
పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం
–ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
–మంత్రి జగదీశ్‌రెడ్డి
–టీఎన్‌జీఓ భవన్‌లో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని టీఎన్‌జీఓ భవన్‌లో ఆడిటోరియం భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎల్లవేళలా వారికి అండగా ఉంటామన్నారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత తొందరగా అభివృద్ధి చెందలేదన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రెండున్నరేళ్లలోనే అభివృద్ధి సాధించి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. అందుకు ఉద్యోగులు చేసిన కృషి కూడా ఎనలేనిదన్నారు. అంతేకాకుండా ఉద్యమకాలంలో ఉద్యోగులు చూపిన తెగువ మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, టీఎన్‌జీఓ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ దేవిప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హమీద్,జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి , ప్రధాన కార్యదర్శి ఏడుదొడ్ల వెంకట్రాంరెడ్డి, కోశాధికారి శ్రవన్‌కుమార్, ఉపాధ్యక్షుడు చేపూరి నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.