Lockdown In Telangana: పదిరోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది - Sakshi
Sakshi News home page

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్‌

Published Tue, May 11 2021 2:05 PM | Last Updated on Tue, May 11 2021 4:25 PM

Telangana CM KCR Cabinet Meeting On Lockdown Live Updates In Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ కట్టడి కోసం రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. తెలంగాణ హైకోర్టుతో సహా పలు సంస్థలు లాక్‌డౌన్‌ విధించిడమే సరైన మార్గం అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. అదే విధంగా.. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ సర్కారును ప్రశ్నించింది. ఇక పాతబస్తీలో కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదన్న న్యాయస్థానం.. లాక్‌డౌన్‌ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

చదవండి: కోవిడ్‌ సంక్షోభ సమయంలో.. ఆదర్శం ఈ అపార్ట్‌మెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement