నా సహోద్యోగులు, స్నేహితులు, దేశవాసులతో పాటు.. తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే భారతదేశం కోసం నేను కల కంటుంటాను. భారత పారిశ్రామిక ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యు డిగా నా మనస్సులో ఏడు సూత్రాల ఎజెండా ఉంది. ఈరోజు మనం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గురించి, నవతరం సంపద సృష్టికర్తల పురోగతి గురించి సంబరంగా మాట్లాడుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా భావనను ఈ స్టార్టప్స్ ముందుకు తీసుకెళతాయి.
భారత్‌ను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఈ ఏడు సూత్రాలను పరిశీలిద్దాం. ఒకటి. 2020 సంవ త్సరం గణాంకాలను చూసినట్లయితే మన జనా భాలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్లో 80 శాతం మేరకు 20 శాతం ఆదాయ పన్నుచెల్లింపుదారుల నుంచి వస్తోంది. అంటే అధికాదాయం పొందు తున్న 0.4 శాతం మంది వ్యక్తులు 80 శాతం పన్నులను చెల్లిస్తున్నారు.
వీరిని మనం తప్పకుండా గౌరవించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల్లో చాలామంది వేధింపులకు గురవుతున్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 2019లో అధికాదాయం కలిగిన వారిలో 7 వేలమంది విదేశాలకు వలస వెళ్లిపోయారని వార్తలు. ఇలా దేశం విడిచిపెట్టిన వారిలో చాలామంది తమచుట్టూ విషపూరితమైన వాతావరణం, వేధింపుల గురించి మాట్లాడు తున్నారు. అలా దేశాన్ని వదిలి వెళ్లిపోయిన సంపద సృష్టికర్తలందరినీ తిరిగి వెనక్కు తీసుకొచ్చి జాతి ఉన్నతి కోసం వారు పాటుపడేలా ప్రోత్సహించే రోజు కోసం నేను కలగంటున్నాను.
2. పారిశ్రామిక నేతలు తరచుగా ప్రభుత్వంతో తమ సంప్రదింపుల గురించి మాట్లాడుతుంటారు. అయితే పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం కొరవడటం గురించి ఒక సందర్భంలో కూడా వీరు మాట్లాడటం లేదు. అందుకే న్యాయమైన, పార దర్శకమైన వ్యవస్థ కోసం మనందరం ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంది.
3. సులభతర వాణిజ్య సూచికి సంబంధించి తన స్కోరును పెంచుకోవడంలో భారత్ ఎంతో మెరుగైంది. వాణిజ్యవర్గాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రశంసలు అందుకుంటోంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో గొప్ప సానుకూలత ఉంది. ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిబద్ధతను ప్రదర్శించింది. అయితే వాణిజ్య రంగంలో మనం చేయవలసింది ఎంతో ఉంది.
4. నిష్పక్షపాతమైన, న్యాయమైన, సంతోష కరమైన సమాజానికి హామీ ఇచ్చేలా న్యాయ సంస్కరణల దిశగా మనం కృషి చేయవలసిన అవ సరం ఉంది. 5. పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో చాలా రాష్ట్రాలు అమలుపర్చలేదని తాజా నివేదిక తెలి పింది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి. 6. నాణ్య మైన విద్యను మనం మెరుగుపర్చాలి. 2020 జాతీయ విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నాం. శిక్షణ పొందిన, ఉపాధి పొందగల శ్రామిక శక్తికి భరోసా ఇచ్చేలా శిక్షణ సంస్థలను నెలకొల్పాలి.
7. నేడు భారత్ అవకాశాలు పురివిప్పుతున్న దేశం. నిజంగానే కోవిడ్–19 మహమ్మారి అనిశ్చిత త్వాన్ని పరిష్కరించడంలో మన సామర్థ్యాన్ని పరీ క్షించింది. ఈ విషయంలో మరిన్ని çసృజనాత్మక ఆవిష్కరణలు రావాల్సిన తరుణమిది. దేశం పోకడ గురించి అనేక వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. భేదాభిప్రా యాలు, చీలికలు మనల్ని కలవరపెడుతున్న ప్పుడు త్రివర్ణ పతాకాన్ని మన మనస్సులో ఉంచు కోవలసిన సమయమిది. జాతీయ జెండా కంటే మించిన ఐక్యతా చిహ్నం మరొకటి లేదు.
– నవీన్ జిందాల్
చైర్మన్ – జిందాల్ స్టీల్ అండ్ పవర్, మాజీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment