వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయాలి | ysrcp Need to strengthen | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయాలి

Published Sun, Oct 2 2016 11:15 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయాలి - Sakshi

వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయాలి

నకిరేకల్‌ : నకిరేకల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇరుగు సునీల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో ఆదివారం జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల లోపు వైఎస్సార్‌సీపీని ఈ నియోజకవర్గంలో పటిష్టపరచాలన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు వేస్తామన్నారు. అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని, ఇతర బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. డబుల్‌బెడ్‌రూమ్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయకుండా గందరగోళం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అంశల సత్యనారాయణ, పుట్ట పిచ్చయ్యగౌడ్, బాస నర్సింహ, శంకరయ్య, జానకి రామిరెడ్డి, దేవయ్య, పార్టీ జిల్లా కార్యదర్శులు పోగుల నర్సింహగౌడ్, పిల్లి జలేంధర్, దేవసారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement