Prophet Muhammad
-
ప్రవక్త జీవితంలో ముఖ్య ఘట్టం.. మొహర్రం
ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం సంవత్సరంలోని మొదటి నెల ‘మొహర్రం ’. ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్ ప్రవక్త (స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్’. (మక్కా నుండి మదీనాకు వలస). హిజ్రత్ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్య సందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉంటుంది.దేవుడు భూమ్యాకాశాలను సృష్టించిన నాటినుండి నెలల సంఖ్య పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు పవిత్ర మాసాలు’. అందులో ‘మొహర్రం’ కూడా ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం: ‘పన్నెండు నెలలు ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవప్రదమైనవి. జుల్ ఖ అద, జుల్ హిజ్జ, ముహర్రమ్, రజబ్. కనుక ఈ నెలలో ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవ భీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ నెల ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ నెల. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్తవస్త్రం కప్పేవారు. ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ముహర్రం మాసం 9, 10 లేదా 10, 11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (సహీహ్ ముస్లిం 1162).మొహర్రం నెల ్రపాముఖ్యం, హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో హజ్రత్ ఇమామె హుసైన్, ఆయన పరివారం వీరమరణం పొందారు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ్రపాణాలను సైతం లెక్క చేయకుండా ΄ోరాడి అమరుడయ్యారో మనం దాని నుంచి ప్రేరణ పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, సమాజ శ్రేయోభిలాషులు, న్యాయప్రేమికులు, ΄ûరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా ΄ోరాడాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం.( 17, బుధవారం మొహర్రం – యౌమె ఆషూరా)కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్రపాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించనక్కర లేదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి ΄ోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
ఇమామ్ త్యాగం.. స్మరణీయం స్ఫూర్తిదాయకం
సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమామ్ త్యాగం స్ఫూర్తిగా నిలవాలి. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్తసంవత్సరం ‘ముహర్రం’ నుండే ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల (ఉపవాసాలు) తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంత మాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాలపరంగా బాధాకరం కావచ్చునేమోగాని, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యం లో పూర్తిగా విషాదానికి పరిమితం కావడమూ అంత సరికాకపోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త(స) నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సార«థ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం,‘దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు’. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంతమాత్రంకాదు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛీలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్నిశాఖల అధికారులు ఎంతో నిజాయితీపరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు. అనుక్షణం దైవానికి భయపడుతూ, ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. ప్రతిరోజూ నమాజుల సమయంలో ప్రజల్ని కలుసుకొని, వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కాని ఖలీఫాల తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోయాయి. దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకూ ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) కంకణబద్ధులయ్యారు. లక్ష్యసాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిధ్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు. ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మనముందున్నాయి. ఇమామె హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమరాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోడానికి ’కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ పదవ తేదీన (యౌమె ఆషూరా) ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం ఆషామాషీ మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Nupur Sharma: నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ
ఢిల్లీ: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన నూపుర్ శర్మకు గన్ లైసెన్స్ జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. కిందటి ఏడాది ఓ టీవీ డిబేట్లో ఆమె ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు.. యావత్ ప్రపంచంలోనూ మంట పుట్టించాయి. ఆపై ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కూడా. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని, తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె ఎప్పటి నుంచో పోలీసులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కోరారామె. ఈ నేపథ్యంలోనే ఆమెకు గన్ లైసెన్స్ జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ లైసెన్స్ ఆధారంగా ఆమె ఆత్మ రక్షణ కోసం తుపాకీని వెంట పెట్టుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు.. సుప్రీం కోర్టు సైతం ఆమె భద్రత కారణాల దృష్ట్యా.. దేశంలో ఆమెపై దాఖలైన(దాఖలు అవుతున్న కూడా) ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదలాయించాలని ఆదేశించి ఆమెకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు కొన్నినెలల ముందు.. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె తక్షణ క్షమాపణలు చెప్పాల్సిందని అభిప్రాయపడింది. బాధ్యత గల న్యాయవాది వృత్తిలో అనుభవం ఉండి.. సోయి లేకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు దేశంలో విద్వేషాలకు దారి తీసిందని, పరిణామాలకు ఆమె ఒక్కతే బాధ్యత వహించాలంటూ కూడా అభిప్రాయపడింది. ఇక నూపుర్‌కు మద్దతు వ్యాఖ్యలు చేసినందుకే.. రెండు హత్యలు జరగడం దేశాన్ని కుదిపేసింది కూడా. రాజస్థాన్ ఉదయ్‌పూర్ ఓ టైలర్‌ను, ఆపై మహారాష్ట్ర అమరావతిలో ఓ ఫార్మసిస్ట్‌ను దారుణంగా హతమార్చారు. మరోవైపు ఆమెను హతమారుస్తామంటూ కొందరు వీడియోల ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డంతో ఆమె కొన్నాళ్లూ అజ్ఞాతంలోనూ గడిపారు. -
పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతబస్తీలో రోడ్లపైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొఘల్‌పురాలో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. హైటెన్షన్ నెలకొంది. పోలీసులు నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి.. పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం(బుధవారం) మరోసారి చార్మినార్ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ నుంచి గోషామహల్‌కు వెళ్లే రోడ్లు మూసేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్‌లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్ కుటుంబమే లక్ష్యం?! -
Nupur Sharma: నూపుర్ శర్మకు భారీ ఊరట
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ప్రాణ హాని ఉందన్న ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఆమె వినతి పిటిషన్‌కు సానుకూలంగా స్పందించింది. ఆమెపై దాఖలైన అన్ని కేసులన్నింటిని కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఐఎఫ్ఎస్వో యూనిట్‌కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను బుధవారం ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను సైతం నూపుర్ శర్మకు ఇస్తున్నట్లు తెలిపింది. తనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయని, అయితే విచారణ నిమిత్తం తాను అక్కడికి వెళ్తే దాడులు జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నూపుర్ శర్మ.. సుప్రీంలో వినతి పిటిషన్ వేసింది. కాబట్టి, తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఈ మేరకు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కొత్తగా ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం పేర్కొంది. గతంలో ఇదే బెంచ్.. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి. ఆమెవి అహంకారపూరిత వ్యాఖ్యలు’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది కూడా. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్(ఐఎఫ్ఎస్వో) అనేది ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం. ద్వారకాలో దీని ఆఫీస్ ఉంది. ప్రధానమైన కేసులతో పాటు సున్నితమైన అంశాలను ఇది పరిశీలిస్తుంటుంది. ఇదీ చదవండి: మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి-నూపుర్ -
మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి
ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊహించని స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాక.. బెదిరింపులు, వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె తాజా అభ్యర్థన పిటిషన్‌ను అదే బెంచ్ ముందు దాఖలు చేశారు. తన అరెస్టును నిలువరించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె మరోసారి కోర్టులో అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఆమె పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టే అవకాశం ఉంది. గతంలో విచారణ సందర్భంగా ఆమె అభ్యర్థనపై స్పందించిన బెంచ్.. సంబంధిత హైకోర్టు(ఢిల్లీ)ను సంప్రదించాలని ఆమె తరపు న్యాయవాదికి సూచించారు. అయినప్పటికీ ఆమె మరోసారి సుప్రీంను ఆశ్రయించడం విశేషం. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జులై 1వ తేదీన నూపుర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు నిరసన సెగ తగిలింది. అంతేకాదు పలువురు మేధావులు, రిటైర్డ్ జడ్జిలు, బ్యూరోక్రట్లు, రాజకీయ నేతలు సైతం తీవ్రంగా తప్పుబడుతూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఒక బహిరంగ లేఖ రాశారు కూడా. అయితే ఆ నాటి నుంచి తనకు అత్యాచార, చావు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయని ఆమె తాజా అభ్యర్థనలో పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని ఢిల్లీకి బదలాయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఆమె సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ గ్యాప్‌లో ఆమెపై మరో మూడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు కావడం గమనార్హం. చదవండి: బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి! -
ప్రవక్తపై కామెంట్లు: మా చైర్మన్‌ను బద్నాం చేయకండి
ముంబై: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వాళ్లలో నూపుర్ శర్మతో పాటు బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి ప్రతీరోజూ మీడియాలో ఆయన పేరు నానుతోంది. అయితే.. కథనాలు రాసే క్రమంలో కొన్ని మీడియా సంస్థలు ముందు వెనుకా ఆలోచించడం లేదు. పొరపాటున ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ పేరును, ఫొటోలను వాడేస్తున్నాయి. కంటెంట్ ట్యాగులు, హ్యాష్‌ట్యాగులను కూడా నవీన్ జిందాల్గానే టైప్ చేస్తున్నాయి. ఈ చేష్టలతో తమ చైర్మన్‌కు ఇబ్బంది కలుగుతోందని జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియాలో నవీన్ కుమార్ జిందాల్ బదులుగా.. నవీన్ జిందాల్ ఫొటోలు ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు కూడా తమ చైర్మన్ సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారని వివరించింది. ఇది ఓ వ్యక్తిని మరో వ్యక్తిగా పొరబడడమేనని, ఇలాంటి చర్యలకు మీడియా దూరంగా ఉండాలని సూచించింది. నవీన్ కుమార్ జిందాల్ కు, తమ బాస్ నవీన్ జిందాల్ కు ఎలాంటి సంబంధంలేదని జిందాల్ స్టీల్స్ స్పష్టం చేసింది. మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. Certain recent developments in public domain involving name of Mr Naveen Kumar Jindal are in no way related to our Group Chairman Mr Naveen Jindal. We urge media not to erroneously use photographs of our chairman while reporting it. This clearly is case of mistaken identity: JSPL pic.twitter.com/XeF1T5LDJe — ANI (@ANI) June 12, 2022 -
బెంగాల్లో మళ్లీ హింస
కోల్‌కతా/లక్నో/రాంచీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో రగిలిన కార్చిచ్చు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్లో రెండో రోజు శనివారం కూడా హింస చోటుచేసుకుంది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దాడిలో పోలీసులు గాయపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు. హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు ఈ నెల 14వ తేదీ దాకా నిలిపేశారు. పలు ప్రాంతాల్లో 15వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ను 144 సెక్షన్ అమల్లో ఉన్న హౌరా జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బెంగాల్ జమ్మూ కశ్మీర్‌లా మారుతోందని సుకాంత ఆరోపించారు. శుక్రవారం నిరసనల్లో బాలులను భాగస్వాములను చేశారన్న అభియోగాలపై ఫిర్జాదా ఆఫ్ ఫర్ఫురా షరీఫ్‌కు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ షోకాజులిచ్చింది. బెంగాల్లో శాంతిభద్రతలు దిగజారుతున్నాయంటూ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదేశించారు. నిందితుల పట్ల ఔదార్యం చూపుతుండడం దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు. యూపీలో 255 మంది అరెస్టు యూపీలో శుక్రవారం హింసాత్మక ఘటనలకు సంబంధించి 255 మందిని జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులపై రాళ్ల దాడికి చిన్నపిల్లలను దుండగులు నియోగించినట్లు గుర్తించారు. కారకులపై 29 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు చెప్పారు. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ తల నరికేస్తున్నట్టు వీడియో రూపొందించి యూట్యూబ్‌లో పెట్టిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫైజల్ వనీ అనే యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోయలో పలుచోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. ఢిల్లీలో జామా మసీదు బయట ప్రదర్శనల ఉదంతానికి సంబంధించి కేసు నమోదైంది. ప్రతి మసీదు, మదర్సా లోపల, బయట హై క్వాలిటీతో కూడిన సీసీ కెమెరాలు పెట్టాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. ఆందోళనకారులు ఏయే ప్రార్థనా స్థలాల్లో నుంచి బయటికొచ్చి గొడవకు దిగారో అవే ఈ విధ్వంసానికి బాధ్యత వహించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్‌లో పాలన రాజ్యాంగం ప్రకారం నడుస్తుందే తప్ప షరియా ప్రకారం కాదని విధ్వంసకులు తెలుసుకోవాలన్నారు. నుపుర్ శర్మకు బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు. ఆలయంపైకి పెట్రోల్ బాంబులు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శుక్రవారం నిరసనల్లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు బులెట్ గాయాలతో చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ హింసకు నిరసనగా హిందూ సంఘాలు శనివారం రాంచీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దాంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసకు కారకులపై కేసులు పెట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నామరు. నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. రాంచీలోని ఓ ఆలయంలో పూజారి, ఆయన కుటుంబం ప్రాంగణంలో నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన నిరసనలకు సంబంధించి 100 మందికిపైగా వ్యక్తులపై కేసులు పెట్టారు. విమర్శకు ఎవరూ అతీతులు కారు: తస్లీమా న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతోన్మాదుల ఆగడాలను చూస్తే దిగ్బ్రాంతి కలుగుతోందని బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. వాటిని చూస్తే మహ్మద్ ప్రవక్త దిగ్భ్రాంతికి గురయ్యేవారని అభిప్రాయపడ్డారు. ‘‘విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. ఏ మనిషీ, మత గురువూ, మత బోధకుడూ, ప్రవక్తా, దేవుడూ... ఎవరూ అతీతులు కారు. ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చాలంటే సూక్ష్మ పరిశీలన, విమర్శ అవసరం’’ అని కామెంట్ చేశారు. -
నూపుర్ వ్యవహారం.. బీజేపీ దిద్దుబాటు చర్యలు
న్యూఢిల్లీ: ఓ టీవీ డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలుకా ప్రభావం.. బీజేపీని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దేశంలో రాజకీయ విమర్శలు ఎదురుకాగా.. ముఖ్యంగా ఇస్లాం దేశాల అభ్యంతరాలతో వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. నూపుర్ శర్మ వ్యాఖ్యల వ్యవహారం లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించింది. బీజేపీ అధికార ప్రతినిధులు, ప్యానెలిస్టులు మాత్రమే టీవీ డిబేట్లలలో పాల్గొనాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాళ్లను ఎంపిక చేసి పంపించే బాధ్యతను మీడియా సెల్‌కు అప్పజెప్పింది. అంతేకాదు.. టీవీ డిబేట్లను వెళ్లే ప్రతినిధులు ఎవరైనా సరే.. మతపరమైన చర్చ జరపకూడదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘‘నిగ్రహ భాష ఉపయోగించండి. ఉద్రేకంగా మాట్లాడొద్దు. ఆందోళన చెందొద్దు. ఎవరి ప్రోద్బలంతో కూడా పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను ఉల్లంఘించవద్దు’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు పార్టీ లైన్‌కు అనుకూలంగా నడుచుకోవాలని, డిబేట్లకు వెళ్లే ముందు అంశంపై పూర్తిస్థాయి పరిజ్ఞానంతోనే ముందుకు వెళ్లాలని సూచించింది. తాజా రూల్స్ ప్రకారం.. టీవీ డిబేట్లో పాల్గొనే ప్రతినిధులు పార్టీ ఎజెండా నుంచి పక్కదారి పట్టకూడదు. ఎవరు రెచ్చగొట్టినా ఉచ్చులో పడి వ్యాఖ్యలు చేయొద్దు అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఓ టీవీ డిబేట్లో వ్యాఖ్యలు చేసినందుకే నూపుర్ శర్మపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఆమెను పార్టీని నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అదే విధంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మరో నేత నవీన్ కుమార్ జిందాల్‌ను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. ఖతర్, కువైట్, యూఏఈ, పాకిస్థాన్, మాల్దీవ్, ఇండోనేషియా.. ఇలా దాదాపు పదిహేను దేశాలు నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. చదవండి: అలా చేయకుంటే.. నూపుర్ శర్మ అంతుచూస్తాం -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నూపుర్ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆదివారం వెల్లడించింది. నవీన్ కుమార్ జిందాల్ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్‌గా ఉన్నారు. సస్పెన్షన్ లెటర్లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్లోని దుకాణాలను మూసివేయాలని ముస్లిం వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొవడలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. చదవండి: డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్ రౌత్ ఇదిలా ఉండగా.. వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్‌లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్‌గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్ శర్మపై హైదరాబాద్, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. అన్ని మతాలను గౌరవిస్తాం అయితే నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటుకు కొద్దిసేపటి ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని అన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందనని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీస్తే, మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. -
ముస్లిం సోదరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరులకు మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, సామరస్యత, సోదరభావం పెంపొందించుకోవాలన్న ప్రవక్త బోధనలు మానవాళి ధర్మమార్గంలో నడిచేందుకు స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స ) Warm greetings on the occasion of Eid-e-Milad-un-Nabi. May the Prophet's teachings of compassion, harmony & universal brotherhood inspire us to lead righteous lives.#EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2020 -
గవర్నర్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం మన మధ్య శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. -
సైతాన్ ఉన్న చోట
అబూబక్ర్ సిద్దీఖ్ (ర) ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క అత్యంత ప్రియమైన మిత్రుడు. ఒకసారి ఆయన ప్రవక్త (స) తో పాటు ఇతర సహచరుల సన్నిధిలో కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (ర) ను అనరాని మాటలు అంటున్నాడు. హజ్రత్ అబూబక్ర్ మౌనంగా వింటూన్నాడు. ప్రవక్త ముహమ్మద్ ( స) ఆ దృశ్యాన్ని చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూన్నారు. ఆ వ్యక్తి లేనిపోని నిందలు వేస్తూ, ఇంకా ఏదేదో అంటుంటే, అబూబక్ర్ సహనం కోల్పోయి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి, అప్పటి దాకా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్న ప్రవక్త ముహమ్మద్ (స) అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు.కాసేపటికి హజ్రత్ అబూబక్ర్, ప్రవక్త మహనీయుల వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్త ముహమ్మద్ (స)! ఆ వ్యక్తి నన్ను అనరాని మాటలు అంటుంటే మీరు ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నారు. నేను వాడికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి మీరు లేచి వెళ్లిపోయారేమిటీ?’’ అని అడిగాడు.‘‘నిన్ను ఆ వ్యక్తి దూషిస్తున్నప్పుడు దైవదూతలు నీకు బదులుగా సమాధానం ఇస్తున్నారు. అది చూసి నేను నవ్వుతూ వింటున్నా. నీవు అతనికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి దైవదూతలు అక్కడ నుండి నిష్క్రమించారు. సైతాన్ మీ మధ్యలోకి వచ్చాడు. సైతాన్ ఉన్న చోట నేను ఉండలేను కదా. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను’’ అని చెప్పారు.దూషణలకు దూషణ సమాధానం కారాదు. అలాంటి ఇద్దరి మధ్య సైతాన్ దూరి తన పని కానిస్తాడు. ఇద్దరి మధ్య వైరం రగిలించి, శత్రుత్వాన్ని పెంపొందించే పని చేస్తాడు. ఇంకా వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, తమ సమయాన్ని చెడు పనులకు వినియోగిస్తారు. అందుకే ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ‘ఓ ప్రవక్తా(స) మంచి చెడు ఒకటి కాదు. చెడును అతి శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించడానికి ప్రయత్నం చేయి. నీ ప్రాణ శత్రువు సైతం నీ ప్రాణ స్నేహితుడై పోవడం నీవు చూస్తావు. కాని ఈ అదృష్ట యోగ్యం అందరికీ సాధ్యం కాదు’ అని.ఇలాంటి సహన గుణం అలవరచుకోవడం కోసమే రంజాన్ మాసంలో నెలరోజుల ఉపవాస దీక్షతో శిక్షణ పొందేలా చేస్తుంది ఇస్లాం.‘మీరు ఉపవాసం పాటిస్తున్నప్పుడు, ఎవరైనా తిట్టినా లేదా జగడానికి దిగినా.. నేను రోజూ పాటిస్తున్నాను అని సమాధానం ఇవ్వండి’ అని ప్రవక్త (స )తెలిపారు. అంటే మీరు ద్వేషించే వారిని ఉపవాస దీక్ష ద్వారా ప్రేమించడం అలవర్చుకోవాలి. – షేక్ అబ్దుల్ బాసిత్ -
ఒక దీపం చాలదా?
ఒకరోజు ఒక పేదవాడు ప్రవక్త ముహమ్మద్ (స) వద్దకు వచ్చి, ‘‘అయ్యా! నేను పేదవాడిని. నా కూతురు పెళ్ళీడుకు వచ్చింది. దయచేసి నా కూతురు పెళ్లికి ఏదైనా సహాయం చేయండి’ అని అడిగాడు. ‘‘బాబూ! ప్రస్తుతం నీకు సహాయం చేయడానికి నా వద్ద ఏమీ లేవు. నువ్వు ఒక పని చేయి, ఫలానావ్యక్తి దగ్గరకు వెళ్ళు. మీ అమ్మాయి పెళ్ళికి అవసరమైన సహాయం చేస్తాడు’’ అని సలహా ఇచ్చారు. ఆ పేదవాడు ప్రవక్త ముహమ్మద్ (స) తెలిపిన వ్యక్తి దగ్గరకు వెళ్ళే సమయానికి సాయంత్రం అయింది. ఇంట్లో నుండి ‘‘రెండు దీపాలు వెలిగించావు, ఒక దీపం చాలదా’’ అని భార్యతో ఆ పెద్దమనిషి అంటున్న మాటలు విని, ‘ఇంత పిసినారి నాకేం సహాయం చేస్తాడు’ అని మళ్ళీ తిరిగి ప్రవక్త (స) వద్దకు వెళ్ళి తాను విన్నది విన్నవించాడు. ప్రవక్త (స) మళ్ళీ ఆ వ్యక్తి వద్దకే వెళ్ళమన్నారు. అతడు తిరిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి తాను వచ్చిన విషయం విన్నవించాడు. ఆ పెద్దమనిషి ఇతన్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేశాడు. ఆ పెద్దాయన తాను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేయడాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ‘‘అయ్యా! ఇందాక మీరు రెండు దీపాలు వెలిగించినందుకు మీ భార్యను గద్దించారు. ఇప్పుడేమో నాకు నేను ఆశించిన దానికన్నా ఎక్కువ సహాయం చేశారు’’ అని అన్నాడు.‘‘నేను ఇలా పొదుపు చేయడం వల్లేకదా నీలాంటి వారికి సహాయం చేయగలిగాను. కాసిన్ని పుణ్యాలు సంపాదించుకోగలిగాను’’ అని సమాధానం ఇచ్చాడు ఆ పెద్దాయన. ‘‘వ్యర్థమైన ఖర్చులు చేయకండి. వ్యర్థమైన ఖర్చులు చేసేవారు సైతాన్ సోదరులు. సైతాన్ మీ బద్ధశత్రువు’’ (17: 27) అని ఖురాన్లో అల్లాహ్ చేసే హితబోధను మనమంతా పాటించి శాశ్వతమైన స్వర్గం కోసం పుణ్యాలు సమకూర్చుకునే సద్బుద్ధి ప్రసాదించు గాక. – షేక్ అబ్దుల్ బాసిత్ -
ప్రవక్త జీవితం, సందేశం శాంతి
కొత్త కోణం: అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉండగా, తెగల మధ్య చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని మహమ్మద్ ప్రవక్త యోచించారు. ప్రజలను ఐక్యం చేయాలని పరితపించారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి ప్రవక్త చేసిన కృషి విజయవంతమైంది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు ప్రపంచంలో శాంతిని నెలకొల్పిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఆయన శాంతి, ఐక్యతల సందేశం అందరికీ అనుసరణీయం. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమాజంలోని వివిధ సంఘర్షణల నుంచి అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొందరు ఆ సంక్షోభంలో పడికొట్టుకుపోతే, కొందరు ప్రవాహానికి ఎదురీది సమాజానికి నూతనో త్తేజాన్ని అందిస్తారు. సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు. అలాంటి వారినే ఒకప్పుడు ప్రవక్తలన్నారు. సమాజ అంగీకారాన్ని పొందిన కొందరు ప్రవక్తల ప్రబోధాలే మతాలై ప్రపంచాన్ని నడిపిస్తుంటాయి. ప్రపంచంలో అత్యధిక భాగానికి వ్యాపించిన బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు అవి ఆవిర్భవించిన కాలాల్లో సామాజిక విప్లవాలుగా నిలిచాయి. సమాజ పురోగమనానికి, అభివృద్ధికి దోహదం చేశాయి. కాలంచెల్లిన బానిస సమాజపు పోకడలను కాలదన్ని వినూత్న ఆలోచనలకు అంకురార్పణ చేసిన ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజు నేడు. ప్రవక్త జన్మది నాన్నే మిలాద్-ఉన్-నబీగా జరుపుకుంటున్నాం. ఆయన జన్మించేనాటికి అరబ్బు ప్రపంచంలో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన బోధనలు ఆనాటి సామాజాన్ని మౌఢ్యం సుడిగుండం నుంచి గట్టెక్కించి, సామాజిక సంక్షోభాన్ని పరిష్కరించాయని విశదమవుతుంది. అంధకారంలో మెరిసిన కాంతి రేఖ మూడు వైపులా సముద్రం చుట్టివున్న ద్వీపకల్పం లాంటి అరబ్బు ప్రాంతం ఆనాడు చాలా తెగలకు ఆవాసంగా ఉండేది. మూడు ముఖ్య తెగలు కీలకమై నవిగా ఉండేవి. మొదటి ప్రవక్తగా భావించే ఇబ్రహీం బోధనలను కాదని, వారు వివిధ రకాల విగ్రహాలకు పూజలు చేసేవాళ్ళు. ఇస్లాం సందేశానికి మూలమైన ‘‘తౌహీద్’’ ఏకేశ్వరోపాసన, దేవుని ఏకత్వ భావనకు వారి మత విశ్వాసాలు విరుద్ధమైనవి. సూర్యచంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను, సన్యాసులను, నదులను, పర్వతాలను, మనుషుల్ని, చివరకు జంతువులను, రాళ్ళను, కొండలను, గుట్టలను వారు పూజించేవారు. ఈ బహు దైవారాధన తెగల మధ్య క్రమంగా నిరంతర సంఘర్షణలకు కారణమైంది. అంతర్గత యుద్ధాలతో అరబ్బు నేలపై రక్తం ఏరులై పారేది. ఫలితంగా రాజకీయ అస్థిరత నెలకొనడమే గాక, సామాజిక, ఆర్థిక జీవితం ఛిన్నాభిన్నమైంది. అనైక్యతతో, మౌఢ్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అరబ్బులు ఎవరికీ లొంగని స్వతంత్ర స్వభావులు. కఠోరమైన ఎడారి జీవితానికి తోడు, కర్తవ్య నిర్వహణ కోసం జీవితాన్ని ధారపోసే విశిష్ట స్వభావం వారిది. అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సమయంలోనే మక్కాలో క్రీ.శ. 571 ఏప్రిల్ 22న ప్రవక్త మహమ్మద్ జన్మించారు. సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్న ఖురైష్ తెగకు చెందిన మహమ్మద్ ప్రవక్త చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, తాత ఒడిలో పెరిగారు. అరబ్బు సంప్రదాయాల ప్రకారం పట్టణాలలో పుట్టిన పిల్లలు కూడా బాల్యాన్ని పల్లెల్లో గడిపేవారు. మహమ్మద్ ప్రవక్త కూడా అలా పల్లెలో గొర్రెల కాపరిగా ఎదిగారు. ఆ తెగ నాయకత్వ స్థానానికి రావడానికి కష్టభరితమైన ఆ జీవితం ఆయనకు ఎంతో ఉపకరించింది. తాత మరణం తర్వాత, ఆయన పినతండ్రి దగ్గరికి చేరాడు. ప్రవక్త శాంతి ప్రస్థానానికి నాంది అరబ్బులలోని మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనైక్యత ఆయనను చిన్నతనం నుంచే కలవరపరిచాయి. ఖురైష్ తెగ సంప్రదాయాలను ఆయన ఆనాటి నుంచే వ్యతిరేకించారు. విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు. ఖురైష్, కైస్ తెగల మధ్య జరిగిన ఫిజార్ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త కూడా పాల్గొన్నారు. ఆ యుద్ధం ఆయనలో పెద్ద మార్పుని తీసుకొచ్చింది. యుద్ధం తదుపరి ఆయన పినతండ్రి జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ చొరవతో ఖురెష్ ప్రముఖులు ఐదు అంశాల తీర్మానాన్ని ఆమోదించారు. 1. ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పుతాము, 2. బాటసారుల కోసం రక్షణ సదుపాయాలు కలుగజేస్తాం, 3. నిరుపేదల అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తాం, 4. దుర్మార్గుల దౌర్జన్యానికి గురయ్యేవారికి రక్షణ కల్పిస్తాం, 5. దౌర్జన్యపరులకు మక్కాలో స్థానం లేకుండా చేస్తాం. ఈ తీర్మానాన్ని రూపొందించడంలో మహమ్మద్ ప్రవక్తకు కూడా భాగం ఉంది. ఆయన తమ తెగ ఆచారం ప్రకారం వర్తకాన్ని వృత్తిగా స్వీకరించారు. అందులో ఆయన కనబరిచిన నిజాయితీ, సచ్ఛీలత ఎందరినో ఆకర్షించాయి. ప్రజలు ఆయనను సాదిక్ (సత్యసంధుడు), అమీన్ (విశ్వసనీయుడు) అని పిలిచేవారు. వ్యాపారంలో భాగంగా ఆయన సిరియా, బస్రా, యెమెన్ దేశాల్లో చాలా సార్లు పర్యటించారు. ఆ సమయంలోనే శ్రీమంతురాలు, వ్యాపారవేత్తయిన హజ్రత్ ఖదీజా, మహమ్మద్ ప్రవక్త దీక్షాదక్షతలను తెలుసుకొని, తన వ్యాపార బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆయన నిజాయితీని మెచ్చిన ఆమె, ఆయనకు భార్య కావడానికి సుముఖత వ్యక్తం చేశారు. అలా వారిరువురు జీవిత భాగస్వాములయ్యారు. సఫా పర్వతంపై నుంచి తొలి సందేశం అయితే మహమ్మద్ ప్రవక్త రోజురోజుకూ సత్యాన్వేషణపై దృష్టిని కేంద్రీకరించారు. అరబ్బు ప్రపంచంలో చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని యోచించారు. ఒంటరిగా నిత్యం తనలో తాను సంఘర్షించేవారు. బహు దేవతల ఆరాధనతో అనైక్యంగా ఉన్న ప్రజలందరినీ ఎలాగైనా ఐక్యం చేయాలని పరితపించేవారు. సంఘర్షణలు, యుద్ధాలు మాన్పించి, సమాజాన్ని శాంతి వైపు నడిపించాలని కలలుగనేవారు. ప్రజలనందరినీ ఏదైనా సందేశం వినిపించడానికో, హెచ్చరించడానికో చెట్టుమీదకు లేదా గుట్టమీదకు ఎక్కి అరవడం ఆ రోజుల్లో అలవాటుగా ఉండేది. ఒకరోజున మహమ్మద్ ప్రవక్త కూడా సఫా పర్వతంపై నుంచి అందర్నీ పిలిచి ‘‘కొండకు ఆవల ఒక పెద్ద సైన్యం నిలిచి ఉందని, అది మీపైకి దండెత్తడానికి సిద్ధంగా ఉందని నేనంటే నా మాటను నమ్ముతారా?’’ అని గట్టిగా అడిగారు. ‘‘నిస్సంకోచంగా నమ్ముతాం. మిమ్మల్ని సత్యసంధులుగా, విశ్వసనీయులుగానే చూశాం’’ అని ప్రజలు జవాబిచ్చారు. అప్పుడు మళ్ళీ మహమ్మద్ ప్రవక్త ‘‘జనులారా! నేను మిమ్మల్ని విగ్రహారాధన చేయరాదని కోరుతున్నాను. ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించాలని అడుగుతున్నాను. మీరు ఇది కాదన్నారంటే భయంకరమైన శిక్షకు గురవుతారు’’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మహమ్మద్ ప్రవక్త తొలి సందేశం ఇదే. అయితే అది విన్న ఖురైష్ ప్రజల కోపం కట్టలు తెంచుకున్నది, కల్లోలం రేగింది. మహమ్మద్ ప్రవక్తపైకి కత్తులతో దూసుకువచ్చారు. హజ్రత్ అనే వ్యక్తి ప్రవక్తకు రక్షణగా నిలిచి ఆయన కోసం ప్రాణత్యాగం చేశారు. ఇస్లాం మార్గంలో మొట్ట మొదటి షహదత్ ఆయనే. ఆ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రవక్త, ఆ తర్వాతా భౌతిక దాడులకు గురయ్యారు. అడుగడుగునా ఛీత్కారాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా క్రమంగా మహమ్మద్ ప్రవక్తను అనుసరించే ఇస్లామీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొట్టమొదట ఇస్లాంను స్వీకరించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జీవిత భాగస్వామి ఖదీజానే కావడం విశేషం. ఇస్లాం చరిత్ర గతిని మార్చిన మదీనా రాజ్యాంగం కానీ ప్రవక్తపై ఖురైష్ తెగ దాడులు తీవ్రమయ్యాయి. ఆయన అనుయాయులపైనా హింసాకాండ పెచ్చరిల్లింది. దీంతో మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి తన కార్యస్థలాన్ని మార్చాలని భావిస్తుండగా... మదీనా నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. మహమ్మద్ ప్రవక్తకు అండదండలందిస్తానని మదీనా నుంచి సమాచారం అందింది. ప్రవక్త తన మొదటి సందేశం వినిపించిన తర్వాత 11 ఏళ్లకు ఆరుగురు ప్రతినిధుల బృందం మక్కా వచ్చి ఆయనతో విస్తృతంగా చర్చలు జరిపింది. మరుసటి ఏడాది వచ్చిన 12 మంది ప్రతినిధులు ప్రవక్తతో జరిపిన చర్చలు, చేసిన ప్రతిజ్ఞ ‘అకాబా ప్రతిజ్ఞ’గా పేరు మోశాయి. ఆ తరువాత ప్రవక్త మదీనా పట్టణానికి చేరారు. మక్కాలోని ముస్లింలంతా ఆయనను అనుసరించి మదీనాకు వెళ్లారు. మదీనాలోని ఒకటి, రెండు మినహా అన్ని తెగలూ ప్రతి కుటుంబం నుంచి ఒక యువకుడిని ఇస్లాం సేవకు పంపాయి. దీంతో ఇస్లామియా ఉద్యమం కొత్త ఊపుతో ముందుకు సాగింది. మదీనాలో మహమ్మద్ ప్రవక్త తీసుకున్న రాజకీయ నిర్ణయం ఇస్లాం చరిత్ర గతినే మార్చివేసింది. మదీనాలోని యూదులకు, ముస్లింలకు మధ్య ఒక సామాజిక ఒప్పందాన్ని ఖరారు చేయడం వల్ల ఇస్లాం ఒక ప్రత్యేక దశలోకి అడుగుపెట్టింది. దీనినే ‘మదీనా కాన్స్టిట్యూషన్’ అంటారు. ప్రపంచంలోని తొలి లిఖిత పూర్వక రాజ్యాంగంగా కూడా పిలుస్తారు. ఈ ఒప్పందం ఇస్లాం రాజ్యానికి పునాదులు వేసింది. వ్యవస్థీకృత సమాజంలో దేవునికే సర్వసత్తాక అధికారం ఉంటుందని, దైవిక చట్టాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారని ఈ రాజ్యాంగం వ్యాఖ్యానించింది. మదీనాలోని స్థానిక అన్సార్లకు, మక్కా నుంచి వచ్చిన ముహజిర్లకు మధ్య సోదర సంబంధాలను నెలకొల్పడం ద్వారా ప్రవక్త నూతన సహోదర మానవ సంబంధాలకు పునాదిని వేశారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేయడానికి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాం మతం విస్తరించింది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు భూభాగాన్ని నవ నాగరికతలోకి నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. అందుకే ఆయన చూపిన శాంతి, ఐక్యత నుంచి స్ఫూర్తినొందడం అందరికీ అనుసరణీయమే. నేడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా... వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య( మొబైల్: 97055 66213)