న్యూఢిల్లీ: కేంద్ర బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాలు కలసి జిందాల్ గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపులో కుట్ర చేశారని సీబీఐ సోమవారం ప్రత్యేక కోర్టులో తెలిపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్‌లకు అమరకొండ బొగ్గు గనులను కేటాయించేందుకు జార్ఖండ్ ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందని పేర్కొంది. అప్పుడు కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్న దాసరి నారాయణరావు, మధుకోడా, నవీన్ జిందాల్, హెచ్‌సి గుప్తాలు కుట్రలో భాగస్వాములంది.
ఈ రెండు సంస్థలకు గనుల కేటాయించటాన్ని స్క్రీనింగ్ కమిటీ తిరస్కరించిన తరువాత కూడా గుప్తా వీటికోసం సిఫార్సు చేశారని పేర్కొంది. జిందాల్, దాసరి లాయర్లు దీన్ని తోసిపుచ్చారు. దాసరి సహాయమంత్రి కావటం వల్ల.. కేటాయింపుల్లో ఆయన పాత్ర ఏదీ లేదని ఆయన లాయర్ అన్నారు. తుది నిర్ణయాన్ని తీసుకున్నది ఆనాడు బొగ్గు శాఖనూ పర్యవేక్షించిన ప్రధాని మన్మోహన్‌సింగేనన్నారు.
‘జిందాల్‌కు బొగ్గు’లో దాసరి కుట్ర: సీబీఐ
Published Tue, Nov 3 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM
Advertisement