Economically
-
జగన్ అద్భుత పాలన... ఆర్థికంగా ఏపీ బలోపేతం
-
ప్రపంచంలోని టాప్ 10 ఆర్థికంగా స్థిరమైన దేశాలు (ఫోటోలు)
-
దేశం సుసంపన్నం కావాలంటే..
నా సహోద్యోగులు, స్నేహితులు, దేశవాసులతో పాటు.. తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే భారతదేశం కోసం నేను కల కంటుంటాను. భారత పారిశ్రామిక ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యు డిగా నా మనస్సులో ఏడు సూత్రాల ఎజెండా ఉంది. ఈరోజు మనం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గురించి, నవతరం సంపద సృష్టికర్తల పురోగతి గురించి సంబరంగా మాట్లాడుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా భావనను ఈ స్టార్టప్స్ ముందుకు తీసుకెళతాయి. భారత్‌ను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఈ ఏడు సూత్రాలను పరిశీలిద్దాం. ఒకటి. 2020 సంవ త్సరం గణాంకాలను చూసినట్లయితే మన జనా భాలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్లో 80 శాతం మేరకు 20 శాతం ఆదాయ పన్నుచెల్లింపుదారుల నుంచి వస్తోంది. అంటే అధికాదాయం పొందు తున్న 0.4 శాతం మంది వ్యక్తులు 80 శాతం పన్నులను చెల్లిస్తున్నారు. వీరిని మనం తప్పకుండా గౌరవించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల్లో చాలామంది వేధింపులకు గురవుతున్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 2019లో అధికాదాయం కలిగిన వారిలో 7 వేలమంది విదేశాలకు వలస వెళ్లిపోయారని వార్తలు. ఇలా దేశం విడిచిపెట్టిన వారిలో చాలామంది తమచుట్టూ విషపూరితమైన వాతావరణం, వేధింపుల గురించి మాట్లాడు తున్నారు. అలా దేశాన్ని వదిలి వెళ్లిపోయిన సంపద సృష్టికర్తలందరినీ తిరిగి వెనక్కు తీసుకొచ్చి జాతి ఉన్నతి కోసం వారు పాటుపడేలా ప్రోత్సహించే రోజు కోసం నేను కలగంటున్నాను. 2. పారిశ్రామిక నేతలు తరచుగా ప్రభుత్వంతో తమ సంప్రదింపుల గురించి మాట్లాడుతుంటారు. అయితే పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం కొరవడటం గురించి ఒక సందర్భంలో కూడా వీరు మాట్లాడటం లేదు. అందుకే న్యాయమైన, పార దర్శకమైన వ్యవస్థ కోసం మనందరం ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంది. 3. సులభతర వాణిజ్య సూచికి సంబంధించి తన స్కోరును పెంచుకోవడంలో భారత్ ఎంతో మెరుగైంది. వాణిజ్యవర్గాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రశంసలు అందుకుంటోంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో గొప్ప సానుకూలత ఉంది. ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిబద్ధతను ప్రదర్శించింది. అయితే వాణిజ్య రంగంలో మనం చేయవలసింది ఎంతో ఉంది. 4. నిష్పక్షపాతమైన, న్యాయమైన, సంతోష కరమైన సమాజానికి హామీ ఇచ్చేలా న్యాయ సంస్కరణల దిశగా మనం కృషి చేయవలసిన అవ సరం ఉంది. 5. పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో చాలా రాష్ట్రాలు అమలుపర్చలేదని తాజా నివేదిక తెలి పింది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి. 6. నాణ్య మైన విద్యను మనం మెరుగుపర్చాలి. 2020 జాతీయ విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నాం. శిక్షణ పొందిన, ఉపాధి పొందగల శ్రామిక శక్తికి భరోసా ఇచ్చేలా శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. 7. నేడు భారత్ అవకాశాలు పురివిప్పుతున్న దేశం. నిజంగానే కోవిడ్–19 మహమ్మారి అనిశ్చిత త్వాన్ని పరిష్కరించడంలో మన సామర్థ్యాన్ని పరీ క్షించింది. ఈ విషయంలో మరిన్ని çసృజనాత్మక ఆవిష్కరణలు రావాల్సిన తరుణమిది. దేశం పోకడ గురించి అనేక వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. భేదాభిప్రా యాలు, చీలికలు మనల్ని కలవరపెడుతున్న ప్పుడు త్రివర్ణ పతాకాన్ని మన మనస్సులో ఉంచు కోవలసిన సమయమిది. జాతీయ జెండా కంటే మించిన ఐక్యతా చిహ్నం మరొకటి లేదు. – నవీన్ జిందాల్ చైర్మన్ – జిందాల్ స్టీల్ అండ్ పవర్, మాజీ ఎంపీ -
కాపులు బీసీలా? ఓసీలా? అన్న అయోమయానికి బాబు గురిచేశారు: సీఎం జగన్
-
కరోనా : ఆర్థిక ఆరోగ్యానికి అయిదు టీకాలు
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాము. ఏడాది పాటు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పుడు రెండు టీకాలు తీసుకుంటే ‘‘కరోనా’’ నుంచి మనకు పూర్తి రక్షణ ఏర్పడినట్టే. ఇది ఆరోగ్యానికి సంబంధించింది. కానీ, ఇదే జాగ్రత్త వ్యక్తిగత ఆర్థిక అంశాల్లోనూ తీసుకోవాలి. ఇక్కడ పేర్కొన్న అయిదు సూత్రాలను సకాలంలో పాటించడం ద్వారా (వీటిని టీకాలు అనుకొండి) మీ వ్యక్తిగత ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకోవచ్చు. ప్రణాళిక ప్రకారం సాగితే పొదుపు... మదుపు... ఎటువంటి కుదుపులు లేకుండా సజావుగా వెళ్లిపోతుంది. ►త్వరలో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలోని వ్యవహారాలను సమీక్షించండి. జీతం తగ్గిపోయి ఉండొచ్చు. రావల్సిన అద్దె రాకపోయి ఉండొచ్చు. లాభాలు అంచనాలను అందుకోలేపోయి ఉండొచ్చు. కరోనాతో ఆదాయానికి గండి పడింది. ఖర్చులు మాత్రం ఏమీ తగ్గలేదు. దీంతో దాచుకున్న నిల్వలు తరిగిపోయి ఉండొచ్చు. కరోనా మహమ్మారి ఖర్చులు తగ్గించుకోవాలన్న సంకేతాన్ని ఇచ్చింది. అనవస రపు ఖర్చులను ఎంత తగ్గించామో సమీక్షించుకోండి. (జియోకు షాకిస్తున్న ఎయిర్టెల్) ► రాబోయే ఆర్థిక సంవత్సరానికి తగిన ప్రణాళికలు వేయండి. వ్యాపారస్తులు కరోనా చేదు అనుభవాల నుంచి తేరుకొని ఏం చేయాలో ఆలోచించండి. వేతన జీవులు కూడా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి. ఆదాయపు పన్ను భారం తగ్గలేదు. పెరగలేదు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, స్థిరాస్థి క్రయ విక్రయాలు గురించి ఆలోచించండి. పెద్ద పెద్ద కమిట్స్మెంట్ ఏవీ పెట్టుకోకండి. ► ఆర్థిక ఆలోచనలను మీరు ఒక్కరికే పరిమితం చేయకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి. కరోనా తెచ్చిన కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో వ్యాపారస్తులు ఆలోచించండి. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచింది. హంగులు, ఆర్భాటాల జోలికెళ్లకండి. అద్దె ఇళ్లలో ఉంటూ వ్యాపారం చేసే బదులు సొంత ఇళ్లలో వ్యాపారం చేయడం ఉత్తమం. ► జరిగేవన్నీ మంచికే అనే వేదాంత ధోరణి కాకుండా ముందు జాగ్రత్తగా.. ఆదాయపు వనరులు, ఖర్చుల గురించి వార్షిక ప్రణాళికలు వేసుకోండి. ప్రణాళికలు పక్కాగా ఉంటే పొర పాట్లు జరగవు. అనుకోని ఆర్థిక విపత్తులు ఎదురైనా ముందస్తు ఆలోచనల ద్వారా బయటపడొచ్చు. ► సంపాదించిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకోండి. నగదు వ్యవహారాలకు స్వస్తి పలకండి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్థిరాస్తి లావాదేవీల సమగ్ర సమాచారం అధికారుల వద్ద ఉంది. లెక్కలు సక్రమంగా చూపించండి. పొదుపు చేయండి. చేతనైతే విరాళాలు ఇవ్వండి. పన్ను భారం అడ్వాన్సు టాక్స్ రూల్స్ ప్రకారం చెల్లించండి. ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించే బదులు వాయిదాల ప్రకారం చెల్లించండి. ఏ ఆందోళనా ఉండదు. ఇలా ప్రణాళిక బద్ధంగా వెళితే మీ ఆరోగ్యంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆరోగ్యంగా, నిలకడగానూ ఉంటుంది. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
పాములపాడు(వేములపల్లి) : మహిళలు పొదుపు చేసుకోని ఆర్థికంగా ఎదగాలని ఏపీజీవీబీ మేనేజర్లు వెంకటేశ్వర్రావు, సత్యనారాయణ అన్నారు. మంగళవారం పాములపాడు గ్రామీణ వికాస బ్యాంకులో మహిళ సంఘాలకు జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చే పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, సంఘాల మహిళలు వీరమళ్లు, మమత, గౌసు, సైదులు, ఉపేందర్, సతీష్ తదితరులున్నారు. -
ఏపీని ఆర్థికంగా ఆదుకుంటాం:జైట్లీ
-
గ్రీస్ కొత్త ప్రతిపాదనలకు యూరో గ్రూప్ ఓకే!
బ్రసెల్స్: ఇప్పటికే దివాలా తీసి ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న గ్రీస్.. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి రుణదాతల కఠిన షరతులకు తలొగ్గింది. కొత్తగా బెయిలవుట్ ప్యాకేజీ కోరుతూ సవివర ప్రతిపాదనలను యూరోజోన్ నేతలకు అందజేసింది. ఇందులో ముఖ్యంగా పెన్షన్ల తగ్గింపు, విలువాధారిత పన్ను(వ్యాట్) పెంపు వంటి కీలక సంస్కరణ చర్యలు ఉన్నాయి. ప్రతిపాదనల సమర్పణకు గురువారం అర్ధరాత్రిని డెడ్‌లైన్‌గా విధించగా.. దీనికి రెండు గంటల ముందు గ్రీస్ వీటిని యూరో గ్రూప్ ప్రెసిడెంట్ జెరోన్ దిసెల్బ్లోయెమ్కు అందించింది. కాగా, గ్రీస్ సంస్కరణ ప్రతిపాదనలకు ప్రాథమికంగా యూరో గ్రూప్ వర్గాలు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, నేడు(శనివారం) యూరోజోన్ ఆర్థిక మంత్రుల సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించనున్నారు. ఆ తర్వాత ఆది వారం జరిగే కీలకమైన 28 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) అధినేతల సదస్సులో బెయిలవుట్ ఇవ్వాలా, వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
ఆ విషయంలో... వయసును బట్టే వాయిదా!
కౌన్సెలింగ్ సంతానం కలగక ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపుటలవాట్లు... కారణమేదైతేనేం అనేకమంది మాతృత్వానికి నోచుకోలేకపోతున్నారు. పిల్లలు కలగకపోవడం ఒక సమస్య అయితే ఆ సమస్య కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. పెళ్ళయ్యాక చాలామంది దంపతులు ముందుగా వారు ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. అలా చేయడం మంచిదే కాని మీ వయసును దృష్టిలో పెట్టుకుని అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మూడేళ్ళు...నాలుగేళ్ళు అంటూ నియమం పెట్టుకునే మందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ముప్ఫై ఏళ్ళు దాటాక పిల్లలు కనడం మహిళల విషయంలో మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. చాలామంది దంపతుల విషయంలో డాక్టర్లు ఏ లోపమూ లేదని చెబుతారు. ఇంకొంత కాలం ఎదురు చూడమంటారు. ఈలోగా ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు దంపతుల్ని అనవసరపు ఒత్తిడికీ, ఆందోళనకూ గురి చేస్తుంటాయి. మాటిమాటికీ పిల్లల తలంపు ఎత్తడం వల్ల ఏర్పడే ఒత్తిడి దాంపత్య జీవితంపై చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇటు పుట్టింటివారు, అటు అత్తింటి వారు మాటిమాటికి అమ్మాయినే అడగడం, తోటివారితో పోల్చడం వల్ల మానసికంగా కుంగిపోతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. దంపతులిద్దరూ పెద్దవాళ్ళకు నిర్మొహమాటంగా తమ ప్లానింగ్ గురించి చెప్పేయడం ఉత్తమం. ఒకవేళ డాక్టర్లు లోపం ఉందని చెబితే దాని గురించి కూడా వివరంగా చెప్పి, మీ భవిష్యత్ ప్రణాళిక గురించి ముందుగా మీరే చెబితే వారు కూడా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు పుట్టకపోవడానికి లోపం దంపతులిద్దరిలో ఉంటుంది. మహిళలకు లోపం ఉంటే ఆ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పేస్తారు. అదే అబ్బాయికి ఏదైనా సమస్య ఉంటే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల భార్య అనవసరపు అభాండాలకు గురవుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్ళు అవసరమైన చికిత్సకు ముందుకెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి. ఎంత వైద్యం చేయించుకున్నా ప్రయోజనం లేకపోతే అనవసరపు బెంగలు పెట్టుకోకుండా దత్తత మార్గాన్ని ఎంచుకోవడంలో తప్పు లేదు. ఏళ్ళ తరబడి పిల్లల కోసం ఎదురుచూస్తూ, వైద్యం పేరుతో ఆరోగ్యం పాడుచేసుకునే బదులు ఓ బిడ్డను పెంచుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. - డాక్టర్ పద్మా పాల్వాయి, సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పటల్