Coal block scam
-
కోల్ స్కాం.. జిందాల్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఊరటనిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ సహా మరో ముగ్గురికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఉర్తన్ నార్త్ కోల్ బ్లాక్ కేటాయింపులో అవకవతవకల ఆరోపణలు రావటంతో విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ జిందాల్ సహా పలువురి పాత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో చేర్చింది. జిందాల్‌స్టీల్ పవర్ లిమిటెడ్ మాజీ డైరక్టర్ సుశీల్ మర్రూ, మాజీ మేనేజింగ్ డైరక్టర్ ఆనంద్ గోయల్, సీఈవో విక్రాంత్ గుజ్రాల్ లను కూడా నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఉర్తన్ నార్త్ కోల్ బ్లాకు కేటాయింపులో వీరు మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర జరిపారని సీబీఐ ఆరోపించింది. అయితే బెయిల్ కోరుతూ వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం లక్ష రూపాయల పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. మరోవైపు జార్ఖండ్ అమరకొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో కూడా జిందాల్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
నవభారత్ పవర్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సంస్థ నవభారత్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.186 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్(జప్తు) చేసింది. 2006 నుంచి 2009 మధ్య బొగ్గు బ్లాక్‌ల కోసం చేసిన దరఖాస్తుల్లో వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపిస్తూ.. సీబీఐ ఇప్పటికే ఈ కంపెనీ పేరును చార్జిషీట్లో చేర్చిన సంగతి తెలిసిందే. బొగ్గు స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జూలైలో తొలిసారిగా నాగ్‌పూర్ కంపెనీకి చెందిన రూ.24.50 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది. సీబీఐతో కలిసి దర్యాప్తు...: బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుల్లో అక్రమాలపై దర్యాప్తులో భాగంగా నవభారత్‌కు కంపెనీ, డెరైక్టర్ల ఆర్థిక లావాదేవీలను రికార్డు చేశాకే అటాచ్మెంట్ ఆదేశాలను జారీచేసినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అక్రమ సొమ్ముగా తేల్చిన రూ.186.11 కోట్ల మొత్తాన్ని కంపెనీ డెరైక్టర్లు ఇతర కంపెనీల్లో తిరిగి పెట్టుబడులుగా పెట్టారని.. ముఖ్యంగా డెరైక్టర్ పి. త్రివిక్రమ ప్రసాద్ నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.147.99 కోట్ల విలువైన 73.99 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ షేర్ల ప్రస్తుత అటాచ్మెంట్ విలువ రూ.138.59 కోట్లుగా పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన జోనల్ కార్యాలయం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇక నవభారత్ పవర్‌కు చెందిన మరో డెరైక్టర్ వై.హరీష్ చంద్ర ప్రసాద్ మహాలక్ష్మి విండ్‌పవర్ హైదరాబాద్ అనే సంస్థలో చేసిన రూ.45.19 కోట్ల పెట్టుబడులను(జప్తు విలువ రూ.36.32 కోట్లు) అటాచ్ చేసినట్లు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లాలోని రూ.11.20 కోట్ల విలువైన భూమిని కూడా సీజ్ చేసినట్లు కూడా పేర్కొంది. సీబీఐతో కలిసి ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. -
నేను దోషినైతే మన్మోహన్ కూడా దోషే: పరేఖ్
-
నేను దోషినైతే మన్మోహన్ కూడా దోషే: పరేఖ్
న్యూఢిల్లీ: బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణం ఛార్జ్షీటులో తన పేరు చేర్చటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాను దోషిని అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా దోషేనని పరేఖ్ వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమారమంగళం బిర్లా(46)పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణం కేసులో తనను ఇరికిస్తున్నారని పీసీ పరేఖ్ మండిడ్డారు. ప్రభుత్వం తీసుకున్న పాలసీనే తాను అమలు చేశానని అన్నారు. అంతిమ నిర్ణయం తీసుకున్న ఆనాటి బొగ్గు శాఖ మంత్రిని, ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించకుండా.... తన పేరురను ఛార్జిషీట్లో పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేట్ సంస్థలకు లబ్ది చేకూరేలా గనులను కేటాయింపు జరిగిందని సీబీఐ భావిస్తే.... ఆ నిర్ణయం తీసుకున్న అందరిని దోషులుగా పేర్కొనాలని డిమాండ్ చేశారు. గనుల కేటాయింపులో ఆయనతోపాటు,పీసీ పరేఖ్, కొంతమంది అధికారులు అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. -
కుమార మంగళం బిర్లాను విచారించనున్న సీబీఐ!
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కుమ్మక్కై దేశ సహజ సంపదను దోపిడీ చేసిన సంఘటనలో సంచలనాలు నమోదు అవుతున్నాయి. భారతీయ పారిశ్రామిక రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన కుమార మంగళం బిర్లా పేరును సీబీఐ.. బొగ్గు కుంభకోణం నిందితుల జాబితాలో చేర్చింది. 14వ ఎఫ్ఐఆర్లో బిర్లాతో పాటు ఆయనకు చెందిన హిందాల్కో కంపెనీ పేరును, ప్రభుత్వ రంగ సంస్థ అయిన నాల్కో పేరును కూడా చేర్చింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ, కోల్‌కతా, భువనేశ్వర్, ముంబాయి, హైదరాబాద్‌ల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కుమార్ మంగళం బిర్లా కంపెనీకి 2005లో బొగ్గు గనులు కేటాయించడంలో అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. 46 ఏళ్ల బిర్లా.. ఈ కేసులో కుట్ర, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కుమార మంగళం బిర్లాను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఇదే కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. బొగ్గు శాఖ ప్రధానమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. పారదర్శకంగా వేలం పాట నిర్వహించకుండా ఇష్టానుసారం బొగ్గు గనులు కేటాయించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరితగతిన విచారణ జరపాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బొగ్గు కుంభకోణంలో సీబీఐ మళ్లీ సోదాలు
-
బొగ్గు కుంభకోణంలో సీబీఐ మళ్లీ సోదాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మళ్లీ సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, కోల్‌కతా, ముంబయిలలో సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కుంభకోణంలో చార్జీషీట్లో తాజాగా ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేరును ఛార్జీషీట్లో చేర్చింది. అలాగే బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి. పరేఖ్ పేరు కూడా చార్జీషీట్లో నమోదు చేసింది. ఇక యుపిఎ-1 హయాంలో ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా బొగ్గు మంత్రిత్వశాఖను పర్యవేక్షించిన కాలంలో చోటుచేసుకొన్న భారీ బొగ్గు కేటాయింపుల కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం జరిగిందని కంట్రోలర్, ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించిన వైనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2 జి స్పెక్ట్రమ్ కేసులో లక్ష డెబ్బై వేల కోట్ల నష్టం జరిగిందని వెలుగులోకి తెచ్చిన కాగ్ ఆతర్వాత బొగ్గు గనుల కేటాయింపులో వేలం పాటలు నిర్వహించనందున పదిలక్షల డెబ్బైవేల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని లెక్కగట్టింది.