సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్‌కు మేనమామ వరుస అయ్యే గునిగంటి కమలాకర్‌రావు (94) శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్‌లో సొంత ఇంటిలో కన్నుమూశారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్‌రావు చాలా కాలంగా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నారు. ఆయన సంతానం అంతా హైదరాబాద్‌లో ఉంటారు. కాగా పదేళ్ల క్రితం కమలాకర్‌రావు భార్య చనిపోయినపుడు దశదిన కర్మకు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ హాజరయ్యారు.
కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్ తన మేనమామ ఇంటికి బాల్యంలో అనేక సార్లు వచ్చేవాడినని, అప్పుడు కామారెడ్డి గంజ్‌లో బెల్లం వాసన గుప్పుమని వచ్చేదంటూ గుర్తు చేసుకునే వారు. కమలాకర్‌రావు అంత్యక్రియలకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.
(చదవండి: వ్యవసాయ భూముల విలువ.. 42 గ్రామాల్లో 150% పెంపు)
Comments
Please login to add a commentAdd a comment