tennice
-
ఆగస్టు వినోదం
కబడ్డీ కూత, యాషెస్ సిరీస్, కరీబియన్ క్రికెట్‌తో ఆగస్టు ‘మస్తు మజా’ అందించనుంది. పనిలో పనిగా హైదరాబాద్‌లో షటిల్ రాకెట్లు సమరాన్ని చూపించనున్నాయి. గత నెలలో మొదలైన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ఈ ఆగస్టులో ఆరు నగరాల్లో కూతపెడతాయి. యాషెస్ సిరీస్‌తో పాటు, విండీస్‌లో భారత్ పర్యటన క్రికెట్ పంట పండించనుంది. ఏస్‌లతో యూఎస్ ఓపెన్, కార్ల స్పీడ్‌తో హంగేరి గ్రాండ్‌ప్రి ‘రయ్ రయ్’మనిపిస్తుంది. అలా ఈ ఆగస్టు ఆటలతో ‘అటెస్ట్’ అయిపోయింది. క్రికెట్ వెస్టిండీస్‌లో భారత్ పర్యటన తొలి టి20: ఆగస్టు 3 రెండో టి20: ఆగస్టు 4 మూడో టి20: ఆగస్టు 6 తొలి వన్డే: ఆగస్టు 8 రెండో వన్డే: ఆగస్టు 11 మూడో వన్డే: ఆగస్టు 14 తొలి టెస్టు: ఆగస్టు 22–26 రెండో టెస్టు: ఆగస్టు 30–సెప్టెంబరు 3 బ్యాడ్మింటన్ ఆగస్టు 6–11: హైదరాబాద్ ఓపెన్ టోర్నీ ఆగస్టు 19–25: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (స్విట్జర్లాండ్) షూటింగ్ ఆగస్టు 15–22: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (ఫిన్లాండ్) ఆగస్టు 28–సెప్టెంబర్ 2: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ టోర్నీ (రియో డి జనీరో) ఫార్ములావన్ ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ప్రి యాషెస్ సిరీస్ తొలి టెస్టు: ఆగస్టు 1–5 బర్మింగ్‌హామ్ రెండో టెస్టు: ఆగస్టు 14–18 లార్డ్స్ మూడో టెస్టు: ఆగస్టు 22–26 లీడ్స్ న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటన తొలి టెస్టు: ఆగస్టు 14–18 రెండో టెస్టు: ఆగస్టు 22–26 తొలి టి20: ఆగస్టు 31 టెన్నిస్ ఆగస్టు 26–సెప్టెంబర్ 8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రెజ్లింగ్ ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (ఎస్తోనియా) ప్రొ కబడ్డీ లీగ్–7 సీజన్ మ్యాచ్‌లు ఆగస్టు 2–31 చెస్ ఆగస్టు 15–19: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ (బెలారస్) ఆగస్టు 20–సెప్టెంబర్ 2: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) చాంపియన్‌షిప్ (చైనా) హాకీ ఆగస్టు 17–21: టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ హాకీ టోర్నీ – సాక్షి క్రీడావిభాగం -
ఫెడరర్ శుభారంభం
లండన్: రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్‌పై దృష్టి పెట్టిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన ‘బోరిస్ బెకర్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 7–6 (7/4)తో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతోన్న జాక్ సోక్ (అమెరికా)పై గెలుపొందాడు. గంటా 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సెట్లో ఒకసారి జాక్ సోక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ రెండో సెట్లో టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫెడరర్‌కిది 50వ విజయం కావడం విశేషం. -
టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం
–ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి –5 కేటగిరీల్లో విజేతలకు బహుమతి ప్రదానం –ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడకు ప్రాచుర్యం తీసువచ్చేందుకు తనవంతు కషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టేబుల్ టెన్నిస్ ఆడేందుకు అనుగుణంగా నాలుగు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపారన్నారు. జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మరింత నైపుణ్యం చాటుకునే విధంగా జిల్లా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, టోర్నీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్గార్గె, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాము, చీఫ్ రిఫరీ లక్ష్మీకాంత్, డీఎస్డీఓ బి.కబీర్దాస్, టీఎన్జీఓస్ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, సాంబమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విజేతలు... సబ్‌జూనియర్ గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు బాలుర ఫైనల్స్‌లో బి.వరుణ్శంకర్–కెశవన్కన్నన్పై 11–8, 11–9, 13–11, 12–4, 11–5, జూనియర్ బాలురలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–11–6, 7–11, 11–4, 11–9, 11–6 పాయింట్ల తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. యూత్ బాలుర ఫైనల్స్‌లో హర్ష వి.లాహోటి–హరికష్ణ పై 7–11, 11–9, 11–7, 11–9, 4–11, 11–4 తేడాతో నెగ్గి విజేతగా నిలిచాడు. ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–చంద్రచూడ్ పై 13–11, 8–11, 11–9, 10–12, 12–10, 9–1, 11–7 తేడాతో గెలుపొందాడు. బాలికల విజేతలు : సబ్‌జూనియర్ బాలికల ఫైనల్స్‌లో అయేష్–కీర్తన 11–7, 11–3, 11–9, 11–2 తేడాతో నెగ్గింది. జూనియర్ బాలికల ఫైనల్స్‌లో లాస్య –సస్యాపై 11–9, 11–8, 11–7, 9–1, 4–11, 11–5 తేడాతో గెలిచింది. యూత్ బాలికల విభాగంలో అకుల శ్రీజ–ఆయుష్‌పై 11–8, 11–9, 11–9, 11–9 తేడాతో గెలుపొందింది. మహిళల ఫైనల్స్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ భట్టుపై 11–8, 10–12, 4–11, 11–8, 11–9, 1–11, 11–8 తేడాతో గెలుపొందింది. 542 : విజేతలకు బహుమతి అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 545 : ఫైనల్స్‌లో తలపడుతున్న పోటీదారులు -
టీటీ క్రీడకు ప్రాచుర్యం తీసుకువస్తాం
–ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి –5 కేటగిరీల్లో విజేతలకు బహుమతి ప్రదానం –ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడకు ప్రాచుర్యం తీసువచ్చేందుకు తనవంతు కషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టేబుల్ టెన్నిస్ ఆడేందుకు అనుగుణంగా నాలుగు బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపారన్నారు. జిల్లాలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మరింత నైపుణ్యం చాటుకునే విధంగా జిల్లా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి ప్రకాష్‌రాజు, టోర్నీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్గార్గె, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాము, చీఫ్ రిఫరీ లక్ష్మీకాంత్, డీఎస్డీఓ బి.కబీర్దాస్, టీఎన్జీఓస్ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, సాంబమూర్తి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విజేతలు... సబ్‌జూనియర్ గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు బాలుర ఫైనల్స్‌లో బి.వరుణ్శంకర్–కెశవన్కన్నన్పై 11–8, 11–9, 13–11, 12–4, 11–5, జూనియర్ బాలురలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–11–6, 7–11, 11–4, 11–9, 11–6 పాయింట్ల తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. యూత్ బాలుర ఫైనల్స్‌లో హర్ష వి.లాహోటి–హరికష్ణ పై 7–11, 11–9, 11–7, 11–9, 4–11, 11–4 తేడాతో నెగ్గి విజేతగా నిలిచాడు. ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్–చంద్రచూడ్ పై 13–11, 8–11, 11–9, 10–12, 12–10, 9–1, 11–7 తేడాతో గెలుపొందాడు. బాలికల విజేతలు : సబ్‌జూనియర్ బాలికల ఫైనల్స్‌లో అయేష్–కీర్తన 11–7, 11–3, 11–9, 11–2 తేడాతో నెగ్గింది. జూనియర్ బాలికల ఫైనల్స్‌లో లాస్య –సస్యాపై 11–9, 11–8, 11–7, 9–1, 4–11, 11–5 తేడాతో గెలిచింది. యూత్ బాలికల విభాగంలో అకుల శ్రీజ–ఆయుష్‌పై 11–8, 11–9, 11–9, 11–9 తేడాతో గెలుపొందింది. మహిళల ఫైనల్స్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ భట్టుపై 11–8, 10–12, 4–11, 11–8, 11–9, 1–11, 11–8 తేడాతో గెలుపొందింది. 542 : విజేతలకు బహుమతి అందజేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 545 : ఫైనల్స్‌లో తలపడుతున్న పోటీదారులు