Naveen Jindal
-
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ చైర్మన్ అయిన నవీన్ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్ బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్తక్ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్ సింగ్ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల ‘కురుక్షేత్రం’.. మూటలు మోసిన కుబేరుడు!
Naveen Jindal: ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆకట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అపర కుబేరుడు, జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారారు. 2004, 2009 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కొద్దిరోజుల కిందటే కాషాయ కండువా కప్పుకొన్న నవీన్ జిందాల్ అదే కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్‌తో రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ జిందాల్.. స్థానిక మార్కెట్ యార్డులో మూటలు మోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 50 కేజీల గోధుమ మూటను ఎత్తుకుని లారీలోకి లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. హర్యానాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఆరో విడతలో అంటే మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయడానికి అటు ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష కూటమి పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. हरियाणा के किसान, देश की जान...🙏 pic.twitter.com/WNdJZduS1P — Naveen Jindal (@MPNaveenJindal) April 17, 2024 -
Lok sabha elections 2024: కంగనా రనౌత్, నవీన్ జిందాల్‌కు బీజేపీ టికెట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో 111 మంది అభ్యర్థులతో అధికార బీజేపీ ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. కేంద్ర మంత్రి అశి్వనీకుమార్ చౌబే, ఎంపీ వరుణ్ గాం«దీకి ఈసారి టికెట్లు నిరాకరించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ అభ్యర్థిత్వం ఖరారయ్యింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబాల్పూర్ నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పూరీ నుంచి పోటీ చేయబోతున్నారు. సీనియర్ నేత మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి, పిలిభిత్ నియోజకవర్గంలో వరుణ్ గాంధీ స్థానంలో ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద, ఇటీవల బీజేపీలో చేసిన సీతా సోరెన్ జార్ఖండ్‌లోని దుమ్కా స్థానం నుంచి పోటీకి దిగబోతున్నారు. టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర ధరించిన అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. ఆదివారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హరియాణాలోని కురు క్షేత్ర నుంచి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ బందోపాధ్యాయ పశ్చిమ బెంగాల్‌లోని తమ్లూక్ నుంచి పోటీ చేయబోతున్నారు. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీకి దిగబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డేకు ఈసారి అవకాశం కలి్పంచలేదు. తన అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేయడం పట్ల బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఆదివారం చెప్పారు. ఆమె తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేయబోతున్నారు. బీజేపీలో చేరడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బీజేపీలో చేరిన స్టీల్ టైకూన్.. గంటల్లోనే టికెట్!
పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. అలా చేరారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు బీజేపీ టికెట్ ప్రకటించింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. అంతకుముందు రోజు నవీన్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను పదేళ్లు కురుక్షేత్ర నుంచి ఎంపీగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నాను’ అన్నారు. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. పార్టీతో జిందాల్ అనుబంధం దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళుతుందన్నారు. దేశంలోని ప్రముఖ జిందాల్ స్టీల్ & పవర్ (JSP) గ్రూప్‌నకు నవీన్ జిందాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి వ్యవస్థాపక ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. పోలో, స్కీట్ షూటింగ్ వంటి క్రీడల్లో జాతీయ గుర్తింపును సాధించారు. శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి షల్లు జిందాల్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవీన్ జిందాల్ 2004 నుంచి 2014 వరకు కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2014 జాతీయ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజ్ కుమార్ సైనీపై ఓటమిని ఎదుర్కొన్నారు. తదనంతరం 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. -
సీఎం జగన్ పై ప్రశంసలు...
-
విజనరీ సీఎం నేతృత్వంలో ముందడుగు
– నవీన్ జిందాల్, జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి రాష్ట్రం అనుకూలమైంది. విజనరీ లీడర్ షిప్‌తో ప్రోగ్రెసివ్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఇండస్ట్రీస్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూలమైన సింగిల్ విండో విధానాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. జిందాల్ గ్రూప్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లోనూ వృద్ధిలోనూ ఏపీ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 140 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నాం. కృష్ణపట్నం సమీపంలో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేలా స్టీల్‌ప్లాంట్‌కు ఇటీవలే భూమి పూజ చేశాం. ఏపీకి యంగ్, డైనమిక్ లీడర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారు. సీమపురి ఎనర్జీ ప్లాంట్ నుంచి 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందించనున్నాం. కడప స్టీల్‌ప్లాంట్‌కు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ శంకుస్థాపన చేసింది. సోలార్, హైడ్రో, విండ్ పవర్, సిమెంట్ ప్రాజెక్టు ఎంవోయూలు కూడా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్నాం. సమృద్ధిగా వనరులు, అపార అవకాశాలతో ఏపీ స్వర్గధామంలా ఉంది. సీఎం జగన్ నిరంతర శ్రమకు నిదర్శనంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జీడీపీ వృద్ధి రేటులో ఏపీ అగ్రగామిగా ఉండటం శుభపరిణామం. అపార వనరులున్న రాష్ట్రమిది – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ అగ్రగామిగా ఉంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రమిది. వివిధ రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఆంధ్రప్రదేశ్‌లో కొదవలేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాపార, వాణిజ్య రంగాలపై మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నాం. వేగంగా అనుమతులు.. – అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల మంత్రి రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు పుష్కల అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చిన మాదిరిగానే సీఎం నాయకత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రతి పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. -
జిందాల్‌కు బెదిరింపు
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ సెంట్రల్ జైలు ఖైదీ ఒకడు పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెదిరింపు లేఖ రాశాడు. రూ.50 కోట్లను 48 గంటల్లోగా పంపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అందులో హెచ్చరించాడు. ఈ మేరకు గత వారం రాయ్‌గఢ్‌లోని పత్రపాలి గ్రామంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్)కు లేఖ అందింది. దీనిపై కోట్రా రోడ్ పోలీసులు సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. సదరు బెదిరింపు లేఖను బిలాస్పూర్ జైలులోని ఖైదీ పోస్టు ద్వారా పంపినట్లు తేలిందని దర్యాప్తులు పోలీసులు చెప్పారు. -
ప్రవక్తపై కామెంట్లు: మా చైర్మన్‌ను బద్నాం చేయకండి
ముంబై: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వాళ్లలో నూపుర్ శర్మతో పాటు బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి ప్రతీరోజూ మీడియాలో ఆయన పేరు నానుతోంది. అయితే.. కథనాలు రాసే క్రమంలో కొన్ని మీడియా సంస్థలు ముందు వెనుకా ఆలోచించడం లేదు. పొరపాటున ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ పేరును, ఫొటోలను వాడేస్తున్నాయి. కంటెంట్ ట్యాగులు, హ్యాష్‌ట్యాగులను కూడా నవీన్ జిందాల్గానే టైప్ చేస్తున్నాయి. ఈ చేష్టలతో తమ చైర్మన్‌కు ఇబ్బంది కలుగుతోందని జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియాలో నవీన్ కుమార్ జిందాల్ బదులుగా.. నవీన్ జిందాల్ ఫొటోలు ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు కూడా తమ చైర్మన్ సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారని వివరించింది. ఇది ఓ వ్యక్తిని మరో వ్యక్తిగా పొరబడడమేనని, ఇలాంటి చర్యలకు మీడియా దూరంగా ఉండాలని సూచించింది. నవీన్ కుమార్ జిందాల్ కు, తమ బాస్ నవీన్ జిందాల్ కు ఎలాంటి సంబంధంలేదని జిందాల్ స్టీల్స్ స్పష్టం చేసింది. మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. Certain recent developments in public domain involving name of Mr Naveen Kumar Jindal are in no way related to our Group Chairman Mr Naveen Jindal. We urge media not to erroneously use photographs of our chairman while reporting it. This clearly is case of mistaken identity: JSPL pic.twitter.com/XeF1T5LDJe — ANI (@ANI) June 12, 2022 -
విమర్శలు-సమన్లు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు త్రీవస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తుండగా.. ఐవోసీ ఘాటు వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జెడ్డా వేదికగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (IOC) ‘‘భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు తేటతెల్లం అయ్యాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దరిమిలా భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, సంకుచిత భావంతో కూడుకుని ఉన్నాయంటూ వ్యాఖ్యానించారాయన. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. ఐవోసీలో ఇస్లాం ఆధిపత్య దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయన్నది తెలిసిందే. తమది ఇస్లాం ప్రపంచ సంయుక్త గొంతుక అని ప్రకటించుకుంటుంది ఆ వేదిక. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఐవోసీ జోక్యం చేసుకోవడం, ఆ జోక్యాన్ని భారత్ ఖండిస్తూ వస్తుండడం జరుగుతోంది. తాజాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఐవోసీకి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. దూషణపూరితమైన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసినవని, అది భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు బాగ్చీ. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్‌లపై తొలగింపు వేటు కూడా పడిందన్న విషయాన్ని బాగ్చీ గుర్తు చేస్తున్నారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. టీవీ డిబెట్లో బీజేపీ మాజీ ప్రతినిధులు మహమద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ శర్మ కామెంట్లు అవమానకరరీతిలో ఉన్నాయని, అన్ని మతాలను.. విశ్వాసాలను గౌరవించాలని అంటున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాగం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది. మరోవైపు దోహాలోని భారత దౌత్యవేత్తకు అక్కడి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తక్షణ ఖండన, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఖతర్. ఇక కువైట్ కూడా ఖతర్లాగే భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాక్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. దేశంలో వరుసగా జరుగుతున్న మత విద్వేష ఘర్షణలు, జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహమద్ ప్రవక్తను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేసి.. అది విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేసేశారు. ఈ పరిణామాల తర్వాత కాన్పూర్(యూపీ) శుక్రవారం ప్రార్థనల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు. నుపూర్, నవీన్ చేష్టల వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తగా.. బీజేపీ సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. సౌదీ అరేబియా, బహ్రైన్‌తో పాటు మరికొన్ని దేశాలు సైతం భారత ఉత్పత్తులను సూపర్మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. చదవండి: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
దేశం సుసంపన్నం కావాలంటే..
నా సహోద్యోగులు, స్నేహితులు, దేశవాసులతో పాటు.. తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే భారతదేశం కోసం నేను కల కంటుంటాను. భారత పారిశ్రామిక ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యు డిగా నా మనస్సులో ఏడు సూత్రాల ఎజెండా ఉంది. ఈరోజు మనం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గురించి, నవతరం సంపద సృష్టికర్తల పురోగతి గురించి సంబరంగా మాట్లాడుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా భావనను ఈ స్టార్టప్స్ ముందుకు తీసుకెళతాయి. భారత్‌ను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఈ ఏడు సూత్రాలను పరిశీలిద్దాం. ఒకటి. 2020 సంవ త్సరం గణాంకాలను చూసినట్లయితే మన జనా భాలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్లో 80 శాతం మేరకు 20 శాతం ఆదాయ పన్నుచెల్లింపుదారుల నుంచి వస్తోంది. అంటే అధికాదాయం పొందు తున్న 0.4 శాతం మంది వ్యక్తులు 80 శాతం పన్నులను చెల్లిస్తున్నారు. వీరిని మనం తప్పకుండా గౌరవించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల్లో చాలామంది వేధింపులకు గురవుతున్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 2019లో అధికాదాయం కలిగిన వారిలో 7 వేలమంది విదేశాలకు వలస వెళ్లిపోయారని వార్తలు. ఇలా దేశం విడిచిపెట్టిన వారిలో చాలామంది తమచుట్టూ విషపూరితమైన వాతావరణం, వేధింపుల గురించి మాట్లాడు తున్నారు. అలా దేశాన్ని వదిలి వెళ్లిపోయిన సంపద సృష్టికర్తలందరినీ తిరిగి వెనక్కు తీసుకొచ్చి జాతి ఉన్నతి కోసం వారు పాటుపడేలా ప్రోత్సహించే రోజు కోసం నేను కలగంటున్నాను. 2. పారిశ్రామిక నేతలు తరచుగా ప్రభుత్వంతో తమ సంప్రదింపుల గురించి మాట్లాడుతుంటారు. అయితే పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం కొరవడటం గురించి ఒక సందర్భంలో కూడా వీరు మాట్లాడటం లేదు. అందుకే న్యాయమైన, పార దర్శకమైన వ్యవస్థ కోసం మనందరం ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంది. 3. సులభతర వాణిజ్య సూచికి సంబంధించి తన స్కోరును పెంచుకోవడంలో భారత్ ఎంతో మెరుగైంది. వాణిజ్యవర్గాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రశంసలు అందుకుంటోంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో గొప్ప సానుకూలత ఉంది. ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిబద్ధతను ప్రదర్శించింది. అయితే వాణిజ్య రంగంలో మనం చేయవలసింది ఎంతో ఉంది. 4. నిష్పక్షపాతమైన, న్యాయమైన, సంతోష కరమైన సమాజానికి హామీ ఇచ్చేలా న్యాయ సంస్కరణల దిశగా మనం కృషి చేయవలసిన అవ సరం ఉంది. 5. పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో చాలా రాష్ట్రాలు అమలుపర్చలేదని తాజా నివేదిక తెలి పింది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి. 6. నాణ్య మైన విద్యను మనం మెరుగుపర్చాలి. 2020 జాతీయ విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నాం. శిక్షణ పొందిన, ఉపాధి పొందగల శ్రామిక శక్తికి భరోసా ఇచ్చేలా శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. 7. నేడు భారత్ అవకాశాలు పురివిప్పుతున్న దేశం. నిజంగానే కోవిడ్–19 మహమ్మారి అనిశ్చిత త్వాన్ని పరిష్కరించడంలో మన సామర్థ్యాన్ని పరీ క్షించింది. ఈ విషయంలో మరిన్ని çసృజనాత్మక ఆవిష్కరణలు రావాల్సిన తరుణమిది. దేశం పోకడ గురించి అనేక వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. భేదాభిప్రా యాలు, చీలికలు మనల్ని కలవరపెడుతున్న ప్పుడు త్రివర్ణ పతాకాన్ని మన మనస్సులో ఉంచు కోవలసిన సమయమిది. జాతీయ జెండా కంటే మించిన ఐక్యతా చిహ్నం మరొకటి లేదు. – నవీన్ జిందాల్ చైర్మన్ – జిందాల్ స్టీల్ అండ్ పవర్, మాజీ ఎంపీ -
జిందాల్‌పై అభియోగాలు నమోదుచేయండి
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థను ఆదేశించింది. జిందాల్‌తో పాటు మరో నలుగురిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (చీటింగ్), 120–బి (క్రిమినల్ కుట్ర) కింద అభియోగాలు మోపాలని ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాషర్ ఆదేశించారు. జిందాల్‌తోపాటు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సుశీల్ మరూ, మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గోయల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రాంత్ గుజ్రాల్, కంపెనీ అధీకృత ఉద్యోగి డీఎన్ అబ్రోల్‌పై అభియోగాలు మోపారు. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన విషయాన్ని కోర్టు విచారించింది. నిందితులపై అభియోగాలను అధికారికంగా ప్రకటించేందుకు జూలై 25 వరకు సమయం ఇచ్చింది. -
కోల్ స్కాం : జిందాల్‌పై ముడుపుల అభియోగం
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు స్కాంలో పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ ఇతరులపై ముడుపుల అభియోగాలూ నమోదు చేసినట్టు ప్రత్యేక న్యాయస్ధానానికి సీబీఐ నివేదించింది. జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ కేటాయింపునకు సంబంధించిన కేసులో నిందితులపై ముడుపుల అభియోగాలను నమోదు చేశామని తెలిపింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, 12 కింద ప్రభుత్వ అధికారికి ముడుపులు చెల్లించడం లేదా స్వీకరించడం శిక్షార్హమని..నిందితులపై ఆయా సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశామని సీబీఐ తరపు న్యాయవాది వీకే శర్మ చెప్పారు. ఈ కేసులో జిందాల్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా సహా 11 మందిపై నేరపూరిత కుట్ర, మోసం వంటి పలు అభియోగాలు నమోదు చేయాలని 2016, ఏప్రిల్‌లో న్యాయస్ధానం ఆదేశించగా, తాజాగా వీరిపై ముడుపుల ఆరోపణలనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు. -
కోల్ స్కాం.. జిందాల్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఊరటనిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ సహా మరో ముగ్గురికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఉర్తన్ నార్త్ కోల్ బ్లాక్ కేటాయింపులో అవకవతవకల ఆరోపణలు రావటంతో విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ జిందాల్ సహా పలువురి పాత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో చేర్చింది. జిందాల్‌స్టీల్ పవర్ లిమిటెడ్ మాజీ డైరక్టర్ సుశీల్ మర్రూ, మాజీ మేనేజింగ్ డైరక్టర్ ఆనంద్ గోయల్, సీఈవో విక్రాంత్ గుజ్రాల్ లను కూడా నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఉర్తన్ నార్త్ కోల్ బ్లాకు కేటాయింపులో వీరు మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర జరిపారని సీబీఐ ఆరోపించింది. అయితే బెయిల్ కోరుతూ వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం లక్ష రూపాయల పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. మరోవైపు జార్ఖండ్ అమరకొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో కూడా జిందాల్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
మరిన్ని కష్టాల్లో జిందాల్ స్టీల్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ ఎంపీ నవీన్ జిందాల్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు . న్యూఢిల్లీకి చెందిన, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్స్ చెల్లించని కారణంగా నష్టాల్లో కూరుకుపోయింది.రుణభారంతో సతమత మవుతున్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ సెప్టెంబర్ 30 తేదీ నాటికి మార్పిడికి వీల్లేని డిబెంచర్ల(ఎన్సీడీలు)పై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైన వార్తలతో మరోసారి కుదేలైంది. గురువారం నాటి మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో 5 శాతానికి పైగా నష్టపోయింది. ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపులో విఫమైనట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో బుధవారం జిందాల్ స్టీల్ వెల్లడించింది. జిందాల్ చెందిన 11 గ్రూపుల సెక్యూరిటీలు ఈ చెల్లింపుల్లో ఫెయిల్ అయినట్టు ప్రకటించింది. అయితే దీనికి కారణాలను కంపెనీ స్పష్టంగా వివరించ లేదు. 10ఏళ్ల కాలపరిమితిగల ఎన్‌సీడీలకు 9.8 శాతం కూపన్ రేటుకాగా, సెప్టెంబర్ 30న వీటిపై వడ్డీ చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న సంస్థ నికర అప్పుల విలువ రూ.46,000 కోట్లను దాటింది. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయంపై భారీ కసరత్తలులే చేస్తోంది. మరోవైపు కంపెనీ సీఈవో రవి ఉప్పాల అప్పులను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్తుల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, మొజాంబిక్ దేశాల్లో ఉన్న కుకింగ్ కోల్ మైన్స్ విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి రవి నిరాకరించారు. -
రూ.10,000 కోట్ల సమీకరించనున్న జేఎస్పీఎల్
న్యూఢిల్లీ: నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) కంపెనీ, ఎన్సీడీలు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది. ఆగస్టులో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో ఈ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరతామని జేఎస్పీఎల్ పేర్కొంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5,000 కోట్లు నిధుల సమీకరించే ప్రతిపాదనకు సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్ ఆమోదం తెలిపిందని జేఎస్పీఎల్ వెల్లడించింది. -
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జేఎస్పీఎల్ ప్లాంట్
డీల్ విలువ రూ.6,500 కోట్లు న్యూఢిల్లీ: నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్పీఎల్) 1,000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనున్నది. సజ్జన్, నవీన్ జిందాల్‌లు ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురు సావిత్రి దేవి జిందాల్ కొడుకులు. ఈ డీల్ విలువ రూ.6,500 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా జేఎస్‌పీఎల్‌కు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కనీసం రూ.4,000 కోట్లు చెల్లిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 1,000 మెగావాట్ల ప్లాంట్‌కు దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరితే, మిగిలిన రూ.2,500 కోట్లను చెల్లిస్తుంది. ఈ డీల్ 2018, జూన్ 30 మధ్యకల్లా పూర్తవుతుందని జేఎస్పీఎల్.. పేర్కొంది. జేఎస్పీఎల్ రుణ భారం రూ.46,000 కోట్లుగా ఉంది. ఈ డీల్‌కు ఇరు కంపెనీల వాటాదారులు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదాలను పొందాల్సి ఉంది. జేఎస్‌డబ్ల్యూ కొనుగోళ్ల జోరు జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ఇటీవలనే జై ప్రకాష్ అసోసియేట్స్‌కు చెందిన 1,391 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్లను కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని జైప్రకాశ్ అసోసియేట్స్‌కు చెందిన 500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను, ఒడిశాలో మెనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీకి ఉన్న 1,050 మెగావాట్ల పవర్ ప్లాం ట్ను కూడా కొనుగోలు చేయనున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ కొనుగోళ్లన్నింటిని ఎవర్బెస్ట్ స్టీల్ అండ్ మైనింగ్ హోల్డింగ్స్ అనే ప్రత్యేక సంస్థ ద్వారా జరుపుతామని వివరించింది. -
కోల్ స్కాం: వారి పేర్లను చార్జీషీటులో చేర్చండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో అప్పటి బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ లతో పాటు మరో 13 మంది పేర్లను కుట్ర, మోసం తదితర నేరాల కింద చార్జీ షీట్లలో చేర్చాలని ప్రత్యేక కోర్టు సీబీఐకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్డి భరత్ పరాషార్ మాట్లాడుతూ అమర్ కొండ బొగ్గు క్షేత్రాన్ని జిందాల్ గ్రూప్, గగన్ ఇన్ ఫ్రా ఎనర్జీ లిమిటెడ్, సౌభాగ్య మీడియా లిమిటెడ్, న్యూఢిల్లీ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ లకు ఇవ్వడంలో జరిగిన అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కొడా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తాల పేర్లను కూడా చార్జీషీట్లో చేర్చాలని ఆదేశించారు. నిందితుల పేర్లపై చార్జీషీట్లను చేర్చేందుకు వాదనలు వినిపించిన సీబీఐ... మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కొడా జేఎస్పీఎల్, జీఎస్ఐపీఎల్ లకు బొగ్గు గనులను కేటాయించడంలో కీలక పాత్ర వహించారని ఆరోపించింది. దీనిపై ప్రతివాదనలు వినిపించిన నిందితుల తరఫు న్యాయవాది అవన్నీ నిరాధారమని, చార్జీ షీట్లలో పేర్లను నమోదు చేయడం కుట్రపూరితమని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో దోషిగా ఉన్న సురేశ్ సింఘాల్ ఏప్రిల్ 21న కోర్టును క్షమాభిక్ష కోరుతూ అప్రూవర్ గా మారారు. దీంతో ఏసీబీ, 14 మంది దోషులకు కోర్టు నోటీసులు జారీచేసింది. మేజిస్ర్టేట్ ఆయన వాంగ్మూలాన్ని స్వీకరించి సీల్డ్ కవర్ ప్రత్యేకకోర్టుకు అందజేశారు. మే 11న తదుపరి విచారణను వాయిదా వేస్తూ సింఘాల్ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. -
‘జిందాల్‌కు బొగ్గు’లో దాసరి కుట్ర: సీబీఐ
న్యూఢిల్లీ: కేంద్ర బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాలు కలసి జిందాల్ గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపులో కుట్ర చేశారని సీబీఐ సోమవారం ప్రత్యేక కోర్టులో తెలిపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్లకు అమరకొండ బొగ్గు గనులను కేటాయించేందుకు జార్ఖండ్ ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందని పేర్కొంది. అప్పుడు కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్న దాసరి నారాయణరావు, మధుకోడా, నవీన్ జిందాల్, హెచ్‌సి గుప్తాలు కుట్రలో భాగస్వాములంది. ఈ రెండు సంస్థలకు గనుల కేటాయించటాన్ని స్క్రీనింగ్ కమిటీ తిరస్కరించిన తరువాత కూడా గుప్తా వీటికోసం సిఫార్సు చేశారని పేర్కొంది. జిందాల్, దాసరి లాయర్లు దీన్ని తోసిపుచ్చారు. దాసరి సహాయమంత్రి కావటం వల్ల.. కేటాయింపుల్లో ఆయన పాత్ర ఏదీ లేదని ఆయన లాయర్ అన్నారు. తుది నిర్ణయాన్ని తీసుకున్నది ఆనాడు బొగ్గు శాఖనూ పర్యవేక్షించిన ప్రధాని మన్మోహన్సింగేనన్నారు. -
నవీన్ జిందాల్ విదేశీ యానానికి అనుమతి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ విదేశీ పర్యటనకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు జూన్ 14 నుంచి 29 వరకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, నవీన్ జిందాల్, మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సహా పలువురి పేర్లను సీబీఐ చార్జిషీటులో చేర్చిన సంగతి తెలిసిందే. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో పెట్టారు. -
దాసరిని వెంటాడుతున్న కోల్ స్కామ్
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును కోల్ స్కామ్ వెంటాడుతోంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో దాసరి నారాయణరావుపై సీబీఐ బుధవారం మరో ఛార్జిషీటు దాఖలు చేసింది. అమరకొండ ముర్గాదంగల్(జార్ఖండ్) బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో ఆయన పాటు 14 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాలపై అభియోగాలు మోపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో పెట్టారు. నేరపూరిత కుట్ర, ఛీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. ఈ ఛార్జిషీట్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం పరిశీలించనుంది. -
సామాన్యురాలిగా దేశ ధనిక మహిళ ప్రచారం!
హిసార్: ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలిగా ఖ్యాతి గాంచిన మహిళ. వేల కోట్ల రూపాయల ఓ పారిశ్రామిక సామ్రాజ్యానికి అధినేత్రి. ఓ పారిశ్రామిక దిగ్గజానికి తల్లి. అయినప్పటికీ ఆమె ఎప్పటిలాగానే ఓ సామాన్యురాలిగా ప్రవర్తిస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెనే సావిత్రి జిందాల్. కార్పొరేట్ దిగ్గజం (ఒ.పి. జిందాల్ గ్రూప్) నవీన్ జిందాల్‌కు తల్లి. హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2005, 2009లలో గెలిచి మంత్రి పదవి చేపట్టిన సావిత్రి జిందాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రచారపర్వం మొదలు పెట్టారు. అయితే ఎక్కడా తన హోదాను, దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్యురాలిగానే వీధులు, సందుల్లో కలియదిరుగుతూ ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. ఎప్పటిలాగానే సాధారణ ప్రింటెడ్ చీరలో దర్శనమిస్తూ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. -
దాసరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు
న్యూఢిల్లీ: బోగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, ఎంపీ నవీన్ జిందాల్ లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరి నారాయణ రావును ఇటీవల సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఒడిశాలోని తలబిరా-II కోల్ బ్లాక్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేశారు. -
నవీన్ జిందాల్ ను ప్రశ్నించనున్న సీబీఐ
బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ను దేశపు అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) శుక్రవారం ప్రశ్నించనుంది. 2008లో బిర్బమ్ లని అమరకొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాక్ ను దక్కించుకునేందుకు నేరపూరితమైన కుట్రకు, చీటింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో నవీన్ జిందాల్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బొగ్గు నిల్వల కేటాయింపు కుంభకోణంలో ఈ సంవత్సరం జూన్ లో నమోదు చేసిన 12వ ఎఫ్ఐఆర్ లో నవీన్ జిందాల్ పేరును సీబీఐ పేర్కోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సీబీఐ జారీ చేసిన సమన్లపై సమాచారం సేకరించేందుకు ఈ మెయిల్, ఫోన్ ద్వారా చేసిన ప్రయత్నాలకు ఎలాంటి స్పందన లభించలేదు. అయితే నవీన్ జిందాల్ శుక్రవారం విచారణకు హాజరు కావొచ్చనే వార్తలు వెలువడుతున్నప్పటికి.. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.