Nakirekal
-
అడవి నుంచి అసెంబ్లీ దాకా..
నకిరేకల్ : అడవిబాట పట్టి ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి నకిరేకల్ నియోజకవర్గం నుంచి 2014 ఎమ్మెల్యేగా గెలిచారు వేముల వీరేశం. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. కుటుంబ నేపథ్యం.. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వేముల వీరేశం సీపీఐ(ఎంఎల్) నేత యానాల మల్లారెడ్డి స్ఫూర్తితో ప్రగతిశీల ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. తర్వాత సీపీఐ(ఎంఎల్) జనశక్తి విప్లవ ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 2004లో ప్రభుత్వ చర్చల సమయంలో జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న వేముల వీరేశం 2005 ఆగస్టులో విజయవాడలో అరెస్టయి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం వీరేశంపై పోలీసులు అక్రమ కేసులు మోపే ప్రయత్నం చేయగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో సీపీఐ(ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అమర్ అరెస్టు అనంతరం ఆయన బాధ్యతలను వేముల వీరేశం చేపట్టారు. అప్పటి నుంచి 2009 జూలై వరకు వీరేశం అజ్ఞాతంలోనే ఉన్నారు. 2009లో టీఆర్ఎస్లో చేరిక.. పోలీసుల నుంచి విముక్తి పొందిన వేముల వీరేశం నకిరేకల్‌లో ఉంటూ కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూనే 2009లో గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆశీస్సులతో టీఆర్ఎస్లో చేరారు. 2013లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం నాటి సీమాంధ్ర పాలకులు ప్రజా ఉద్యమంపై ఉక్కపాదం మోపి వేముల వీరేశాన్ని ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ కాలంగా విద్యార్థి, విప్లవ ఉద్యమంలో వీరేశం పనిచేసిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకొని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వ్యవస్థ మారాలని, ప్రజల సమస్యలు తీరాలనే లక్ష్యంతో ఉద్యమాలు నడిపారు. అజ్ఞాతంలో ఉన్న వీరేశంను 2009 జూలై 2వ తేదీన హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. వీరేశానికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరేశం భార్య పుష్ప కూడా కళాకారురాలిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రతినిధిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో విజయం తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో నకిరేకల్ నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న వేముల వీరేశం కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. -
బీఆర్ఎస్ పార్టీకి వేముల వీరేశం రాజీనామా
సాక్షి, నల్లగొండ జిల్లా: టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో నిరాశే మిగిలింది. దీంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ‘‘వేముల వీరేశం ఏం చేశాడని నాలుగున్నరేళ్లుగా హింసిస్తున్నారు. ఉద్యమకాలంలో దెబ్బలు తిని జైలుకు పోయింది నేను కాదా.. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో కొట్టించినా జిల్లా నాయకత్వం పట్టించుకోలేదు. గన్మెన్లను కూడా తొలగించారు. ఇన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్: బండి సంజయ్ ‘‘ఈ రోజు నుంచి బీఆర్ఎస్తో తనకు ఉన్న బంధం తెగిపోయింది. నా రాజీనామా లేఖను అనుచరులు, నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతున్నా. నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా’’ అంటూ వీరేశం సవాల్ విసిరారు. -
ఎమ్మెల్యే చిరుమర్తికి మంత్రి కేటీఆర్ ఫోన్..!
నకిరేకల్ : నియోజకవర్గంలో కరోనా వైరస్ విజృంభణపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ చేసి కరోనా పరిస్థితులు, మహమ్మారి నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ఏ విధంగా సాగుతోందని అడిగి తెలుసుకున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపాలని, మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు సమకూర్చుతామని తెలిపారు. కరోనా బాధితులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే కరోనా బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భరోసా ఇచ్చారు. నకిరేకల్ మున్సిపాలిటిలోని 1,2,5,6,17,20 వార్డులలో ఆదివారం ఆయన పర్యటించారు. కరోనా బారిన పడి మృతి చెందిన 15 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.1.50లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. కరోనా వచ్చిందని అధైర్యపడకుండా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అదే విధంగా అన్ని పీహెచ్సీలలో కరోనా టెస్టులు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు కందాల భిక్షం రెడ్డి, రాచకొండ సునీల్‌గౌడ్, పల్లేవిజయ్, చెవుగోని రాములమ్మ ఉన్నారు. చదవండి: Corona: పిల్లల్లో కోవిడ్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి? -
ఉరి వేసుకుని వీఆర్వో ఆత్మహత్య
సాక్షి, నకిరేకల్: పని ఒత్తిడితో నెలరోజులుగా విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న ఓ వీఆర్వో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నకిరేకల్ మండలం నోముల గ్రామ వీఆర్వోగా శాలిగౌరా రం మండలం తక్కళ్లపాడుకి చెందిన మొగిలి సోమనర్సయ్య(53) పనిచేస్తున్నాడు. గతంలో ఇతను శాలిగౌరారం, కేతేపల్లి, మునుగోడు మండలాల్లో పని చేశాడు. 5 నెలల క్రితం మునుగోడు నుంచి నకిరేకల్ మండలం నోములకు బదిలీపై వచ్చాడు. ఇదే మండలంలోని పన్నాలగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల భూ సమస్యలు అధికంగా వస్తుండడంతో పని ఒత్తిడి పెరిగింది. కాగా, అతను విధులకు సరిగా హాజరుకాకపోవడంతో అధికారులు ఇటీవల కలెక్టర్‌కు సరెండర్ చేశారు. దీంతో సోమనర్సయ్య నెల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. బుధవారం ఉదయం 10 గంటలకు భార్యకు చెప్పి బయటకువెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి 100కు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హరిబాబు తెలిపారు. దీనిపై స్థానిక తహసీల్దార్ జంగయ్య మాట్లాడుతూ సోమనర్సయ్య నెల నుంచి విధులకు రావడం లేదని, దీంతో కలెక్టర్‌కు సరెండర్ చేశామని చెప్పారు. -
టీఆర్ఎస్కు బ్రహ్మరథం : వీరేశం
సాక్షి, నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా న కిరేకల్ మండలం నెల్లిబండ, నకిరేకల్‌లోని రెహమత్నగర్, 5, 12, 13, 14వ వార్డుల్లో సోమవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నెల్లిబండ గ్రామంలో ప్రజలు కోళాటాలు, పూల వర్షంతో స్వాగతం పలికారు. నకిరేకల్‌లోని 5వ వార్డులో, రెహమత్‌నగర్‌లో వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మరోసారి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పల్రెడ్డి నర్సిం హారెడ్డి, కొండ వెంకన్నగౌడ్, జెట్పీటీసీ పెండెం ధనలక్ష్మీసదానంద,ం నెల్లిబండ సర్పంచ్ ముస్కు పాపమ్మపుల్లయ్య, నాయకులు వీర్లపాటి రమేశ్, యానాల లింగా రెడ్డి, మంగినపల్లిరాజు, కొండ శ్రీను, సామ శ్రీని వాస్‌రెడ్డి, యానాల శేఖర్‌రెడ్డి, రాచకొండ వెంకన్న, య ల ్లపురెడ్డి సైదారెడ్డి, కదిరె రమేశ్, షబానా, చిట్యాల, ని ర్మల, నర్సింహ, గంగాధర పద్మ, సబితలు ఉన్నారు. ఆశీర్వదించి మరోసారి గెలిపించాలి.. నార్కట్‌పల్లి : ప్రజ సేవ చేయడానికి మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెమ్మాని గ్రామంలో సోమవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే మరోసారి తనను గెలిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, గంట్ల నర్సిరెడ్డి, సట్టు సత్తయ్య, గాయం శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఊయాల అనితవెంకన్న, తదితరులు ఉన్నారు. -
వీరేశం లక్ష మెజారిటీతో గెలవడం ఖాయం
సాక్షి, నకిరేకల్ : నకిరేకల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వేముల వీరేశం లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని అపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నకిరేకల్ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోరుతూ బుధవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘నకిరేకల్ మినీస్టేడియంలో ఉన్న జనా న్ని, హెలిక్యాప్టర్‌లో వస్తూనే చూశాను.. స్టేడియం అం తా జనంతో నిండింది. రోడ్లమీద మరో 10వేల మందికిపైగా నిలబడి ఉన్నారు. ఈ జనసంద్రాన్ని చూస్తేనే వీరే శం గెలుపు ఖాయం’అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయితే భువనగిరి బస్వాపురం రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో మూసీపై ఆనకట్ట నిర్మిస్తే నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. అయిటిపాముల లిఫ్ట్‌కు ప్రత్యేకంగా రూ.111కోట్లతో మంజూరు చేశామన్నారు. మళ్లీ వీరేశాన్ని గెలిపిస్తే మిగిలిన పనులను పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వీరేశానికి పెద్దపదవి.. నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా వేముల వీరేశాన్ని మళ్లీ గెలిపిస్తే ఇప్పుడు ఇంకా పెద్ద పదవి కూడా ఇస్తామని స్పష్టంచేశారు. ఆ కల నెరవేరాలంటే కారు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాని హాజరైన ప్రజలతో శపథం చేయించారు. భవిష్యత్తు బాగుండాలంటే వీరేశం గెలవాలి నకిరేకల్ నియోజకవర్గం భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ వేముల వీరేశాన్ని గెలిపించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు లబ్ధిపొందుతున్న ప్రజలంతా టీఆర్ఎస్కు ఓటు వేస్తే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా గెలువలేక కూటమి పేరుతో ఆంధ్రాపార్టీని కలుపుకుందని ఎద్దేవా చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో నకిరేకల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన వీరేశాన్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ను గెలపించాలి.. నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి ఇప్పటికే రూ.2800కోట్లు మంజూరు చేయించానని.. ఈ అభివృద్ధి పనులు కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం కోరారు. డిసెంబర్ 7న తమ ఓటు వేసి మహాకూటమి అభ్యర్థి డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పునివ్వాలని కోరారు. వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీ కేశవరావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పూజర్ల శంభయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్, నియోజకవర్గ పరిశీలకుడు లింగంపల్లి కిషన్‌రావు, ప్రముఖ డాక్టర్లు రాపోలు రఘునందన్, మోహన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు కటికం సత్తయ్యగౌడ్, చాడ కిషన్‌రెడ్డి, జెల్ల మార్కెండేయులు, శరణ్యరెడ్డి, నకిరేకల్, చిట్యాల మార్కెట్ చైర్మన్లు మారం భిక్షంరెడ్డి, కాటం వెంకటేశం, వైస్ చైర్మన్ వీర్లపాటి రమేష్, నాయకులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, గాదగోని కొండయ్య, బొజ్జ సుందర్, కొండ వెంకన్నగౌడ్, సోమా యాదగిరి, యానాల లింగారెడ్డి, కొండ శ్రీను, మందడి వెంకటరామిరెడ్డి, భరత్‌కుమార్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, గుత్త మంజుల, కొండ లింగస్వామి, పెండెం ధనలక్ష్మి సదానందం, సామ బాలమ్మ, రాజు, సైదారెడ్డి, రమేష్, నరేందర్, పెండెం సంతోష్ తదితరులు ఉన్నారు. -
గొంతు కోసి.. గోళ్లు పీకేసి..
నకిరేకల్: ఇంటి వద్ద ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశారు. గొంతు కోసి.. గోళ్లు పీకేసి.. పొట్టపై కాళ్లతో తొక్కి.. చేతులపై విచక్షణారహితంగా గాయాలు చేసి పొట్టనపెట్టుకున్నారు. తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి బాలుడి ఇంటిపైనే పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం వడ్డెర కాలనీ సమీపంలో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కుక్కడం గ్రామానికి చెందిన రాపోలు రమేశ్, వాణి దంపతులు నాలుగేళ్ల క్రితం నకిరేకల్ పట్టణానికి బతుకుదెరువు కోసం వచ్చారు. స్థానిక మార్కెట్ రోడ్డులోని వడ్డెర కాలనీ ఎగువన నివసిస్తున్నారు. వీరికి సాత్విక్ (9), రుత్విక్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ స్థానిక ఏవీఎం టాలెంట్ స్కూల్లో చదువుతున్నారు. తల్లి స్థానిక బట్టల షాపులో పని చేస్తుండగా.. తండ్రి ఇంట్లోనే మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు రుత్విక్కు జ్వరం రావడంతో పెద్ద కుమారుడు సాత్విక్‌ను కూడా సోమవారం పాఠశాలకు పంపించలేదు. రోజూమాదిరిగానే తల్లి తాను పనిచేసే దుకాణానికి వెళ్లింది. తండ్రి మగ్గం నేస్తూ ఇంట్లోనే ఉన్నాడు. ఆడుకుంటూ అదృశ్యం... సాత్విక్, రుత్విక్‌తోపాటు చుట్టుపక్కల పిల్లలంతా కలసి ఇంటి బయట ఆడుకుంటున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో సాత్విక్ అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని రుత్విక్ తన తండ్రికి చెప్పడంతో అర్ధరాత్రి వరకు చుట్టుపక్కల అంతా గాలించారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రమేశ్ ఇంటి రేకులపై సాత్విక్ మృతదేహం ఉన్న విషయాన్ని పక్కింటికి చెందిన విజయ్‌కుమార్ గమనించి, ఆ విషయాన్ని బాలుడి తండ్రికి తెలిపాడు. వెంటనే ఇంటి పైకి ఎక్కి కుమారుడి మృతదేహాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. చిత్రహింసలు పెట్టి తమ కుమారుడిని చంపారన్న సంగతి తెలిసి తల్లిదండ్రులిద్దరూ కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు బాలుడిని తీసుకెళ్లి కొట్టి చంపి, మృతదేహాన్ని తీసుకొచ్చి వారి ఇంటిపైనే పడేశారని సీఐ గౌరినాయుడు వెల్లడించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని అతడి తండ్రి చెబుతున్నార ని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బాలుడి మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
చిరుమర్తి లింగయ్యకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు
-
ఆయనకు టికెట్ రాకపోతే.. నేను పోటీ చేయను..!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ టికెట్ ఆశిస్తున్న చిరుమర్తి లింగయ్యకు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ‘లింగయ్యకు నకిరేకల్ టికెట్ తప్పక వస్తుంది. అలా జరగని పక్షంలో నేను మునుగోడు నుంచి పోటీచేసే ప్రసక్తే లేదు. నా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ నుంచి పోటీ చేయడు’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇంటిపార్టీకి ఒక సీటు కేటాయిస్తామని కుంతియా చేసిన ప్రకటనతో ఈ అయోమయం నెలకొందని అన్నారు. ‘గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని నమ్ముతున్నాను. భక్త చరణ్‌దాస్ నిజాయితీపరుడు. ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, ఓయూ జేఏసీ నేత మానవత రాయ్‌కు టికెట్లు ఇవ్వనున్నారు’ అని రాజగోపాల్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. టికెట్ల ఎంపిక ప్రక్రియ చాలా బాగా జరిగిందని అన్నారు. టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని అన్నారు. పాల్వాయి స్రవంతికి నా సహకారం ఎప్పుడూ ఉంటుందనీ, ఆమె రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆ బ్రదర్స్ ప్రజల్లో తిరుగుతున్నారంటే..
నల్గొండ జిల్లా : కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ప్రజల్లో తిరుగుతున్నారంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే 2019 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమర్తి లింగయ్య యాభై వేల మెజార్టీ కాదు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు. పిళ్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు నా సొంతంగా రూ.4 కోట్లు ఖర్చు పెట్టి కాలువ పనులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూశానని తెలిపారు. నల్లొంగ జిల్లా అంటేనే కేసీఆర్‌కు భయమని, అందులోనూ నకిరేకల్ నియోజకవర్గం అంటే ఇంకా భయమని అన్నారు. -
ఇంట్లో చెప్పకుండా వెళ్లి... బావిలో శవమై తేలి..!
కేతేపల్లి(నకిరేకల్) : కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మూడు రోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిన మహిళ వ్యవసాయం బావిలో శవమై తేలింది. ఈ సంఘటన కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామంలో గురువారం జరిగింది. కేతేపల్లి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన మౌనిక(28)కు, కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన కొండ క్రిష్ణతో పదే ళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. క్రిష్ణ సూర్యాపేట ఆంధ్రబ్యాం కు శాఖ తరఫున గ్రామంలో బ్యాంకుమిత్రగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో నాలుగు రోజుల కిత్రం క్రిష్ణ గ్రామానికి చెందిన బ్యాంకు ఖాతా దారులకు చెల్లించేందుకు çసూర్యాపేట బ్యాంకు నుంచి దా దాపు రూ.2లక్షలను తీసుకొచ్చి ఇంట్లో దాచాడు. ఈవిషయం తెలియని ఆయన భార్య మౌనిక ఇంటి తలుపులు వేయకుండానే పక్కనే ఉన్న ఇరుగుపొరుగు వారి ఇంటికి వెళ్లింది. ఊళ్లోకి వెళ్లి ఇంటికి వచ్చిన క్రిష్ణకు తలుపులు బార్లాగా తెరిచి ఉండడంతో పాటు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భార్య మౌనికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక ఈ నెల 19న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. మౌనిక ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెదికినా ఫలితం లేకపోవడంతో క్రిష్ణ తన భార్య కనిపించడం లేదంటూ ఈనెల 20న కేతేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిత్రం కనిపించకుండా పోయిన మౌనిక గురువారం స్థానికంగా చౌళ్లగూడెం వెళ్లే దారిలో రైతు సత్తిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో శవమై లేలింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు కేతేపల్లి పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని కేతేపల్లి ఎస్ఐ రజనీకర్‌రెడ్డి తెలిపారు. -
‘వారు పోరాడేది కుర్చీల కోసమే’
సాక్షి, నకిరేకల్/నల్గొండ: కాంగ్రెస్ హయాంలో సాగునీటికి, కరెంట్‌కు అరిగోస పడ్డ రైతన్నల కష్టాలు తీర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు హరీశ్‌రావు, జగదీష్ రెడ్డి అన్నారు. నీటి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించడం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో ఆదివారం నిమ్మ మార్కెట్‌ను ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రైతుల ఎన్నో ఏళ్ల కల నిమ్మ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాకు మూసి ఆయకట్టు కింద 40 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రజల బాగుకోసం ఆలోచించని కాంగ్రెస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. వాళ్లు కుర్చీల కోసమే కొట్లాడుకుంటారనీ.. ప్రజా సమస్యలపై పోరాడే తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. ఏనాడైనా మాట్లాడారా? టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని హరీశ్‌రావు అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి ఏనాడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ ఎడమకాలువకు 700 కోట్ల ఖర్చు పెడితే, నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో 1200 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నామని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా అక్రమంగా నీరు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్తున్నా ఒక్క కాంగ్రెస్ నేత నోరు మెదపలేదని విమర్శించారు. -
చెరువులో పడి బాలిక మృతి
కేతేపల్లి (నకిరేకల్) : బహిర్భూమికి వెళ్లిన బాలిక ప్రమాదశవాత్తు చెరువులో మునిగి మృతి చెంది ంది. ఈ ఘటన కేతేపల్లి మండలం గుడివాడలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు...గ్రామానికి చెందిన టేకుల సుధాకర్‌కు ఇద్దరు కూతుళ్లు కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె మాధురి(11) తోటి స్నేహితురాలితో కలసి సోమవారం బహిర్భూమికి స్థానిక జెడ్పీ పాఠశాల పక్కనే ఉన్న చెరువు వద్దకు వద్దకు వెళ్లింది. ఈక్రమంలో చెరువులోకి దిగిన మాధురి అందులో ఉన్న లోతైన గుంటలను గమనించక పోవటంతో ప్రమాదశవాత్తు నీటిలో మునిగిపోయింది. దీంతో మాధురి వెంట ఉన్న బాలిక కేకలు వేస్తూ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియ చేసిం ది. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న మాధురి తల్లిదండ్రులు, గ్రామస్తులు చెరువులో గాలించటంతో మాధురి మృతదేహం లభించింది. మృతురాలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గ్రామస్తుల అందోళన పాఠశాలకు సమీపంలో ఉన్న చెరువులో కొందరు అక్రమార్కులు విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టినా అధికారులు పట్టించుకోక పోవటం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందోళనకు దిగారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. పాఠశాల పక్కనే లోతైన గుంతలు తవ్వి మట్టి తీసుకెళ్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పి మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కేతేపల్లి ఎస్ఐ రజనీకర్‌రెడ్డి తెలిపారు. -
స్నేహితుడే నిందితుడు..!
నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామంలో ఈ నెల 7వ తేదీన వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హోమోసెక్స్‌కు ఒత్తిడి చేయడంతోనే స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుధాకర్ కేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌పల్లి (నకిరేకల్) : నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి (25), చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన మాదాసు ఆరోగ్యం ఇద్దరూ స్థానిక ఐడియల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు బావ, బావమరుదుల వరసతో పిలుచుకుంటూ తిరిగేవారు. వీరు తమ ఫోన్లలో పలుమార్లు అశ్లీల చిత్రాలు చూసేవారు. అందులో ఇద్దరు మగవారు కలిసి చేసుకునే హోమోసెక్స్‌కు ఆకర్షితులై కొంత కాలంగా పలుమార్లు ఆ విధంగా కలుసుకున్నారు. స్నేహితుడిని ఓదార్చేందుకు.. గత నెల 13న ఆరోగ్యం చిన్న కూతురు మృతిచెందింది. ఆ బాధలో ఉన్న ఆరోగ్యాన్ని స్నేహితులు ఓ దార్చే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఆరోగ్యాన్ని స్నేహితులందరూ కలిసి ఆరోగ్యాన్ని జాన్‌పహాడ్ దర్గా వద్దకు తీసుకెళ్లి పార్టీ చేస్తున్నారు. బెదిరించి.. జానపహాడ్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం జాన్‌రెడ్డి ఫోన్‌చేసి ఆరోగ్యాన్ని కలుసుకోవాలని ఒత్తిడి చేశాడు. అతను రానని చెప్పడంతో అసహనానికి గురైన జాన్‌రెడ్డి వారిద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపెడతానని బెదిరించాడు.తన భార్యని కూడా కలవాలని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన ఆరోగ్యం జాన్‌రెడ్డి బతికిఉంటే ఎప్పటికైన ప్రమాదమే అనుకుని చంపాలని పథకం వేశాడు. ఒత్తిడి చేసి పిలిపించుకుని.. జాన్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌చేసి ఒత్తిడి చేయడంతో ఆరోగ్యం విసిగిపోయాడు. దీంతో అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.అప్పటికే తాగి ఉన్న జాన్‌రెడ్డిని చంపడానికి అనుకూల సమయమని నిర్ధారించుకున్న ఆరోగ్యం తనతో పాటు చిన్నకత్తిని వెంట తెచ్చుకున్నాడు. ఎప్పటిలాగే వ్యవసాయబావి వద్ద మంచంపై దుస్తులు లేకుండా మంచానికి జాన్‌రెడ్డిని కట్టివేసి ఆరోగ్యం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి చంపాడు. మృతుడి కాల్‌డేటా ఆధారంగా నిందుతుడిని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో శా లిగౌరారం సర్కిల్ సీఐ క్యాస్ట్రోరెడ్డి, ఎస్ఐ గోవర్థ న్, సిబ్బంది మధు, రమేష్, జనార్ధన్ ఉన్నారు. -
అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్
చిట్యాల (నకిరేకల్) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ అమలు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే తెలంగాణ.. అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతోందని తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడులో దశమి ల్యాబ్స్ పరిశ్రమ యజమాన్యం ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను గురువారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం గుండ్రాంపలిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్ల కాలంలోనే రూ.రెండు వేల కోట్లతో ఆభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గుండ్రాంపల్లి గ్రామంలో మరో 150 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని, కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆయా కార్యక్రమాల్లో జేసీ నారాయణరెడ్డి ,ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ బట్టు అరుణ అయిలేష్, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ రాచకొండ లావణ్య క్రిష్టయ్య, తహసీల్దార్ సీహెచ్.విశాలాక్షి, ఎంపీడీఓ జి.కాంతమ్మ, ఈఓపీఆర్డీ బి.లాజర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఎద్దులపురి క్రిష్ణ, గుండెబోయిన సైదులు, బెల్లి సత్తయ్య, బక్క శేఖర్, గోలి మహేష్, బైకాని నాగరాజు, బోడిగె అంజయ్య, నర్సింహ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి నార్కట్‌పల్లి (నకిరేకల్) : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బి.వెల్లెంలలో రూ.5కోట్లతో డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.రాష్ట్రంలో నేటి వరకు 2లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రూ.700కోట్లతో ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. రూ.30కోట్లతో ప్రతి జిల్లాలో మత్సకార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బి.వెల్లెంల ఉదయ సముద్రంప్రాజెక్టు రెండు నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నార్కట్‌పల్లి మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. -
కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాజీనామాకు సై!
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు టీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. 'కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. నకిరేకల్‌లో నేను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?' అని ప్రశ్నించారు. ఈసారి నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. నకిరేకల్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తున్నారంటేనే ఎమ్మెల్యే వేముల వీరేశానికి గుబులు పుడుతుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం దిగివచ్చినా ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మూడవ కన్ను తెరిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఏ జిల్లాకు వెళ్లినా తమకు టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. -
వివాదంలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్ : అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) సీఈవో మదన్మోహన్ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ సంభాషణ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో అధికారిని ఎమ్మెల్యే బూతులు తిట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీసీసీబీలో సస్పెన్షన్‌కు గురైన డీజీఎం స్థాయి ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకునే వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యేకు, సీఈవోకు మధ్య ఈ సంభాషణ జరిగింది. దేవరకొండ డీసీసీబీ బ్రాంచిలో అవినీతికి పాల్పడిన వారిపై కేసు పెట్టిన మహిళా అధికారిని సస్పెండ్ చేశారని.. తిరిగి విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుండడంతో తాను గట్టిగా నిలదీశానని ఎమ్మెల్యే వీరేశం చెబుతున్నారు. అధికారి, ఎమ్మెల్యేల ఫోన్‌కాల్ సంక్షిప్తంగా.. ఎమ్మెల్యే: సీఈవోగారు చిన్న పని.. సీఈవో: చైర్మన్ గారికి చెప్పాను సార్, మండే వస్తారు.. ఎమ్మెల్యే: ఒకరోజు టైం ఇవ్వండి అన్నావు కదా.. సీఈవో: చైర్మన్‌గారికి చెప్పాను సార్.. మండే వచ్చి చూస్తానని చైర్మన్‌గారు చెప్పారు సార్.. ఎమ్మెల్యే: దీంట్లో చైర్మన్‌కు ఏం పని? సీఈవో: చైర్మన్ సంతకం పెట్టాలి సార్ ఎమ్మెల్యే: బైలా ప్రకారం జీఎం, డీజీఎం, అసిస్టెంట్ జీఎం దాకా సీఈవోనే ఫైనల్ అని ఉంది. బుక్కు ప్రింట్ చేసినోడు తప్పు చేసిండా. జీవో ఇచ్చినోడు తప్పు చేసిండా. మరి మీరు తప్పు చేస్తున్నరా.. నాకు అర్థం కావట్లే.. సీఈవో: లేదు సార్.. నేను తప్పు కాదు సార్ ఎమ్మెల్యే: మండే నేను వస్తా. నాకు ఆర్డర్ కాపీ ఇస్తవా..? సీఈవో: సరే సార్.. మండే రోజు చైర్మన్ సార్ వస్తానన్నరు సార్. ఎమ్మెల్యే: ఏయ్..! చెప్పేది వినాలి.. డ్రామా చేయకు. మొన్న ఏం చెప్పినవ్. ఒకరోజు టైమివ్వండి.. నేను హ్యాండికాపిడ్.. కథ కార్కానమ్ అని చెప్పినవా.. లేదా.. సీఈవో: చెప్పిన సార్.. ఎమ్మెల్యే: ఇప్పటి వరకు ఫైల్ పెట్టినవా? సీఈవో: ఫైల్ పెట్టిన సార్.. చైర్మన్‌కు పెట్టిన ఎమ్మెల్యే: ఫైల్ ఎక్కడ ఉంది.. ఫైల్ నంబర్ చెప్పు సీఈవో: ఫైల్ చైర్మన్‌గారికి పెట్టాను సార్.. నంబర్ లేదు దానికి ఎమ్మెల్యే: చైర్మన్ సంతకం ఎందుకు చెల్లుతది.. ఎంప్లాయికి..? సీఈవో: ఇది వరకు చైర్మన్‌నే ఆర్డర్ ఇచ్చారు సార్ ఎమ్మెల్యే: వాడెవెడు ఆ పనికి.. నువ్వు ఎవడు.. వానిది నీది ..... నీ అయ్య జాగీరా.. చైర్మన్, నువ్వు ఇద్దరం దోచుకుతింటమని రాసకొచ్చుకున్నరా.. వాడి మీద నువ్వు.. నీ మీద వాడు.. ఇద్దరిదీ పలగ్గొడతా.. నేను మంచిగుంటెనే మంచోణ్ని.. ఒక రోజు టైం అడిగినవ్.. సరేనన్న.. నువ్వు ఇంకా ఫైలే పెట్టకుండా మళ్లీ చైర్మన్ అనే వెధవ గురించి నాకు చెప్పొద్దు. ఉద్యోగం ఇస్తవా.. లేదా.. లేకుంటే నిన్ను, నీ చైర్మన్‌ను, సంపత్‌రెడ్డి అనేటోణ్ని ముగ్గురి ..... పలగ్గొడతా ఆడికి వచ్చి ... సంపత్ రెడ్డిగాడు నాయి ఊరికనే 8 లక్షలు తీసుకుండు. వాని ఓటు అమ్ముకోవడానికి రూ. 8 లక్షలు తీసుకుండు. నీక్కూడా డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తం. సీఈవో: నేను అలాంటి వాడిని కాదు సార్.. ఎమ్మెల్యే: అలాంటోడివి కావైయితివి.. సిస్టమ్‌ను ఫాలో అయితున్నంటివి.. ఆంధ్రా నుంచి వచ్చి మా దగ్గర ఉద్యోగం చేస్తుంటివి. మమ్ముల్ని ... కుడిపితివి ఎట్లా.. సీఈవో: చైర్మన్‌గారు సంతకం పెడితే ఇస్తాను సార్ ఎమ్మెల్యే: నువ్వు రూల్స్ పాటించకుండా ఎట్లా ఆపుతవ్.. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నవ్.. కోర్టు నిన్ను జైల్లో ఎందుకు పెట్టకూడదు.. మీ బ్యాంకర్ చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలా.. పది లక్షలు డిమాండ్ చేస్తుండు.. లేకుంటే ఇస్తలేడని సీఎం కాడ ఫిర్యాదు చేస్తా.. సీఈవో: మండే చైర్మన్ వస్తానన్నాడు సార్ ఎమ్మెల్యే: చైర్మన్ మాట ఎత్తొద్దు. డ్రామాలు వినను. నా దగ్గర బైలా బుక్ ఉంది. యాక్ట్‌లు చదువుకో. నీకు మెయిల్ చేస్తా. మల్లికార్జున్ వస్తడు పని చేసిపెట్టు. లేదంటే నాకు ఇక్కడి నుంచి 30 నుంచి 40 నిమిషాలు జర్నీ. నేనే వస్తా.. ప్రజల పక్షాన మాట్లాడుతా.. ‘‘దేవరకొండ సొసైటీ బ్యాంకులో 21 మంది అవినీతికి పాల్పడ్డారు. డీజీఎం లక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అవినీతికి పాల్పడిన వారిపై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. కానీ డీజీఎం తమను డబ్బులు అడిగిందని వాళ్లు తిరిగి కేసు పెట్టారు. దీంతో రెండేళ్ల కింద డీజీఎంను సస్పెండ్ చేశారు. ఏడాది నుంచి తిప్పుతున్నారు. ఆరు నెలల నుంచి జీతం ఇవ్వడం లేదు. పది లక్షలు ఇస్తే ఉద్యోగంలోకి తీసుకుంటామన్నరు. ఆమె వికలాంగురాలు. నేను న్యాయం పక్షాన నిలబడి ప్రశ్నించిన. ప్రజల పక్షాన నిలదీస్తా.. నీ సంగతి చూస్తా అని కూడా మాట్లాడుతా. నాకు నటించడం రాదు. ఇట్లనే జీవిస్తం..’’ – వేముల వీరేశం, నకిరేకల్ ఎమ్మెల్యే కావాలనే ఇబ్బంది పెడుతున్నారు ‘‘2013లో దేవరకొండ బ్రాంచిలో అక్రమాలు జరిగాయి. నన్ను విచారణాధికారిగా వేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కేసు పెట్టాను. అప్పటినుంచి బ్యాంకులో డైరెక్టర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. 2015లో నన్ను కావాలనే సస్పెండ్ చేశారు. రెండేళ్లు పూర్తయింది. తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు శుక్రవారం ఆర్డర్ కాపీ ఇస్తామన్నారు. అసలు ఈ వ్యవహారంలో డీసీసీబీ చైర్మన్‌కు సంబంధం లేదు. సీఈవో కావాలనే అలా చెబుతున్నారు. డైరెక్టర్లు సీఈవోపైన ఒత్తిడి చేస్తున్నారు..’’ – సస్పెన్షన్‌కు గురైన డీజీఎం లక్ష్మి -
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
-
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నకిరేకల్(నల్లగొండ): నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న కెమికల్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. వివారాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన జిల్లాలోని నకిరేకల్ మండలం ఐటిపాముల సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రూ.20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
కేతేపల్లి (నకిరేకల్) : 65 నంబరు జాతీయ రహదారి మీ దుగా అక్రమంగా రవాణా చేస్తున్న రూ.20 లక్షల విలువైన అంబర్, గుట్కా పాకెట్లను కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్‌ప్లాజా వద్ద బుధవారం నల్లగొండ జిల్లా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ సత్తన్న ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 30మంది అధికారులు, విజిలెన్స్ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫీల్‌ఖానా నుంచి భ్రద్రాచలంకు వివిధ సరుకులతో వెళ్తున్న సెంట్రల్ పార్శిల్ సర్వీసుకు చెందిన ఏపీ 29టీఏ 6779 నంబరు గల లారీపై ఓవర్‌లోడ్ ఉన్నట్లుగా గుర్తించి విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేశారు. లారీలో ఉన్న సరుకులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సక్రమంలా లేకపోవటంతో పాటు, డ్రైవర్ పొంతన లేని సమాధానలు చెబుతుండటంతో అనుమానించిన సిబ్బంది లారీని రోడ్డు పక్కకు నిలిపి సరుకులను పరిశీలించారు. లారీలో నిషేధిత పొ గాకు ఉత్పత్తులతో కూడిన అంబర్లు, గుట్కాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు లా రీని కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించారు. లారీలో కొన్ని కుర్కురే ప్యాకెట్ల్, చెప్పులు, ప్లాస్టిక్ సామగ్రి డ బ్బాలతో పాటు సగంలోడు మేర గుట్కా, అంబర్ ప్యాకెట్లు బైయటపడ్డాయి. 70 కాటన్ల అంబ ర్ ప్యాకెట్లు, 4 కాటన్లు దుబాయ్ గుట్కా, 8గన్నీ బ్యాగులు పహలనిషా, 8 బ్యాగులు స్వాగత్ గుట్కా, 3 గన్నీ బ్యా గులు త్రీస్టార్ ఖైనీ, 2గన్నీ బ్యాగులు గోపిక గుట్కా, 6 కాటన్లు ఖలేజా గుట్కా లభ్యమయ్యాయి. పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల విలువ సుమా రు రూ. 20లక్షలకు పైనే ఉంటుందని విజి లెన్స్ డీఎస్పీ సత్తన్న తెలి పారు. లారీని, గుట్కా ప్యాకెట్లను కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్వాధీన పర్చి కేసు నమోదుకు సిఫారసు చేశామని తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐలు నర్సింహరాజు, చలమంచరాజు, ఏజీ నర్సిరెడ్డి, ఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీటీఓలు క్రిష్ణ, శ్రీధర్‌రెడ్డి, ఎఫ్ఆర్వో ఆంజనేయులు, ఎంవీఐ సలీం, ఎస్ఐ గౌస్ పాల్గొన్నారు. -
ప్రపంచానికి మార్గదర్శకుడు ‘వివేకానంద’
నకిరేకల్ : ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని నెహ్రూ యువకేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్ అన్నారు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పగల సామర్ధ్యం కలిగిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గులు, వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో ప్రధమ బహుమతి జె.రేణుక, రెండో బహుమతి ఎస్.మాధవి, మూడో బహుమతి సంతోష, వ్యాసరచన పోటీలో ప్రధమ ఝాన్సీ, ద్వితీయ ఎం.జ్యోతి, తృతీయ కే.శ్రీదేవి అందుకున్నారు. తొలుత గ్రామ శివారులోని రాణి రుద్రమాదేవి శిలాశాసనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ కొమ్ము వెంకటేషం, ఎంపీటీసీ పుట్ట సరిత, దోసపాటి రాము, వివేకాయంద యువజన మండలి అధ్యక్షుడు పుట్ట సాయి, ప్రతిని«ధులు జొర్రీగల వెంకటేశ్వర్లు, దోసపాటి నాగరాజు, పుట్ట సత్యనారాయణ, తండు శ్రీను, శ్రీకాంత్, బెజవాడ సురేష్, పుట్ట జానయ్య, దయాకర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నకిరేకల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్ కులాల శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నకిరేకల్‌లోని నారాయణరెడ్డి ఫంక్షన్హాల్లో నకిరేకల్, కట్టంగూర్, చిట్యాల, మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిపొందిన 86మందికి రూ.51వేల చొప్పున రూ.43.86లక్షలు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణలక్షి పథకం ఎన్నికల హామీ కాదు..ఎవ్వరు కూడా అడగలేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిన మనింటికి కళ్యాణ లక్ష్మి వస్తుందని అనుకోవాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో కల్యాణ లక్ష్మి కింద 2500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మొదటి విడుతలో 1300మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. రెండవ విడుతలో కూడా మిగితా వారికి చెక్కులు ఇస్తామన్నారు. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణ, శిశువిక్రయాలకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతామన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిల కోసం సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో రూ.51వేలు ఇవ్వడం గొప్పవిషయం అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఆడపిల్లల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఒక పెద్దకొడుకులాగా ఉండి వారి వివాహాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. నల్లగొండ ఆర్డీఓ వెంకటచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సుజాత యాదయ్య, ఎంపీపీలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, గుత్త మంజుల, కొండ లింగస్వామి, జెడ్పీటీసీలు పెండెం ధనలక్ష్మి సదానందం, శేపూరి రవీందర్, తహసీల్దార్లు అంబేద్కర్, ప్రమీళ, పుష్పలత, సర్పంచ్‌లు పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, దుబ్బాక మంగమ్మ, ఎంపీటీసీలు రాచకొండ వెంకన్న, సైదారెడ్డి, మమత, సరిత తదితరులు ఉన్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
నకిరేకల్ : ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నకిరేకల్‌లో సోమవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్‌హాల్ పక్క వీధిలో మీలా సంధ్య (43) తన భర్త దేవేంద్ర ప్రసాద్‌తో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. మూడు రోజుల క్రితం తిరుపతి పుణ్య క్షేత్రానికి వెళ్లి ఆదివారం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో భర్త, చిన్న కుమార్తె ఉన్న సమయంలో సంధ్య గదిలోకి వెళ్లి లోపల గడియ వేసుకుని ఉరివేసుకుంది. కాసేపటికి భర్త తలుపును తెరిచేసరికి అప్పటికే మృతిచెందింది. దీంతో భర్త దేవేంద్ర ప్రసాద్‌తో పా టు కుమార్తె కూడా దుఖః సాగరంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నర్సింహారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
గృహిణి ఆత్మహత్య
నల్లగొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మీలా సంధ్య(42) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నయీంను కాపాడింది కాంగ్రెస్సే
శాలిగౌరారం : సమైక్య రాష్టంలో దశాబ్దకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే నరహంతక నయీంను పెంచి పోషించిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం మండలంలోని ఊట్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీం కేసు విచారణలో తమపేర్లు ఎక్కడ బయట పడతాయోనని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అంతర్మథనంలో ఆందోళన చెందుతూ బయటకు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. టీఆర్ఎస్పార్టీ ఉద్యమ కాలంలో న యీం వల్ల రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులను పోగొట్టుకొని తీరని నష్టానికి గురైందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాడు ఐదు సంవత్సరాలుగా భువనగిరి ఎంపీగా పనిచేశారని, అప్పుడు న యీం అంటే ఏమిటో కోమటిరెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసం పదువులను ఆశించే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నయీంతో సంబంధాలు కచ్చితంగా ఉన్నాయని, సిట్ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్నారు. నయీం నరహంతకుడని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరహంతకులను అంతమొందించేందుకు నరకాసురవధ చేపట్టిందన్నారు. సమావేశంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు యానాల పాపిరెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, కట్టంగూరు జెడ్పీటీసీ మాద యాదగిరి, సింగిల్‌విండో చైర్మన్ లోకసాని రంగారెడ్డి, నాయకులు అయితగోని వెంకన్న, పూజర్ల శంభయ్య, భూపతి యాదయ్య, కోక యాదయ్య, వేముల లింగయ్య, ఇద్దయ్య, దార అశోక్, యారాల జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు
నార్కట్‌పల్లి : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై స్థాయికి మించి మాట్లాడడం అధికార దాహమేనన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టు కోసం అప్‌సెండింగ్ సమావేశానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరు కాని ఆయనకు ప్రాజెక్టుల గురించి ఏమి తెలియదన్నారు. ప్రాజెక్టుల గురించి తెలియని ఆయనకు మూసీ ప్రాజెక్టు నిండిన వెంటనే గేట్లు తెరిచి నీటిని వృధా చేశారని అన్నారు. ప్రాజెక్టులపై అవగాహన ఉంటే నీటిని ఎలా వృథా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో గెలిచిన వేముల వీరేశం కేవలం భూకబ్జాలకే పరిమితమయ్యారు తప్ప ప్రజల సమస్యలు, మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, సర్పంచ్‌లు కొండూరు శంకర్, బొక్క భూపాల్‌రెడ్డి, చెర్వుగట్టు దేవస్థాన మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, నాయకులు పాశం శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బలి మల్లేషం, వల్లపు మల్లేషం, వెంకటచారి, లింగస్వామి, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్య సంపదను పెంచడమే లక్ష్యం
నకిరేకల్ : మత్స్య సంపదను పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ పశు, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామ శివారులోని మూసీ జలాశయంలో 18.50 లక్షలకు 6లక్షల చేప పిల్లలను గురువారం ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి వదిలిపెట్టారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చండీయాగం ప్రతిఫలంగా ఈ ఏడాది తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, జలాశయాలు నిండాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో 45 నుంచి 50 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దళారీ వ్యవస్థను అరికడుతూ మత్స్య సంపదపై ఆధారపడిన గంగపుత్రులు, ముదిరాజ్‌లు, బెస్త వృత్తుల కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత సీమాంద్ర ప్రభుత్వాల హయాంలో మత్స్యశాఖకు రూ.1కోటి బడ్జెట్ ఉండగా నేడు తెలంగాణలో రూ.100కోట్లకు పెంచామన్నారు. సొసైటీ సభ్యులతో సభ్యత్వం లేని వారు కూడా ఆ జాతి కోసం జరిగే ఈ మేలులో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ వర్గానికి చెందిన వారందరికి సభ్యత్వం ఇస్తామన్నారు. పెరిగిన చేపలపై సభ్యులందరికి హక్కు ఉంటుందన్నారు. చేపల విక్రయానికి ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రాల్లో చిన్న చిన్న చేప మార్కెట్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గంగ పుత్రుల కమ్యూనిటీ హాల్ కోసం రూ.10లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గంగ పుత్రుల కోసం జీపులు, ద్విచక్రవాహనాలు కూడా 75శాతం సబ్సిడీపై అందిస్తుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సార థ్యంతో 15 కమ్యూనిటీ హాల్లు మంజూరు కావడం హర్షణీయమన్నారు. మూసీ రిజార్వాయర్‌లో కూడా కేజి కల్చర్ 10 యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మత్స్యకారులలో ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మత్స్య సంపద దళారుల బారిన పడకుండా ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారి జీవితాలలో వెలుగు నింపేందుకే ఈ చేప పిల్లల పంపిణి కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రావు, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, పశు సంవర్థక శాఖ జేడీ నర్సింహ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఓయూ జేఏసీ ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్, నల్లగొండ ఆర్డీ ఓ వెంకటాచారి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి సుజాతయాదయ్య, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి, మూసీ మత్స్యకార సంఘం చైర్మన్ అల్వాల వెంకటస్వామి, డైరెక్టర్ సాదుల నర్సయ్య, వల్లభాపురం సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ మాద ధనలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు పూజర్ల శంభయ్య, పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులు, వీర్లపాటి రమేష్, మంగినపల్లి రాజు, ఎల్లపురెడ్డి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలి
నల్లగొండ రూరల్ : సీఎం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దుర్గామాత ఆశీస్సులతో విజయవంతం కావాలని కోరుతున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం పానగల్లు శ్రీరేణుక ఎల్లమ్మ దేవాలయంలో దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం వేముల రాజీవ్ జ్ఞాపకార్థం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంబించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగరత్నంరాజు, అబ్బగోని రమేష్‌గౌడ్, ప్రదిప్నాయక్, సత్తయ్యగౌడ్, బకరం వెంకన్న, అరుణాకర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కట్టా శ్రీను, నకిరేకల్ ఇన్చార్జి సైదులు, శ్రవణ్, తదితరులున్నారు. -
రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా
నకిరేకల్ : ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కోరుతూ సీపీఐఎంఎల్ నూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నకిరేకల్ సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ అంబేద్కర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి రాయి కృష్ణ మాట్లాడుతూ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. వరుసగా కరువుతో ఇబ్బందులు పడిన రైతాంగం ఈ భారీ వర్షాల వల్ల కోలుకోలేని స్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంటనష్టాన్ని శాస్త్రీయంగా అంచనావేయాలన్నారు. రెండవ పంటకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం ఉచితంగా అందజేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పల్స యాదగిరి, వేముల కొండ శంకర్, సిలివేరు జానయ్య, జానపాటి దేవయ్య, జుబేదా, అల్లయ్య, రావుల లింగయ్య, వరికుప్పల వెంకన్న, తూర్పాటి వెంకన్న, సైదులు, సురేష్, వెంకన్న, శంభయ్య, లింగారెడ్డి ఉన్నారు. -
వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలి
నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇరుగు సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో ఆదివారం జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల లోపు వైఎస్సార్సీపీని ఈ నియోజకవర్గంలో పటిష్టపరచాలన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు వేస్తామన్నారు. అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని, ఇతర బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. డబుల్బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయకుండా గందరగోళం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అంశల సత్యనారాయణ, పుట్ట పిచ్చయ్యగౌడ్, బాస నర్సింహ, శంకరయ్య, జానకి రామిరెడ్డి, దేవయ్య, పార్టీ జిల్లా కార్యదర్శులు పోగుల నర్సింహగౌడ్, పిల్లి జలేంధర్, దేవసారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యనందించేందుకే కేజీ టు పీజీ
నకిరేకల్ : పేదవర్గాల వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారని.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 350 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నకిరేకల్‌లో రూ.2.25కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జెడ్పీహైస్కూల్లో రూ.52లక్షలతో అదనపు గదుల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెయిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. తాజాగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ గురుకులాన్ని కేటాయిస్తూ మొత్తం 119 గురుకుల పాఠశాలలను మంజూరు చే శారన్నారు. జానారెడ్డిపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. 30ఏళ్లుగా ఈ జిల్లా జానారెడ్డి పాలనలో ఉందని.. కనీసం ఆయన నియోజకవర్గానికి రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా మంజూరు చేయించలేదని విమర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పీచై ర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మొగిలి సుజాత, అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పూజర్ల శంభయ్య, పల్రెడ్డి నర్సింహారెడ్డి, వీర్లపాటి రమేష్, సోమ యాదగిరి, సిలివేరు ప్రభాకర్, మంగినపల్లిరాజు తదితరులు ఉన్నారు. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
నకిరేకల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నకిరేకల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను విమర్శించే స్థాయి మంత్రి హరీష్‌రావు, ఎంపీ కవితకు లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూమ్ హామీలు నేటికి నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, మండల శాఖ అధ్యక్షుడు తాటికొండ రామమూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జిల్లా డాకయ్య, నాయకులు పుట్ట వెంకన్నగౌడ్, కొండేటి శ్రీను, యానాల శ్రీనివాస్‌రెడ్డి, గుడుగుంట్ల సాయన్న, చెరుకు రోశయ్య, పుట్ట సతీష్, ఉయ్యాల శ్రీను, నల్లగొండ వెంకటయ్య తదితరులు ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణ కోసం..
నకిరేకల్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో ప్రపథమంగా నకిరేకల్‌లోని పన్నాలగూడెంలో ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం ఎదుట నెలకొల్పిన మట్టి వినాయక విగ్రహాన్ని బుధవారం రాత్రి మండపం వద్దే పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హీత నిమజ్జనం (నీళ్లతో కరిగించడం) చేశారు. నీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. అయితే విగ్రహాలను నిమజ్జనానికి వేరే ప్రాంతాలకు తీసుకెళాల్లంటే ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు చెరువుల్లో వేస్తే నీటి కాలుష్యం అవుతున్న నేప£ý ్యంలో నీటితో అభిషేకం చేసి కరిగించారు. కరిగించిన తరువాత మట్టిని భక్తులు తమ ఇళ్లకు తీసుకెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకుంఆ మట్టి విగ్రహాలను నెలకొల్పడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి విగ్రహాలు నెలకొల్పేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు శ్రీనివాస్‌రావు, విద్యాసాగర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, తిరుమలేశ, విగ్రహదాత పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డెంగీతో బాలుడి మృతి
నకిరేకల్ : డెంగీతో మూడున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. నకిరేకల్‌లోని వీటీ కాలనీలో నివాసం ఉంటున్న కందగట్ల సందీప్, దివ్యల మూడున్నరేళ్ల బాలుడు శాన్వికి మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. డెంగీగా అనుమానంతో హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న బేబి వైద్యశాలలో చేర్పించారు. పల్స్ పడిపోవడంతో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. డెంగీతో మృతిచెందాడని డాక్టర్ తెలిపినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. మంగళవారం శాన్వి మృతదేహాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులు సందర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
వ్యాపారంగా మారిన రాజకీయాలు
నకిరేకల్ : దేవాభివృద్ధికి దిక్సూచిగా ఉండాల్సిన రాజకీయాలు నేడు వ్యాపారంగా మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమరజీవి కల్లు రామచంద్రారెడ్డి 32వ వర్ధంతి సందర్భంగా సమకాలిన రాజకీయ పరిస్థితులపై ఆదివారం స్థానికంగా జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బడా పెట్టుబడిదారులు, భూస్వాములు, రాజకీయ రంగంలో ప్రవేశించి రాజకీయాలను వ్యాపారంగా మార్చారన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో శతకోటేశ్వరులు కూర్చుని పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తున్నారన్నారు. అంతకుముందు పట్టణంలో సీసీఎం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామచంద్రారెడ్డి స్థూపం వద్ద యాట నర్సింహారెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి ఎంపీపీ గుత్త మంజుల, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎండీ.జహంగిర్, జిల్లా కమిటీ సభ్యులు బోళ్ల నర్సింహారెడ్డి, కందాల ప్రమీల, కేఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు యానాల కృష్ణారెడ్డి, ప్రతినిధులు బిచినేపల్లి ప్రకాశ్‌రావు, కె.సీతారాములు, రావిరాల మల్లయ్య, నంద్యాల హరేందర్, కల్లు ఉత్తమ్‌రెడ్డి, మర్రి వెంకటయ్య, బొజ్జ చిన్నవెంకులు, అవిశెట్టి శంకరయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, ఆకుల బాస్కర్, ఆదిమల్ల శ్రీనివాస్, సాకుంట్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఎడారులను తలపిస్తున్న చెరువులు
నకిరేకల్ నకిరేకల్ : ప్రస్తుత వర్షాకాలంలోనూ కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆగస్టులో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నకిరేకల్ నియోజకవర్గంలోని పంటలు ఎండిపోతూ రైతన్నలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు లేక చెరువులు, కుంటలు, చివరకు వ్యవసాయ బావులు వెలవెలబోతున్నాయి. దీంతో రైతులు సాగు చేసిన వేలాది ఎకరాల వరిపంట ఎండుముఖం పట్టింది. ఫలితంగా సాగుకోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు అడియాసలుగా మారాయి. చెరువుల్లో చుక్కనీరు లేని దుస్థితి..! నకరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లోని ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ఎక్కడా చుక్క నీరు లేదు. నియోజకవర్గంలో మెుత్తం 83 చెరువులు, 211కుంటలున్నాయి. వీటికింద సుమారు 12,100 ఎకరాలలో ఆయకట్టు ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 11,912 హెక్టార్లలో వరి, 24,737హెక్టార్లలో పత్తి, 3,910 హెక్టార్లలో పెసర, 5,585 హెక్టార్లో కంది, 5,468 హెక్టార్లల్లో వేరుశనగ సాగు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో చెరువులలో, కుంటలలో నీరు లేకపోవడంతో బోర్లపైనే ఆధారపడి రైతులు వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. వర్షాలు కురవక పోవడంతో మెట్టపంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని ప్రధాన చెరువుల్లోకి ఏఎమ్మార్పీ కాలువల ద్వారా నీరు రావాలి ఉన్నా ఈ ఏడాది విడుదల చేయకపోవడంతో ఆ చెరువుల కింద సాగుచేసిన పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. కరువు కోరల్లో ‘నకిరేకల్’.. నకిరేకల్ మండలం వ్యాప్తంగా 13 చెరువులు, 84 కుంటలున్నాయి. వీటి పరిధిలో 5,200 ఆయకట్టు ఉంది. అయితే నేటికీ ఏ చెరువుల్లోకి చుక్క నీరు రాలేదు. అయితే కొందరు రైతులు విచ్చలవిడిగా బోర్ల వేయిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ప్రతి ఏడాది నకిరేకల్ మండలానికి ఎమ్మార్పీ కాల్వలకు నీరు విడుదల చేసేవారు ఈ ఏడాది చుక్క నీరును కూడా వదలలేదు.. మరోవైపు వర్షాలు లేక భూగర్భజలమట్టం అడుగంటింది. రైతుల సాగు నీటి బోర్లులో నీరు రాక మొరాయస్తున్నాయి. దీంతో పండ్ల తోటల రైతుల పరిస్థితితోపాటు ఇటు మెట్టపంటలు, అటు ఆయకట్టులో సాగు చేసిన వరి పొలాలు వాడుబారుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కంటే నకిరేకల్ మండలంలో కరువు ఛాయలు అధికంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు వాటి కింద సాగు విస్తీర్ణం.. మండలం చెరువులు కుంటలు విస్తీర్ణం(ఎకరాలలో) ––––––––––––––––––––––––––––––––––––––––––––––– నకిరేకల్ 13 84 5,200 కేతేపల్లి 17 15 3,200 కట్టంగూర్ 13 40 3,500 నార్కట్‌పల్లి 10 30 1,100 చిట్యాల 10 12 1,500 రామన్నపేట 20 30 2,444 ––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 83 211 12,100 ––––––––––––––––––––––––––––––––––––––––––––––– రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి – మర్రి వెంకటయ్య , మాజీ ఎంపీపీ, నకిరేకల్ పంటలు ఎండిపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆరుతడి పంటలైన కంది, వేరుశనగ, పెసర పంటలు వేసిన రైతులకు ఎకరాకు రూ.20వేలు నష్టపరిహారం ఇవ్వాలి. చెరువులు, కుంటలు కూడా చుక్కనీరు రాక వెలవెల బోతున్నాయి. -
నిమ్మకు మద్దతు ధర కల్పించాలి
నకిరేకల్ : నిమ్మ రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి సైదిరెడ్డి కోరారు. స్థానిక మార్కెట్ కార్యాలయంలో శనివారం నిమ్మ వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్‌లో త్వరలోనే నిమ్మ మార్కెట్ ఏర్పాటు కానుందన్నారు. ప్రస్తుతం నిమ్మ రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస మద్దతు ధర కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సిబ్బంది ఎస్.రమేష్, ఎం.వెంకట్‌రెడ్డి, కుమారి, మౌనిక, జగదీష్, నిమ్మ కాయల వ్యాపారులు మంగినపల్లి రాజు, బి.అంజయ్య, రామలింగం, నూక క్రాంతి, వెంకన్న, మట్టుపల్లి వీరేందర్, చెట్టుపల్లి సుధాకర్, నాగరాజు, జగన్, జోగు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాస్తారోకో
నకిరేకల్ : ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని రవాణాకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నకిరేకల్ మెయిన్‌సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి మండలాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నప్పటì కీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాస్తారోకో చేస్తున్న సమయంలోనంబర్ ప్లేట్ లేకుండా ఇసుకుతో వస్తున్న ఓ ట్రాక్టర్‌ను మెయిన్‌సెంటర్ నిలిపివేసి పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ సర్పంచ్పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, నాయకులు దైద సుధాకర్, కందాల ప్రమీల, మర్రి వెంకటయ్య, రాయి కృష్ణ, పల్స యాదగిరి, బొమ్మకంటి కొమురయ్య, గౌని లక్ష్మినర్సయ్య, పురుషోత్తంరెడ్డి, ఆకుల భాస్కర్, వంటెపాక వెంకటేశ్వర్లు, సాకుంట్ల నర్సింహ్మ, సుదీర్‌రెడ్డి, మర్రి రామస్వామి, దేవయ్య, శ్రీను, జనార్ధన్, అమీర్‌పాషా, నగిశెట్టి శ్రీను, వంటెపాక కృష్ణ, పుట్ట సత్తయ్య, ముత్తిరాములు, బొజ్జ చిన్నవెంకులు తదితరులు ఉన్నారు. -
ఓసీటీఎల్ లాకౌట్ ఎత్తివేయడం కార్మికుల విజయం
నకిరేకల్ : నార్కట్‌పల్లిలోని ఓసీటీఎల్ కంపెనీ 183 రోజుల తర్వాత లాకౌట్ ఎత్తి వేయడం కార్మికుల విజయమని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మీ అన్నారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమకు తోచిన విధంగా చట్టాలను తుంగలో తొక్కుతుంటే అది ఎవరికైనా తెలంగాణలో సా«ధ్యం కాదని మరోసారి రుజువైందన్నారు. ఇప్పటికైనా ఓసీటీఎల్‌లో పారిశ్రామికమైన శాంతిని నెలకొల్పి యాజమాన్యం కార్మికులకు సహకరించాలని కోరారు. ఓసీటీఎల్ కంపెనీ లాభాల బాటలో ఉండాలని కోరారు. సమావేశంలో ఆ వేదిక జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి, నాయకులు వనం నరేందర్, నార్కట్‌పల్లి రమేష్, మొరోజు సైదాచారి, పూల సైదులు, ముడుదుడ్ల శ్రీనివాస్, అయిటిపాముల గిరి, సతీష్, సుల్తానా, జాని తదితరులు ఉన్నారు. -
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
నకిరేకల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, పండుగలు, గుళ్ల నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. నకిరేకల్‌లోని సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహారాష్ట్రతో ప్రభుత్వం చేసుకున్న నదీజాలాల ఒప్పందాన్ని ఇంతగా ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల చేసి చెరువులు, కుంటలను నింపితే కొంతమేర సాగు, తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. హైదరాబాద్ నగరం భారీగా విస్తరించినందున సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అడవిదేవులపల్లి, మద్దిరాల, నాగిరెడ్డిపల్లి, నాగార్జునసాగర్, అమ్మనబోలు గ్రామాలను మండల కేంద్రాలుగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో నంద్యాల నర్సింహారెడ్డి, అనంతరామ శర్మ, తుమ్మల వీరారెడ్డి, తిరందాస్ గోపి, మామిడి సర్వయ్య, ఎండీ.జహంగీర్, కందాల ప్రమీల, బోళ్ల నర్సింహారెడ్డి, మన్ను లక్ష్మి, ఎం.రాములు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, మర్రి వెంకటయ్య, లక్కపాక రాజు, తాజేశ్వర్ పాల్గొన్నారు. -
రాజగోపాల్‌రెడ్డిపై ఆరోపణలు తగవు
నకిరేకల్ : ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. నయీంతో కూడా జిల్లాకు చెందిన కొందురు టీఆర్ఎస్ వారితో సంబంధాలున్నాయన్నారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, మారం చెన్నకృ ష్ణారెడ్డి, నకిరేకంటి ఏసుపాదం, యాస కర్ణాకర్‌రెడ్డి, గుర్రం గణేష్, మాద నగేష్, నవీన్‌రావు, పల్లె విజయ్ ఉన్నారు. -
జైత్రయాత్రను విజయవంతం చేయాలి
నకిరేకల్ : ఆగస్టు 3న నకిరేకల్‌లో జరిగే సర్ధార్ సర్వాయి పాపన్న జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్హాల్లో జరిగిన జైత్రయాత్ర సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై, జిల్లా కేంద్రాల్లో పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆగస్టు 2న నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, నల్లగొండలో జైత్రయాత్రలు కొనసాగుతాయన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘ నాయకులు కొప్పు అంజయ్య, పి.అచ్చాలు, బాదిని చెన్నయ్య, రాచకొండ వెంకన్నగౌడ్, రాచకొండ యాదగిరి, రామచంద్రు, నర్సింహ, దోరపల్లి లక్ష్మయ్య, బుచ్చిరాములు, సుధాకర్, సత్తయ్య, ముత్తిరాములు తదితరులు ఉన్నారు. -
విద్యారంగం పట్ల నిర్లక్ష్య ధోరణి
నకిరేకల్ : కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్హాల్లో శనివారం జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ మరిన్ని పోరాటాలు చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించినా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల బతుకులు మారలేదన్నారు. విద్యారంగసమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మల్లం మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఎం.రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల విద్యాసాగర్, రాష్ట్ర కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటషం, తీగల వెంకన్న, ఆర్ ఇందిర, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, ఖమ్మంపాటి శంకర్, సురేష్, బాబు, మధుకృష్ణ,దుస్స లింగస్వామి, ఆకారం నరేష్, మట్టిపల్లి వెంకట్, నరేష్, ఉపేందర్, శివకుమార్, దుర్గం మేగాత్ర, రమేష్ తదితరులు ఉన్నారు. భారీ ప్రదర్శన నకిరేకల్‌లో రెండు రోజుల పాటు జరగబోయే ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి మహాసభలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మినీ స్టేడియం నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శకుంతల ఫంక్షన్హాల్లోఎస్ఎఫ్ఐ పతాకాన్ని సంఘం జిల్లా అ««ధ్యక్షుడు మల్లం మహేష్ ఎగురవేశారు. -
‘చెరుకు’కు తప్పిన ముప్పు
నకిరేకల్ : తెలంగాణ ఉద్యమవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సామాజిక తెలంగాణ గుండెచప్పుడు కార్యక్రమానికి ఆదివారం తన ఇన్నోవా వాహనంలో అక్కడి వెళ్లారు. రాత్రి 8:30 గంటలకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఆదిలాబాద్ జిల్లా మెండివారి గుట్ట సమీపంలో ఎదురుగా అడవి జంతువులు ఒక్కసారిగా వాహనానికి ఎదురుగా వచ్చాయి. దీంతో డ్రైవర్ వాటిని ప్రమాదాన్ని తప్పించేందుకు సడన్ బ్రెక్ వేయడంతో వాహనం ముందుభాగం ధ్వంసమైంది. సమయానికి సీటు బెల్ట్ పెట్టుకున్నందున చెరుకు సుధాకర్‌తో పాటు అందులో ఉన్న మరో ఆరుగురు ఉద్యమ వేదిక నాయకులు ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
విజిలెన్స్ అధికారుల తనిఖీ
నకిరేకల్ : నకిరేకల్‌లోని శ్రీ మల్లికార్జున జూనియర్, డిగ్రీ కళాశాలలో సోమవారం సాయంత్రం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా ఎస్పీ భాస్కర్‌రావు ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ పి. రాధా, డీసీటీఓ శ్రీమన్నారాయణ తెలిపారు. కళాశాలలో విద్యార్థుల హాజరు, సరిపడా స్టాఫ్ ఉన్నారా.. ల్యాబ్‌లలో తగిన పరికరాలు ఉన్నాయా... విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగస్తులుగా ఉండి ఫీజు రీయింబర్స్మెంట్ కింద లబ్ధిపొందుతున్నారా.. తదితర అంశాలను పరిశీలించామని తెలిపారు. వారి వెంట ఎస్ఐ పీరయ్య, కానిస్టేబుల్ పీ. వెంకట్‌రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్స్ వెంకన్న, కృష్ణ ఉన్నారు. -
చెట్టుపై నుంచి కిందపడి విద్యార్థి మృతి
నకిరేకల్ చెట్టుపై నుంచి జారి కింద పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండం కడపర్తి గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపర్తి గ్రామానికి చెందిన మోగరాల యాదయ్య చిన్న కూమారుడు గణేష్ (17) నకిరేకల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సం చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గ్రామంలోని సెల్ టవర్ సమీపంలో అల్లనేరెడు చెట్టు ఎక్కి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిరోడ్డు మీద పడటంతో తలకు బలమైన దెబ్బలు తగిలాయి. వెంటనే చుట్టపక్కల వారు చూసి ఆటోలో నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో యాదయ్య కుటుంబంలో విషాదం అమలుకుంది. స్థానిక సర్పంచ్ దుబ్బాక మంగమ్మయాదగిరి రెడ్డి,ఎంపీటీసీ పల్లేబోయిన అంజమ్మ లు సంతాపం తెలిపారు. -
ఈ.. అభాగ్యులను ఆదుకోరూ..
కిడ్నీలు చెడిపోవడంతో అనారోగ్యం ఆపన్నహస్తం కోసం రెండు కుటుంబాలు ఎదురుచూపు ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం సాధించాలన్నది ఆమె సంకల్పం.. ఒకరోజు తరగతి గదిలోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తే ఆ కుటుంబానికి నమ్మశక్యం కాని నిజం బయటపడింది. రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు.. కూతురు కోసం ఆ తల్లిదండ్రులు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు. ఇప్పుడు చిల్లిగవ్వలేదు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మరొకరిది బీద కుటుంబం. భర్త వికలాంగుడు..భార్యే కూలి పనిచేసి పోషిస్తోంది. ఉన్నట్టుండి ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఈ కుటుంబం కూడా ఆర్థికసాయం కోసం అర్థిస్తోంది. నకిరేకల్: శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన దోనూరి కృష్ణారెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఈ కుటుంబం పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఇంటికి పెద్దకుమార్తె అయిన స్పందన ప్రాథమిక దశ నుంచే చదువులో రాణిస్తూ ఉన్నత ఆశయాలతో ముందుకుసాగుతోంది. స్పందన పదవ తరగతి వరకు నకిరేకల్‌లోని సరస్వతి పాఠశాలలో పూర్తిచేసింది. ఆ తరువాత ఇంటర్ కాకతీయ,డిగ్రీ వాసవీ కళాశాలలో పూర్తి చేసింది. ఆ తరువాత ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం సాధించి కన్నతల్లిదండ్రుల కష్టాలను తొలగించాలని అనుకుంది. బ్యాంక్ రుణంతో హైదరాబాద్‌లోని నోవా కళాశాలలో ఎంబీఏ కోర్సులో ప్రవేశం పొందింది. పరీక్షలు రాస్తూనే.. 2010 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల సమయంలో స్పందనకు తీవ్ర జ్వరం వచ్చింది. పరీక్షలు రాస్తూనే కళ్లు తిరిగి పడిపోయింది. తక్షణమే స్పందనను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎమర్జన్సీ కేస్ అని ఎవ్వరూ చేర్చుకోలేదు. చివరికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు అన్ని చేశాక స్పందన రెండు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు ధ్రువీకరించారు. ఉన్నదంత ఊడ్చినా.. పెద్ద కూతురు స్పందనకు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో దోనూరి కృష్ణారెడ్డి సుజాత దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. కడుపుతీపి చంపుకోలేక తమకున్న రెండు ఎకరాల భూమిని విక్రయించి కుమార్తె వైద్య ఖర్చుల కోసం వినియోగించారు. అయినా చాలకపోవడంతో వ్యవసాయానికి ఆధారమైన ట్రాక్టర్‌ను కూడా తాకట్టు పెట్టారు. ఐదేళ్లుగా ఆరోగ్య శ్రీ పథకం కింద స్పందనకు డయాలసిస్ చేయిస్తున్నారు. కూతురు కోసం స్వగ్రామమైన వల్లాలను విడిచి నకిరేకల్‌లోనే నివాసం ఉంటూ రెండు రోజుకు ఒకసారి హైదరాబాద్‌కు తీసుకువెళ్లి డయాలసిస్ చేయిస్తూ బిడ్డను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిలైన స్పందనకు 26ఏళ్ల వయస్సు ఉండడంతో వయస్సు కూడా తక్కువగా ఉన్నందున డయాలసిస్ కాకుండా కిడ్నీ మార్పు చేయిస్తే ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు సలహా ఇచ్చారు. కిడ్నీ మార్పిడికి రూ.6లక్షల పైనే ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. నా కూతురిని కాపాడండి : సుజాత, స్పందన తల్లి నా బిడ్డ సావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దాని బాధ చూడలేకపోతున్నాం. ఉన్నదంతా అమ్మినా జబ్బు నయం కాలే.. ఐదేళ్లుగా బిడ్డ బాధపడుతోంది.. మనవతాహృదయంతో దాతలు ముందుకొచ్చి సాయమందిస్తే వాళ్ల రుణం మర్చిపోము. నా కూతురు కన్న కలలను కూడా సాకారం చేయిస్తాం. మనసున్న మహరాజులు నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి. ఆర్థికసాయం చేయాలనుకున్న వారు.. ఆర్థికసాయం చేయాలనుకున్న 9502210262 నంబర్‌కు సంప్రదించండి. బ్యాంక్ ద్వారా సహాయం అందించాలనుంటే ఎస్బీహెచ్ నకిరేకల్ అకౌంట్ నంబర్ 62092763532, ఐఎ స్బి కోడ్ ఎస్‌బీహెచ్‌వై 002018కి డబ్బులు పంపించొచ్చు. -
నల్లగొండ జిల్లాలో మళ్లీ ఉగ్రవాదుల కలకలం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. గత నెల 26న నకిరేకల్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినవారు ఉగ్రవాదులుగా నిర్థారించినట్లు తెలుస్తోంది. పానగల్లో తప్పించుకున్న ఇద్దరు యువకులు.. ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిపినవారికి బహుమానం కూడా ప్రకటించారు. కాగా మే 26వ తేదీన నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు పిస్టల్‌తో హల్చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్‌లు బైక్‌పై సివిల్‌డ్రెస్‌లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్‌కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు. ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్‌ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు. దాంతో ఇటీవల నల్లగొండలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ ఇద్దరు యువకులు... దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
దొంగలా.. ఉగ్రవాదులా..?
నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు మంగళవారం పిస్టల్‌తో హల్చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై పిస్టల్గురిపెట్టి బైక్‌పై పారిపోయారు. వీరు దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమనుంచి తప్పించుకుని పారిపోయిన యువకులు దొంగలేనని పోలీసులు పేర్కొంటున్నారు. నకిరేకల్ :పట్టణంలో గుర్తుతెలియని దుండగులు పిస్టల్‌తో సంచరించడం సంచలనం సృష్టించింది. అయితే సదరు వ్యక్తులు దొంగలా..ఉగ్రవాదులా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం తమ నుంచి తప్పించుకుపోయిన ఇద్దరు యువకులు దొంగలేనని కొట్టిపారేస్తున్నారు. వివరాలు.. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఇద్దరు యువకులు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని నకిరేకల్ వైపు వైట్ కలర్ అపాచీ బైక్‌పై పరారైనట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులు నకిరేకల్ పోలీసులను అప్రమత్తం చేశారు. చిక్కినట్టే చిక్కి.. దొంగల సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్‌లు బైక్‌పై సివిల్‌డ్రెస్‌లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్‌కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు. ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్‌ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు. మళ్లీ.. అదే తప్పు..! ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అనే నానుడిని పోలీసు శాఖ వంటపట్టించుకున్నట్టు కనిపించడం లేదు. నిందితులను పట్టుకోవడంలో ఆ శాఖ అధికారుల డొల్లతనం మరోసారి ప్రస్పుటంగా వెల్లడైంది. రెండు మాసాల క్రితమే సూర్యాపేట, అర్వపల్లిలో ఆయుధాలు లేని కారణంగా ఆ శాఖ అధికారులు భారీ మూల్యమే చెల్లించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ కూడా దుండగుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆయుధాలు లేకుండానే వారిని వెంబడించి ఖంగుతిని బతుకుజీవుడా అంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ సదరు దుండగుడు పిస్టల్‌ను చూపించి మాత్రమే బెదిరించాడు. గురిపెట్టి కాల్చి ఉంటే మరో ఇద్దరు ఖాకీల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవేనని స్థానికంగా చర్చజరుగుతోంది. ఈ ఘటన విషయం తెలుసుకుని ఆఫీసర్స్ కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. డీఎస్పీ సందర్శన నకిరేకల్‌లో ఇద్దరు దొంగలు పిస్టల్‌తో వచ్చిన సంఘటన తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ రాములు నాయక్, స్థానిక సీఐ బాలకృష్ణ తన పోలీసుల బలగాలతో ఆఫీసర్స్ కాలనీని సందర్శించారు. దొంగలు బైక్ నుంచి కింద పడి పారిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. బైక్‌పై పరారైన ఈ ఇద్దరు దొంగల గ్యాంగ్గానే నిర్ధారించినట్లు డీఎస్పీ రాములు నాయక్ తెలి పారు. మహిళల మెడలో నుంచి గొలుసులను చోరీ చేసేందుకు కత్తులు, బొమ్మ పిస్టల్‌తో సంచరిస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు. ఈ విషయంపై విచారణ జరిపి పారిపోయిన దొం గల ముఠాను పట్టుకుంటామన్నారు. కాగా, నకిరేకల్ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు నకిరేకల్ మండలం మర్రూర్‌కు చెందిన అన్నదమ్ములు షేక్ సయ్యద్‌మియా, షేక్ అబూ బఖర్ సూ ర్యా పేటలోని స్వరాజ్ట్రాక్టర్ షోరూంలో *26 వేలు చెల్లిం చేందుకు వస్తున్నారని తెలియడంతో విడిచిపెట్టారు. పట్టుకునే ప్రయత్నం చేశాం: కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్ నకిరేకల్‌లో బైక్‌పై ఇద్దరు దొంగలు సంచరిస్తున్నట్లు తమకు సమాచారం రావ డంతో వెంటనే బైక్‌పై గాలింపు చర్యలు చేపట్టాం. మధ్యాహ్నం 12:20నిమిషాల సమయంలో ఆఫీసర్స్ కాలనీలోని ఆఫీసర్స్ క్లబ్ వెనక సందులో వెళ్తుండగా వారికి ఎదురుగా వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో దుండగులు, తాము బైక్‌లపై నుంచి కిందపడ్డాం. దొంగలను కూడా పట్టుకున్నాం. బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి తన జేబులో నుంచి నల్లటి ఆకారంలో ఎదో బయటకు తీశాడు. వెంటనే మేము పక్కకు వెళ్లిపోయాం. ఆ తరువాత దొంగలు బైక్‌పై పరారయ్యారు. దుండగుల వయస్సు 30లోపే పట్టణానికి పిస్టల్‌తో వచ్చి పోలీసులపై గురి పెట్టి పరారైన దుండగులు 27-30 వయస్సు ఉన్నట్టు ఆఫీసర్స కాలనీవాసులు చెబుతున్నారు. దుం డగుల్లో ఒకరు జీన్స్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ వేసుకుని గడ్డంతో ఉన్నాడని, మరొకరు బైక్ నడుపుతూ ముఖానికి ముసుగు కట్టుకున్నాడని తెలి పారు. వారిలో ఒకడు పోలీసులపై కాల్చడానికి గురి పెట్టాడని,అది పేల కపోవడంతో పరారయ్యారని కాలనీకి చెందిన ఓ మహిళ తెలిపింది. ఇద్దరు ఎదో భాషలో మాట్లాడుతున్నారని కాలనీవాసులు తెలిపారు. -
అడ్డుగా ఉందని..
మాతృమూర్తి సమాజంలో ఉన్నత స్థానం ఉంది. కానీ ఆ మహోన్నత స్థానానికే కలంకం తెచ్చేలా ఓ తల్లి వ్యవహరించింది. తన ‘సుఖానికి’ అడ్డుగా ఉందన్న కారణంతో కడుపునపుట్టిన ముక్కుపచ్చలారని చిన్నారిని ప్రియుడితో కలిసి దారుణంగా అంతమొందించింది.. మూడు నెలల క్రితం నకిరేకల్ పట్టణంలో వెలుగుచూసిన చిన్నారి డులసి హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు.. కన్నతల్లే ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. - ప్రియుడితో కలిసి కూతురినే కడతేర్చిన తల్లి - చిన్నారి డులసి హత్యకేసును ఛేదించిన పోలీసులు - ఫోన్‌కాల్ లిస్ట్ ఆధారంగా వెలుగులోకి - నిందితుల అరెస్ట్.. రిమాండ్ నకిరేకల్ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన సుష్మితకు నకిరేకల్ పట్టణం సంతోష్‌నగర్‌కు చెందిన నిమ్మనగోటి విక్రమ్‌తో 2012 ఆగస్టు 15న వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి డులసి (18 నెలలు) సంతానం. ప్రియుడితో ప్రేమాయణం అదే ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, సంతోష్‌నగర్‌లోనే నివాసముంటున్న కోట సాయికిరణ్‌తో సుష్మిత ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసి విక్రమ్ సుష్మితను పాఠశాల మాన్పించాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఒకనొకదశలో సుష్మిత తన భర్త విక్రమ్‌కు విడాకులు ఇచ్చి సాయికిరణ్‌ను వివాహం చేసుకోవాలనుకుంది. లైన్‌క్లియర్ చేసుకోవాలని.. తనకు విడాకులు కావాలని సుష్మిత భర్తతో పలుమార్లు తగాదా పడింది. అందుకు విక్రమ్ ఒప్పుకోలేదు. దీంతో చిన్నారి డులసిని అంతమొందించి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి పన్నాగం పన్నారు. దీనిలో భాగంగానే గత మార్చి 26వ తేదీన విక్రమ్ పాఠశాలకు వెళ్లగానే సాయికిరణ్‌ను ఇంటికి పిలిచింది. తానే డులసిని నీటి బకెట్లో వేసి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. ఆపై సాయికిరణ్‌తో తలపై కొట్టించుకుని దుండగులు దాడి చేశారని చిత్రీకరించి అందరినీ నమ్మించింది. తన భర్తే దుండగుల చేత చేయించాడని పోలీసులకు తెలిపింది. వెలుగులోకి ఇలా.. సుష్మిత ఫిర్యాదు మేరకు విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే సుష్మిత ప్రేమాయణాన్ని విక్రమ్ పోలీసులకు వివరించడంతో పోలీసులు ఆమె కదలికలపై నిఘా వేశారు. దీంతో పాటు ఆమె సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను విచారించడంతో వారి అనుమానం బలపడింది. సాయికిరణ్‌ను, సుష్మితను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారని సీఐ వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి స్థానిక మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. -
టీఆర్ఎస్ ప్లీనరీని జయప్రదం చేయాలి
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా ప్రతి నియోజకవర్గంనుంచి 300మందికి మించకుండా ప్లీనరీకి రావాలి బహిరంగ సభకు జిల్లా నుంచి లక్ష మంది తరలింపు నకిరేకల్ : ఈనెల 24న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్లీనరీ, 27న జరిగే పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కోరారు. నకిరేకల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మాట్లాడారు. ప్లీనరీకి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300మందికి మించకుండా హాజరు కావాలని చెప్పారు. 27న జరిగే బహిరంగ సభలో జిల్లా నుంచి లక్ష మంది టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నల్లగొండ జిల్లా త్వరలోనే టీఆర్ఎస్కు పెట్టిన కోటగా మారబోతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా నాయకులు అమరేందర్‌రెడ్డి, పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, ఎం పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యానాల పాపిరెడ్డి, కోక యాదయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ శాఖ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్, లారీ ఢీ: చిన్నారి మృతి
నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులోని కడపర్తి పెట్రోల్ బంకు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న చిన్నారి మృతిచెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. చౌటుప్పల్ భీమనకల్లుకు చెందిన దంపతులు బిడ్డతో బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేలకొరిగిన అరుణ శిఖరం
చిట్యాల/నకిరేకల్ : ప్రజా సేవకుడు, కమ్యూనిస్టు కురవృద్ధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, నర్రా రాఘవరెడ్డి (91) కన్నుమూశారు. చిట్యాల మండలం వట్టిర్తికి చెందిన నర్రా రాఘవరెడ్డి గురువారం నార్కట్‌పల్లి కామినేని వైద్యశాలలో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్వగ్రామమైన వట్టిమర్తిలోని తన ఇంటి వద్ద కాలం గడుపుతున్నారు 20 రోజుల క్రితం తన ఇంట్లో బాతురూంలో జారి పడడంలో కాలుకు దెబ్బతాకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను 20 రోజుల క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 10రోజుల క్రితమే స్వగ్రామమైన వట్టిమర్తికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం 10:30గంటల సమయంలో తిరిగి నర్రా రాఘవరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యులు నర్రా రాఘవరెడ్డికి చికిత్సను అందించారు. షుగర్ లెవల్ ఎక్కువ కావడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో శ్వాస తీసుకోలేక సాయంత్రం 6 :15 గంటల సమయంలో ప్రాణాలు వదిలారు. జిల్లా కార్యాలయానికి తరలింపు.. నల్లగొండ టౌన్ : రాఘవరెడ్డి భౌతికకాయాన్ని గురువారం రాత్రి 8 గంటలకు సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాఘవరెడ్డి కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సుంకరి మల్లేష్‌గౌడ్, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, డాక్టర్ చెరకు సుధాకర్, రాఘవరెడ్డి సహచరుడు దశరథకుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, అనంతరామశర్మ, మల్లు నాగార్జున్‌రెడ్డి, గోపి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పాలడుగు ప్రభావతి, మల్లు లక్ష్మీ, పాలడుగు నాగార్జున, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి, రవినాయక్, ఎండీ సలీం, అవుట రవీందర్, సయ్యద్ హాషం, టి.నర్సిరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలను నివాళులర్పించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నీతికి, నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మహానీయుడని కొనియాడారు. డాక్టర్ చెరకు సుధాకర్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యేగా ఆరుసార్లు పనిచేశారని చెప్పారు. సుంకరి మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ రాఘవరెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించిన నాయకుడని కొనియాడారు. రాఘవరెడ్డి సహచరుడు దశరథకుమార్ మాట్లాడుతూ రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన పిట్టలదొర, గొల్ల సుద్దులు చెప్పేవారని, తాను పాటలు పాడేవాడినని గుర్తు చేసుకున్నారు. నేడు మధ్యాహ్నం వట్టిమర్తిలో అంత్యక్రియలు... నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి పార్టీలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాఘవరెడ్డి వృతి పట్ల జిల్లా పార్టీ తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని తెలిపిందన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి అనంతరం నకిరేకల్ కేంద్రానికి తరలిస్తామన్నారు. అక్కడి నుంచి వట్టిమర్తి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలి పారు. అంత్యక్రియలకు తమ్మినేని వీరభద్రం, రాఘవులుతోపాటు ఇతర రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు సంతాప దినాలను పాటించి గ్రామ గ్రామాన సంతాప సభలు నిర్వహిస్తామని తెలిపారు. -
విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి
నకిరేకల్ :విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, నకిరేకల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మూసపాటి కమలమ్మ(72) బుధవారం రాత్రి మృతి చెం దారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్‌లో చికిత్సపొందారు. ఆస్పత్రి నుంచి ఈ నెల 8న నాంపల్లిలోని తన సోదరిడి ఇంటికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విష మించి మృతి చెందారు. ఆమె అంత్యక్రియ లను నాంపల్లిలోనే నిర్వహించారు. జీవితాం తం కుమారిగానే ఉండి తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసారామె. నకిరేకల్ స్థానం నుంచి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించిన నర్రారాఘవరెడ్డిపై పోటీ చేసి గెలుపొందిన రికార్డు ఆమెకే సొంతమైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మూసపాటి కమలమ్మ మృతి చెందడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన కమలమ్మ అనేక ఉద్యమాల్లో పనిచేశారు. రాజకీయాల్లోకి చేరిన తర్వాత నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. మెదక్‌జిల్లా జిన్నారం మండలం దాసారం గ్రామానికి చెందిన శాంతమ్మ, నాగయ్యలకు 1943లో మూసపాటి కమలమ్మ జన్మించింది. ఈమెకు నలుగురు అన్నదమ్ములున్నారు. ఆనాడు తండ్రి ద్వారా గాంధీ, నెహ్రూలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల గాధులు విన్న ఆమె, వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలిగా.. బీఏ వరకు చదివిన మూసపాటి కమలమ్మ 1959లో నల్లగొండ జిల్లా పరిషత్, పంచాయతీ సమితీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో గ్రామ గ్రామాన ఎడ్ల బండ్లపై తిరిగి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు.. ఆనాటి జిల్లా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే జిల్లా రాజకీయాల్లో స్థిరపడ్డారు. 1967 ఎన్నికలోఉ్ల నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాఘవరెడ్డిపై ఓడిపోయారు. తిరిగి 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించిన నర్రా రాఘవరెడ్డిపై 3,836 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. 1970లో సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ సోషల్ వర్కర్స్ మహాసభల్లో ఫిలిప్పిన్స్, జపాన్, బ్యాంకాక్, హాంకాంగ్‌లో ఇందిరాగాంధీతో కలిసి పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా.. ఎమ్మెల్యేగా ఎన్నికైనా తరవాత కమలమ్మ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యేగా నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం, తోపుచర్ల, ఫిర్కాలలో బలహీన వర్గాల రైతుల కోసం బావులు తవ్వించారు. 1972 సెప్టెంబర్ 7న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీని నకిరేకల్‌కు పిలిపించి నియోజక వర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. నకిరేకల్‌లో కోఆపరేటివ్ బ్యాంక్, బస్టాండ్ నిర్మాణం, చేనేత కార్మికులకు రుణాలు, గుడివాడలో వడ్డెర కార్మికులకు 25 బోరు బావులు వేయించారు. నిర్వహించిన పదవులు.. 1959లో సేవాదళ్ కార్యకర్తగా, 1962లో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా, 1972లో నకిరేకల్ ఎమ్మెల్యేగా, ఆల్ఇం డియా పల్స్ బోర్డ్ డెరైక్టర్‌గా, 1978, 79లో మైనింగ్ కార్పోరేషన్ డెరైక్టర్‌గా, బీసీ కార్పోరేషన్ ైడె రెక్టర్‌గా, రెండు సార్లు సెం ట్రల్ వెల్ఫేర్ బోర్డ్ డెరైక్టర్‌గా పని చేశారు. పీసీసీ సభ్యురాలిగా కొనసాగారు. -
బీసీల బడ్జెట్‌ను రూ.25వేల కోట్లకు పెంచాలి
నకిరేకల్ : బీసీల బడ్జెట్‌ను రూ. 25వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్‌ను పెంచాలని కోరుతూ ఈ నెల 18న బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆదివారం నకిరేకల్‌లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ కులాల అభ్యు న్నతికి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సకినాల రవి, అర్రూరి వెంకటేశ్వర్లు, పగిల్ల సందీప్, బీసీ సంఘం నాయకులు బండపల్లి శ్రీనివాస్‌గౌడ్, మిడిసినమెట్ల సైదులు, నేలపట్ల రమేష్, పగిల్ల వెంకన్న, గోగికార పరమేష్, పోగుల ఉపేందర్, తిరుగుడు రవి, ఆలకుంట్ల సైదులు, శ్రీనివాసచారి, మాజీద్, వెంకన్న, శ్రీను, సంకోజు కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. -
చిన్నారుల అదృశ్యంపై ఆర్జేడీ విచారణ
నకిరేకల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన ఆశ్రమ చిన్నారుల అదృశ్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజనల్ జా యింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మీ విచారణ జరిపారు. నకిరేకల్ని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న ఆశ్రమ నిర్వాహకురాలు కవిత గృహాన్ని ఆర్జేడీ, జిల్లా ఇన్చార్జ్ ఐసీడీఎస్ పీడీ మోతి, సీఐ శ్రీనివాస్‌రావు సందర్శించారు. నిర్వాహకురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వద్ద ఉన్న ఐదుగురు చిన్నారులు ఐతరాజు విష్నేష్, వేముల సురేష్, వేముల శివ, నోముల రవి, నోముల సాయి విచారించారు. జ్వరం వచ్చిందని.. జ్వరం రావడంతోనే అనాథాశ్రమంలోని 22 మంది చిన్నారులను వారి సంరక్షకులకు అప్పగించి మిగిలిన ఐదుగురు అనాథలను తన వద్ద ఉంచుకున్నట్టు ఆశ్రమ నిర్వాహకురాలు కవిత అధికారులకు వివరణ ఇచ్చింది. కవిత వద్ద ఉన్న ఆ చిన్నారులను నల్లగొండలోని బాలసదన్‌కు తరలించాలని ఆర్జేడీ ఐసీడీఎస్ సిబ్బందిని ఆదేశించారు. పిల్లలను ఇబ్బంది పెడితే చర్యలు: ఆర్జేడీ ఆశ్రమాల పేరుతో నిరుపేద, అనాథ పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రిజినల్ జాయింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి నిధులు వస్తాయని ఆశతో కొంత మంది ఆశ్రమాలు స్థాపించి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మోత్కూరులో కూడా అబ్బాస్ పిల్లల ఆశ్రమం నిర్వాహకురాలు కవిత కూడా అదే పని చేయబోయిందని పేర్కొన్నారు. గత జనవరిలో ఇలాంటి ఆశ్రమాలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ నోటిఫికేషన్ జారీచేశారని గుర్తుచేశారు. అయిన మోత్కూర్ అబ్బాస్ పిల్లల అనాథాశ్రమం నిర్వాహకులు దరఖాస్తులు కూడా చేసుకోలేదన్నారు. ఆశ్రమంలో ఉండాల్సిన పిల్లలు ఇతర ప్రాంతాలకు ఇష్టానుసారంగా తరలించండం చట్టరీత్యా నేరమన్నారు. చీటింగ్ చేసిన కవితపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఆమె వెంట నకిరేకల్, రామన్నపేట సీఐలు శ్రీనివాసరావు, బాల గంగిరెడ్డి, ఐసీడీఎస్ ఏపీడీ కృష్ణవేణి, నకిరేకల్ మోత్కూర్ మండలాల ఐసీడీఎస్ సూపర్ వైజర్లు అరుణశ్రీ, సావిత్రమ్మ, డీసీపీఓ సైదులు ఉన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం : ఓఎస్డీ నల్లగొండ క్రైం : మోత్కూరులోని స్మైల్ చైల్డ్ హోం కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తామని జిల్లా ఇన్చార్జ్ ఏఎస్పీ, ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. కేంద్రంలోని 27 మంది విద్యార్థుల అదృశ్యంపై శనివారం ఆయన స్పందించారు. తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ రికార్డులో ఎక్కువగా చూపించారని తేలిందన్నారు. 22 మంది పిల్లలు చైల్డ్ హోం కేర్ సెంటర్లో ఉండగా 16 మంది పిల్లలు మోత్కూరు మండలానికి సంబంధించిన వాళ్లు కాగా మరో ఐదుగురు పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారని తెలిపారు. ఇతర దేశాల నుంచి డబ్బులు లాగేందుకు ఎక్కువ మంది పిల్లలను చూపించారన్నారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
నకిరేకల్ : నకిరేకల్ శివారులోని బాబాసాహెడ్గూడెంకు చెందిన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. బాబాసాహెబ్‌గూడెం గ్రామానికి చెందిన గద్దపాటి అఖిల్ (25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అఖిల్ తన ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బా తీసుకొని వెళ్లి నకిరేకల్ శివారులో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలినగాయాలతో కొట్టుమిట్టాడుతున్న అఖిల్‌ను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న ల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని అఖిల్ తన వాంగ్మూలం ఇచ్చినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
కేతేపల్లి : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండలంలోని కాసనగోడు ఉన్నత పాఠశాలలో రూ.37.69 లక్షల ఆర్ఎంఎస్ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడంలో గత పాలకుల వైఫల్యం వల్లే నేడు తెలంగాణలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలుకు కార్యాచరణ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎంఈఓ డి.వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్త మంజుల, జెడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ, స్థానిక సర్పంచ్ బొజ్జ సైదమ్మ రామకృష్ణ, ఎంపీటీసీ కందుల మోహన్‌కుమార్, ఉప సర్పంచ్ దయాకర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కరుణ, పీఆర్టీయూ మండల కార్యదర్శి కె.వెంకట్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ పి.జగన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురిని బలిగొన్న అతివేగం
కల్వర్టును ఢీకొన్న కారు అక్కడికక్కడే ఒకరు.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి మృతుల్లో నవదంపతులు నకిరేకల్ సమీపంలో దుర్ఘటన మృతులంతా ఖమ్మం జిల్లా వాసులు నకిరేకల్, న్యూస్‌లైన్ అతివేగం మూడు నిండు ప్రాణాలను బలిగొన్న ది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు నవదంపతులున్నారు. ఈ విషాదకర సంఘటన నకిరేకల్ బైపాస్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బుక్యవరపు వెంకటకృష్ణప్రసాద్(31) అతని భార్య బుక్యవరపు సౌమ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటకృష్ణప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, సౌమ్య మల్లారెడ్డి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుభకార్యం ఉండటంతో వీరిద్దరూ స్వగ్రా మం వెళ్లారు. తిరుగుప్రయాణంలో సత్తుపల్లి మండ లం తంబూరుకు చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ బావ తిన్నవల్లి చైతన్యకుమార్, చెల్లి విష్ణుప్రియతో కలిసి కారులో ఇల్లందు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉదయం 7గంటల సమయంలో కారు నడుపుతున్న వెంకటకృష్ణప్రసాద్ నకిరేకల్ బైపాస్ వద్ద అతివేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని త ప్పించబోయి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. ఈ ఘట నలో సౌమ్య అక్కడికక్కడే మృతిచెందగా వెంకట కృష్ణప్రసాద్, అతని బావ చైతన్యకుమార్(31), చెల్లి విష్ణుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి త రలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్బీనగ ర్ కామినేనికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకటకృష్ణప్రసాద్, చైతన్యకుమార్ మృతి చెందగా విష్ణుప్రియ మృత్యువు తో పోరాడుతోంది.సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రమాద స్థలిని సీఐ నాగేశ్వర్, ఎస్ఐ ప్రసాద్‌రావులు సందర్శించారు. సౌమ్య మృతదేహానికి నకిరేకల్ ప్ర భుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
30న ‘అరుణోదయ’ జిల్లా సదస్సు
నకిరేకల్, న్యూస్‌లైన్: ఈ నెల 30న నల్లగొండలోని టౌన్హాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలం సంతోష్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్సూర్, పల్స నిర్మల తెలిపారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం నకిరేకల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 30వ తేదీన ఉదయం 11 గంటలకు టౌన్‌హల్‌లో జిల్లా సదస్సు, సాయంత్రం 6 గంటలకు క్లాక్‌టవర్ తెలంగాణ చౌక్ వద్ద బహిరంగా సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సుకు జిల్లాలోని వివిధ రంగాల కళాకారులు 200 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర , జిల్లా కమిటీల నియామకం, భవిష్యత్ లక్ష్యా ల కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా విమలక్క, కవి,పరిశోధకుడు జయధీర్, తెలంగాణ జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మకంటి కొమరయ్య, పీడీఎస్‌యూ జిల్లా కన్వీనర్ ఆవుల నాగరాజు, జిల్లా నాయకులు యానాల లింగారెడ్డి, పల్సగిరి, బోడ్డు శంకర్, మిట్టా నర్సిరెడ్డి, రంగన్న, రామలింగయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.