నవీన్ జిందాల్ ను ప్రశ్నించనున్న సీబీఐ
బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ను దేశపు అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) శుక్రవారం ప్రశ్నించనుంది. 2008లో బిర్బమ్ లని అమరకొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాక్ ను దక్కించుకునేందుకు నేరపూరితమైన కుట్రకు, చీటింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో నవీన్ జిందాల్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బొగ్గు నిల్వల కేటాయింపు కుంభకోణంలో ఈ సంవత్సరం జూన్ లో నమోదు చేసిన 12వ ఎఫ్ఐఆర్ లో నవీన్ జిందాల్ పేరును సీబీఐ పేర్కోంది.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సీబీఐ జారీ చేసిన సమన్లపై సమాచారం సేకరించేందుకు ఈ మెయిల్, ఫోన్ ద్వారా చేసిన ప్రయత్నాలకు ఎలాంటి స్పందన లభించలేదు. అయితే నవీన్ జిందాల్ శుక్రవారం విచారణకు హాజరు కావొచ్చనే వార్తలు వెలువడుతున్నప్పటికి.. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.