టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం | we developed table tennice | Sakshi
Sakshi News home page

టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం

Published Mon, Sep 19 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం

టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం

  • –ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
  • –5 కేటగిరీల్లో విజేతలకు బహుమతి ప్రదానం 
  • –ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు
  • ఖమ్మం స్పోర్ట్స్‌ : జిల్లాలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడకు ప్రాచుర్యం తీసువచ్చేందుకు తనవంతు కషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టేబుల్‌ టెన్నిస్‌ ఆడేందుకు అనుగుణంగా నాలుగు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపారన్నారు. జిల్లాలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారులు మరింత నైపుణ్యం చాటుకునే విధంగా జిల్లా అసోసియేషన్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, టోర్నీ ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌గార్గె, గ్లోబల్‌ టేబుల్‌ టెన్నిస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాము, చీఫ్‌ రిఫరీ లక్ష్మీకాంత్, డీఎస్డీఓ బి.కబీర్‌దాస్, టీఎన్జీఓస్‌ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్పొరేటర్‌ దోరెపల్లి శ్వేత, సాంబమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
    • బాలుర విజేతలు...
    సబ్‌జూనియర్‌ గ్లోబల్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీకి చెందిన క్రీడాకారులు బాలుర ఫైనల్స్‌లో బి.వరుణ్‌శంకర్‌–కెశవన్‌కన్నన్‌పై 11–8, 11–9, 13–11, 12–4, 11–5, జూనియర్‌ బాలురలో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌–11–6, 7–11, 11–4, 11–9, 11–6 పాయింట్ల తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. యూత్‌ బాలుర ఫైనల్స్‌లో హర్ష వి.లాహోటి–హరికష్ణ పై 7–11, 11–9, 11–7, 11–9, 4–11, 11–4 తేడాతో నెగ్గి విజేతగా నిలిచాడు. ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌–చంద్రచూడ్‌ పై 13–11, 8–11, 11–9, 10–12, 12–10, 9–1, 11–7 తేడాతో గెలుపొందాడు.
    • బాలికల విజేతలు : 
    సబ్‌జూనియర్‌ బాలికల ఫైనల్స్‌లో అయేష్‌–కీర్తన 11–7, 11–3, 11–9, 11–2 తేడాతో నెగ్గింది. జూనియర్‌ బాలికల ఫైనల్స్‌లో లాస్య –సస్యాపై 11–9, 11–8, 11–7, 9–1, 4–11, 11–5 తేడాతో గెలిచింది. యూత్‌ బాలికల విభాగంలో అకుల శ్రీజ–ఆయుష్‌పై 11–8, 11–9, 11–9, 11–9 తేడాతో గెలుపొందింది. మహిళల ఫైనల్స్‌లో ఆకుల శ్రీజ–నిఖత్‌ భట్టుపై 11–8, 10–12, 4–11, 11–8, 11–9, 1–11, 11–8 తేడాతో గెలుపొందింది. 
     
    542 : విజేతలకు బహుమతి అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
    545 : ఫైనల్స్‌లో తలపడుతున్న పోటీదారులు 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement