందరికీ ఆర్థిక ఫలాలు (సమ్మిళితత్వం) అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ధేశించిన అభివృద్ధి భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కావాల్సిన అన్ని సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర సర్కారు పెట్టుబడిదారుల అనుకూల సంస్కరణలు ఎన్నింటినో తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. భారత్‌లో శక్తివంతమైన యువ జనాభా ఉందంటూ, ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా వారికి కావాల్సిన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. 25 ఏళ్లలో సాధించేందుకు.. ‘‘మౌలిక సదుపాయాల కల్పనను పెద్ద ఎత్తున చేపట్టాం. గత 3–5 ఏళ్లలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాలు పెద్ద ఎత్తున పెంచడంతో 2023–24 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. మౌలిక సదుపాయాలు అనేవి పెట్టుబడుల వల్లే సాధ్యపడతాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మౌలిక సదుపాయాలు అంటే కేవలం బ్రిడ్జ్‌లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులే కాకుండా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగే, ఆవిష్కరణలను సైతం ప్రోత్సహిస్తున్నాం. అంతరిక్షం, అణు ఇంధనం విభాగాల్లో అవకాశాలకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. అలాగే సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నేడు యువత తగిన పరిష్కారాలను అందిస్తుందని విశ్వసించేందుకు తగిన కారణాలు ఉన్నాయి. చివరిగా అందరికీ ఆర్థిక ఫలాలను అందించడం ద్వారా 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. కనుక భారత్‌లో ప్రతీ వర్గం, సామాన్య వ్యక్తి కూడా ప్రభుత్వం చేపట్టే పెట్టుబడులు, సంస్కరణలు, తదితర చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారు’’అని మంత్రి సీతారామన్ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. జీ20 ముందు ఎన్నో లక్ష్యాలు జీ20 కూటమికి అధ్యక్ష స్థానంలో భారత్ చేస్తున్న కృషిని సైతం మంత్రి సీతారామన్ ప్రస్తావించారు. కరోనా అనంతరం ఎదురైన సవాళ్ల పరిష్కారం, పునరుద్ధరణ ప్రణాళికలపై పనిచేస్తున్నట్టు చెప్పారు. 21వ శతాబ్దపు సవాళ్లను మలీ్టలేటరల్ బ్యాంకులు ఎలా పరిష్కరించగలవనేది తమ తొలి ఏజెండా అని చెప్పారు. మార్కెట్, ప్రైవేటు రంగం నుంచి అవి మరిన్ని నిధులను తీసుకురాగల సామర్థ్యాలు కలిగి ఉన్నట్టు తెలిపారు. చాలా దేశాలు ఎదుర్కొంటున్న రుణ భారం కూడా తమ అజెండాలో ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వేగంగా రుణ భారాన్ని ఎలా పరిష్కరించుకోగలమన్న దానిపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. శ్రీలంకను ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీలపై సెంట్రల్ బ్యాంకుల నియంత్రణ అవసరాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైతే భారత్ నియంత్రణ విషయంలో తొందర పడడం లేదని చెబుతూ.. ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సంకేతం ఇచ్చారు. ఇది టెక్నాలజీ ఆధారంగా నడిచే కరెన్సీ కనుక దీనిపై నియంత్రణ అవసరమన్నారు. అన్ని దేశాలు ఉమ్మడి వైఖరిని అనుసరించినప్పుడే దీని నియంత్రణ సాధ్యమని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలన్నవి తమ నాలుగో ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విషయంలో భారత్ తన సామర్థ్యాలు ఏంటో చూపించిందన్నారు. -
హైదరాబాద్‌లో ఏ మూలైతే ఏంటి? ఎక్కడా తగ్గేదెలే!
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలు నిర్ణయంలో ధర, ప్రాంతం, వసతులతో పాటు వాస్తు కూడా ప్రధానమైనదే. భారతీయ గృహ కొనుగోలుదారులైతే వాస్తు తర్వాతే మిగతా అంశాలను ఎంపిక చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లలో ఏ దిక్కున ఎంత అభివృద్ధి చెందుతుంది? ఏడాది కాలంలో నగరంలో గృహ కొనుగోళ్ల విలువ, ధరల వృద్ధి తదితర అంశాలపై నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదికను వెలువరించింది. గత నెలలో హైదరాబాద్‌లో రూ. 3,352 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే మార్చిలో నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 6,414 అపార్ట్మెంట్లు రిజిస్టేషన్స్ అయ్యాయి. ఇందులో 53 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే రిజిస్టేషన్స్ కాగా.. 70 శాతం 1,000 నుంచి 2,000 చ.అ. ప్రాపర్టీలే ఉండటం గమనార్హం. పశ్చిమం.. సరఫరా అయిన గృహాల విలువ: 85 వేల కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 7,700 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 19 % టాప్–5 మైక్రో మార్కెట్లు: తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి ఉత్తరం.. సరఫరా అయిన గృహాల విలువ: 26 వేల కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 1,900 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 22 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: కొంపల్లి, సైనిక్‌పురి, పోచారం, బాచుపల్లి, మియాపూర్ (ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?) దక్షిణం.. సరఫరా అయిన గృహాల విలువ: 3,400 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 310 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: రాజేంద్రనగర్, మహేశ్వరం, శంషాబాద్, ఆదిభట్ల, షాద్‌నగర్ తూర్పు.. సరఫరా అయిన గృహాల విలువ: 3,200 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 230 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: ఉప్పల్, ఘట్కేసర్, హబ్సిగూడ, నాగోల్, ఎల్బీనగర్ (ఇదీ చదవండి: భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!) సెంట్రల్.. సరఫరా అయిన గృహాల విలువ: 2,200 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 180 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20% టాప్ 5 మైక్రో మార్కెట్లు: అమీర్‌పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం -
దేశం సుసంపన్నం కావాలంటే..
నా సహోద్యోగులు, స్నేహితులు, దేశవాసులతో పాటు.. తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే భారతదేశం కోసం నేను కల కంటుంటాను. భారత పారిశ్రామిక ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యు డిగా నా మనస్సులో ఏడు సూత్రాల ఎజెండా ఉంది. ఈరోజు మనం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గురించి, నవతరం సంపద సృష్టికర్తల పురోగతి గురించి సంబరంగా మాట్లాడుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా భావనను ఈ స్టార్టప్స్ ముందుకు తీసుకెళతాయి. భారత్‌ను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఈ ఏడు సూత్రాలను పరిశీలిద్దాం. ఒకటి. 2020 సంవ త్సరం గణాంకాలను చూసినట్లయితే మన జనా భాలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్లో 80 శాతం మేరకు 20 శాతం ఆదాయ పన్నుచెల్లింపుదారుల నుంచి వస్తోంది. అంటే అధికాదాయం పొందు తున్న 0.4 శాతం మంది వ్యక్తులు 80 శాతం పన్నులను చెల్లిస్తున్నారు. వీరిని మనం తప్పకుండా గౌరవించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల్లో చాలామంది వేధింపులకు గురవుతున్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 2019లో అధికాదాయం కలిగిన వారిలో 7 వేలమంది విదేశాలకు వలస వెళ్లిపోయారని వార్తలు. ఇలా దేశం విడిచిపెట్టిన వారిలో చాలామంది తమచుట్టూ విషపూరితమైన వాతావరణం, వేధింపుల గురించి మాట్లాడు తున్నారు. అలా దేశాన్ని వదిలి వెళ్లిపోయిన సంపద సృష్టికర్తలందరినీ తిరిగి వెనక్కు తీసుకొచ్చి జాతి ఉన్నతి కోసం వారు పాటుపడేలా ప్రోత్సహించే రోజు కోసం నేను కలగంటున్నాను. 2. పారిశ్రామిక నేతలు తరచుగా ప్రభుత్వంతో తమ సంప్రదింపుల గురించి మాట్లాడుతుంటారు. అయితే పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం కొరవడటం గురించి ఒక సందర్భంలో కూడా వీరు మాట్లాడటం లేదు. అందుకే న్యాయమైన, పార దర్శకమైన వ్యవస్థ కోసం మనందరం ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంది. 3. సులభతర వాణిజ్య సూచికి సంబంధించి తన స్కోరును పెంచుకోవడంలో భారత్ ఎంతో మెరుగైంది. వాణిజ్యవర్గాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రశంసలు అందుకుంటోంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో గొప్ప సానుకూలత ఉంది. ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిబద్ధతను ప్రదర్శించింది. అయితే వాణిజ్య రంగంలో మనం చేయవలసింది ఎంతో ఉంది. 4. నిష్పక్షపాతమైన, న్యాయమైన, సంతోష కరమైన సమాజానికి హామీ ఇచ్చేలా న్యాయ సంస్కరణల దిశగా మనం కృషి చేయవలసిన అవ సరం ఉంది. 5. పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో చాలా రాష్ట్రాలు అమలుపర్చలేదని తాజా నివేదిక తెలి పింది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి. 6. నాణ్య మైన విద్యను మనం మెరుగుపర్చాలి. 2020 జాతీయ విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నాం. శిక్షణ పొందిన, ఉపాధి పొందగల శ్రామిక శక్తికి భరోసా ఇచ్చేలా శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. 7. నేడు భారత్ అవకాశాలు పురివిప్పుతున్న దేశం. నిజంగానే కోవిడ్–19 మహమ్మారి అనిశ్చిత త్వాన్ని పరిష్కరించడంలో మన సామర్థ్యాన్ని పరీ క్షించింది. ఈ విషయంలో మరిన్ని çసృజనాత్మక ఆవిష్కరణలు రావాల్సిన తరుణమిది. దేశం పోకడ గురించి అనేక వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. భేదాభిప్రా యాలు, చీలికలు మనల్ని కలవరపెడుతున్న ప్పుడు త్రివర్ణ పతాకాన్ని మన మనస్సులో ఉంచు కోవలసిన సమయమిది. జాతీయ జెండా కంటే మించిన ఐక్యతా చిహ్నం మరొకటి లేదు. – నవీన్ జిందాల్ చైర్మన్ – జిందాల్ స్టీల్ అండ్ పవర్, మాజీ ఎంపీ -
ఆర్మీ స్వదేశీ వారధి
సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర భారత్ ప్రస్థానంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇంకో ముందడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసింది. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది. లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ కార్యాలయంలో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని మంగళవారం ఆర్మీకి అందజేశారు. డీఆర్డీవో, ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఈ వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్లతో దీన్ని రూపొందించారు. -
కోటిన్నర మందికి పాఠాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, రోగ లక్షణాలు మొదలుకుని చికిత్స దాకా క్షేత్రస్థాయిలో అవగాహన అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతుండగా, మూడో దశకు చేరుకుంటే తలెత్తే పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కరోనా విస్తరిస్తే కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ‘ఈ ప్లాట్పారమ్’ను రూపొందించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఎన్సీసీ, నెహ్రూ యువకేంద్రం, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్‌క్రాస్ సంస్థలకు చెందిన కార్యకర్తలకు ‘ఆన్లైన్ లెర్నింగ్’ విధానంలో పాఠాలు బోధించాలని డీఓపీటీ నిర్ణయించింది. వీరికి ముందస్తు అవగాహన, శిక్షణ ద్వారా అత్యయిక స్థితిని ఎదుర్కోవచ్చని డీఓపీటీ భావిస్తోంది. డీఓపీటీకి చెందిన ‘ఐ గాట్’ వెబ్సైట్లో అంతర్భాగంగా పనిచేసే ‘ఈ ప్లాట్ఫారం’ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి శిక్షణ ఇస్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎవరెవరు ఏయే విధులు నిర్వర్తించాలి అనే అంశంపై సలహాలు, సూచనలకు సంబంధించిన మాడ్యూల్స్ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో సుమారు లక్ష మందికి ఈ తరహా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
దుర్గంచెరువు భాగ్యనగరానికే ఐకాన్
ముచ్చట గొలిపే ప్రకృతి అందాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో చెరువులు కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. దుర్గం చెరువుతోపాటు మరో 14 చెరువులు సరికొత్త రూపు దాల్చనున్నాయి. కార్పొరేట్ కంపెనీల సహకరంతో పలు చెరువులు సుందర తటాకాలుగా మారనున్నాయి. ఆయా చెరువులను ప్రభుత్వం టూరిజం కేంద్రాలుగా మార్చనుంది. గచ్చిబౌలి: దుర్గం చెరువు కొద్ది నెలల్లోనే టూరిజం స్పాట్‌గా మారనుంది. అమెరికాలోని లాస్‌వెగాస్ లేక్ మాదిరిగా వాటర్ ఫ్లోటింగ్ లైట్లతో దుర్గం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రాత్రి సమయంలో కేబుల్ బ్రిడ్జిపై విద్యుత్ కాంతులు వెదజల్లనున్న ఎల్ఈడీ లైట్లకు ఫ్లోటింగ్ లైట్లు తోడుకానున్నాయి. చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు చైనా ఫ్లోటింగ్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. మార్చి నాటికి లైట్లను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చెరువుపై కేబుల్ బ్రిడ్జి, చుట్టూ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, గ్రీనరీ, ఒక వైపు కేబుల్ బ్రిడ్జి, మరో వైపు దుర్గం చెరువు అభివృద్ధితో చెరువును చూసేందుకు ఆసక్తి కనబర్చుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుందర తటాకంగా దుర్గం చెరువు భాగ్యనగరానికే ఐకాన్‌గా మారనుంది. ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారిని అనుకొని ఉన్న ఖాజాగూడలోని పెద్ద చెరువుకు కొత్త హంగులు దిద్దనున్నారు. వెల్స్ ఫార్గో కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సీఎస్ఆర్)లో భాగంగా చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్‌లోని 14 చెరువుల అభివృద్ధి పనులను ఆయా కంపెనీలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల అభివృద్ధికి గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వెయ్యి కోట్ల నిధులను అందించనుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి తెలిపారు. దుర్గం చెరువు చుట్టూ ఫ్లోటింగ్ లైట్లు.. కె.రహేజా కార్పోరేట్ కంపెనీ దుర్గం అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదించడంతో కె.రహేజా గ్రూపు చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు రూ.3.5 కోట్ల విలువైన వాటర్‌లో ఫ్లోటింగ్ లైట్లు, వాటర్ ఫౌంటేన్లు అమర్చనున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన కంపెనీలకు ప్రతిపాదనలు పంపగా రెండు నమునాలను రహేజా గ్రూపుకు పంపారు. మరో రెండు నమూనాలు రావాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే జీహెచ్ఎంసీ అమోదం తెలుపనుంది. ►ఎంట్రెన్స్ ప్లాజా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గ్రీనరీ , ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది. ►చుట్టూ 4 కిలో మీటర్ల పొడవునా 7 మీటర్ల వెడల్పులో‡ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. u రెండు ట్రాక్‌ల మధ్య గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. ►100 మీటర్ల పొడవున స్కై వాక్ రానుంది. ►ఆంపి థియేటర్ రానుంది. పెద్ద చెరువు కొత్త సొబగులు... ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారి నుంచి ఖాజాగూడ వరకు విస్తరించి ఉన్న పెద్ద చెరువును కొత్త హంగులతో తీర్చిదిద్దనున్నారు. వెల్స్ ఫార్గొ కంపెనీ మూడు కోట్లకు పైనే నిధులతో పెద్ద చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. అభివృద్ధి పనులను యునైటెడ్ వేస్ సంస్థకు అప్పగించింది. ఇప్పటికే ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. చెరువు చుట్టు రెండు కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్, అర కిలోమీటరు సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. గ్రీనరీ, ల్యాండ్‌స్కేప్, చిల్డ్రెన్స్ ప్లే ఏరియా, బటర్ ఫ్లై పార్క్, హెర్బల్ గార్డెన్, చెరువులోని నీటిని శుద్ధి చేసేందుకు 5 వేల వెట్లాండ్ మొక్కలు నాటనున్నారు. ఎంట్రెన్స్, ఎగ్జిట్ ప్లాజా, టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. 14 చెరువుల అభివృద్ధి ... ఐటీ కారిడార్‌లోని చెరువులు, కుంటలను అభివృద్ధి చేసేందుకు వివిద కంపెనీలు ముందకు వచ్చాయి. కొన్ని కంపెనీలు చెరువులæఅభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నాయి. దుర్గం చెరువు– కె.రహేజా గ్రూపు, పెద్ద చెరువు–వెల్స్పార్గొ, మల్కం చెరువు–అపర్ణ, బర్లకుంట–జేపి మోర్గాన్, కుడికుంట–పెర్నాడ్ రికార్డ్, మేడికుంట–ఎక్సిగాన్, నల్లగండ్ల చెరువు–అపర్ణ, ప్రగతినగర్ చెరువు– శ్రీశ్రీ ఫౌండేషన్, నిథమ్ చెరువు, ఎల్లమ్మ చెరువులను ఈఎఫ్ఐ అభివృద్ధి చేస్తోంది. కొండాపూర్‌లోని రంగన్న కుంటతో పాటు మరో మూడు చెరువులను అభివృద్ధి చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. చెరువుల అభివృద్ధికి వెయ్యి కోట్లు... వివిధ చెరువుల అభివృద్ధికి దక్షిణి కొరియాలోని గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వెయ్యి కోట్ల నిధులు అందించనుంది. జీహెచ్ఎంసీకి రెండు విడతలుగా రూ.400 కోట్లు , హెచ్ఎండీఏకు రూ.600 కోట్లు ఇవ్వనున్నారు. ఇలా 14 చెరువులను అభివృద్ధి చేయనున్నాం. – హరిచందన దాసరి, అడిషనల్ కమిషనర్, వెస్ట్ జోనల్ కమిషనర్ -
‘మినీ’ని సుందరంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి పెద్దచెరువు మినీట్యాంక్‌బండ్‌పై అందమైన మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతామని డీపీఓ హనూక్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిని దత్తత తీసుకున్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్స్ సుజీంద్ర, దిలీప్‌దాస్‌తో కలిసి డీపీఓ హనూక్ మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలమేరకు ఎంఎస్ అగర్వాల్ కంపెనీ మండలాన్ని దత్తత తీసుకుందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు కౌడిపల్లి గ్రామంలో మొక్కలు నాటడంతోపాటు వాటికి రక్షణ కల్పిస్తుందన్నారు. ట్యాంక్‌బండ్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగా మొక్కలు సైతం పెంచనున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టి నీరు పోయడంతో పాటు కాపలా ఏర్పాటు చేస్తామన్నారు. కట్టపై అందంగా మొక్కల పెంపకం.. కట్టపై అందంగా కనిపించే పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు పెద్దగా పెరిగే వివిధ రకాల మొక్కలను నాటుతామని తెలిపారు. అనంతరం ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ప్రతినిధి సుజీంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ట్యాంక్‌బండ్‌నూ పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు సూచనలు ఖర్చు అంచనాలను కంపెనీకి సమర్పించిన అనంతరం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటిలింగం, ఏపీఓ శ్యాంకుమార్, ఈసీ ప్రేంకుమార్, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పిశ్కె శెట్టయ్య, చంద్రం దుర్గాగౌడ్ పాల్గొన్నారు. -
అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్
చిట్యాల (నకిరేకల్) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ అమలు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే తెలంగాణ.. అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతోందని తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడులో దశమి ల్యాబ్స్ పరిశ్రమ యజమాన్యం ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను గురువారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం గుండ్రాంపలిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్ల కాలంలోనే రూ.రెండు వేల కోట్లతో ఆభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గుండ్రాంపల్లి గ్రామంలో మరో 150 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని, కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆయా కార్యక్రమాల్లో జేసీ నారాయణరెడ్డి ,ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ బట్టు అరుణ అయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ రాచకొండ లావణ్య క్రిష్టయ్య, తహసీల్దార్ సీహెచ్.విశాలాక్షి, ఎంపీడీఓ జి.కాంతమ్మ, ఈఓపీఆర్డీ బి.లాజర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఎద్దులపురి క్రిష్ణ, గుండెబోయిన సైదులు, బెల్లి సత్తయ్య, బక్క శేఖర్, గోలి మహేష్, బైకాని నాగరాజు, బోడిగె అంజయ్య, నర్సింహ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి నార్కట్‌పల్లి (నకిరేకల్) : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బి.వెల్లెంలలో రూ.5కోట్లతో డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.రాష్ట్రంలో నేటి వరకు 2లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రూ.700కోట్లతో ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. రూ.30కోట్లతో ప్రతి జిల్లాలో మత్సకార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బి.వెల్లెంల ఉదయ సముద్రంప్రాజెక్టు రెండు నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నార్కట్‌పల్లి మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. -
త్రీడీ ఎముకల కణజాలం!
లండన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీ–డైమెన్ష నల్ (త్రీడీ) ఎముకల కణజాలాలను ప్రయోగశాలలో శాస్త్ర వేత్తలు అభివృద్ధి చేశారు. దెబ్బతిన్న, విరిగిన ఎముకలకు చికిత్స చేయడానికి ఈ కణజాలాల్ని వినియోగిస్తారని పరిశోధకులు తెలిపారు. బ్రిటన్‌లోని గ్లాస్గో యూనివర్సిటీ, స్ట్రాథ్క్లైడ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీటిని అభివృద్ధి చేశారు. ‘ప్రస్తుతం అభివృద్ధి చేసిన విధానంతో అత్యంత సులువుగా ఎముకలకు చికిత్స నిర్వహించవచ్చు. ఎముకలకు పగుళ్లు, విరగడం వంటివి జరిగినపుడు ఈ త్రీడీ ఎముకల కణజాలాలను మానవుడి దేహంలోకి పంపించాల్సి ఉంటుం ది. ఈ కణజాలలు ఎముకల్లో దెబ్బతిన్న భాగాలను, పగుళ్లను నయం చేసి సాధారణ స్థితికి తీసుకువస్తాయి’ అని పరిశోధకుడు మాథ్యూ వివరించారు. -
ఘాజీపూర్‌లో మనోజ్ సిన్హ పనితనం ప్రభావం
-
టూరిజంతో ఉపాధి కోసం సరికొత్త యాప్
-
టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం
–ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి –5 కేటగిరీల్లో విజేతలకు బహుమతి ప్రదానం –ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడకు ప్రాచుర్యం తీసువచ్చేందుకు తనవంతు కషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టేబుల్ టెన్నిస్ ఆడేందుకు అనుగుణంగా నాలుగు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపారన్నారు. జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మరింత నైపుణ్యం చాటుకునే విధంగా జిల్లా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, టోర్నీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్గార్గె, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాము, చీఫ్ రిఫరీ లక్ష్మీకాంత్, డీఎస్డీఓ బి.కబీర్దాస్, టీఎన్జీఓస్ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, సాంబమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విజేతలు... సబ్‌జూనియర్ గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు బాలుర ఫైనల్స్‌లో బి.వరుణ్శంకర్–కెశవన్కన్నన్పై 11–8, 11–9, 13–11, 12–4, 11–5, జూనియర్ బాలురలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–11–6, 7–11, 11–4, 11–9, 11–6 పాయింట్ల తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. యూత్ బాలుర ఫైనల్స్‌లో హర్ష వి.లాహోటి–హరికష్ణ పై 7–11, 11–9, 11–7, 11–9, 4–11, 11–4 తేడాతో నెగ్గి విజేతగా నిలిచాడు. ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–చంద్రచూడ్ పై 13–11, 8–11, 11–9, 10–12, 12–10, 9–1, 11–7 తేడాతో గెలుపొందాడు. బాలికల విజేతలు : సబ్‌జూనియర్ బాలికల ఫైనల్స్‌లో అయేష్–కీర్తన 11–7, 11–3, 11–9, 11–2 తేడాతో నెగ్గింది. జూనియర్ బాలికల ఫైనల్స్‌లో లాస్య –సస్యాపై 11–9, 11–8, 11–7, 9–1, 4–11, 11–5 తేడాతో గెలిచింది. యూత్ బాలికల విభాగంలో అకుల శ్రీజ–ఆయుష్‌పై 11–8, 11–9, 11–9, 11–9 తేడాతో గెలుపొందింది. మహిళల ఫైనల్స్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ భట్టుపై 11–8, 10–12, 4–11, 11–8, 11–9, 1–11, 11–8 తేడాతో గెలుపొందింది. 542 : విజేతలకు బహుమతి అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 545 : ఫైనల్స్‌లో తలపడుతున్న పోటీదారులు -
టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం
–ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి –5 కేటగిరీల్లో విజేతలకు బహుమతి ప్రదానం –ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడకు ప్రాచుర్యం తీసువచ్చేందుకు తనవంతు కషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టేబుల్ టెన్నిస్ ఆడేందుకు అనుగుణంగా నాలుగు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపారన్నారు. జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మరింత నైపుణ్యం చాటుకునే విధంగా జిల్లా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, టోర్నీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్గార్గె, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాము, చీఫ్ రిఫరీ లక్ష్మీకాంత్, డీఎస్డీఓ బి.కబీర్దాస్, టీఎన్జీఓస్ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, సాంబమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విజేతలు... సబ్‌జూనియర్ గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు బాలుర ఫైనల్స్‌లో బి.వరుణ్శంకర్–కెశవన్కన్నన్పై 11–8, 11–9, 13–11, 12–4, 11–5, జూనియర్ బాలురలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–11–6, 7–11, 11–4, 11–9, 11–6 పాయింట్ల తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. యూత్ బాలుర ఫైనల్స్‌లో హర్ష వి.లాహోటి–హరికష్ణ పై 7–11, 11–9, 11–7, 11–9, 4–11, 11–4 తేడాతో నెగ్గి విజేతగా నిలిచాడు. ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–చంద్రచూడ్ పై 13–11, 8–11, 11–9, 10–12, 12–10, 9–1, 11–7 తేడాతో గెలుపొందాడు. బాలికల విజేతలు : సబ్‌జూనియర్ బాలికల ఫైనల్స్‌లో అయేష్–కీర్తన 11–7, 11–3, 11–9, 11–2 తేడాతో నెగ్గింది. జూనియర్ బాలికల ఫైనల్స్‌లో లాస్య –సస్యాపై 11–9, 11–8, 11–7, 9–1, 4–11, 11–5 తేడాతో గెలిచింది. యూత్ బాలికల విభాగంలో అకుల శ్రీజ–ఆయుష్‌పై 11–8, 11–9, 11–9, 11–9 తేడాతో గెలుపొందింది. మహిళల ఫైనల్స్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ భట్టుపై 11–8, 10–12, 4–11, 11–8, 11–9, 1–11, 11–8 తేడాతో గెలుపొందింది. 542 : విజేతలకు బహుమతి అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 545 : ఫైనల్స్‌లో తలపడుతున్న పోటీదారులు -
పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం
–ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది –మంత్రి జగదీశ్‌రెడ్డి –టీఎన్జీఓ భవన్లో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని టీఎన్జీఓ భవన్లో ఆడిటోరియం భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎల్లవేళలా వారికి అండగా ఉంటామన్నారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత తొందరగా అభివృద్ధి చెందలేదన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రెండున్నరేళ్లలోనే అభివృద్ధి సాధించి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. అందుకు ఉద్యోగులు చేసిన కృషి కూడా ఎనలేనిదన్నారు. అంతేకాకుండా ఉద్యమకాలంలో ఉద్యోగులు చూపిన తెగువ మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, టీఎన్జీఓ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ దేవిప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హమీద్,జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి , ప్రధాన కార్యదర్శి ఏడుదొడ్ల వెంకట్రాంరెడ్డి, కోశాధికారి శ్రవన్‌కుమార్, ఉపాధ్యక్షుడు చేపూరి నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు ఖమ్మం రూరల్: వైఎస్సార్సీపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు పేర్కొన్నారు. శనివారం మండలంలోని గుదమిళ్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని, వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్ట్‌ల పేర్లు మార్చి రీడిజైన్ చేయడం సరైంది కాదన్నారు. రైతుల కోసం ఒకే దఫా రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా వైఎస్ఆర్ నిలిచారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపూ ఇతర పార్టీల నుంచి ఎవరిని చేర్చుకోవాలనే ధ్యాస తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన చేయడంలేదని, ఒక్క సభ్యులు ఉన్న వారి రేషన్ కార్డులను తొలగించడానికి కుట్ర పన్నుతోందని విమర్శించారు. రెతులకు మూడో విడత రుణమాఫీ సొమ్ము ఇంతవరకు బ్యాంక్‌లకు జమచేయకపోవడంతో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం నానా అవస్థలు పడుతున్నారని, విధిలేని పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పుచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, అయినా ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలనే ధ్యాసేలేదన్నారు. రాబోవుకాలంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎండపల్లి వెంకయ్య, చల్లా హనుమంతు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి క్రిష్ణ, పెనుగొండ వెంకటేశ్వర్లు, చేకూరి సైదులు, తమ్మిశెట్టి బాబు, చల్లా సాంబశివరావు, చల్లా లక్ష్మా, నాగయ్య, వీరబాబు, గోపి, ఉపేందర్, మోహన్‌రావు, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇక బట్టలు ఉతకక్కర్లేదట!
మురికి పట్టిన బట్టలు ఉతికి ఉతికి అలసిపోయారా? ఈ మరక పోయేదెలా అని బెంగపడుతున్నారా? ఇక ఆ అలసటకు, బెంగలకు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చని అంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. భారతీయ సంతతికి చెందిన పరిశోధకుడు రాజేష్ రామనాథన్, దిపేష్ కుమార్, విపుల్ బన్సల్ సహా పరిశోధక బృందం ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికింది. అతి తక్కువ ఖర్చుతో, అతి సునాయసంగా దుస్తులు శుభ్రం చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశామంటున్నారు. వాటంతట అవే శుభ్రం అయ్యే దుస్తులు తొందర్లోనే వచ్చేస్తున్నాయ్! కేవలం కొన్నినిమిషాల పాటు సూర్యకాంతి, లేదా బల్బ్ కాంతి కింద ఉంచడం ద్వారా వస్త్రాలు శుభ్రమయ్యే పద్ధతిని కనుగొన్నామని చెప్పారు. నానో స్ట్రక్చర్లు ఉన్న దుస్తులను కాంతికింద ఉంచినపుడు, అందులోని సేంద్రియ పదార్థాలు క్షీణిస్తాయని, ఫలితంగా కొన్ని నిమిషాల్లోనే బట్టలు వాటికవే శుభ్రపడతాయన్నారు. తమ పరిశోధనలో భాగంగా కాంతికి ఆకర్షించే వెండి, రాగికి సంబంధించిన నానో స్ట్రక్చర్లను పరిశీలించినట్టు చెప్పారు. తాము రూపొందించిన టెక్నాలజీ ప్రకారం కాంతిని స్వీకరించిన నానో స్ట్రక్చర్లు హాట్ ఎలక్ట్రాన్లను క్రియేట్ చేస్తాయి. తద్వారా మరింత శక్తి జనించి, సేంద్రియ పదార్థాన్ని కీణింపజేస్తాయి. దీంతో ఆరు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే వాటంతట అవే బట్టలు శుభ్రమవుతాయని పరిశోధనలో తేలిందన్నారు. తమ ఈ పరిశోధన నానో ఎన్హాన్స్డ్ వస్త్రాల తయారీకి మార్గం సుగమం చేస్తుందన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నామని, పారిశ్రామిక స్థాయిలో ఈ టెక్నాలజీని విస్తరింపచేస్తే భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని వారు తెలిపారు. టమాటా సాస్, వైన్ లాంటి వాటివల్ల ఏర్పడే మరకల్ని కూడా సాధ్యమైనంత త్వరగా శుభ్రం చేసే దిశగా తమ పరిశోధన సాగుతోందని, అది ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. తమ పరిశోధన పత్రం 'అడ్వాన్స్ డ్ మెటీరియల్స్ ఇంటర్ ఫేసెస్ ' అనే జర్నల్ లో పబ్లిష్ అయిందని తెలిపారు. -
'ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ఎదగాలి'
గూడూరు: ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని పీవీఆర్ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వంశంలో పుట్టిన మనం వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవాలన్నారు. నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందుకు తన వంతు సాయం కూడా అందజేస్తానని మంత్రి తెలిపారు. ఆర్యవైశ్యుల అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న కార్యక్రమంలో ఆర్యవైశ్యులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఎదో ఒక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన అన్నారు. -
హైదరాబాద్‌లో జోరందుకున్న క్యాబ్స్
-
అభివృద్ధికి పట్టం కట్టండి : జానారెడ్డి
గుర్రంపోడు, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండని కాంగ్రెస్ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి కోరారు. గురువారం మండలంలోని మొసంగి, చేపూరు, తా నేదార్పల్లి, జూనూతుల, మక్కపల్లి, సుల్తాన్పురం, ఉట్లపల్లి, పోచంపల్లి, తేనపల్లి, కొప్పోలు, గుర్రం పోడు, పాల్వాయి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. 30 ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించానని తెలిపారు. శ్రీశైలం ఎడుమగట్టు కాల్వకు పునాది వేసింది, మండల వ్యవస్థకు ఆధ్యున్ని తానేనని పేర్కొన్నారు. ఊరు, వాడా తెలి యని వాళ్లు కులం పేరుతోనో, మరో రకంగానో ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జానారెడ్డికి కులం, మతం లేదని ప్రజలందరి మనిషినని అన్నారు. తెలంగాణా పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోరతను అధిగమించేందుకు నాలుగు వేల కోట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సోని యా, రాహూల్ హామీ ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని, తొమ్మిదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో జరిగిన జెండావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు రెండు వందల మంది ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గంగారెడ్డి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టకుండా ఇరు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పిందన్నారు. బిల్లుకు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ఎన్నో ఏళ్లుగా తెలియజేస్తున్నామన్నారు. ప్రజలకు, రైతులకు అందించాల్సిన రాయితీలను అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వంపై వారు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తును అందజేస్తామని హామీలిచ్చి ప్రస్తుతం విద్యుత్తు కోతలతో వారిని ఇబ్బందులను గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం పూర్తిగా స్కాంలు, అవినీతిమయంగా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో దేశాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి నాయకులు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పేరుతో మరోమారు రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేసే విధంగా ప్రకటనలు ఇస్తుందన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ ప్రాంతంలో చిచ్చు రగిల్చిన యూపీఏ ప్రభుత్వం ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో చిచ్చు పెట్టిందన్నారు.