ముంబై: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వాళ్లలో నూపుర్ శర్మతో పాటు బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి ప్రతీరోజూ మీడియాలో ఆయన పేరు నానుతోంది. అయితే..
కథనాలు రాసే క్రమంలో కొన్ని మీడియా సంస్థలు ముందు వెనుకా ఆలోచించడం లేదు. పొరపాటున ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ పేరును, ఫొటోలను వాడేస్తున్నాయి. కంటెంట్ ట్యాగులు, హ్యాష్‌ట్యాగులను కూడా నవీన్ జిందాల్‌గానే టైప్ చేస్తున్నాయి. ఈ చేష్టలతో తమ చైర్మన్‌కు ఇబ్బంది కలుగుతోందని జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
మీడియాలో నవీన్ కుమార్ జిందాల్ బదులుగా.. నవీన్ జిందాల్ ఫొటోలు ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు కూడా తమ చైర్మన్ సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారని వివరించింది. ఇది ఓ వ్యక్తిని మరో వ్యక్తిగా పొరబడడమేనని, ఇలాంటి చర్యలకు మీడియా దూరంగా ఉండాలని సూచించింది.
నవీన్ కుమార్ జిందాల్ కు, తమ బాస్ నవీన్ జిందాల్ కు ఎలాంటి సంబంధంలేదని జిందాల్ స్టీల్స్ స్పష్టం చేసింది. మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది.
Certain recent developments in public domain involving name of Mr Naveen Kumar Jindal are in no way related to our Group Chairman Mr Naveen Jindal. We urge media not to erroneously use photographs of our chairman while reporting it. This clearly is case of mistaken identity: JSPL pic.twitter.com/XeF1T5LDJe
— ANI (@ANI) June 12, 2022
Comments
Please login to add a commentAdd a comment