కోల్ స్కాం.. జిందాల్‌కు బెయిల్
కోల్ స్కాం.. జిందాల్‌కు బెయిల్
Published Mon, Sep 4 2017 12:12 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఊరటనిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ సహా మరో ముగ్గురికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
మధ్యప్రదేశ్‌లోని ఉర్తన్ నార్త్ కోల్ బ్లాక్ కేటాయింపులో అవకవతవకల ఆరోపణలు రావటంతో విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ జిందాల్ సహా పలువురి పాత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో చేర్చింది. జిందాల్‌స్టీల్ పవర్ లిమిటెడ్ మాజీ డైరక్టర్ సుశీల్ మర్రూ, మాజీ మేనేజింగ్ డైరక్టర్ ఆనంద్ గోయల్, సీఈవో విక్రాంత్ గుజ్రాల్ లను కూడా నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఉర్తన్ నార్త్ కోల్ బ్లాకు కేటాయింపులో వీరు మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర జరిపారని సీబీఐ ఆరోపించింది.
అయితే బెయిల్ కోరుతూ వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం లక్ష రూపాయల పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. మరోవైపు జార్ఖండ్ అమరకొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో కూడా జిందాల్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Advertisement