సాక్షి, నల్లగొండ జిల్లా: టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్‌ఎస్ మొండిచేయి చూపడంతో నిరాశే మిగిలింది. దీంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
‘‘వేముల వీరేశం ఏం చేశాడని నాలుగున్నరేళ్లుగా హింసిస్తున్నారు. ఉద్యమకాలంలో దెబ్బలు తిని జైలుకు పోయింది నేను కాదా.. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో కొట్టించినా జిల్లా నాయకత్వం పట్టించుకోలేదు. గన్‌మెన్‌లను కూడా తొలగించారు. ఇన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్: బండి సంజయ్
‘‘ఈ రోజు నుంచి బీఆర్ఎస్‌తో తనకు ఉన్న బంధం తెగిపోయింది. నా రాజీనామా లేఖను అనుచరులు, నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతున్నా. నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా’’ అంటూ వీరేశం సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment