Lockdown In Telangana, CM KCR Clarifies About Lockdown In Telangana - Sakshi
Sakshi News home page

తెలంగాణలో లాక్‌డౌన్‌?.. 15వ తేదీ నుంచి అమల్లోకి..!

Published Tue, May 11 2021 1:41 AM | Last Updated on Tue, May 11 2021 11:11 AM

Lockdown In Telangana? CM KCR To Hold Meeting On May 11 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రంజాన్‌ పండుగ (శుక్రవారం) మరుసటి రోజు నుంచి అంటే.. ఈనెల 15 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు న్నాయి.  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. పూర్తిగా అదుపులోకి రాని కరోనా కేసులకు అడ్డుకట్ట వేయా లంటే లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు అధి కారవర్గాల సమాచారం.

దాదాపుగా పొరుగు రాష్ట్రా లన్నీ ఇప్ప టికే లాక్‌డౌన్‌ విధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18 గంటల కర్ఫ్యూ అమలవు తుంటే.. రాష్ట్రంలో మాత్రం రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంది. పగటిపూట అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గడం లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బాధితులకు నగరంలోని అనేక ఆçస్పత్రుల్లో పడకలు సైతం లభించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ అనివార్యమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రజలు నిర్లక్ష్యం వీడకపోవడం వల్లే... 
లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిం టుందని, పేదలకు ఉపాధి కరు వవుతుందని, లాక్‌డౌన్‌ విధిం చిన రాష్ట్రాల్లోనూ పెద్దగా ప్రయోజనం కన్పించడం లేదని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కర్ఫ్యూలేని పగలంతా ప్రజలు స్వీయ నియంత్రణ లేకుండా వ్యవహరించడం, కనీస భౌతిక దూరం పాటించక పోవడం, ఎంతగా హెచ్చరిస్తున్నా మాస్క్‌లు సైతం పెట్టుకో కుండా తిరుగుతున్న నేపథ్యంలో.. మున్ముందు పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం ఉందనే భావనకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుని క్రమేణా తగ్గుతున్న విషయం విదితమే.

ఈ విధంగా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో కేసులు నమోదు ప్రారంభమైతే పరిస్థితి చేయి దాటిపోతుందని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా కరోనా వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వైద్యరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  చదవండి: (కరోనా నెగెటివ్‌ వచ్చినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..)

కరోనా పరీక్షలు, టీకాల పైనా చర్చ
కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న తీరు, వ్యాక్సిన్ల లభ్యత, మొదటి డోసు మాట అలా ఉంచితే.. రెండో డోసు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరడం తదితర అంశాలన్నింటినీ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ విధిస్తే రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయంపై కూడా చర్చించనున్నారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఈ నెల 15 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టుగా ప్రకటిస్తే... నగరంలో ఉన్న వలస కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రెండుమూడు రోజుల్లో తమ స్వస్థలాలకు వెళ్లడానికి అవకాశం లభిస్తుందని, ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి వీలవుతుందని, ధాన్యం కొనుగోళ్లు క్రమబద్ధీకరించడానికి కూడా అవకాశం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. 

నేడు మంత్రివర్గ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది  రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై కేబినెట్‌ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా కరోనా వ్యాప్తి అంతగా తగ్గలేదన్న నివేదికలు ఉన్నాయని, అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని వర్గాలు లాక్‌డౌన్‌ కావాలని కోరుతున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఎదురయ్యే సాధక బాధకాలతో పాటు  రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై దీని ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై మంత్రివర్గం  చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.  
(చదవండి: తెలంగాణలో వ్యాక్సిన్‌ టెన్షన్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement