చిట్యాల : డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి,
చిట్యాల (నకిరేకల్) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ అమలు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే తెలంగాణ.. అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతోందని తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడులో దశమి ల్యాబ్స్ పరిశ్రమ యజమాన్యం ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను గురువారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం గుండ్రాంపలిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
నకిరేకల్ నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్ల కాలంలోనే రూ.రెండు వేల కోట్లతో ఆభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గుండ్రాంపల్లి గ్రామంలో మరో 150 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని, కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆయా కార్యక్రమాల్లో జేసీ నారాయణరెడ్డి ,ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ బట్టు అరుణ అయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ రాచకొండ లావణ్య క్రిష్టయ్య, తహసీల్దార్ సీహెచ్.విశాలాక్షి, ఎంపీడీఓ జి.కాంతమ్మ, ఈఓపీఆర్‌డీ బి.లాజర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఎద్దులపురి క్రిష్ణ, గుండెబోయిన సైదులు, బెల్లి సత్తయ్య, బక్క శేఖర్, గోలి మహేష్, బైకాని నాగరాజు, బోడిగె అంజయ్య, నర్సింహ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
నార్కట్‌పల్లి (నకిరేకల్) : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బి.వెల్లెంలలో రూ.5కోట్లతో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.రాష్ట్రంలో నేటి వరకు 2లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రూ.700కోట్లతో ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. రూ.30కోట్లతో ప్రతి జిల్లాలో మత్సకార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బి.వెల్లెంల ఉదయ సముద్రంప్రాజెక్టు రెండు నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నార్కట్‌పల్లి మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment