suneel kumar
-
వినేశ్‌కు రజతం
న్యూఢిల్లీ: ఈ సీజన్లో వరుసగా నాలుగో స్వర్ణ పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశ ఎదురైంది. బెలారస్లో ఆదివారం ముగిసిన మెద్వేద్ ఓపెన్ టోర్నమెంట్లో వినేశ్ రన్నరప్‌గా నిలిచింది. రష్యా రెజ్లర్ మలిషెవాతో జరిగిన ఫైనల్లో వినేశ్ 0–10తో ఓడింది. ఈ సీజన్లో వినేశ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి, యాసర్ డొగో టోర్నీ, పోలాండ్ ఓపెన్ టోర్నీల్లో పసిడి పతకాలు సాధించింది. మెద్వేద్ టోర్నీలోనే ఇతర భారత మహిళా రెజ్లర్లు కూడా ఆకట్టుకున్నారు. పింకీ (55 కేజీలు), సరిత (57 కేజీలు) కూడా రజతాలు గెలిచారు. సాక్షి మలిక్ (62 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (68 కేజీలు), రాణి (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. సుశీల్‌కు నిరాశ... రవికి కాంస్యం ఇదే టోర్నీలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సుశీల్ 7–8తో కడిమగమెదోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో తొలి రౌండ్లో అబ్దురఖమనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో సుశీల్ 90 సెకన్లలో ఓటమి పాలయ్యాడు. అయితే అబ్దురఖమనోవ్ ఫైనల్‌కు చేరడంతో సుశీల్‌కు రెపిచేజ్ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరులో ఆడే అవకాశం దక్కింది. పురుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియాకు కాంస్యం లభించింది. కాంస్య పతక బౌట్లో రవి 9–4తో అరాబిద్జె (రష్యా)పై గెలిచాడు. -
చంద్రబాబుకు పుట్టగతులుండవు
సాక్షి, తిరుపతి: బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న ఆమెను పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మట్లాడుతూ... చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచ రాజకీయమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటిస్తున్న తమను అరెస్ట్ చేయడాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఖండించారు. ‘మీరు చేసిన దొంగ దీక్షలకు పోలీసుల రక్షణ కావాలి. ప్రత్యేక హోదా సాధించేందుకు నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్న మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేస్తారా?’ అని ప్రశ్నించారు. కలిగిరి ఎస్ఐ దాష్టీకం చిత్తూరు జిల్లా పీలేరులో బంద్ చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఎస్ఐ శ్రీనివాస్ రౌడీయిజం ప్రదర్శించారు. ఆందోళకారులను విచణారహింగా కొట్టడమే కాకుండా ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారు. ఎస్ఐ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సంబంధిత కథనాలు: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న బంద్ మహిళలను ఈడ్చిపడేశారు హోదా ఉద్యమాన్ని బాబు అణచడం దారుణం: సీపీఎం బాబూ.. బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు? -
పార్టీ ఫిరాయిస్తే రూ.40 కోట్లు
సాక్షి, రొంపిచెర్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సునీల్‌కుమార్ వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవనని, తాను ఎప్పటికీ తన గురువు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. -
పసిడి పురి...ఊపిరి పీల్చుకో
గ్యాంగ్‌స్టర్ సునీల్ పేరు చెబితే.. ప్రొద్దుటూరు వాసులు గడగడలాడే వారు... ఇక ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే వణికిపోయే వారు... ఎందుకంటే అతడి అరాచకాలు అలా ఉండేవి... డబ్బు కోసం శ్రీమంతుల్ని బెదిరించేవాడు... ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే వాడు... అప్పటికీ ఇవ్వని పక్షంలో చంపేసే వాడు... దీంతో చాలా మందికి కంటి మీద కునుకు ఉండేది కాదు... ఈ క్రమంలో సునీల్ చనిపోవడంతో వారంతా ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రొద్దుటూరు క్రైం : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సునీల్.. పేరు మోసిన నేరస్తుడు. అతను ఇంటర్మీడియట్‌ను మధ్యలో వదిలేశాడు. జులాయిగా తిరిగే యువకులతో బ్యాచ్ ఏర్పాటు చేసుకుని.. పెద్ద నెట్వర్క్ నడిపాడు. మారుమూల గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రతి చోట తన అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో చదువు మానేసిన వారే ఎక్కువగా ఉండే వారు. మందు, బిరియాని, ఖరీదైన వస్తువులను కొనిస్తూ వారిని ఆకర్షించాడు. ముఖ్య అనుచరులైన వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి సినీ రంగుల ప్రంపంచాన్ని కూడా చూపించాడు. ఇలా యువకులను ఆయుధంగా చేసుకొని సునీల్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. యువకులే ఆయుధంగా.. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మండ్ల వెంకట సునీల్‌కుమార్ తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి, చెల్లెలు ఉన్నారు. సునీల్ కొన్ని నెలలు ఆటో డ్రైవర్‌గా పని చేశాడు. ఆటో నడుపుకునే సమయంలోనే ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కొన్ని సార్లు పోలీసులకు దొరికాడు. స్టేషన్‌కు వెళ్లడం.. బయటికి రావడం షరామామూలే అయింది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి లంచాలు ఇచ్చి.. వారి నుంచి సహకారం పొందే వాడు. క్రమేణ కిడ్నాప్‌లకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న, మానేసిన యువకులను చేరదీశాడు. వీరి ద్వారా కిడ్నాప్‌లు చేయడం ప్రారంభించాడు. ప్రొద్దుటూరులోనే 50 మంది దాకా అనుచరులను ఏర్పరుచుకున్నాడు. సీమ వ్యాప్తంగా స్థానికంగా ఉన్న బ్యాచ్‌లతో పరిచయాలు పెంచుకుని.. వారిని తన గ్యాంగ్‌లో కలుపుకొన్నాడు. ఇలా దాదాపు 400 మందితో తన గ్యాంగ్‌ను విస్తరింప చేశాడు. శ్రీమంతులపై కన్ను సునీల్ టార్గెట్ అంతా డబ్బున్న వారే. వారిని బెదిరించి, వేధింపులకు గురి చేసే వాడు. సీమ వ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాడు. అతడిది ప్రొద్దుటూరే కావడం.. ఈ ప్రాంతంలో శ్రీమంతులు అధికంగా ఉండటంతో ఎక్కువగా దృష్టి సారించాడు. సునీల్ దందాలను కర్నూలు జిల్లా జలదుర్గానికి చెందిన అప్పటి ఎస్ఐ జయన్న బయట పెట్టగలిగారు. ఆయన విచారణలోనే ప్రొద్దుటూరులోని పలువురు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను కిడ్నాప్ చేయాలని సునీల్ వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. ఆ ఎస్ఐ ఇచ్చిన సమాచారంతో ప్రొద్దుటూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులోని ప్రముఖ బంగారు వ్యాపారితోపాటు ఆయన కుమారుడ్ని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ వేశాడు. హైదరాబాద్‌తోపాటు ప్రొద్దుటూరులోని ఆయన ఇంటి వద్ద పలుమార్లు ప్రయత్నించి, విఫలమయ్యాడు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాలో సునీల్ బాధితులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సునీల్ ఆత్మహత్య వార్త తెలియడంతో వీరంతా ఊపిరి పీ ల్చుకున్నారు. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌లో మూడు కేసులు, త్రీటౌన్‌లో మూడు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు సునీల్‌పై నమోదయ్యాయి. సీమ వ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి. సునీల్ దందాలు బయట పడిందిలా.. ప్రొద్దుటూరుకు చెందిన వాసురాంప్రసాద్ తాడిపత్రిలోని వంశీ మెడికల్ స్టోర్ నిర్వహిస్తుండే వాడు. వాసురాంప్రసాద్ తండ్రికి సునీల్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆయన పట్టించుకోక పోవడంతో 2013 ఫిబ్రవరిలో జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో వాసురాంప్రసాద్‌ను హత్య చేశారు. ఈ కేసును ఎస్ఐ జయన్న చాలెంజ్‌గా తీసుకున్నారు. అప్పటికే ప్రొద్దుటూరులో డాబాపై దాడి చేసిన కేసు సునీల్‌పై నమోదైంది. వాటి ఆధారంగా ఎస్ఐ జయన్న.. సునీల్ ముఠా సభ్యులపై ఆరా తీశారు. డాబా కేసులో ఇద్దరు యువకులు ప్రొద్దుటూరు సబ్జైల్లో ఉంటూ బెయిల్‌పై బయటికి రావడంతో ఎస్ఐ వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాసూరాం ప్రసాద్‌ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. ఈ కేసులో మరో 10 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వారంతా హైదరాబాద్‌లో ఉన్నట్లు టవర్ లొకేషన్న్ద్వారా తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ సునీల్‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని కర్నూలుకు తరలించారు. 10 కిడ్నాప్‌లు చేసినట్లు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చేలోపే సునీల్ ఎస్ఐకి వివరించాడు. జలదుర్గం ఎస్ఐ దర్యాప్తు ఫలితంగా గ్యాంగ్‌లీడర్, కిడ్నాపర్ సునీల్ దందాలు బయట పడ్డాయి. వాసురాంప్రసాద్‌ను హత్య చేసిన కేసులో సునీల్‌కు జీవిత ఖైదు పడింది. ఈ శిక్షను కడప సెంట్రల్ జైలులో అనుభవిస్తున్న సునీల్ శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రొద్దుటూరులోని శ్రీమంతుల్లో భయం వీడింది. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు రాయచోటి అర్బన్: కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్‌ను అధికారులే పథకం ప్రకారం అంతమొందించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. నేరాలకు పాల్పడుతున్న సునీల్‌కు.. చాలా మంది పోలీస్ అధికారులు సహకరించి అతడి ద్వారా లబ్ధి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే తమ పాత్ర వెలుగులోకి వస్తుందని భావించి.. వారే తుదముట్టించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
‘అలాంటిది ఏమీ లేదు’
సాక్షి, బెంగళూరు : దేశ ఐటీ రాజధాని బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల్లో మళ్లీ కీచక పర్వం చోటు చేసుకున్నట్టు వచ్చిన వార్తలను నగర పోలీస్ కమిషనర్ ఖండించారు. అమ్మాయిలను వేధించిన ఘటనలేవీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో జరగలేదని చెప్పారు. గతేడాది కీచక పర్వం చోటు చేసుకున్న ప్రాంతంలో ఓ యువతి ఏడుస్తూ వెళ్లడం అనుమానాలకు తావిచ్చింది. దీనిపై వివరణ ఇచ్చిన కమిషనర్ సునీల్ కుమార్.. సీసీటీవీ ఫుటేజిలో వేధింపులకు సంబంధించిన దృశ్యాలు ఏవీ లభ్యం కాలేదని చెప్పారు. నిరుడు నగరంలోని బిగ్రేడ్, ఎంజీ రోడ్ ప్రాంతాల్లో యువతులపై అల్లరిమూకలు సామూహిక వేధింపులకు పాల్పడినట్టు వెల్లడికావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. రక్షణ కల్పించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజలు, విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో 2018 నూతన సంవత్సర వేడుకలకు కర్ణాటక ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసింది. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బిగ్రేడ్, ఎంజీ రోడ్డు, చర్చి స్ట్రీట్లలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతోనూ నిఘా పెట్టింది. అయితే, ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మొత్తం 1300ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులో నమోదయ్యాయి. వేడుకల్లో శ్రుతిమించితే కఠిన దండన తప్పదని ముందే పోలీసులు హెచ్చిరించినా బెంగళూరు వాసులు వెనక్కు తగ్గలేదు. కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలి
నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇరుగు సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో ఆదివారం జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల లోపు వైఎస్సార్సీపీని ఈ నియోజకవర్గంలో పటిష్టపరచాలన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు వేస్తామన్నారు. అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని, ఇతర బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. డబుల్బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయకుండా గందరగోళం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అంశల సత్యనారాయణ, పుట్ట పిచ్చయ్యగౌడ్, బాస నర్సింహ, శంకరయ్య, జానకి రామిరెడ్డి, దేవయ్య, పార్టీ జిల్లా కార్యదర్శులు పోగుల నర్సింహగౌడ్, పిల్లి జలేంధర్, దేవసారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ధర్నా
చిత్తూరు: మండల సర్వసభ్య సమావేశంలోకి అనర్హులకు ప్రవేశం కల్పించి కాలాన్ని వృధా చేస్తున్నారంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.00 గంటలైనా ఎందుకు ప్రారంభించలేదని ఎంపీడీవో పార్వతమ్మపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో చైర్మన్లు తదితరులను సమావేశానికి ఎలా రానిస్తారని ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు సమావేశం జరుపుతామని ఎమ్మెల్యేకు ఎంపీడీవో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడే ధర్నాకు దిగారు. కోరం లేకున్నా ఎంపీడీవో పార్వతమ్మ మాత్రం ఈ సమావేశాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. -
జెడ్పీ చైర్మన్ కుమారుడంటూ వసూళ్లు
అనంతపురం : అనంతపురం జెడ్పీ చైర్మన్ కుమారుడినంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ విజయ్ మల్లికార్జున వర్మ తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపేట గ్రామానికి చెందిన అత్తోటి సునీల్‌కుమార్ కొన్ని రోజులుగా వసూళ్లు మొదలుపెట్టాడు. విశాఖ జిల్లాకు చెందిన పలువురు రియల్టర్లను జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ కుమారుడినంటూ బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల అనంతపురంలోని ఓ లాడ్జిలో మకాం వేసిన సునీల్‌కుమార్ ఉద్యోగమిప్పిస్తానని ఆశచూపి ఇద్దరు యువకుల నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. అంతేకాకుండా తన వద్ద నున్న బొమ్మ పిస్తోలు చూపి ఓ వ్యాపారి నుంచి రూ.లక్ష వసూలు చేశాడు. అతనిచ్చిన సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు సునీల్ కుమార్ ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.