నవీన్ జిందాల్ విదేశీ యానానికి అనుమతి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ విదేశీ పర్యటనకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు జూన్ 14 నుంచి 29 వరకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది.
బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, నవీన్ జిందాల్, మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సహా పలువురి పేర్లను సీబీఐ చార్జిషీటులో చేర్చిన సంగతి తెలిసిందే. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో పెట్టారు.