సామాన్యురాలిగా దేశ ధనిక మహిళ ప్రచారం! | Country's richest woman campaigns like a commoner | Sakshi
Sakshi News home page

సామాన్యురాలిగా దేశ ధనిక మహిళ ప్రచారం!

Published Sun, Oct 5 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

సామాన్యురాలిగా దేశ ధనిక మహిళ ప్రచారం!

సామాన్యురాలిగా దేశ ధనిక మహిళ ప్రచారం!

హిసార్: ఆమె దేశంలోనే అత్యంత సంపన్నురాలిగా ఖ్యాతి గాంచిన మహిళ. వేల కోట్ల రూపాయల ఓ పారిశ్రామిక సామ్రాజ్యానికి అధినేత్రి. ఓ పారిశ్రామిక దిగ్గజానికి తల్లి. అయినప్పటికీ ఆమె ఎప్పటిలాగానే ఓ సామాన్యురాలిగా ప్రవర్తిస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెనే సావిత్రి జిందాల్. కార్పొరేట్ దిగ్గజం (ఒ.పి. జిందాల్ గ్రూప్) నవీన్ జిందాల్‌కు తల్లి. హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2005, 2009లలో గెలిచి మంత్రి పదవి చేపట్టిన సావిత్రి జిందాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రచారపర్వం మొదలు పెట్టారు. అయితే ఎక్కడా తన హోదాను, దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్యురాలిగానే వీధులు, సందుల్లో కలియదిరుగుతూ ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. ఎప్పటిలాగానే సాధారణ ప్రింటెడ్ చీరలో దర్శనమిస్తూ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement