Published
Fri, Aug 26 2016 7:22 PM
| Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
ఓసీటీఎల్ లాకౌట్ ఎత్తివేయడం కార్మికుల విజయం
నకిరేకల్ : నార్కట్‌పల్లిలోని ఓసీటీఎల్ కంపెనీ 183 రోజుల తర్వాత లాకౌట్ ఎత్తి వేయడం కార్మికుల విజయమని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మీ అన్నారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమకు తోచిన విధంగా చట్టాలను తుంగలో తొక్కుతుంటే అది ఎవరికైనా తెలంగాణలో సా«ధ్యం కాదని మరోసారి రుజువైందన్నారు. ఇప్పటికైనా ఓసీటీఎల్‌లో పారిశ్రామికమైన శాంతిని నెలకొల్పి యాజమాన్యం కార్మికులకు సహకరించాలని కోరారు. ఓసీటీఎల్ కంపెనీ లాభాల బాటలో ఉండాలని కోరారు. సమావేశంలో ఆ వేదిక జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి, నాయకులు వనం నరేందర్, నార్కట్‌పల్లి రమేష్, మొరోజు సైదాచారి, పూల సైదులు, ముడుదుడ్ల శ్రీనివాస్, అయిటిపాముల గిరి, సతీష్, సుల్తానా, జాని తదితరులు ఉన్నారు.