
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్‌లో జరుగుతున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ పొడిగింపుపై బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం సమావేశమాయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల పూర్తిస్థాయి జీతాల చెల్లింపునకు సీఎం సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెన్షనర్లకు కూడా కోతల్లేకుండా మొత్తం చెల్లించే యోచనలో సీఎం ఉన్నట్టు తెలిసింది. లాక్‌డౌన్ సడలింపులకు సంబంధించి కేంద్రం విడుదల చేసే మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర సర్కారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
(చదవండి: పలు సడలింపులతో మరో లాక్‌డౌన్ ?)
అయితే, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, మతపరమైన సంస్థల ప్రారంభానికి కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోకపోచ్చని తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసులు, సీటీ బస్సు సర్వీసులపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. అయితే, రాష్ట్రం మొత్తంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నందున ప్రజా రవాణాకు అనుమతులు ఇవ్వకపోవచ్చు. స్కూళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వకపోవచ్చు. కరోనా కట్టడికి ప్రస్తుతం ఉన్న నిబంధనలే యధావిధిగా అమలు చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.
(చదవండి: ప్రాణాలు నిలిపిన కరోనా లాక్‌డౌన్!)
Comments
Please login to add a commentAdd a comment