దాసరిని వెంటాడుతున్న కోల్ స్కామ్
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును కోల్ స్కామ్ వెంటాడుతోంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో దాసరి నారాయణరావుపై సీబీఐ బుధవారం మరో ఛార్జిషీటు దాఖలు చేసింది. అమరకొండ ముర్గాదంగల్(జార్ఖండ్) బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో ఆయన పాటు 14 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది.
మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాలపై అభియోగాలు మోపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో పెట్టారు. నేరపూరిత కుట్ర, ఛీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. ఈ ఛార్జిషీట్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం పరిశీలించనుంది.